Wednesday, October 5th, 2016

 

తెలంగాణ భాషా, మాండలికమా?

ఒక భాష మరొక భాషపై ఆధిక్యం చలాయించడం అనాదిగా వస్తున్నదే. అలా ఎన్నో భాషలు కాలగర్భంలో కలినిపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భాష, దాని పూర్వాపరాల గురించి చర్చిస్తున్నారు తెలుగు భాషా పండితులు డా॥ నలిమెల భాస్కర్ ప్రపంచవ్యాప్తంగా సమస్త ఆధిపత్యాలను ప్రశ్నిస్తున్న కాలం యిది. పురుషల్ని న్ర్తీలు నిలదీస్తున్నారు. మేమూ మనుషలమేనని! అగ్రవర్ణాల వారిని దళితులు అడుగుతున్నారు, మేమూ మీలాంటి మానవులమే నంటూ. ప్రపంచ భాషగా చేయబడ్డ ఇంగ్లీష పెత్తనాన్ని తన మాతృభాష ‘గికుయూ’ లో తప్ప రాయనని గుగివాథియాంగో ధిక్కరిస్తున్నాడు. ఉత్తరాది హిందీని నిన్నా మొన్నటి వరకు తమిళులు తిరస్కరించారు. త్రిభాషా సూత్రం ప్రకారం మీరూ మా దక్షిణ దేశ భాషల్లో ఏదైనా ఒకటి నేర్చుకోవాలని వాళ్ళు తమ నిరసన గళం బలంగా విప్పారు. బెంగాలీ ఆధిపత్యాన్ని అస్సామీన్, ఒరియా భాషీయులు కడిగేశారు. పైగాRead More


గొందెలి: అంతరించిపోతున్న అరుదైన జానపద కళ

జానపద కళారూపాలు కనుమరుగైపోతున్న నేపథ్యంలో వాటిని తిరిగి వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఇటీవల టీఆర్‌నీ ఆధ్వర్యంలో జరిగిన చర్చా కార్యక్రమంలో చోటు చేసుకుంది. ఆ జానపద కళారూపం గురించి వివరిస్తున్నారు ఈ రంగానికి చెందిన పరిశోధకులు డా॥ ద్యవనపల్లి సత్యనారాయణ, ప్రజలు పట్టణీకరణ, ఆధునీకరణ చెందుతున్న క్రమంలో వందల ఏళ్ళుగా పల్లెల్లో ఆదరించి ఆనందించిన జానపద ప్రదర్శన కళలు ఆంతరించిపోతున్నాయి. దీనివల్ల సాంస్కృతిక వైవిధ్యం మరుగైపోయి ప్రజల మనుగడ ప్రశ్పార్థకమై పోతుంది. ఇది ప్రమాద సంకేతం. కాబట్టి జానపద కళలను కాపాడుకోవాలి. ఈ సృ్పహతోనే ఈ మధ్య మే 25న హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ 11వ నంబరు వీధిలో ఉన్న ‘చంద్రం’లో గొందెలి అనే ఒక ప్రాచీన జానపద కళారూపాన్ని మహ బూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలానికి చెందిన నర్సింగరావు బృందం చేRead More