ఎంతో ఆకట్టుకున్న పప్పెట్ షో
రాజధాని నగరమైన హైదరాబాద్‍లో 10వ హైదరాబాద్ చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్ జూబ్లీహిల్స్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్‍మెంట్ ఇనిస్టిట్యూట్‍లో డిసెంబర్ 7న ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత శోబు యర్లగడ్డ, బి.పి.ఆచార్య, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, థియేటర్ ఇన్ ఎడ్యుకేషన్ నిర్వాహకులు జ్యోత్న, ప్రియాంక, వైశాలి, దీప్తి, కరన్‍కుమార్, జైన్, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
కళలను బతికించు కోవడానికి చిల్డ్రన్స్ ఫెస్టివల్స్ ఉపయోగ పడతాయి : ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ
గత 10 సంవత్సరాల నుండి తాను చిల్డ్రన్స్ ఫెస్టివల్‍లో భాగస్వాములు అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ అన్నారు. చిల్డ్రన్స్ ఫెస్టివల్ పిల్లలకు చాలా ఉత్సాహంగా, ఆదర్శంగా, ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు. పిల్లలు ఇక్కడికి వచ్చి స్వయంగా చూసి చాలా చక్కగా నేర్చుకునే వెసులుబాటు ఉందన్నారు. నశించిపోతున్న కళలను బతికించుకోవడానికి ఇలాంటి ఫెస్టివల్స్ ఎంతో ఉపయోగపడతాయన్నారు.
పిల్లల కెరీర్ చాలా ముఖ్యం : బి.పి.ఆచార్య
నేటి పిల్లల కెరీర్ చాలా ముఖ్యమని, పిల్లల కెరీర్‍కు ఇలాంటి ఫెస్టివల్స్ మార్గదర్శకంగా నిలుస్తాయని బి.పి.ఆచార్య పేర్కొన్నారు. పిల్లల అభివృద్ధికి కెరీర్, కౌన్సెలింగ్ మొదలైన అంశాలపై అవగాహన ఎంతో అవసరం అన్నారు. పిల్లలకు ప్రతి ఒక్కరూ సపోర్టుగా నిలవడం చాలా సంతోషం అన్నారు.
ఈ సందర్భంగా పలు నాట కాలు, నాటికలు, పలు సినిమాలతో పాటు తోలు బొమ్మలాటలు, పలు రకాల నృత్యాలు పిల్లలను ఎంతగానో అలరించాయి. పిల్లల బొమ్మలతో కూడిన ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ థియేటర్ ఫెస్టివల్ డిసెంబర్ 17వ తేదీ వరకు కొనసాగింది.
ఈ చిల్డ్రన్స్ థియెటర్ ఫెస్టివల్‍కు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా నగరంలోని పలు పాఠశాలల నుండి విద్యార్థిని, విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సం దర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పప్పెట్స్ షో గురించి వినడమే కాని, ప్రత్యక్షంగా చూడలేదని, ప్రత్యక్షంగా ఇప్పుడు చూడడంతో చాలా సంతోషంగా ఉందని పలు పాఠశాలల నుండి వచ్చిన పిల్లలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
– దక్కన్‍న్యూస్,
ఎ : 9030 6262 88