నానీలు

నగరవాసుల
ధమనులు
సిరిలల్లో
నిర్విరామ జన ప్రవాహం

ఒకప్పుడు
అన్నం మెతుకుపై మన పేరు
మరి ఇప్పుడో
ట్యాబ్‍ లెట్లపై

భూమాత
గుండెల్లో దింపిన
ఇనుప స్ట్రాలు
బోరింగ్‍ మిషన్లు

కెరటాలు
కాళ్ళ కింది ఇసుకను
లాగేస్తున్నాయి
నమ్మక ద్రోహిలా !

రోజూ దసరా పండగే
నడక దారిలో
పాలపిట్ట
దర్శనం !


-కంచనపల్లి రవికాంత్‍
ఎ : 949012275

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *