ప్రక్షాలన…


చీకటి ముసిరింది మొదలు
తూరుపు తెల్లారుదాకా…
చెత్తా చెదారం చేరిపి
దుమ్ము ధూళి దులిపి
నల్లటి రోడ్ల ‘‘చంద్రబింబం’’లా మెరిపిస్తారు

వంచిన నడుము ఎత్తక
వీధుల ‘‘చిత్తడి’’ ఊడ్చి
కడిగిన ‘‘ముత్య’’మల్లే మార్చుతారు

ముక్కు పుటాలు అదిరే
మురికి కాల్వ ‘‘కుళ్లును’’ ఎత్తిపోసి
పరిశుభ్రత చేకూరుస్తారు

కాలలతో నిమిత్తం లేక
చలి మంచులో ‘‘నెగళ్లై’’ రగులుతారు
జోరు వానలో ‘‘చెమట’’చుక్కలై రాలుతారు

లోకమంతా ‘‘కలల’’ నిద్దట్లో మునకేస్తే
వాడల ‘‘ఊడిగం’’లో జాగరణమౌతారు

రాత్రి వీధి లైట్ల ‘‘వెలుగు’’లో మలిగితే…
పగలు ఎండ ‘‘కుంపట్లో’’ కములుతారు

గౌరవాలేవి దక్కకున్నా…
సగర్వంగా ముందుకు సాగుతారు

ఛీత్కారాలెన్నున్నా…
పరిశుభ్రత ‘‘పరమ’’ సేవగా విశ్వసిస్తారు
వృత్తినే ‘‘ప్రాణ’’ప్రదంగా తలపోస్తారు

పల్లె, పట్టణాల ‘‘కల్మషం’’కడిగే
ఈ ‘‘పారిశుద్ధ’’ జీవులకు
మనిషి మానసిక ‘‘కుళ్లు’’ను
ప్రక్షాలన చేయగల ‘‘శక్తి’’ ఉంటే
ఎంత బావుణ్ణు!

(పారిశుద్ధ కార్మిక సేవా దృక్పధానికి స్పందనగా..)

కోడిగూటి తిరుపతి, ఎ : 9573929493

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *