Day: January 1, 2020

తెలంగాణ చరిత్రను నిర్భయంగా చెప్పిన ధీశాలి బి.ఎన్‍.శాస్త్రి

తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్‍ డా.నందిని సిధారెడ్డి తెలంగాణ వివక్షతకు గురైనప్పుడు తెలంగాణ చరిత్రను నిర్భయంగా, నిరంతరంగా చెప్పిన ధీశాలి బి.ఎన్‍.శాస్త్రి అని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్‍ డా.నందిని సిధారెడ్డి కొనియాడారు. ఉన్నదాన్ని ఒప్పుకోక ఘర్షణ పడి చరిత్రను రచించిన వారే చరిత్రకారులని, ఈ కోవలోకే చెందినవారు బి.ఎన్‍.శాస్త్రి అని ఆయన చెప్పారు. తెలంగాణ సాహిత్య అకాడమీ, మూసీ సాహిత్య ధార సంయుక్తాధ్వర్యంలో బి.ఎన్‍.శాస్త్రి సాహిత్యం, సమాలోచన అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు …

తెలంగాణ చరిత్రను నిర్భయంగా చెప్పిన ధీశాలి బి.ఎన్‍.శాస్త్రి Read More »

స్వప్న శైధిల్యం

చూపులు వేలాడుతున్నప్పుడుఅడుగులు తడబడుతున్నవిమరకలంటించుకొని జ్ఞానం పుస్తకాల్లోంచిఎగిరిపోయిందిఆలోచనలు చుక్కల దారుల వెంటనీటి ధారలే కనపడని వింతదారుల విస్తరణ మరింత ఇరుకవుతుందిచీకటి వేళ చీకటినే ముట్టించేకన్ను ఎక్కడో మాయమయ్యిందిచేతుల కింద చురకత్తులు పరిహసించబడిరాలుతున్న పూలకు ఉరేసుకున్నవిఎగురేసుకు పోయిన జెండాలుపొలిమేరలు దాటంగనే వలలైపోయినవిఇప్పుడు చిలుకలకు పలుకులు లేవుఎలుకలు వలలు కొరికేది లేదుచంపుడు పందెం పిల్లల ఆటల్లోనే పురుడుపోసుకుంది దీపం తలాపున నవ్వుతుంటేసంధ్య వేళలు వెక్కిరిస్తున్నవిగాలికి ఉడుకపోస్తుంటేతరగతి గదులు తాళాలతో వేలాడుతున్నవి. – ఒద్దిరాజు ప్రవీణ్‍ కుమార్‍ఎ : 9849082693

తెలంగాణ రైతుకు వైభవం

వ్యవసాయం దండుగ కాదు పండుగ అని, స్వరాష్ట్రం వస్తే రైతులకు అన్ని విధాల లాభం జరుగుతుందని మన ముఖ్యమంత్రి కల్వకంట్ల చంద్రశేఖర్‍ రావు చెప్పిన మాటలు ఇప్పటికే కార్యాచరణలోకి వచ్చేసాయి. రైతు బంధు, రైతు భీమా మొదలైన వాటితో పాటు తెలంగాణ భూములకు అనుకూలమైన అధిక ఆదాయాన్నిచ్చే పంటలు సాగు చేయడానికి రైతుకు ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా ఆయిల్‍ పామ్‍ సాగును తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఒక టన్ను పామాయిల్‍ ఉత్పత్తి చెయ్యాలంటే …

తెలంగాణ రైతుకు వైభవం Read More »

కదవాస శత్రువుల కుత్తుకల నవలీల మత్తరించగ రాజ్యతంత్రము నడిపిన రావెళ్ళ పదాలు

సామాజిక స్థితిగతులు స్థానికపరిస్థితులే మనుషులు విభిన్నంగ ఆలోచించడానికి కారణమైతయని నిరూపించిన జీవితం. తాను పుట్టిపెరిగిన వాతావరణంతో పాటు ఆనాటి భూస్వామ్య విధానం వల్ల చెలరేగిన ఉద్యమాన్ని కండ్లార చూసిండు. చిన్నతనం నుంచే పద్యాలు పాడడం, రాయడం పట్ల ఆసక్తిని పెంచుకొని, ఆయుధాలను చేతబట్టి తన శక్తియుక్తలను మేళవించి ప్రజాక్షేత్రంలో నిలబడ్డ మేథాసంపన్నుడు. తెలంగాణ తొలి, మలి విడత పోరాటంలో తన పదాలతో, పద్యనాదాలతో ఉద్యమాన్ని పదునెక్కించిన అభ్యుదయ కవి, సాయుధ రైతాంగ పోరాట యోధుడు రావెళ్ళ వెంకట …

కదవాస శత్రువుల కుత్తుకల నవలీల మత్తరించగ రాజ్యతంత్రము నడిపిన రావెళ్ళ పదాలు Read More »

విద్యార్థులకు ఉపాధ్యాయులే మార్గదర్శి

ఐపీఎస్‍ అధికారి ఏకే.ఖాన్‍ పిల్లలను భావి, భారత పౌరులుగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయం : పాఠశాల వైస్‍ చైర్మన్‍ ప్రార్దన మణికొండ ఘనంగా ఆక్స్ఫర్డ్ గ్రామర్‍ స్కూల్‍ 39వ వార్షికోత్సవం భావి, భారత పౌరులుగా తీర్చిదిద్దబడే ఏకైక ప్రదేశం పాఠశాల. పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి వారిని అభివృద్ధిపథంలో నడిపించేదే విద్యాలయం. ఎంతో మంది విద్యార్థులను ప్రగతిపథంలో నడిపి దేశ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో విజయాలను నమోదు చేసుకున్న ఆక్స్ఫర్డ్ గ్రామర్‍ స్కూల్‍ 2019 నాటికి …

విద్యార్థులకు ఉపాధ్యాయులే మార్గదర్శి Read More »

ఘనంగా 10వ హైదరాబాద్‍ చిల్డ్రన్స్ థియేటర్‍ ఫెస్టివల్‍

ఎంతో ఆకట్టుకున్న పప్పెట్‍ షో రాజధాని నగరమైన హైదరాబాద్‍లో 10వ హైదరాబాద్‍ చిల్డ్రన్స్ థియేటర్‍ ఫెస్టివల్‍ జూబ్లీహిల్స్లోని డాక్టర్‍ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్‍ రిసోర్స్ డెవలప్‍మెంట్‍ ఇనిస్టిట్యూట్‍లో డిసెంబర్‍ 7న ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత శోబు యర్లగడ్డ, బి.పి.ఆచార్య, నేషనల్‍ స్కూల్‍ ఆఫ్‍ డ్రామా, థియేటర్‍ ఇన్‍ ఎడ్యుకేషన్‍ నిర్వాహకులు జ్యోత్న, ప్రియాంక, వైశాలి, దీప్తి, కరన్‍కుమార్‍, జైన్‍, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కళలను బతికించు కోవడానికి చిల్డ్రన్స్ ఫెస్టివల్స్ ఉపయోగ …

ఘనంగా 10వ హైదరాబాద్‍ చిల్డ్రన్స్ థియేటర్‍ ఫెస్టివల్‍ Read More »

ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్‍కు ‘కీర్తిశిఖర’ – 2019 పురస్కారం ప్రదానం

భూపతి చంద్ర మెమోరియల్‍ ట్రస్ట్ తరుపున మొదటి అవార్డు, రూ.లక్ష నగదు, సన్మానంతెలుగు రాష్ట్రాల్లో ఇది విలువైన అవార్డు : టీఎస్‍పీఎస్సీ చైర్మన్‍ ప్రొ.ఘంటా చక్రపాణిట్రస్టు సభ్యులకు కృతజ్ఞతలు : అంపశయ్య నవీన్‍ తెలంగాణలో సాహిత్యానికి చైతన్య బీజాలు వేసిన గొప్ప వ్యక్తి ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్‍ అని తెలంగాణ పబ్లిక్‍ సర్వీస్‍ కమిషన్‍ చైర్మన్‍ ప్రొఫెసర్‍ ఘంటా చక్రపాణి అన్నారు. నాంపల్లి పబ్లిక్‍గార్డెన్స్లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ‘భూపతి చంద్ర మెమోరియల్‍ ట్రస్ట్’ తరుపున …

ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్‍కు ‘కీర్తిశిఖర’ – 2019 పురస్కారం ప్రదానం Read More »

శిల్పి చెక్కిన సౌందర్యం

చెక్క, రాగి, ఇనుములాంటి పదార్థాలకు ప్రాణం పోస్తున్న శివరామాచారి ఆ శిల్పాలు నాట్యం చేస్తాయి.. ఒక శిల్పంతో ఇంకో శిల్పం మాట్లాడుతుంది. జీవంలేని వస్తువులు ప్రాణం పోసుకొని జీవిస్తాయి. ఎందుకు పనికిరాని ముడి వస్తువులు సైతం ప్రఖ్యాత శిలా శిల్పంలా తయారవుతాయి. కళారూపాలు వైవిధ్యభరితంగా చూపరులను ఆకట్టుకుంటాయి. విభిన్నమైన శిల్పి చెక్కిన సౌందర్యం మంత్ర ముగ్దులను చేస్తుంది. ఇలాంటి ఎన్నో అద్భుతమైన శిల్పాలకు చిరునామాగా నిలుస్తున్నారు శివరామాచారి. తన అమ్ముల పొదిలో ఆయుధమైన స్కల్ప్చర్‍ స్పేస్‍తో శిలా …

శిల్పి చెక్కిన సౌందర్యం Read More »

జి. అరవిందన్‍ – ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు

1955లో సత్యజిత్‍ రే నవ్య సినిమా ఉద్యమానికి శ్రీకారం చుట్టి జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించిన తరువాత, దేశంలోని పలు చిక్కుల్లో ఉన్న మేధావులు, సినీ అభిమానులలో చాలా మంది ప్రభావితులై, క్రమంగా నవ్య సినిమా పురోగమించింది. అలా ప్రభావితులైన వారిలో దక్షిణ భారతం నుండి ప్రముఖంగా స్వర్గీయ జి.అరవిందన్‍ను చెప్పుకోవచ్చు. అరవిందన్‍ ఏక్సిడెంటల్‍గా చిత్రసీమలోకి ప్రవేశించాడు. ఆయన ఏ ఫిల్మ్ ఇన్‍స్టిట్యూట్‍లోనూ శిక్షణ పొందకపోయినా, భారతదేశం గర్వపడేలా సినిమాలు తీసిన ప్రతిభాశాలి. 1936 జనవరి 23న …

జి. అరవిందన్‍ – ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు Read More »

మాటల వంతెనొకటి నిర్మించుకుందాం రా!

మరణం కన్నా బాధాకరమైన మౌనాన్నియుద్ధం కన్నా భయంకరమైన నిశ్శబ్ధాన్నిఎన్నేళ్ళిలా భుజాల మీద మోస్తాం?సంధికి నాంది పలుకుదాం రా! ఒకరి వెనుక వేరొకరు చేరిగోతులు తవ్వుకొని నవ్వుకోవడంఒకరి బలహీనతల మీదమరొకరు సింహాసనం వేసుక్కూర్చోవడంఎన్నాళ్ళిలా నాటకాన్ని రక్తికట్టిస్తాం?హృదయ వేదిక మీద ఎదురెదురుగాకూర్చొని చర్చించుకుందాం రా! దారి పొడుగునావిమర్శల ముళ్ళ పొదలుఎదురుపడితే ప్రేమగా పలకరించుకోలేనిఅగాధపు దారులుఅపార్ధాల అపనమ్మకాలఎగసిపడే అగ్నికీలలుఎంతకాలమని అదే దారిలో నడుస్తాం?మాటల వంతెనొకటి నిర్మించుకుందాం రా! సాంబమూర్తి లండఎ : 9642732008