తెలంగాణ కుంభమేళ.. మేడారం సమ్మక్క-సారక్క జాతర
ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక-సారక్క జాతర. తెలంగాణ కుంభమేళగా పిలుచుకునే ఈ విశిష్ట జాతర ప్రకృతి రమణీయతకు, పర్యావరణ సమతౌల్యానికి అద్దం పడుతుంది. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నెలరోజులపాటు ఈ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రకృతి అంటే ప్రాణమిచ్చే ఆదివాసీలు వాళ్లే పూజారులై ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ జాతరను ఎంతో వైవిధ్యంగా,మరెంతో అపురూపంగా తమ ఆచార సంప్రదాయాల ప్రకారం జరుపుకుంటారు. సమ్మక్క – సారక్క జాతరకు సుమారు …