మిల్లెట్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా ఝరా సంగం మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన రైతు వీర్ శెట్టి బిరాదర్. ఆయన గ్రాడ్యుయేట్. 13 ఎకరాల మెట్ట, 5 ఎకరాల మాగాణి ఉంది. చెరకు, కందిపప్పు, శనగలు, జొన్న, సజ్జ, కొర్ర, రాగి లాంటి పంటలు పండించే వారు.ఒకప్పుడు ఆయన మహారాష్ట్రలో ప్రయా ణిస్తుండగా, ఓసారి తినేందుకు ఆహారం ఏమీ దొరక లేదు. దాంతో ఆకలిబాధకు గురయ్యారు. ఇక అప్పుడే ఆయనకు ఆహారపంటలకే ప్రా ధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. …