పసిపాపను నేను
నవమాసాలు అమ్మ కడుపులోరక్తమాంసాల మధ్య పరిచయంలేని ఒంటరి జీవితాన్ని గడిపిన పసిపాపను నేను కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినవమాసాల పాలబుగ్గ వయసులోపాపాత్ముడి చేతిలో బలైన పసిపాపను నేను పరాయివాడైనా పాపాయిలా నన్నునవ్విస్తాడనుకున్నాను కాని కామంతోకవ్విస్తాడని కలలో ఊహించని పసిపాపని నేను అమ్మఒడికి దూరమై ఆడి పాడేవయసులో అందమైన ప్రపంచంనుండి నేడు అద •శ్యమైన పసిపాపను నేను కామంతో కళ్లు మూసుకుపోయిసిగ్గులేని సభ్యసమాజంలో తలదించితనువును చాలించిన పసిపాపను నేను ఏ ఘడియలో నిద్ర లేచానో కానిమలి ఘడియ రాకముందే …