Day: March 1, 2020

కుమారయ్య (జస్టిస్‍)

ఆయన జీవితాన్ని సమున్నతంగా గెలుచుకున్న న్యాయ కోవిదుడు జనధర్మం కోసం అత్యున్నత న్యాయ పీఠాన్ని అధిరోహించిన బహుజనుడు. సత్వర న్యాయం కోసం పరితపించిన న్యాయమూర్తి. నిరాడంబర జీవితం ఆయన ఆచరణ. ఆయన జస్టిస్‍ నాంపల్లి కుమారయ్య, జగిత్యాల జిల్లా, (అప్పటి కరీంనగర్‍ జిల్లా) కొడిమ్యాల మండల కేంద్రంలో శాలివాహన దంపతులైన నర్సింలు లక్ష్మమ్మలకు ఆయన 15.6.1901లో జన్మించారు. పని చేస్తేనే బతుకుతెరువు అయిన కుటుంబంలో పుట్టి అంచెలు అంచెలుగా విద్యార్హతలు సాధించారు. కుమారయ్య ఏ తరగతిలో ఉన్న ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడు అయ్యేవాడు. ఆయన విద్యాదాహాన్ని గమనించిన …

కుమారయ్య (జస్టిస్‍) Read More »

వినమ్ర విమర్శకుడు అమ్మంగి

సృజనాత్మక రచన కన్నా విమర్శ కష్టమైన పని. కష్టమైన పనే కాదు, కృతజ్ఞతలేని పని. విమర్శకుడు ఒక రచనను పూర్తిగా చదివి దానిలోని క్లిష్టమైన అంశాలను సైతం కూలంకషంగా అర్థం చేసుకోవాలి. దానిపై సాధికారికంగా వ్యాఖ్యనించేందుకు గాను పరిశోధన కూడా అవసరం. పరిశోధన ఖర్చుతో కూడుకున్న పని. ఇంతా చేసి తాను తెలుసుకున్న విషయాలు, కూర్చిన సమన్వయం, ఆర్జించిన జ్ఞానం, చేసిన పరిశోధన, నిర్ధారించిన వాస్తవాలు, వివరించిన వ్యాఖ్యానం, ఇచ్చిన తీర్పులు (రచనపై) అన్నీ కూడా సృజనకారుడికే …

వినమ్ర విమర్శకుడు అమ్మంగి Read More »

హిందూ ముస్లిం సమైక్యతకు సంకేతం‘చార్మినార్‍’

తేరే ఘర్‍ కె సామ్నేదునియా బసావూంగాతేరే ఘర్‍ కె సామ్నేఎక్‍ ఘర్‍ బనావూంగాతారే సజావుంగాతెరే ఘర్‍ కే సామ్నె.1963లో వచ్చిన ఒక హిందీ సిన్మాలో హీరో దేవానంద్‍ తన ప్రియురాలికి చేసిన వాగ్దానాలివి.‘‘నీ ఇంటి ముందు ఒక ప్రపంచాన్నే నెలకొల్పుతాను. నీ ఇంటి ముందు మరో ఇంటినే నిర్మిస్తాను. నిర్మించిన ఆ ఇంటి వాకిటిలో తారల తోరణాలు వ్రేలాడదీస్తాను’’ అని దాని అర్థం. సరిగ్గా 424 ఏండ్ల క్రితం నవాబు మహమ్మద్‍ కులీ కుతుబ్‍షా కూడా తన …

హిందూ ముస్లిం సమైక్యతకు సంకేతం‘చార్మినార్‍’ Read More »

పర్యావరణం – శాస్త్రం – నైతికత – తాత్విక దృక్పథాలు

(గత సంచిక తరువాయి)సోషల్‍ ఎకాలజీముర్రేబుక్‍చిన్‍ అనే సామాజిక సిద్ధాంకర్త సాగించిన ఆలోచనధారను ‘సోషల్‍ ఎకాలజీ’గా వ్యవహరిస్తున్నారు. నాలుగు దశాబ్దాలపై చిలుకుగా ఈయన సామాజిక ఆధిపత్యం, ప్రకృతిపై ఆధిపత్యం మధ్యగల సంబంధాలను గురించి సాగించిన రచనల సారాంశం సోషల్‍ ఎకాలజీగా గుర్తింపు పొందింది.ఈయన సాగించిన చింతనకు మూలాలు భిన్న రకాలైన తాత్త్విక సంప్రదాయాలలో కనిపిస్తాయి. ముఖ్యంగా మార్క్సీయ సామ్యవాదం, ఉదార అరాచకవాదం పాశ్చాత్య జీవవాదాలలో దర్శనమిస్తాయి. అదే విధంగా అరిస్టాటిల్‍, హెగెల్‍ వంటి తత్త్వవేత్తల ఆలోచనల ప్రభావం కనిపిస్తుంది.ముర్రే …

పర్యావరణం – శాస్త్రం – నైతికత – తాత్విక దృక్పథాలు Read More »

చీర్యాలలో శిథిల శివాలయం: కళ్యాణీ చాళుక్యుల శాసనం

తెలంగాణా జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ చరిత్రను అన్వేషిస్తున్న కొత్తతెలంగాణ చరిత్రబృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్‍, వేముగంటి మురళీకృష్ణ, సహాయకుడు చంటి, వారసత్వశాఖ ఉద్యోగి జి.రాజేందర్‍ గైడెన్స్ లో మేడ్చల్‍ జిల్లా, కీసర మండలంలోని చీర్యాల గ్రామంలో 1200 యేండ్ల నాటి పురాతన శివాలయ శిథిలాలను సందర్శించారు. అక్కడున్న శాసనాన్ని ఎడిట్‍ చేసి, పరిష్కరించారు. మనం చూసే వీరగల్లులలో ప్రాణత్యాగం చేసిన శివభక్తుల ప్రతిమలు కూడా చేరి గౌరవించ బడుతున్నాయి. అటువంటి వీరగల్లు చీర్యాలలోని శివాలయ శిథిలాలలో కనిపించింది. భక్తుని …

చీర్యాలలో శిథిల శివాలయం: కళ్యాణీ చాళుక్యుల శాసనం Read More »

మునగాకు పొడి – ఔషధాల ఒడి

సాధారణంగా మనం మునగను కాయల కోసం వాడే ఒక కూరగాయ పంటగా పరి గణిస్తాం. కాని మునగ బహుళ ప్రయోజనకారి అని చాలా మందికి తెలియదు. దీని ఆకులు, కాయలు, విత్తనాలు చాలా ఔషధ విలువలు క లిగి ఉన్నందున దాదాపు 300 రకాల వ్యాధు లను నయం చేసే గుణాలు కలిగి ఉండటం వలన మునగను అద్భుత వృక్షంగా అభివర్ణి స్తారు. మునగాకు వివిధ ప్రయోజనాలను చూ ద్దాం.ఆకులను ఆహారంలో ఒక భాగంగా తీసు కోవడం …

మునగాకు పొడి – ఔషధాల ఒడి Read More »

గ్లోబల్‍ ఆర్ట్ ఆధ్వర్యంలో బాలభవన్‍లో చిత్రకళా ప్రదర్శన

నగరం నుండి పలు పాఠశాలల పిల్లలు హాజరు గ్లోబల్‍ ఆర్ట్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ ఆర్ట్ఫెస్ట్ 2020 చిత్రకళా ప్రదర్శనను నాంపల్లిలోని పబ్లిక్‍ గార్డెన్స్లోని జవహార్‍ బాలభవన్‍లో జనవరి 30న నిర్వహించారు. అందులో భాగంగా రకరకాల చిత్రాలు, అల్లికలు మరియు కుట్లు, వర్లీ ఆర్ట్, కోలార్జ్, బుక్‍లెట్స్, గ్రీటింగ్స్ కార్డస్, తోలుబొమ్మల చిత్రాలు, మెహిందీ, పచ్చబొట్లు, రంగోలి మొదలైన వాటిలో పిల్లలకు మెళుకువలు నేర్పించారు. అద్దంలో వారి ముఖ చిత్రమును వారే గీసుకునే విధంగా తర్పీదునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పిల్లలకు పెయింటింగ్‍పై పలు రకాల …

గ్లోబల్‍ ఆర్ట్ ఆధ్వర్యంలో బాలభవన్‍లో చిత్రకళా ప్రదర్శన Read More »

రంగస్థలాన్ని రక్తి కట్టించిన రాగ సుగంధాలు – తొలి తెలుగు సినీ గేయాలు

చందాల కేశవదాసు పాటలు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి తల్లడిల్లిన పాట. తల్లి చేయి పట్టుకొని ఊరూర తిరిగిన పాట. అన్న తపోదీక్షతో జీవితాన్ని అవగాహన చేసుకున్న పాట. భక్తి తత్వాన్ని, పరమార్థిక చింతనను గానం చేసిన పాట. మదినిండ శ్రీరామ తత్వాన్ని నింపుకొని తమ్మర సీతారామచంద్ర స్వామికే అంకితమైన పాట. దేహమే దేవాలయంగ ఉత్సవ విగ్రహాలను ఊరేగించిన పాట. హరికథా సుగంధాలను వెదజల్లిన పాట. మొట్టమొదటి మాటల సినిమాకు పాటలు రాసిన తొలి తెలుగు సినీ గేయకవి …

రంగస్థలాన్ని రక్తి కట్టించిన రాగ సుగంధాలు – తొలి తెలుగు సినీ గేయాలు Read More »

1938లో హైదరాబాద్‍కు మొదటి రంజీ ట్రోఫీ

సౌత్‍ ఇండియాలో ట్రోఫీ అందుకున్న మొదటి రాష్ట్రం     నవనాగర్‍ జట్టుపై అద్భుత విజయం అదొక అండర్‍డాగ్స్ రంజీ జట్టు.. స్టార్‍ ప్లేయర్లు లేకుండా, ఎలాంటి అంచనాల్లేకుండా ఆటను ప్రారంభించింది. బరిలోకి దిగి ఒక్కో ప్రత్యర్థి జట్లకు దిమ్మదిరిగే షాక్‍ ఇస్తూ ఫైనల్‍ వరకు దూసుకొచ్చింది. ఫైనల్‍ మ్యాచ్‍లో డిఫెండింగ్‍ ఛాంపియన్‍ ప్రిన్స్లీ స్టేట్‍ ఆఫ్‍ నవనాగర్‍ జట్టుపై అద్భుతమైన విజయం సాధించి చరిత్ర సృష్టించింది.  1938వ సంవత్సరంలో హైదరాబాద్‍ రంజీ క్రికెట్‍ జట్టు ఈ రికార్డును నెలకొల్పింది. భారత క్రికెట్‍ కంట్రోల్‍ …

1938లో హైదరాబాద్‍కు మొదటి రంజీ ట్రోఫీ Read More »

నలభై వసంతాల మాభూమి

1950లలో భారతదేశంలో నవ్య సినిమా ప్రారంభమై దాని ప్రభావం క్రమంగా మరాఠి, ఒరియా, అస్సామి రంగాలకు పాకినా దక్షిణాదిని తాకింది 1970 ప్రారంభంలో. అదీ మలయాళ రంగాన్ని. అప్పటికే రామూ కారియత్‍ వంటివారు ‘నీలక్కుయిల్‍’ (1954), ‘చెమ్మీన్‍’ (65), పి.రాందాస్‍ ‘న్యూస్‍పేపర్‍ బాయ్‍’ (1954) వంటి ఆలోచనాత్మక చిత్రాలు మలయాళంలో వచ్చినవి. అయితే ఆదూర్‍ గోపాల కృష్ణన్‍ మలయాళ చిత్రరంగ ప్రవేశం మలయాళ సినిమా రంగాన్ని మహత్తరమైన మలుపు తిప్పింది. వీటన్నింటి ప్రభావం మద్రాసును తాకలేదు కానీ హైదరాబాదును తాకి. అది సికిందరాబాదు ఆల్వాల్‍లో పుట్టి పెరిగిన ‘శ్యాం …

నలభై వసంతాల మాభూమి Read More »