మనిషి భావాలకు రంగులద్దిన వర్ణధారి విజయ్‍కుమార్

దేశవిదేశాల్లో వందకుపైగా చిత్రకళా ప్రదర్శనలు

మనిషిలోని సంఘర్షణకు అద్దం పట్టే మనోజ్ఞ చిత్రాలను గీసి ఔరా అనిపిస్తున్నారు ప్రముఖ చిత్రకారులు విజయ్‍ కుమార్‍. తన భావాలకు అనుగుణంగా రంగులు అద్దడం, ప్రకృతికి, మనిషికి విడదీయరాని సంబంధం ఉందంటూ మనిషిపడే తపన, ఎదుర్కొనే మానసిక సంఘర్షణలను ప్రకృతిలో వెతికి వైవిధ్యమైన చిత్రాలు గీయడం వంటివి ఆయన ప్రతిభను చాటిచెప్తున్నాయి.


బరోడా విశ్వవిద్యాలయం నుంచి మెళకువలు:

ఇద్దరి వ్యక్తుల మధ్య ఉన్న అనుబంధం భిన్నాభిప్రాయాలతో విడిపోవడాన్ని పడిపోయిన చెట్టుతో పోల్చి విభిన్న చిత్రాలు గీసి మెప్పించారు చిత్రకారులు విజయ్‍కుమార్‍. హైదరాబాద్‍ నగరానికి చెందిన ఆయన మనిషి భావాలను ప్రకృతికి అన్వయించి అద్భుతమైన చిత్రాలు గీయడం లక్ష్యంగా ఎంచుకున్నారు. చిన్ననాటి నుండే చిత్రలేఖనంపై ఆసక్తి ఉండటం వల్ల ఈ రంగంలో ప్రవేశించారు. పెయింటింగ్‍లో తొలి మెళకువలన్నీ బరోడా విశ్వవిద్యాలయం కేంద్రంగా నేర్చుకున్నారు. పెయింటింగ్‍లో పోస్టుగ్రాడ్యుయేట్‍ పూర్తిచేసి, చిత్రలేఖనంలోకి 1982లో ప్రవేశించారు. ఎక్రిలిక్‍ రంగులు ఉన్నప్పటికీ ఆ రంగుల ద్వారా అన్ని రకాల షేడ్స్ రావనీ, 50 సంవత్సరాల నుంచి చిత్రలేఖనంలో ఆయిల్‍ కలర్స్ ఎక్కువగా ఉపయోగిస్తూ ప్రయోగాలకు కేంద్రంగా నిలిచారు.దేశవిదేశాల్లో వందల సంఖ్యలో ప్రదర్శనలు నిర్వహించి పేరు గడించారు.


మనిషి మనుగడలో మలుపులు :

మనిషి మనుగడలో మలుపులు ఉన్నట్లే ప్రకృతిలోని చెట్టుచేమలు, పశువులు, జంతువుల్లోనూ ఉంటాయని తన చిత్రాల ద్వారా నిరూపించే ప్రయత్నం చేశారు. మానవ మేథస్సులో దాగిన ఊహాలకు ప్రాణం పోసి రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరించారు. దూరంగా కనిపించే కొండకోనలు, చుట్టూ ఉన్న చెట్టుచేమల్లో ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ తన కుంచేతో ప్రయోగాలు చేస్తున్నారు. తాను గీసే చిత్రాల్ని ఎవరిదృష్టితో వాళ్లు ఎవరి విశ్లేషణతో వాళ్లు వేరువేరుగా చూసుకొని విశ్లేషించుకునే వీలుందంటారు. తన యవ్వనంలో ఎదుర్కొన్న సమస్యలు, జీవితం గూర్చి నేర్చుకున్న గుణపాఠాలే తనను ఇలాంటి భావ చిత్రాలు గీయడానికి దోహదపడిందంటారు ఆయన. భావ చిత్రాలు గీయడానికి ప్రతి చిత్ర లేఖకుడు కృషి చేయాలని విజయ్‍కుమార్‍ కోరుతున్నారు.చిత్రకారుడిగా నిలదొక్కుకోవాలంటే క్రియేటివిటి ఉండాలంటున్నారు.


విద్య :

 •  1983లో బ్యాచిలర్‍ ఆఫ్‍ ఫైన్‍ ఆర్టస్ (బీఎఫ్‍ఏ)లో ఫ్యాకల్టీ ఆఫ్‍ ఫైన్‍ ఆర్టస్, ఎంఎస్‍.యూనివర్సిటీ బరోడా.
 • 1985లో మాస్టర్‍ ఆఫ్‍ ఫైన్‍ ఆర్టస్ (ఎంఎఫ్‍ఏ) (క్రియేటివ్‍ పెయింటింగ్‍)

అవార్డ్సు :

 •  1974లో లలిత కళా సమితి, సిద్ధిపేట, ఆంధప్రదేశ్‍
 •  1979లో ఇంటర్‍ కాలేజియేట్‍ టాలెంట్‍ కాంపిటీషన్‍, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్‍
 •  1989 చిత్రకళ శాంసద్‍, మచిలీపట్నం, ఆంధప్రదేశ్‍
 •  1987 ఆలిండియా యూత్‍ ఆర్ట్ ఎగ్జిబిషన్‍, కమిమోరేటింగ్‍ జామిని రాయ్‍ బర్త్ సెంటినరీ ఇయర్‍, కలకత్తా
 •  1989-96 ఆలిండియా ఆర్టస్ ఎగ్జిబిషన్‍, హైదరాబాద్‍ ఆర్ట్ సొసైటీ
 •  1997 స్టేట్‍ లెవల్‍ ఆర్ట్ ఎగ్జిబిషన్‍ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‍
 •  2001 గోల్డ్మెడల్‍ ఇన్‍ డైమండ్‍ జూబ్లీ ఇయర్‍ ఆలిండియా ఆర్ట్ ఎగ్జిబిషన్‍, హైదరాబాద్‍ ఆర్ట్ సొసైటీ

స్కాలర్‍షిప్స్ అండ్‍ ఫెలోషిప్స్ :

 • 1979-83 ప్రొఫెషనల్‍ స్టడీస్‍ స్కాలర్‍షిప్‍, నిజాం ఛారిటబుల్‍ ట్రస్టు, హైదరాబాద్‍
 •  1980 మెరిట్‍ స్కాలర్‍షిప్‍, ఫ్యాకల్టీ ఆఫ్‍ ఫైన్‍ ఆర్టస్, ఎం.ఎస్‍. యూనివర్సిటీ, బరోడా
 • 1983-84 బెస్ట్ స్టూడెంట్‍ స్కాలర్‍షిప్‍ (ఫ్యాకల్టీ ఆఫ్‍ ఫైన్‍ ఆర్టస్) ఉర్జా ట్రస్టు, బరోడా
 •  1984-85 హయ్యర్‍ ఎడ్యుకేషన్‍ స్కాలర్‍షిప్‍, ఏపీ స్టేట్‍ లలిత కళా అకాడమీ
 •  1995-97 జూనియర్‍ ఫెలోషిప్‍ (విజువల్‍ ఆర్టస్), హెచ్‍ఆర్‍డీ, న్యూఢిల్లీ

సోలో షోలు :

 •  1987 పెయింటింగ్స్ అండ్‍ డ్రాయింగ్స్ ఉత్తీసింగ్‍ విజువల్‍ ఆర్ట్ సెంటర్‍, అహ్మదాబాద్‍
 • 1987 పెయింటింగ్‍ అండ్‍ డ్రాయింగ్స్ మ్యాక్స్ ముల్లర్‍ భవన్‍, హైదరాబాద్‍
 • 1988 పెయింటింగ్స్, డ్రాయింగ్స్ అండ్‍ ఫొటోగ్రాఫ్స్ – శ్రీధరణి ఆర్ట్ గ్యాలరీ, న్యూఢిల్లీ 
 •  1991 ‘రోరింగ్‍ సైలెన్స్’ పెయింటింగ్స్ అండ్‍ డ్రాయింగ్స్ – జహంగీర్‍ ఆర్ట్ గ్యాలరీ, ముంబై 
 • 1993 ఇన్నర్‍ తుర్‍మోయిల్‍ పెయింటింగ్స్ అండ్‍ డ్రాయింగ్స్ మ్యాక్స్ ముల్లర్‍ భవన్‍, హైదరాబాద్‍ 
 • 1996 పెయింటింగ్స్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, హైదరాబాద్‍ 
 • 1998 డ్రాయింగ్స్- కలర్‍షీ, అహ్మదాబాద్‍ అండ్‍ బరోడా 
 • 2000 మీనియేచర్‍ పెయింటింగ్స్ – ఇండోట్రోనిక్స్, హైదరాబాద్‍ 

గ్రూప్‍ షోలు :

 • 1975 ది ఆర్ట్ ఆఫ్‍ త్రీ డికేడ్స్ ఇన్‍ కనెక్షన్‍ విత్‍ ఫస్ట్ వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్, లలిత కళా అకాడమీ, హైదరాబాద్‍, ఏపీ 
 • 1982 యంగ్‍ ఆర్టిస్ట్సు కాంటెంపరరీ ఆర్ట్ ఎగ్జిబిషన్‍, ఆంధ్రాసమితి, బరోడా 
 • 1985 డిగ్రీ షో, ఫ్యాకల్టీ ఆఫ్‍ ఫైన్‍ ఆర్టస్, ఎంఎస్‍.యూనివర్సిటీ, బరోడా 
 • 1988 ఎక్స్పోజిషన్‍ 88, క్రియేటివ్‍ ఆర్టస్ ఫండ్‍, సంస్కార్‍ కేంద్రం, అహ్మదాబాద్‍ 
 • 1990 ‘నైన్‍ టు నైన్‍టీ’ 50 ఆర్టిస్ట్సు ఆఫ్‍ ఫేమ్‍ అండ్‍ ప్రామిస్‍, లలితకళా అకాడమీ, న్యూఢిల్లీ
 • 1990 5 యంగ్‍ కాంటెంపరీస్‍, ఎల్‍.వి.ప్రసాద్‍ ఐ ఇనిస్టిట్యూట్‍ అండ్‍ సీసీఎంబీ, హైదరాబాద్‍
 • 1994 గ్రూప్‍ 5, జహంగీర్‍ ఆర్ట్ గ్యాలరీ, ముంబై 
 • 2000 యానువల్‍ షో, బిర్లా అకాడమి ఆఫ్‍ ఫైన్‍ ఆర్టస్, ముంబై 
 • 2005 ఆర్ట్ క్యాంప్‍ షో, కళాకృతి ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్‍ 
 • 2015 ఆర్ట్ ఎట్‍ తెలంగాణ, సాలార్‍జంగ్‍ మ్యూజియం, హోటల్‍ మారియట్‍, హైదరాబాద్‍ 
 • 2018 ఫస్ట్ ఇంటర్‍నేషనల్‍ కళామేళ, లలితకళా అకాడమి, న్యూఢిల్లీ
 • 2020 6 డైమెన్షియన్స్ సీజన్‍ 4, ఆర్ట్ షో, ఎం.ఈశ్వరయ్య ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్‍.

రామకృష్ణ కాంపాటి,
9866168863

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *