మునగాకు పొడి – ఔషధాల ఒడి

సాధారణంగా మనం మునగను కాయల కోసం వాడే ఒక కూరగాయ పంటగా పరి గణిస్తాం. కాని మునగ బహుళ ప్రయోజనకారి అని చాలా మందికి తెలియదు. దీని ఆకులు, కాయలు, విత్తనాలు చాలా ఔషధ విలువలు క లిగి ఉన్నందున దాదాపు 300 రకాల వ్యాధు లను నయం చేసే గుణాలు కలిగి ఉండటం వలన మునగను అద్భుత వృక్షంగా అభివర్ణి స్తారు. మునగాకు వివిధ ప్రయోజనాలను చూ ద్దాం.
ఆకులను ఆహారంలో ఒక భాగంగా తీసు కోవడం వల్ల గర్భిణులకు, బాలింతలకు రక్త హీనత తగ్గి ఆరోగ్యవంతమైన శిశువు జన్మించ డానికి, పాలు అధికంగా రావటానికి దోహద పడుతుంది. అందుకే ఫిలిఫైన్స్ దేశంలో ము నగను ‘తల్లుల మిత్రుని’ గా పరిగణిస్తారు.


ఆకుల పొడిలో గల పోషక విలువలు:

మన ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలలో దా దాపు 90 కంటే ఎక్కువ పోషకాలు మునగ ఆకుల్లో ఉంటాయి. తాజా ఆకుల కంటే పొడి లో ఎక్కువ మోతాదులో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. తాజా ఆకుల పొడిలో (100గ్రాముల్లో) ఉండే పోషకాలు పట్టికలో తెలుపబడినవి.


కొన్ని ఆసక్తికరమైన విషయాలు: 

  •  ఒక గ్రాము మునగ ఆకుల పొడిలో 3 రెట్లు ఎక్కువ విటమిన్‍లు ఉంటాయి.
  •  పాలకూర కంటే 25 రెట్లు ఎక్కువ ఇను ము, విటమిన్‍లు ఉంటాయి.
  •  అరంటి పండు కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది.
  • క్యారెట్‍ కంటే 10 రెట్లు ఎక్కువ విటమిన్‍ -ఎ ఉంటుంది.
  • గుడ్డులో కంటే 9 రెట్లు ఎక్కువ మాంసకృత్తులు ఉంటాయి.
  •  బత్తాయి కంటే 7 రెట్లు ఎక్కువ విటమిన్‍ -సి ఉంటుంది.

మునగాకును ఏ విధంగా ఆహారంలో తీసు కోవచ్చు అంటే మనం రోజు చేసుకునే చపాతీ లు, ఇడ్లీ, దోశ, సూపులు, సలాడ్‍లలో కలిపి ఆహారంగా తీసుకోవచ్చు. శాకాహార, మాంసా హార, వంటకాల్లో కలిపి వాడుకుంటే ఆ వంట ల పోషక విలువతో పాటు రుచి కూడా పెరు గుతుంది. ‘టీ’ రూపంలో కూడా తీసుకోవచ్చు.
లాభాలు:
మునగ ఆకుల పొడిని సిఫారసు చేసిన మోతాదులో వివిధ రకాలుగా ఉపయోగించు కోవడం వలన అనేక లాభాలు ఉన్నాయి. పోష కాల లోపాలతో బాధపడుతున్న చిన్న పిల్లలకు దివ్యౌషధంగా, సహాయకారిగా ఉపయోగ పడుతుంది. చాలా తక్కువ ఖర్చుతో, మానవ శరీరానికి కావాల్సిన పోషకాలను, ఖనిజాలను, విటమిన్లు మొదలైన వాటిని అందిస్తుంది. అధికంగా పోషకాలు, పీచు పదార్థాలుండ టం వల్ల ఆహారంగా తీసుకోవడం వల్ల నిండు తనాన్ని ఇస్తుంది. కాలేయ పనితీరును క్రమ బద్దీకరిస్తూ సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరు స్తుంది.


ప్రాచీన ఆయుర్వేద వైద్య విధానాల్లో మున గ 300 లకు పైగా వ్యాధుల చికిత్సకు సమర్థ వంతంగా ఉపయోగించుకోవచ్చు. కేన్సర్‍, ఎయిడ్స్, మధుమేహం, అధిక రక్తపోటు, జీర్ణ సంబంధిత రుగ్మతలకు, కీళ్ళనొప్పులకు, రక్త హీనతకు, నిద్ర సహాయకారిణిగా, నొప్పుల ఉపశమనానికి మొదలైన వాటికి చికిత్సగా ఉపయోగించ వచ్చు. అంతేకాకుండా కళ్ళ రక్షణకు, ఎముకల ఆరోగ్యానికి, దృఢత్వానికి, వ్యాధి నిరోధక శక్తి వృద్ధి చేయడానికి, శరీర జీవక్రియల్లో తోడ్పడు తుంది.
మునగ ఆకుల పొడిని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల జీవిత కాలం పెరగడమే కాకుండా ముసలితనానికి ప్రతికూలంగా మరియు బరువు తగ్గకుండా చేయడంలో సహకరి స్తుంది.

  •  ఇందులో గల ‘క్లోరోజెనిక్‍ ఆమ్లం’ రక్తంలో గ్లూకోజ్‍ స్థాయిని నియంత్రిస్తుంది.
  •  ‘క్విర్సిటిన్‍’ ఉండటం వలన రక్తపోటును నియంత్రించడంలో సహాయకారిగా పని చేస్తుంది.
  •  అభివృద్ధి చెందుతున్న దేశాలలో విటమి న్లు, ఖనిజపదార్థం, మాసంకృత్తుల లోపం తో, బాధ పడే వారికి మునగాకు ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది.

పొడిని తయారుచేసే పద్ధతి:
మునగ ఆకుల పొడిని మన ఇళ్ళలో, వాణి జ్య సరళిలో తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఈ కింద తెలిపిన విధంగా పొడిని చేయవచ్చు.


ఆకుల కోత / సేకరణ:
ఒకసారి మునగ మొక్కలు స్థిరపడిన తరువాత ఎప్పుడైనా ఆకు లకు స్వీకరించవచ్చు. అన్ని దశల్లోని ఆకులు అనగా లేత, ముదురాకులు పొడి తయారికి ఉపయోగపడతాయి. చెట్ల నుంచి లేదా మునగ మళ్ళ నుంచి ఆకులను సేకరించవచ్చు. చెట్లను భూమట్టానికి 1-2 మీటర్ల ఎత్తులో నరికి లేదా బాగా పెరిగిన చెట్లలో ఎంపిక చేసుకున్న కొ మ్మలను కత్తిరించి లేదా కొమ్మలను సగం వ రకు కత్తిరించి ఆకులను సేకరించవచ్చు. ము నగ మళ్ళ నుంచి ఆకులను సేకరించటానికి మొక్కలను భూమికి 15-50 సెం.మీ. ఎత్తులో కత్తిరించి ఆకులను సేకరించాలి. ఒక సంవత్స రంలో మళ్ళ నుంచి తగిన వ్యవధిలో 6-9 సార్లు ఆకులను సేకరించవచ్చు. ఆకులను వర్షాకాలంలో సేకరించుట వలన పొడి కాలం వచ్చే సమయానికి కత్తిరించిన చెట్లు తిరిగి చిగుర్లు వేస్తాయి.
మునగ ఆకులు త్వరగా నీటిని కోల్పోతా యి. కనుక త్వరగా వాటిని చల్లని ఉదయం వేళలో సేకరించాలి.ఆకులను సేకరించే సమ యంలో పురుగులు తెగుళ్ళు ఆశించిన ఆకుల ను, రంగు మారిన ఆకులను తొలగించి పశుగ్రాసానికి లేదా కంపోస్టు తయారుచేయటానికి ఉపయోగించవచ్చు. సేకరించిన ఆకులను మంచి నీటితో శుభ్రంగా కడగాలి. దీనివల్ల ఆకులపై దుమ్ము, ధుళి సూక్ష్మక్రియులు తొలగి పోతాయి. వాణిజ్య సరళిలో చాలా బలహీన మైన బ్లీచ్‍ ద్రావణంతో ఆకులను శుభ్రపరు స్తారు.


ఆకులను ఆరబెట్టటం:
పై విధంగా శుభ్రం చేసిన ఆకులను నీడలో ఆరబెట్టాలి. వెలుతురు, ధూళి, దుమ్ము, పురు గుల నుంచి రక్షణ ఉండే ప్రదేశాల్లో ఆరబె ట్టాలి. ఇళ్ళలో తయారుచేసుకునేటప్పుడు ఇంటి లోనే ఆరబెట్టవచ్చు. వాణిజ్య సరళిలో పై వాటి నుంచి రక్షణగా షెడ్లలో ఆరబెట్టాలి. ఆకులను ఎండలో ఆరబెట్టకూడదు. ఎండలో ఆరబెట్టిన ప్పుడు ఆకులనుంచి కొన్ని పోషకాలు, విట మిన్లు నశించిపోతాయి. ఆరబెట్టిన ఒకటి, రెం డు రోజుల్లో పెద్దాకుల నుంచి చిన్న ఆకులు సులువుగా విడిపోతాయి. లేదా ఆకులను దు లిపి రెమ్మలను, ఆకుల కాడలను తొలగించా లి. ఆకులను ఒక పలుచని గుడ్డమీద పలు చగా పరచి ఆరబెట్టాలి. అప్పుడప్పుడు ఆకులను కదలిస్తూ సమంగా ఆరేలా చూడాలి. ఆరబెట్టె ప్రాంతంలో గాలిలో తేమ అధికంగా ఉన్నప్పు డు నిర్ణీత పరికరాలను లేదా ఓవెన్లు లేదా ఫ్యాన్ల సహాయంతో ఆరబెట్టాలి. ఆకులు పెళ పెళలాడి, సులువుగా పొడిగా వచ్చే వరకు ఆ రబెట్టుకోవాలి. ఆకులను ఎంత త్వరగా వీలైతే అంతా త్వరగా ఆరనివ్వాలి. లేనిచో ఆకులకు బూజు, బూడిద తెగుళ్ళు ఆశించే అవకాశముం ది. ఆరబెట్టిన ఆకులను తరచుగా పరిక్షీస్తుండాలి. వీలైనంత వరకు ముదిరిన ఆకులనే సేకరిం చాలి.సాధారణంగా ఆరబెట్టిన ప్రాంతంలో గల పొడి వాతవరణాన్ని బట్టి, తేమ మోతాదును బట్టి ఆకులు 4-6 రోజుల్లో ఎండిపోతాయి. 10 కిలోల తాజా ఆకుల నుంచి 1 కిలో ఎం డిన పొడిని పొందవచ్చు.


ఆకులను పొడి చేయటం:
కొద్ది మోతాదుల్లో లేదా ఇళ్ళలో రోట్లో లేదా విద్యుత్‍ గ్రైండర్లను వినియోగించాలి లేదా చే తులతో నలిపిగాని ఆరబెట్టి ఆకులను పొడి చేయవచ్చు. పొడి చేసిన తర్వాత జల్లెడ పట్టి మిగిలిపోయిన కాండం ముక్కలను, ఆకుల తొడిమల ముక్కలను తొలగించాలి.


ఆకుల పొడిని ఆరబెట్టడం:
ఆరబెట్టిన సమయంలో, పొడి చేసే సమ యంలో మునగ ఆకులు, పొడి పరిసరాల నుం చి తేమను త్వరగా గ్రహిస్తాయి. అలాంటి ఆకు లను, పొడిని, బూజు, బూడిద తెగుళ్ళూ ఆశిం చే అవకాశముండటం వల్ల పొడిని కూడా ఓవెన్లలో 50 డిగ్రీల సెం.గ్రే. వద్ద పొడిలోని తేమను తగ్గించటానికి ఎండనివ్వాలి.


పొడిని నిల్వ చేయటం:
మునగ ఆకుల పొడిని వాణిజ్యపరంగా ఎక్కువగా తయారుచేసుకుంటాం. వర్షకాలం లో తయారుచేయటం వల్ల, ఎడాది పొడవునా వినియోగించాలి కనుక పొడిని జాగ్రత్తగా, చెడిపోకుండా, తెగుళ్ళు ఆశించకుండా నిల్వ చేసుకోవాలి. ఇందుకుగాను గాలి చొరబడని డబ్బాల్లో నిల్వచేసుకొని వేడి, వెలుతురు తేమ నుంచి రక్షణగల ప్రదేశాలో నిల్వచేసుకోవాలి. నిల్వచేసిన పొడివెలుతురు, వేడి తగలడం వల్ల నాణ్యత దెబ్బతినడమే కాకుండా అందులోని పోషకాలు నష్టపోతాయి. అలాగే గాలిలో తేమ ను గ్రహించటం వల్ల బూజు తెగుళ్లు ఆశించి కొన్ని సమస్యలు వచ్చే అవకాశముంది. బూజు ఆశించిన పొడి దుర్వాసన కలిగి హానికరమైన ప్రభావాలు కలిగి ఉంటుంది. కనుక అలాంటి పొడి వినియోగానికి పనికిరాదు. కనుక పారే యాలి. చాలా జాగ్రత్తగా నిల్వ చేసినప్పుడు మునగ ఆకుల పొడిన 6-12 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు. సరిగా ఆరిపోయి, శభ్రం గా ఉన్నప్పుడు, గాలి చేరని డబ్బాల్లో నిల్వ చేసినప్పుడు వేడి, వెలుతురు, తేమల నుంచి, రక్షణ కలిగినప్పుడు 24 డిగ్రీల సెం.గ్రే. కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసినప్పుడు ఎ క్కువ కాలం నిల్వ ఉంటుంది.


ఎంత మోతాదులో తీసుకోవాలంటే:

  •  ప్రతిరోజు ఒకటిన్నర చెంచాల పొడిని క్ర మం తప్పకుండా 3 నెలలపాటు తీసుకున్న ట్లయితే మంచి యాంటి ఆక్సిడెంట్స్ గా పని చేస్తుంది.
  •  సాధారణ ఆరోగ్యవంతులకు రోజుకు 1 లేదా 2 చెంచాల పొడి, అధిక కొలెస్ట్రాల్‍ కలిగిన వారికి రోజుకు 2 టేబుల్‍ స్పూన్‍ పొడి.
  •  మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడే వారు రోజుకి 2 టేబుల్‍ స్పూన్‍ పొడి తీసుకో వచ్చు.
  •  పోషకాహార లోపం గల చిన్న పిల్లలకు (1-3 సంవత్సరాలు) రోజుకు 50గ్రా. పొడి ఇవ్వాలి.

ఇన్ని రకాల పోషకాలు, ఆరోగ్యపరంగా మేలు చేసే గుణం ఉన్న మునగాకు పొడికి అంతర్జాతీయ మార్కెట్లో కూడా ముఖ్యంగా యూరోపియన్‍ దేశాల్లో చాలా డిమాండ్‍ ఉన్నది. ఈ పొడిని ఎగుమతి చేసే అవకాశం ఉంది. దీని ఉత్పత్తిని వాణిజ్య సరళి లో పెద్ద ఎత్తున చేపట్టడం వలన గ్రామీణ ప్రాంతాల్లోని వారికి, మహిళలకు ఉపాధి అవకాశాన్ని కల్పించవచ్చు.


-కె.స్వాతి, కె.సుకుమార్‍, ఆర్‍.ఉమారెడ్డి,
అగ్రికల్చర్‍ పాలిటెక్నిక్‍, పొలాస, జగిత్యాల, తెలంగాణ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *