పర్యావరణం – శాస్త్రం – నైతికత – తాత్విక దృక్పథాలు


(గత సంచిక తరువాయి)
జీవ కేంద్రక నైతికత – అంతర్నిహిత విలువలు

భూమిపై గల జీవ వైవిధ్యం అత్యంత సంక్లిష్టమైంది. దీనిని అర్థం చేసుకోవటం మానవాళికి అవసరం అని ఆవరణ శాస్త్రం చెపుతుంది. జీవశాస్త్రం రెండు వేల ఏళ్ల సంవత్సరాల క్రిందటే జంతు, వృక్ష జాతులను వర్గీకరించడం మొదలు పెట్టింది. శాస్త్రీయంగా ఈ పనిని అరిస్టాటిల్‍ కూడా నిర్వర్తించాడు. శాస్త్రీయంగా ప్రస్తుతం 1.4 మిలియన్ల జాతులను వర్గీకరించారు. అసలు ఉనికిలో ఉన్న జాతుల కంటే, వర్గీకరించినవి అతి స్వల్పశాతం మాత్రమే.


ప్రతి జాతి కొద్ది సంఖ్య మొదలుకొని బిలియన్ల కొద్దీ సభ్యులను కలిగి ఉంటుంది. ప్రతి జాతి పర్యావరణంలో తన ఆవాస స్థానంలో ఉంటూ తన పరిసర జీవులతో చర్య జరుపుతూ ఉంటుంది. జీవిక కోసం. ప్రతి జీవి తనుండే పరిసరం నుండి పోషకాహారం స్వీకరించుతుంది. తన సంతతిని వృద్ధి పరచుకుంటుంది. ఇందుకు అవసరమైన సామర్థ్యం మిలియన్ల కొద్దీ సంవత్సరాల మారుతున్న పర్యావరణం, పరివర్తనలు, సహజ ఎంపిక అనే పరిణామాలపై ఆధారపడి మార్పులు పొందుతూ వచ్చింది. అయితే ఈ సామర్థ్యం ప్రతి జాతి యొక్క జన్యు సంగీతం (బెనెటిక్‍ కోడ్‍)లో నిక్షిప్తమై ఉంటుంది. ప్రతి జీవి ఒక బిలియన్‍ మొదలుకొని పది బిలియన్ల పరిమాణం గల సమాచార శకలాలను తన జన్యు సంకేతంలో కలిగి ఉంటుంది.


ఇంత వైవిధ్యం ఉన్నప్పటికీ వాటికి ముప్పుకలుగుతున్నది. దీనిపై శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతూనే కలుగుతున్న ముప్పును అంచనా కడుతున్నారు. Some Scientists, including E.o. Wilson, estimate that over one hundred species per day, almost 50,000 species each year become extincts.
ఈ విధమైన అంతరింపులు అనేవి ఒక జీవ వాస్తవం అని శిలాజ రికార్డులు తెలుపుతున్నాయి. ఈ శిలాజ ఆధారాలు తెలుపుతూ ఉన్న మరొక వాస్తవం కూడా ఉంది. అదేమంటే ఇటువంటి అంతరింపులు మానవ కారణాలు, ప్రమేయాలు లేకుండానే సహజంగా జరుగుతున్నాయి, వీటిని నేపథ్య అంతరింపు వృద్ధిరేటుగా (background exinction rate) శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇట్లాంటి అంతరింపులు ప్రస్తుతం సంభవిస్తున్న వాటికంటే అతి తక్కువగా ఉన్నాయి. నేపథ్య అంతరింపులు వృద్ధి రేటుకంటే వందరెట్లు అధికంగా ఈనాడు క్షీరదాలు అంతరిస్తున్నాయి. అసలు భూమి ఏక మొత్తంగా అంతరింపుకు అనే సంఘటనకు గురయ్యే అవకాశం పెరిగిందనేది వాస్తవం. వీటి నుండి భూమి తిరిగి కోలుకొని యధాతథ స్థితికి రావడానికి పదిమిలియన్ల సంవత్సరాలు పట్టవచ్చని కొన్ని అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.


ఇక్కడే అసలు ప్రశ్న తలెత్తుతుంది. జీవితానికి జీవికి ఉన్న విలువ ఏమిటనేది ప్రశ్న. అయితే కొన్ని మంచి ప్రయోజనాత్మక వాదాలు జీవ వైవిధ్యం కాపాడబడాలనే వాదనను బలపరుస్తాయి. మరికొన్ని ఇంకొంత మౌలికమైన విషయాలను తీవ్రంగా చర్చకు పెట్టవచ్చు. ఈ విధంగా ఇటువంటి సమస్యలు, సందర్భాలు ఎదురైనప్పుడు వీటి వల్ల మానవులకు ఇతర జీవరూపాలతో ఉన్న నైతిక సంబంధం ఏమిటనేది ప్రధానంగా మారుతుంది.


ఈ నైతిక సంబంధం విషయంగా జరిగిన చర్చ జీవకేంద్రత లేదా ప్రాణి కేంద్రక నైతికతగా రూపు దిద్దుకుని పర్యావరణ తత్వంలో ముఖ్య భాగమై నిలుస్తుంది. ఇప్పటి వరకు జరిగిందేమిటి? మానవులకు ఇతర జీవరూపాలతో సంబంధం, నైతిక బాధ్యతల విషయంగా సంప్రదాయ నైతికతలను విస్తరించడం మీద దృష్టి పెట్టాయి. అసలు జీవకేంద్రక నైతికత గురించి మాట్లాడటం హేతుబద్ధమేనా అనే విషయమూ చర్చింబడింది. Much of the recent Philosophical work on the environment breaks with standard ethical theory and strikes to re think the human nature relationship. దీనిని బట్టి చూస్తే ప్రాణికి నైతిక సిద్ధాంతంతో పర్యావరణ తాత్త్విక రచన ఇటీవల తెగదెంపులు చేసుకొని మనిషి – ప్రకృతిపై పునరాలోచనకు దిగాయని తెలుస్తున్నది. ఇటీవల తాత్విక రచనల్లో ఆ ధోరణి ప్రతిఫలించింది. ఈ తరహా ఆలోచనా ధార పర్యావరణ నైతికతగా కంటే పర్యావరణ తాత్వికతగానే వ్యవహరించ బడుతున్నది. సహజ ప్రకృతి ప్రపంచంలో మానవుల స్థానం నిర్ధారించబడాలంటే తాత్త్వికుల కేవలం నైతిక ప్రశ్నలకంటే మిగిలిన ఎన్నిటినో సంబోధించ వలసి వస్తుంది. అది భౌతిక శాస్త్రాంగాలు, జ్ఞాన సిద్ధాంతాలు, సౌందర్య శాస్త్రం, రాజనీతి తత్వం మొదలైనవి నైతికతను గురించి పునరాలోచన చేస్తున్నప్పుడు ప్రధానమవుతాయి.


ఇంతకుముందే రూపొందించబడిన నైతిక సిద్ధాంతాలను పర్యావరణ సమస్యల పరిష్కారం విషయంగా అన్వయించే ఏ తాత్విక విధాన్నానైనా ప్రక్కకు నెట్టి, పర్యావరణ దృక్పథంతో సమగ్రమైన పర్యావరణ తాత్త్వికతనువృద్ధి పొందించే విధానం రూపొందాలి.


ఇక్కడ ఎదురయ్యే ఎన్నో ప్రశ్నలకు ఒకే సమాధానం లభించదు. కొన్నిటిలో మన హేతువు పర్యావరణ విధ్వంసంలో భాగంగా ఉంది. మానవులకు ముప్పును తెచ్చి పెడుతూ అనేక రకాల ప్రశ్నలు లేవనెత్త బడతాయి. మరికొన్ని విషయాల్లో మనం ప్రకృతితో వ్యవహరించే విధానంలోని నైతికత / విలువ ఆధ్యాత్మిక, సౌందర్యాత్మక, సాంస్కృతిక విలువలను బాధిస్తుంది. మరికొన్నిటిలో ప్రకృతి వస్తువులకు మానవులు ప్రత్యక్ష హానినే తలపెడుతుండటాన్ని గమనించవచ్చు. ఈ విధంగా చూస్తే పర్యావరణ తాత్త్వికతకు ఒక లక్ష్యం ఉందని చెప్పడానికి సందేహమేలేదు. The goal of many environmental philosophers is to provide a single systematic principal or theary that | can account for these various concens. ఇటువంటి లక్ష్యం నెరవేరబడాలంటే నైతిక శాస్త్రంతో పనిచేస్తేనే చాలదు. అధి బౌతిక శాస్త్రం, జ్ఞాన సిద్ధాంతం, సౌందర్య శాస్త్రం రాజకీయ తత్వశాస్త్రాలలోని ఆలోచనలు ఉపకరిస్తాయి.


తాత్త్వికంగా వచ్చిన మార్పును అర్థం చేసుకోవడం ఈ సందర్భంలో గుర్తించాలి. ఈ మార్పు నైతికతకు సంబంధించిన ప్రశ్నలకు విలువకు సంబంధించిన సాధారణ ప్రశ్నలకు మధ్య తేడాల ఆధారంగా గమనించవచ్చు. అయితే ఇక్కడ నైతికతను ఏవిధంగా అర్థం చేసుకుంటా మనేది కూడా ముఖ్యం. “Morality, narrowly understood, has always taken human well being and the relationship between human as its focus‘మానవుల సంక్షేమాన్ని ప్రధానంగా కోరుకుంటూ మానవసంబంధాలు, మనుషులపై దృష్టి నిలపటమే నైతికంగా పరిగణించబడింది. అలాగే నైతికత అంటే ఇతరుల పట్ల మానవులకున్న బాధ్యతలు గాను, ఇతరులకు వ్యతిరేకంగా ఉన్నవి హక్కులుగాను గ్రహింపబడుతూ ఉంది. కాబట్టి పర్యావరణ విషయాల పట్ల సంబంధం కలిగి ఉండటమనేది నైతికతగా పరిగణింపబడటానికి తాత్త్వికులు సుముఖంగా లేరు. అంటే సంప్రదాయ నైతికత అనే భూమిక మీద పర్యావరణాంశాలు నిలవవు సరికదా వాటికి నైతిక పరిగణన లేదు.


కానీ విస్తృతార్థంలో తాత్త్విక నైతికత మంచి జీవితం గురించి, మానవ వికాసాభివృద్ధి గురించి కొన్ని సాధారణ ప్రశ్నలను ఆడిగేదిగా అర్థం చేసుకోబడుతుంది. ఈ ప్రశ్నలు విలువలకు సంబం ధించినవి. ఈ దృక్కోణం నుంచి చూస్తే పర్యావరణ సంబంధం అనేది నైతిక సంబంధాన్ని కలిగి ఉండటంగానే పేర్కొనాలి.
విలువలకు సంబంధించిన ప్రశ్నలు లేవనెత్తటమే కాకుండా, మానవులు ఎట్లా జీవించాలి అనే విషయంగా కొన్ని నియమాలను కూడ స్థాపించగలుగుతాయి. విలువల సంబంధిత ప్రశ్నలన్నీ నైతిక విలువకు సంబంధించినవి మాత్రమే కాకపోవచ్చు. అవి సౌందర్య, ఆధ్యాత్మిక, శాస్త్రీయ, సాంస్కృతిక విలువలు కూడా గౌరవ అర్హమైనవిగా, సమర్థమైనవిగాను గుర్తించాలి.


కాబట్టి పర్యావరణ తత్త్వం ప్రకృతిని మరియు దానికి గల విలువ పరిధిని సమగ్రంగా కీలకమైందిగా పరిగణిస్తుంది. లెక్కలేనన్ని క్రిమికీటకాదులు ఇవ్వాళ విధ్వంసం వల్ల అంతరిస్తున్నాయి. మానవ ఉద్దేశాల కారణంగానే ఈ విధ్వంసం సంభవిస్తున్నదని, ఈ విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. మిలియన్ల కొద్ది కీటకాలు అంతరించటంలో కచ్చితమైన దోషమేది? ఎక్కడుంది? ఈ విషయమై పర్యావరణ తాత్త్విక నైతిక విలువలు గురించి వ్యాఖ్యానించిన వారు యిలా అభిప్రాయపడుతున్నారు. nsects do not feel pain, are not conscious, and are not subjects – of – a – lifle. కీటకాలకు బాధ, స్పృహ లేవు కాబట్టి అవి ప్రాణం గల విషయాలుగా పరిగణన పొందటం లేదు. ఏ విధంగా చూసినా అవి నైతికమైనవి కావు. ఇక్కడ విలువకు సంబంధించిన విషయం ఏదో లోపించింది. నిజానికి ఉద్దేశపూర్వక మానవ కార్యకలాపమే వాటిని మట్టుబెట్టింది. మనిషి దురాశ వల్లగాని తెలియకపోవటం వలనగాని ఈ విలువలను తరచు పోగొట్టుకోవడం జరుగుతుంది. అంటే నైతికతను సంకుచితమైన పరిథిలో అర్థం చేసుకోవటం నుంచి దానిని నైతిక విలువకు సంబంధించి విశాలార్థంలో స్వీకరించడానికి ఉద్యుక్తం కావడం జరుగుతుంది.


ఈ తరహా ఆలోచనా విధానాలలో మానవ సంవేదనలు లేవు కనుక క్రిమికీట కాదులు నైతిక జీవులు కావనే మానవ నిర్ధారణ వల్ల వాటి పట్ల మానవ బాధ్యత ఏమీ లేదనే సమర్థన దాకా వస్తుంది. ఉద్దేశపూర్వక మానవ ప్రయోజనాల వల్ల అవి అంతరి స్తుంటే ఒక విలువేదో మానవాళి కోల్పోయిందని భావించాలి. ఆ లుప్త విలువను తిరిగి సాధించడం కొరకు నైతికత జంతు సంక్షేమం అనే వాదం నుండి మరింత సమగ్ర పూర్ణ పర్యావరణ తాత్వికతవైపు ఆలోచన మారింది. ఎందుకంటే నైతికత, నైతిక విలువ సంకుచి తంగా అర్థం చేసుకోవడం తప్ప విలువను విశాలార్ధంలో గ్రహించలేదు.


తాత్వికులు నైతిక విలువను మానవ ప్రయోజనాలు అనే భావనల ద్వారా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇక్కడ ప్రయోజనాలకు బదులుగా మానవ వాంఛితాలు (interests) పరంగా చర్చించారు. వారిలో Joel, Feinberg, Christopher Stone, Peter Singer, కెన్నెత్‍ గుడ్‍ పాస్టర్లు ఏయే అంశాలు నైతిక పరిగణను పొందుతాయో నిర్ణయించడానికి ‘వాంఛితం’ భావన ఆధారంగా చేపట్టారు. ఒకటి ఏదైనా వాంఛిస్తున్నదంటే అది ‘దాని కోసమే’ నని ఫీన్‍బర్గ్, దానికదిగా విలువ గలదని స్టోన్‍, బెంతామ్‍, సింగర్లు దానిదే అయిన సంక్షేమమని, అంతర్నిహిత విలువ అని రీగన్‍లు, ‘దానికదిగా బాగుండటం’ అని గుడ్‍ పాస్టర్లు పేర్కొన్నారు.


ఏమైనా మానవులు ఆపాదించిన విలువ, సామర్థ్యాల కంటే భిన్నంగా, స్వతంత్రంగా అవి విలువ, సామర్థ్యాలను కలిగి
ఉంటాయి. వాటికి మానవులకున్న సంబంధం బట్టి విలువ ఇవ్వబడుతుందని, వాటంతట అవి విలువ, సామర్థ్యం గలవిగా గుర్తించనప్పుడు మాత్రమే మనం పొరబడతామని తెలుస్తుంది.


అంతర్నిహిత విలువ – ప్రకార్యాత్మక విలువ:
ఇతర ప్రాణులకు విలువ నివ్వటం ఎక్కువ సందర్భాలలో మానవులకు ఇవి ఉపయోగపడటం మీద ఆధారపడి జరుగుతూ ఉంటుంది. మానవ ప్రయోజనాలను నెరవేర్చేవి మాత్రమే విలువ గలవిగా గుర్తించడాన్ని ప్రకార్యాత్మక విలువగా పేర్కొంటున్నారు. మానవ ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా విలువ ఒకటి ఉందని గుర్తించడం అంతర్నిహిత విలువ.


ప్రకార్యాత్మక విలువ:
ఈ విలువ ప్రాణుల లేదా వస్తువుల ఉపయోగం ఆధారంగా గుర్తింపు పొందుతుంది. ఏ వస్తువైనా ప్రకార్యాత్మక విలువ కలిగి ఉందని భావించబడిందంటే, ఆ విలువ ద్వారా ఏదో ఒక ప్రయోజనం మానవాళి పొందుతుంది. The instrumental value of an object lies not in the object itself but in the uses to which that object can be put. దీనిని బట్టి చూసి ఒక వస్తువు విలువ దానిలో ఉండటం కాకుండా, దానిని ఉపయోగంలోకి తీసుకురావడం, అది ఉపయోగంలో ఉండటం అనే దానిపై ఆధారపడి నిర్ణయించబడుతూ ఉంటుంది. ఏదైనా వస్తువుకు ఇక ఏ మాత్రం ఉపయోగం లేనప్పుడు, దాని స్థానంలో మరొకటి వచ్చి చేరుతుంది. అప్పుడది దాని విలువలను కోల్పోయి నట్లు. ఇక ఆ వస్తువును విస్మరించడం లేదా త్యజించడం జరుగుతుంది.


సహజమైన వస్తువులు ‘వనరులు’గా గుర్తింపబడుతూ ఉన్నాయంటే వాటికి ఉన్న ప్రయోజన లేదా ప్రకార్యాత్మక విలువ వల్లనే. గ్రిపోర్ట్ పివిడాట్‍ పరిరక్షణ ఉద్యమం సహజవనరుల ప్రయోజన విలువను నొక్కి చెప్పింది. అడవులు, వన్యప్రాంతాలు పరిరక్షింపబడటం ఎందుకంటే అవి విస్తారమైన వనరులు కలిగి ఉండటం వలన ఆ వనరులు మానవ వినియోగానికి ఉపకరిస్తాయి కాబట్టి. అయితే ఈ జాతీయ వనరుల విలువ తరచుగా అసహజంగా పంపిణీ చేయబడుతుంటాయి లేదా వ్యర్థం చేయబడతాయి. అంటే దీనర్ధం వనరుల వినియోగం సరిగా జరగటం లేదని. పరిశుభ్రమైన నీరు, గాలి, ఎందుకు విలువైనవిగా పరిగణన పొందుతున్నాయి అంటే, అవి స్వచ్ఛంగా లేకపోతే మానవుల ఆరోగ్యం క్షీణింపజేస్తాయి. వృక్ష, జంతు జాతులు పరిరక్షించబడటానికి కారణం వాటికి వైద్య, వ్యవసాయ ఉపయోగాలు ఉండటం. అట్లా ప్రతిదీ ఉపయోగం లేదా ఆర్థిక ప్రయోజనం అనే ప్రకార్యాత్మక విలువ ప్రకృతికి ఇవ్వటం వలన అని భావించాలి. అయితే ప్రకార్యాత్మక విలువ పర్యావరణ నైతికత మీద ఆధారపడి ఉన్నప్పటికీ అది స్థిరం కాదు. ఇందుకు గల కారణం మానవ ప్రయోజనాలు, అవసరాలు, ఆకాంక్షలు స్థిరంగా ఉండవు మారుతూ ఉంటాయి. ఇవి మారినప్పుడల్లా, ప్రకృతిని ఉపయోగించే మానవ అవసరాలు కూడా మారతాయి.


అంతర్నిహిత విలువ :

ప్రకార్యాత్మక విలువ అన్నది ఆ సహజ వస్తువు వల్ల కలిగే ప్రయోజనం పై ఆధారపడి ఉన్నట్లే. అంతర్నిహిత విలువ అనేది దానికదే ఉపయోగంలో ఉండేది. అంతర్నిహిత విలువను ఉపయోగాలను బట్టి నిర్ణయించడం జరుగదు. ఆది అంతర్ని హితంగా ఉండేది. దేనికైనా అంతర్నిహిత విలువ ఉందంటే అది బాహ్య ఉపయోగాల మీద ఆధారపడి ఉండేది. కాదు. దానికదే విలువైనది. దానిలోపల విలువగలది. దానికది మేలు కలిగించేది. దీనిని ఈ విధంగా పేర్కొన్నారు. Nor all things that we value are valued instrumentally some things we value are valued natrumentally. Sometings we value because we recognize h them a moral spritual, symbolic, aesthetic or cultural importance” దేనికైనా విలువను కట్టేప్పుడు వాటి ప్రకార్యాత్మక విలువ ద్వారానే జరగదు కొన్నిటిని విలువైనవిగా గుర్తిస్తాం. అవి నైతిక, ప్రతీకాత్మక, సౌందర్యాత్మక, లేదా సాంస్కృతిక ప్రాధన్యాలను వాటిలో కనుగొంటాం. అవి సూచించేవి, అవి ఎందు నిమిత్తం ఉన్నవి, అవి ఎట్లా ఉపయోగ పడుతున్నవి కూడా చూడం. మన పర్యావరణ పట్టింపు అనేది ఈ అంతర్నిహిత విలువ మీద ఆధారపడి ఉంటుంది. మనం మానవ కార్యకలాపం పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నదని పేర్కొంటున్నామంటే తరచుగా మనం దాని అంతర్నిహిత విలువ పట్ల అగౌరవాన్ని కలిగి ఉన్నామని లేదా పోగొట్టుకుంటున్నామని అర్ధం.


ప్రకృతిని మనం ఏ విలువ ఆధారంగా చూస్తున్నామనే దానిని బట్టి మానవుడు మనమెటువంటి వాళ్ళం? మనమేమిటి అనేవి నిర్ధారణకు వస్తుంది. మానవులకు ఉపయోగపడే, ప్రయోజనం చేకూర్చడం ద్వారా ‘విలువ’ను నిర్ణయించడం జరిగితే అది మానవ కేంద్రక పర్యావరణ నైతికతను లేదా తాత్వికతను సూచిస్తుంది. దీనికి విరుద్ధంగా విలువను పరిగణించేదే ప్రాణికేంద్రక నైతికత లేదా తత్వం. »»Bio centric ethics refers to any theory that all life as possessing intrinsic value”. ప్రతిదీ అంతర్నిహిత విలువను కలిగి ఉంటుందని చెప్పే ఏ సిద్ధాంతమైన ప్రాణి లేదా జీవి కేంద్రక నైతికత పరిథిలోకి వస్తుంది.


ఆల్బర్ట్ ష్వెట్జర్‍ : ప్రకృతి – నైతికత:
తొలినాళ్ళ జీవకేంద్రక నైతికతలో స్వెట్టర్‍ది ముఖ్య స్థానం. ఆయనది ‘‘reverence for life’’ అనే సూత్రం. జీవితం మొత్తం ఇతరులను సంరక్షించడం, శ్రద్ధ వహించడం కోసం నిబద్ధమైన కృషిని సాగించాడు. ఆధునిక సమాజ నైతిక అనారోగ్యాలను గురించి విస్తృతంగా రచనలు చేశాడు. వాటికి చికిత్సలు కూడా సూచించాడు. జీవితం లేదా ప్రాణం పట్ల గౌరవ భావం అనే వైఖరిని విశ్వసించాడు. ఇదొక్కటే ప్రపంచంలోని సంఘర్షణలను నివారించగలదని భావించాడు.
ఆధునిక పారిశ్రామిక సమాజం ప్రకృతి మంచిగా ఉంటే జీవితంలోనూ మంచితనం ఉంటుందనే ప్రాపంచిక దృక్పధానికి దూరంగా జరిగింది. సైన్సు, సాంకేతిక రంగాలు వృద్ధి చెంది సహజ న్యాయ సూత్రాలను, సంప్రదాయ నైతిక భావనలను విచ్ఛిన్నం చేశాయి. పారిశ్రామికీకరణలో సంబంధంగల సమాజాలు నైతికత మంచి మనిషిని విడదీశాయి. ప్రకృతిని భిన్నంగా చూడటం మొదలైంది. ప్రకృతిపై ఆధునిక శాస్త్రానికి భిన్నమైన దృక్పథాలు కలిగాయి. ప్రకృతిని ఒక యంత్రంగా దర్శించి, భౌతిక, యాంత్రిక, నియమాలతో నడిచేదిగా భావించడం మొదలైంది. అందువల్ల మానవ నైతికతలు వునాదిలేని కట్టడాలుగా మారాయి. నైతిక విలువ అనగానే అదొక వ్యక్తిగత అభిప్రాయం అనే కుదింపుడు గురైంది. ఈ స్థితిలో ష్వెట్టర్‍ చేసిందేమంటే ‘‘Schweitzer s ethical thinking sought to reestablish the band between nature and ethics’’. జీవితం పట్ల గురి, గౌరవంతో పాటు భయం కూడా కలిసి ఉంటుందని ష్వెట్టర్‍ భావన. మానవ చైతన్యం యొక్క ప్రాధమిక వాస్తవం ఏమంటే “Iam life which wills to live in the midst of life which wills to live.’’ జీవించాలనే సంకల్పించుకున్న జీవితం జీవించాలని సంకల్పించు కున్న జీవితం మధ్య జీవిస్తుంది. దీనిని ఈ విధంగా వివరించాడు. “The man who has become a thinking being them a compuision to give to every will – to – live the same reverance for life that he gives to his own”. తన జీవితానికి గౌరవం లాంటిదే ఇతర జీవితాలకు ఇవ్వడం. మరి జీవితం పట్ల గౌరవం ఏమి చేస్తుందనే విషయం గురించి ఆలోచించినప్పుడు సమాధానం ఈ విధంగా ఉంటుంది. ‘»»Rewrance for life is that character trait that sensitizes us to the responsibilty of these decisions | is an anti tude that makes us aware of the full implications of these decisions”. మానవులు తాము తీసుకునే నిర్ణయాలకు బాధ్యత వహించడం విషయమై సున్నితపరస్తుంది. ఇది ఒక నియమం లేదా సూత్రం కాకుండా ఒక వైఖరిగా, జీవన విధానంగా మారుతుంది. దీనిని బట్టి చూస్తే ష్వెట్టర్‍ నైతికత, నేనేం చేయాలనే అంశం పై కాకుండా, నేనెటువంటి మానవుడిగా ఉండాలనే దానిపై ద•ష్టినిలిపింది. ఆ అయితే ష్వెట్టర్‍ అనంతరం పర్యావరణ నైతిక తాత్విక చింతన ఇంకొంత పురోగతిని సాధించింది.


పాల్‍, టేలర్‍.. PRILTivism:
1986లో ‘Respect for nature’ అనే గ్రంథం రాశాడు. ప్రాణికేంద్రక నైతికత గురించి ఆయన ఆలోచనలు మరికొంత తాత్విక బలాన్ని కలిగించాయి. ప్రకృతి పట్ల గౌరవ ప్రకటన ఎందుకుండాలంటే మానవులకు ప్రకృతి లేదా ఇతర ప్రాణులకు మధ్య ఉండే సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది. సకల ప్రాణం అంతర్గతంగా విలువను కలిగి ఉంటుందని పేర్కొంటాడు. ” The central tenet of the theory of environmental ethics that I am defendina is that actions are right and character traits are monally good in virtue of their expressing or embractlying a certain maral attitude, which I cal respect for nature”


ప్రకృతి పట్ల గౌరవం ప్రకటితమైనప్పుడు మాత్రమే మానవాళి సరైన నైతిక వైఖరులను కలిగి ఉన్నట్లు భావించవచ్చునని టేలర్‍ అభిప్రాయం. జీవించే ప్రాణులన్నీ ‘‘Teleological centers of life’’ అని టేలర్‍ పేర్కొన్నాడు. దీని ప్రకారం ప్రతి ప్రాణికి జీవించి ఉండటంలో ఒక ప్రయోజనం, లక్ష్యం ఉంటాయి. వాటికోసమే అవి జీవిస్తాయి. అందువల్ల ప్రకృతి పట్ల గౌరవం అంతిమ నైతిక వైఖరిగా మానవులలో వ్యక్తం కావాలి. దీనిని తెలుసుకున్నప్పుడు మాత్రమే, ప్రాణులన్నీ వాటి లక్ష్యసాధన కోసమే అవి జీవించి ఉన్నాయని, ప్రతి ప్రాణికీ ఉండే లక్ష్యం మరో ప్రాణికి ఉండే లక్ష్యానికి విరుద్దంగా గానీ, భిన్నంగా కానీ ఉండవచ్చునని, వాటికవి మంచివేనని, విలువ వాటి అంతర్గత జీవితం కొరకు మాత్రమే ఉంటుందని అవగతమవుతుంది. ఇట్లా ప్రాణి కేంద్రక దృక్పథం ఇతర ప్రాణులతో మానవులకు ఉండాల్సిన సంబంధాలను, బాధ్యతలను గురించి వివరించ గలుగుతుంది.


దీనిలో నాలుగు ప్రధానమైన విశ్వాసాలు కనిపిస్తాయి.
ఒకటి. ఇతర అన్ని ప్రాణుల్లాగే భూమి పై ఒక సమూహంగా సమూహంలోని సభ్యులుగా చూడాలి.
రెండోది. అన్ని జాతులు మానవులతో సహా పరస్పరం ఆధారపడ్డ వ్యవస్థలో భాగం.
మూడవది. అన్ని ప్రాణులు వాటి వాటి పద్ధతుల్లో స్వీయమేలును పొందేందుకు జీవిస్తాయి.
నాలగవది. మానవులు ఇతర ప్రాణులకంటే అంతర్గతంగా అధికులు కారు.
వీటిని గుర్తించినప్పుడు మాత్రమే జీవి, ప్రాణం. జీవితం మొదలైన వాటి పట్ల పర్యావరణహితమైన జీవన దృక్పథాన్ని కలిగి వుండి, ఆచరణలో దీనిని పాటిస్తే పరిణత వ్యక్తులుగా, నమూహాలు, సమాజాలుగా వృద్ధి చెందే ఆవకాశం ఉంటుంది. ఈ అవగాహనను అంతర్నిహిత ప్రకార్యాత్మక విలువలు విస్తృతిని పరిమితులను అర్థం చేసుకోవటం ద్వారా మాత్రమే మానవాళి పొందగలుగుతుంది. ప్రజావాగ్గేయ సాహిత్యంలో అనేక రకాల పశు పక్ష్యాదులు, జీవ, నిర్జీవాల ప్రస్తావన ఈ అంతర్నిహిత విలువను అంతశ్చేతనలో కలిగి ఉండటం ద్వారా వ్యక్తమైంది.


పర్యావరణ విమర్శ
పర్యావరణం ప్రధానాంశంగా సాహిత్య అధ్యయనం, విమర్శ, విశ్లేషణ సాగించే విధానాన్ని ఇకో క్రిటిసిజం పేరుతో వ్యవహరిస్తున్నారు. సాహిత్యం, భౌతిక పర్యావరణాల మధ్యగల సంబంధ అధ్యయనం ఈ విధానంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకే దీనిని ఇలా నిర్వచించటం జరుగుతున్నది. “Ecocriticism is the study of the relationship between literature and the Physical environment”. దీనిని బట్టి తెలుగులో పర్యావరణ సాహిత్య విమర్శ లేదా హరిత సాహిత్య విమర్శ అని పేర్కొనవచ్చు. 1978లోనే డేవిడ్‍ మాజిల్‍ ఈ పదం వాడినట్లు తెలుస్తున్నది. ఇకో క్రిటిసిజం ఇటీవల కాలంలో ప్రాచుర్యం పొందినప్పటికీ ఈ పద్ధతిలో సాహిత్య అనుశీలన 1911 లోనే డల్లాస్‍ లాంప్‍షార్స్ పరిశీలన ప్రకారం, ప్ర.కృతి రచన, ఆటోమొబైల్‍ వ్యాపారం అనతి కాలంలోనే విస్తృతంగా పెంపొందిందని రాయటం గమనించ దగింది. దీనిని బట్టి చూస్తే పారిశ్రామిక నాగరికత పెరుగుతూ ఉన్న కొద్దీ ప్రకృతికి దూరం కావటం జరుగుతుంది. ప్రకృతితో మానవులకు ఏర్పడుతున్న ఎడబాటు వల్ల ప్రకృతిని గురించి ఆలోచన చేయటం మొదలవుతుంది. అయితే అమెరికన్‍ ప్రకృతి రచన ఆధునికా నంతర సిద్ధాంతంతో కలిసి గ్లోబలైజేషన్‍ పర్యావరణ సంక్షోభం మొదలైనవాటి కారణంగా రూపొందిన సాహిత్య విశ్లేషణకు ఇకో క్రిటిసిజం ఒక దారిని చూపింది. ఇది క్రమంగా విస్తృతమై భిన్నమైన అధ్యయనాలు జరిగాయి. ఇకోక్రిటిసిజం కేవలం వర్తమాన పర్యావరణ సంక్షోభాల ఫలితంగా ఉద్భవించిన సాహిత్య రచనలనే కాకుండా, అంతకు పూర్వరచనలను కూడా పర్యావరణ దృష్టి కోణంలో, అధ్యయనం విస్తరించారు. ఆంగ్ల సాహిత్య విశ్లేషణకు కొత్త పుంతలు తొక్కుతూ మార్గాలను స్పష్టపరిచారు.


ఈ విమర్శ విధానం పర్యావరణం, సాహిత్యాల మధ్యగల సంబంధాలను బలంగా ముందుకు తెచ్చింది. ఉదాహరణకు ఫెమినిస్టు సాహిత్యవిమర్శ జండర్‍ దృక్పథం నుండి భాషా, సాహిత్యాలను అనుశీలన చేసినట్లుగా, మార్కిస్టు విమర్శ సాహిత్య అధ్యయన, విమర్శలకు ఆర్థిక ప్రాతిపదిశగా వర్గాలను, ఉత్పత్తి విధానాలను సాధనాలుగా వాడినట్లు, పర్యావరణ విమర్శ విధానం, సాహిత్యం పర్యావరణ సంబంధాలను పరిశీలనకు స్వీకరిస్తుంది. ఒక్కమాటలో చెపితే దీనిని ధరిత్రికేంద్రక విమర్శగా భావించవచ్చు.


సాహిత్యం, పర్యావరణాల మధ్య సంబంధ అధ్యయనంతో పాటుగా ఈ పద్ధతిని మరికొంత విపులంగా నిర్వచించారు. దీని ప్రకారం ఇకోక్రిటిసిజం అంటే “The field of enquiry that analyzes and promotes works of art which raise moral questions about human interac tions with nature, while also motivating audiences to live within a limit that will be binding over generations”.


దీనిని బట్టి చూస్తే మానవులు ప్రకృతితో వ్యవహరించే విషయంగా నైతిక ప్రశ్నలను లేవనెత్తే రచనలను ప్రోత్సహిస్తూ విశ్లేషిస్తుంది. అదే విధంగా పరిమితులను పరిమితులకు లోబడి భవిష్యత్‍ తరాలకు కట్టుబడి జీవించే విధంగా ప్రేరణను కల్పిస్తుంది.
ఈ తరహా విమర్శ సాధించగలిగినదేమిటో ఈ విధంగా విశ్లేషకులు పేర్కొన్నారు. .”Eco criticism aims to show how the work of writers concerned about the environment can play some part in solving real and pressing ecological cancerms”. దీనిని పర్యావరణం పట్ల సానుకూలత గల రచయితల రచనలు ఏ విధంగా కొంతమేరకు వాస్తవమైన, పర్యావరణ పరంగా వత్తిడి పెట్టే సమస్యలను పరిష్కరించగలదో చూపు తుంది.


ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ సంక్షోభాలు నిరంతరం వృద్ధి పొందు తున్న సందర్భంలో ఇక సంపూర్ణ అనుశాసనంగా రూపొందుతూ ఉండాలని ఈ పద్ధతిని అనుసరిస్తున్న విమర్శకులు ఆకాంక్షించారు. విస్తృతి కారణంగా ఇకోక్రిటిసిజం ఏ ఒక్క నిర్వచనం పరిధికి లోబడదు. అందువల్లనే స్పష్టంగా నిర్వచించబడిన సిద్ధాంత బద్ధ ఆచరణ లేదనిపిస్తుంది. అయిన ప్పటికి, సాహిత్యంలో, సాంస్కృతిక అధ్యయనాలలో ముఖ్యస్థానం పొంది. ఎనలేని గుర్తింపు, ప్రాముఖ్యాలను సంతరించుకుంది. ఈ తరహా విమర్శ పద్ధతి, ఇంటర్‍ డిసిప్లినరీ పద్ధతులు కూడా దోహదం చేశాయి.


ఉర్సులా కై. హైజ్‍ అనే అమెరికా పర్యావరణ విమర్శకురాలు దీనికొక ప్రమాణాన్ని పేర్కొంది. ఆమె ప్రకారం ‘‘Eco criticism analyzes the ways in which literature represents the human rela tions to nature at particular moments of history, what values are assigned to nature and why and how perceptions of the natural shape literary tropes and genres”.


ఇకోక్రిటిసిజంలో ప్రకృతిలో మానవులు ఎటువంటి సంబంధాలను కలిగి ఉన్నారనేది ప్రధానం. అయితే ఒకానొక ప్రత్యేక చరిత్ర గమనంలో మానవులు ప్రకృతికి ఎటువంటి విలువలను ఆపాదించారు. ఆ విలువలు ఎందుకు ఇవ్వబడినాయి. సాహిత్య పక్రియలు, అలంకారాలు ఎటువంటి దృక్పథాలతో సహజంగా రూపుదిద్దుకుంటాయి లేదా తీర్చిదిద్దుతాయి అనేది కూడ పరిశీలన చేస్తుంది. 1980లలో అమెరికాలోని గ్రామీణ విశ్వవిద్యాలయాలకు ప్రాకింది. 1990లలో బ్రిటన్‍లోకి ప్రవేశించింది ఇకోక్రిటిసిజం. ఇప్పటిదాకా ఇది ప్రధాన సాహిత్య విమర్శ సిద్ధాంతాలకు కొంత ఎడంగానే ఉంది. ఈ విమర్శ పర్యావరణం పట్ల ఒక స్పృహను కలిగించే లక్ష్యంతో మొదలైంది. మానవ చైతన్యంలోంచి ప్రకటిత మయ్యే ప్రకృతిపట్ల వైఖరులను ఇది చూపుతుంది. వ్యక్త వైఖరుల యొక్క వైఖరులను కూడా ఇది వ్యాఖ్యానిస్తుంది.


పర్యావరణ దృష్టి కోణాన్ని కలిగి ఉండి, సాహిత్య, సాంస్క•తిక, విశ్లేషణ ముఖ్యంగా ఉండే ఇకోక్రిటిసిజం సాహిత్య వాచకం ఏదైనా పర్యావరణ పరంగా సానుకూల, ప్రతికూల ప్రభావాలను కలిగిస్తున్నదా లేదా అనే అంశం ఆధారంగా మూల్యాంకనం చేస్తుంది. అదేవిధంగా సాహిత్య వాచకంలో వ్యక్తమైన విశ్వాసాలు, భావజాలాలు ఎటువంటి పర్యావరణ విషయాలపై ప్రాసంగికతను కలిగి ఉన్నాయో నిర్ధారించి విలువ కడుతుంది.


20 శతాబ్ది ఉత్తరార్థంలోనూ, కొత్త శతాబ్ది ప్రారంభ సంవత్సరాల లోనూ సాహిత్య సిద్ధాంతాలు ప్రపం చంలో ఎన్నో కొత్త అధ్యయనాలకు పఠన పద్ధతులకు, పాత, కొత్త సాహిత్య రచనలకు సంబం ధించి రూపొందాయి. అట్లాంటి వాటిలో ఇకోక్రిటిసిజం ఒకటి. అనేక పేర్లతో భిన్నదృక్పథాలతో వైవిధ్యాన్ని ప్రదర్శించింది. ఒక విశిష్ట సాహిత్య దృక్పథంగా నిలబడింది.


పర్యావరణ విమర్శ చేసే పనిని ఈ క్రింది విధంగా క్రోడీకరించవచ్చు.

 1. పర్యావరణ విమర్శ సాగించే విమర్శకుడు కవి లేదా రచయిత ఉన్న పరిసరం లేదా స్థలం అతడి ప్రాపంచిక దృక్పథాన్ని ఏ విధంగా రూపుదిద్దిందో పరిశీలించాలి. ఏ పరిసరాల్లో పెరిగాడు, ఏయేచోట్ల ఆ రచయిత ప్రయాణించారు? ఏ స్థలం, ప్రాంతం నుండి రాశాడు అనేది కూడా పరిగణన చేయాలి.
 2. సాహిత్యగేయం లేదా వాచకంలో ప్రకృతి/పర్యావరణ సంబం ధాంశాలు ఉన్నట్లయితే ఆ సాహిత్యం ఇప్పటిదాకా ఎందుకు ఈ దృష్టికోణంలో గుర్తింపు పొందలేక పోయింది? ఆలోచించాలి.
 3. సాహిత్యవాచకం ఏదైనా పఠితలకు ప్రకృతితో ఉన్న సంబంధం విషయంగా ఎటువంటి అంతర్దృష్టిని కలిగిస్తున్నది? ప్రక•తి పర్యావరణాల గురించి ఎట్లాంటి ప్రశ్నలను, సమస్యలను ఆ రచన ముందుకు తెచ్చింది చూడాలి.
 4. మానవ చైతన్యం ప్రకృతి ప్రపంచం ఎటువంటి ప్రభావాన్ని కలిగించగలదనే విషయంగా సంప్రదాయ పఠన పద్ధతులు విస్మరించిన విషయాలు ఏమిటి? అని పరిశీలించాలి.
 5. ప్రకృతి లేదా పర్యావరణ రచనగా పేర్కొనబడటానికి ఆవాచకం ఏ విధంగా అర్హమైంది? వివరించాలి.
 6. పర్యావరణ పరిశోధననలు సాధించిన పురోగతి వల్ల సాహిత్య వాచకాన్ని కొత్తగా ఆన్వయించడానికి వీలున్నదా లేదా? వాచకం ప్రకృతి విషయంగా ఎటువంటి ప్రజా ద•క్పణాలను ప్రదర్శించింది.
 7. ప్రకృతి, పర్యావరణం పట్ల కవి, రచయిత ద•క్పథం ఏమిటి? పాఠకులు ఎందుకు ఈ విషయం పట్ల అవగాహన చైతన్యాలను కలిగి ఉండాలని భావిస్తున్నాడు
 8. సాహిత్య వాచకం ద్వారా ప్రకటితమైన విలువలు పర్యావరణ విజ్ఞానాన్ని కలిగిస్తున్నాయా?
 9. ప్రకృతి, పర్యావరణం గురించి స్త్రీల కంటే పురుషులు భిన్నంగా రాస్తారా?
 10. ప్రకృతితో మానవాళి గల సంబంధాన్ని అక్షరాస్యత లేదా చదువు వల్ల ఏ విధంగా ప్రభావితం చేస్తుంది.
 11. పర్యావరణ సంక్షోభ సంబంధాంశాలు ఏ విధంగా ఎటువంటి ప్రభావాలతో సమకాలీన సాహిత్యం లోని, సంస్క•తులలో ప్రవేశిస్తున్నాయి.
 12. సాహిత్య అధ్యయనాలలో పర్యావరణ శాస్త్రం ఏ విధంగాఉపకరిస్తుంది? సాహిత్య విశ్లేషణకు శాస్త్రం చేయగల దోహద మేమిటి? ప్రకృతి చరిత్ర లేదా సైన్సు వాచకంతో కలిగి ఉండే పాత్ర ఎటువంటిదనే అంశాలను పర్యావరణ విమర్శ పట్టించు కుంటుంది.


పర్యావరణ సమస్యలు తరచూ పైకి స్పష్టంగా కనిపించవు. ఇవి తక్షణ సమస్యలుగా కనిపించవు. చాలా చిన్న సమస్యలుగా కనిపిస్తాయి. మౌలికంగా అనిశ్చిత స్వభావాన్ని కలిగి ఉంటాయి. 1990ల నాటికిగాని ఇకోక్రిటిసిజం గుర్తించదగిన ఉద్యమంగా రూపొందలేక పోయింది. అమెరికాలో అది త్వరితగతిన రూపుదిద్దుకుంది. సాహిత్యం పర్యావరణా లను అధ్యయనం చేయడానికి ASLE లాంటి సంఘాలు ఏర్పడ్డాయి. పారిశ్రామిక అభివృద్ధి తెచ్చిపెట్టిన విధ్వంసక రూపాలకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తూ, పారిశ్రామికేతర స్థానిక సంస్కృతుల వైపు అవిదృష్టి సారించాయి. అదే విధంగా పారిశ్రామికేతర స్థానిక సంస్కృతులు సంఘటితం కావడం వల్ల కూడా విస్తృత పర్యావరణం ఉద్యమం రూపు దిద్దుకోవడానికి దారితీసింది.


ప్రజా వాగ్గేయు సాహిత్య విశ్లేషణను పర్యావరణ విమర్శ దృష్టికోణంతో చూడటం జరిగింది. తెలుగు సాహిత్యం మొత్తాన్ని పునర్విశ్లేషణ చేయడానికి పర్యావరణ విమర్శ పద్ధతి ఎంతో ఉపయుక్తమైంది. ఈ ప్రాజెక్టు అధ్యయన లక్ష్యాలలో పర్యావరణ విమర్శను రూపొందించటం కూడా ఒకటి కనుక ఈ విషయం గురించి ప్రస్తావించటం జరిగింది. ఈ తాత్విక భావనల వెలుగులో ప్రజా వాగ్గేయ సాహిత్యంలోని తాత్త్వికతను తరువాత అధ్యాయంలో నిరూపించటం జరుగుతుంది.


డా।। ఆర్‍. సీతారామారావు, ఎ : 9866563519

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *