కరోనా ప్రాణి కాదు – ప్రాణం తీసే ప్రోటీన్‍

వైరస్‍ (కరోనా) ప్రాణి కాదు. అది ఒక డియన్‍ఏ (DNA) అనబడే ప్రోటీన్‍ అణువు. దీనికి లిపిడ్‍ (కొవ్వు) అనబడే రక్షక కవచం ఉంటుంది. శరీరాన్ని చేరిన వైరస్‍, శరీర కణజాలాన్ని మార్చి వేసి (Mutation), పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది. వైరస్‍ ప్రాణి కాదు కాబట్టి దీనిని చంపడం ఉండదు. ఉష్ణోగ్రత, గాలిలో తేమ, వైరస్‍ చేరిన ఉపరితల పదార్థ స్వభావాన్ని బట్టి వైరస్‍ స్వయంగానే కొంత సమయానికి విచ్ఛిన్నమవుతుంది. కరోనా వైరస్‍ పెళుసుగా లేదా సున్నితంగా (fragile) ఉంటుంది. దీనికి లిపిడ్‍ (fat) పొర రక్షణకవచంలా పనిచేస్తుంది. సబ్బు లేదా డిటర్జంట్‍తో 20-30 సెకన్లు కడిగితే లిపిడ్‍ పొర నురగలో కరిగి, లోపల ఉన్న DNA ప్రోటీన్‍ అణువు విచ్ఛిన్నమవుతుంది. వేడి నీటిలో ఈ రక్షక పొర సులభంగా కరిగి, వైరస్‍ అణువు నిశించుటకు దోహదపడుతుంది. కావున వేడి లేదా గోరువెచ్చని నీటిని (25 డిగ్రీ సెల్సియస్‍ కన్న ఎక్కువ) వాడి చేతులు శుభ్రం చేసుకోవాలి. ఆల్కహాల్‍ సానిటైజర్‍లో కూడా ఈ లిపిడ్‍ పొర సులభంగా కరిగి వైరస్‍ విచ్ఛిన్నం అవుతుంది. అలాగే 1:5 నిష్పత్తిలో బ్లీచ్‍: నీటిని ఉపయోగించిననూ ఈ లిపిడ్‍ కరిగి వైరస్‍ నశిస్తుంది.
కరోనా వైరస్‍ అణువు, బ్యాక్టీరియా వలె ప్రాణి కాదు. కావున ఆంటీబయాటిక్‍ ఔషధాలు వైరస్‍ చికిత్సకు పనికిరావు. వైరస్‍ అణువులు బట్టలపై 3 గంటలు, కాపర్‍ మరియు కలప ఫర్నీచర్‍పై 4 గంటలు, కార్డ్ బోర్డ్పై 24 గంటలు, ఇతర లోహాలపై 42 గంటలు, ప్లాస్టిక్‍పై 72 గంటలు మనుగడ సాగించగలదు. శీతల వాతా వరణంలో వైరస్‍ అణువులు ఎక్కువ కాలం స్థిరంగా ఉండగలవు. పొడి గాలి, వేడి వాతావరణం, గాలి వీచే, వెలుతురు ప్రదేశాలలో వైరస్‍ తొందరగా విచ్ఛిన్నం అవుతుంది. అతినీలలోహిత కిరణాలు వైరస్‍ ప్రోటీన్‍ను నాశనం చేయగలవు. వైరస్‍ చర్మంలోకి చొచ్చుకొని పోలేదు. వెలుతురు, గాలి, తెరిచిన కిటికీలు ఉన్న ప్రదేశాలు సురక్షిత మైనవిగా గమనించాలి. ముక్కు, నోరు, ఆహారం, తాళాలు, డోర్‍లు, స్విచ్చులు, టివి రిమోట్‍, మొబైల్‍, వాచ్‍, కంప్యూటర్‍ లాంటి అధికంగా వినియోగించే వస్తువులను తాకటానికి పూర్వం మరియు తాకిన తరువాత చేతులు శుభ్రపరుచుకోవాలి. గోళ్లను కత్తిరించు కోవాలి.
కరోనా వైరస్‍ను అడ్డుకోవడానికి క్షారత్వం అధికంగా ఉన్న నిమ్మ రసం, అవకాడో, వెల్లుల్లి, మామిడి పండు, పైనాపిల్‍, సంత్రాలు, బత్తాయ లాంటి ఆహార పదార్థాలను ఎక్కువగా వాడాలి. తరుచుగా వేడి లేదా గోరువెచ్చని నీటిని తాగటం మంచిది. గోంతులో దురద, పొడి దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు ఉన్నట్లైతే వెంటనే డాక్టర్‍ను సంప్రదించాలి. కరోనా వైరస్‍ను అంతం చేయటానికి ఏకైక మార్గం దానికి దూరంగా ఉండుటయే. అనుమానం కలవారందరం క్వారంటైన్‍లో ఉందాం. వైరస్‍ సోకితే ఐసొలేషన్‍లో ఉంటూ, వైద్యం చేసుకుందాం. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఉన్న వారికి వైరస్‍ సోకినప్పటికీ సులభంగా నయమవుతుంది. వేగంగా వ్యాపించే గుణం కలిగిన కరోనాకు దూరంగా గృహనిర్బంధంలో ఉందాం. లాక్‍డౌన్‍ ఉద్దేశ్యాన్ని భవిష్యత్తులో కూడా గౌరవిద్దాం. మహమ్మారిని మట్టు పెట్టుటకు గట్టిగా ప్రయత్నిద్దాం. వైరస్‍ వ్యాప్తి శృంఖలాన్ని తుంచటానికి మనందరం గట్టి ప్రతిన బూనుదాం.


-బిఎంఆర్‍
ఎ : 99497 00037

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *