ప్రకృతే నియంత్రిస్తుంది! ప్రకృతే శాసిస్తుంది!! -2

ప్రకృతి సూత్రాలలో 15వది – అనగా జీవశాస్త్ర పరంగా మొదటిది:
భూమిపైన జీవం నిర్జీవ పదార్థాల నుండే పుట్టింది. ఈ జీవం క్రమానుగుణంగా పరిణామం చెందుతూ ప్రకృతికి అనుగుణంగా పలురూపాల్లోకి రూపాంతరం చెందింది. చెందుతూనే వుంది. మానవుడి పుట్టుక ఈ పరిణామంలో ఓ భాగమే!

(Life originated from inanimate matter and has been diversifying by Natural Selection. Man is a part of the Organic Evolution)
మత విశ్వాసాల ప్రకారం మానవుడు దేవుడి, అల్లా, లార్డ్ (Lord) లేదా ఏదో అతీత శక్తి ప్రదాత కాడు. ప్రకృతి జనితం. సౌర కుంటుంబం ఆవిర్భావం తర్వాత భూమి ఏర్పరడం, చల్లారుతున్న క్రమంలో ‘జీవం’ ఏర్పడడం జరిగిందని అనేక పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. దాదాపు 1500 కోట్ల సం।। క్రితం విశ్వం ఏర్పడిందని, అందులో నుంచి నెబ్యూలాలు, నక్షత్ర రాశులతో గెలాక్సీలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రజ్ఞులు అనేక దృష్ఠ్యాంతాలను చూపింది తెలిసిందే! దాదాపు 600 కోట్ల సం।। క్రితం పాలపుంతగా పిలవబడే ఓ గెలాక్సీ తనచుట్టూ తాను తిరుగుతున్నప్పుడు వేడిగల ముద్ద మధ్యభాగం సూర్యుడిగా, అంచుభాగాలు గ్రహాలుగా సౌరకుంటుంబం ఏర్పడిందనేది ఖగోళశాస్త్ర పరిజ్ఞానం! ఇలా ఏర్పడిన సౌరకుటుంబంలో సుమారు 4.5-5.0 బిలియన్‍ సంవత్సరాల క్రితం భూమి (Earth) ఏర్పడిందనేది అంచనా!
ఇలా ఏర్పడిన భూమి మొదట అతివేడిగా, కొంతమేర స్వయం ప్రకాశితంగా వుండేది. కాలక్రమంలో భూమి చల్లారడం మొదలుకాగా (ఇప్పటికీ అంతర్భాగంలో అతివేడిమి వుంది) సుమారు 400 కోట్లు (4 బి.) సం।। క్రితం భూమిలో ఏర్పడిన హీలియం (He), హైడ్రోజన్‍ (H) లాంటి వాయువులు (Nobel Gases) కేంద్రక చర్యలకు గురై పెద్ద పరమాణవులుగల మూలకాలు (Elements) ఏర్పడ్డాయని, అందులో అత్యధిక భాగంగా స్థితమైన ఇనుము (Fe) ప్రధానమైనదని గుర్తించారు. ఇలా ఇనుముతో పాటు లవణాలు, సిలికేట్లు (Silicates), బోరేట్లు (Borates), అల్యూమినేట్స్ (Aluminates), ఫెర్రెట్లు (Ferrates)లు కూడా ఏర్పడ్డాయి. వీటి నుంచి ఆక్సిజన్‍ (O), కొంత ఇనుము విచ్ఛితి చెంది కార్బన్‍ (C)గాను, మెగ్నీషియం (Mg)గా మారాయి. తిరిగి ఆక్సిజన్‍, కార్బన్‍తో కలిసి కార్బన్‍డయాక్సైడ్‍ (Co2) బయటకు వెళ్ళగా, భూమ్యాకర్షణకు గురై వాతావరణంగా నిలిచిపోయింది. మరికొంత ఆక్సిజన్‍, హైడ్రోజన్‍తో కలిసి అత్యంత వేడిగల నీటి ఆవిరి (H2O) ఏర్పడింది. తర్వాత వాయువులు శీతలీకరణం చెందడం, దీంతో ధారవాహికంగా వర్షం కురు వడం ప్రారంభమైంది.


ఈ విధంగా మొదలైన వర్షం వందల సంవత్సరాల పాటు కురవడంతో భూఉష్ణోగ్రత 500డిగ్రీల సెంటి గ్రేడ్  నుంచి 600డిగ్రీల సెంటి గ్రేడ్  వద్ద స్థిరీకరించబడింది. మెళ్ళిగా సముద్రాలు ఏర్పడ్డాయి. దీంతో నీటిలో కరిగిన సేంద్రీయ (Organics), నిరీంద్రియ (Inorganic) పదార్థాల నుంచి దాదాపు 3.5-3.9 బిలియన్‍ సం।। క్రితం జీవం పుట్టిందని శిలాజాల (Fossils) వయస్సును లెక్కించే రేడియో మెట్రిక్‍ డేటింగ్‍ (Radiometricdating) విధానంతో లెక్కించడం జరిగింది. ఈ విషయాన్ని ముందుగా రష్యన్‍ శాస్త్రవేత్త అలెగ్జాండ్ర ఒపారిన్‍ (Aleksandar Oparin) 1920లో జీవపదార్థం ఏర్పడడం గూర్చి ఓ పరికల్పనను (Hypothesis) ప్రతిపాదించాడు. ఈ పరికల్పనను బ్రిటీషు శాస్త్రవేత్త జెబిఎస్‍ హాల్డానె (JBS Haldane) కూడా సమర్థించాడు. అందుకే ఈ పరికల్పనను ఒపారిన్‍-హాల్డానె పరికల్పనగా పిలుస్తారు. వీరి అంచనా ప్రకారం నిరీంద్రియ పదార్థాల నుంచి (అణువులు) ఇటుకల లాంటి నిర్మాణాలైన అమినో ఆమ్లాలు, (amini acids), తిరిగి ఇవి కలయిక చెంది క్లిష్టమైన (complex) పాలిమర్స్గా (polymers)గా ఏర్పడ్డాయి. చివరికి ఇవి ప్రొటీన్లుగా (proteins), నూక్లిక్‍ ఆమ్లాలుగా (nucliacids) నీటి అంచుల్లో ఏర్పడిన ఈ సమూహాలు (clusters) సూర్యరశ్మి సహకారంతో, గాలితో జీవక్రియల్ని (metabolic) జరిపే కణాలుగా (cell like structures)గా ఎదిగినట్లు వీరు గుర్తించారు.
ఇలా ఏర్పడిన జీవం అనగా ప్రొటీన్లతో, కణద్రవంతో పరిణితి చెంది ఏకకణ జీవులుగా (uni cellular), బహుకణ జీవులుగా (multi cellular), చివరికి 20 లక్షల సం।। క్రితం ఆది మానవుడిగా రూపుదిద్దుకోవడం జరిగింది. అనగా జీవ పదార్థం ఏర్పడి సుమారు 350-390 కోట్ల సంవత్సరాలని భావిస్తే కరోనా (corona) లాంటి సూక్ష్మజీవులు (ప్రొటీన్లు) ప్రాథమిక స్థాయివి కాగా పరిణితి చెందిన మానవుడిది అత్యున్నత స్థాయి. ఇలా తర్వాతి కాలంలో జీవపదార్థం వృక్షజాలాలుగా, జంతుజాలాలుగా అభివృద్ధి చెందాయని ఆంగ్లశాస్త్రవేత్త చార్లెస్‍ డార్విన్‍ 1859లో అనేక రుజువులతో చూపాడు.


యూరె-మిల్లర్‍ (Urey, Miller) ప్రయోగం :
ఒపారిన్‍, హాల్డెనె జీవపదార్థ ఆవిర్భావ పరికల్పిన సిద్దాంతం తర్వాత చాలా మంది జీవ, రసాయన శాస్త్రజ్ఞులు దీని నిరూపణకై ప్రయోగాలు చేశారు.
ఇందులో ముఖ్యమైనది యూరె-మిల్లర్‍ ప్రయోగం. అమెరికాకు చెందిన ఈ ఇద్దరు (Harlod Urey ` Stanely Miller) రసాయన శాస్త్ర శాస్త్రవేత్తలు నీటిని అత్యంత వేడిమికి, వెలుతురుకు గురి చేయగా జీవానికి మూలకారణాలైన అమ్మోనియా (NH3)తో పాటు ఇతర జీవ సంబంధమైన పదార్థాలు తయారు కావడం జరిగింది. 1952లో మిల్లర్‍ విద్యుత్‍ కిరణాలను బంధించబడిన నీటిపై ప్రయోగించగా, ఈ దృగ్విషయం తెలిసింది. దీన్నే మిల్లర్‍ ప్రయోగమని కూడా అంటారు.
అయితే ఇది వాస్తవమా అనేవారు, నిజంగా జీవపదార్థం ప్రకృతి జనితమా అని ఆశ్చర్యపోయేవారు గత తొమ్మిది దశాబ్దాలుగా నసగడం తెలిసిందే! జీవపరిణామ సిద్ధాంతం చర్చి (church) ఆలోచనకు వ్యతిరేకమనే భావన కలవారు డార్విన్‍పై అమెరికాలో కేసువేయడం తెలిసిందే! టొలెమి (Ptolemy) ప్రతిపాదించిన భూకేంద్ర సిద్ధాంతం తప్పు అని, సౌర కుటుంబ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన నికొలాస్‍ కోపర్నికస్‍ (Nicolaus Copernicus)ను చిత్ర హింసలకు గురి చేసి, ఆయన చేతనే తన సిద్ధాంతం తప్పని రాయించిన మతాధిపతులు, ఈ సిద్ధాంతాన్ని సమర్థించిన బ్రూనో (Giordano Bruno)ను, గెలీలియోను (Galileo Galilei) కాల్చి చంపిన చరిత్ర తెలిసిందే! ఇది మరింతగా ముదిరి పాకాన పడ్డ వ్యవస్థలో బతుకీడుస్తున్న ప్రస్తుత వ్యవస్థ జీవుల పుట్టుక అంతా దైవాంశం అని నమ్మడంలో ఆశ్చర్యం లేదు. పైగా వీరిలో అత్యధికులు విశ్వవిద్యాలయాల నుంచి పట్టాలు పొందడం విషాదం!    (ఈ సందర్భంగా ఫ్రెంచ్‍ వీరవనిత జోన్‍ ఆఫ్‍ ఆర్క్ను మతం కాల్చి చంపిన (Joan of Arc) జీవిత గాథను చదవండి!!) (వచ్చే సంచికలో 16వ ప్రకృతి సూత్రాన్ని చూద్దాం)


– డా।। లచ్చయ్య గాండ్ల, ఎ : 9440116162

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *