పర్యావరణ ఆవశ్యకతలు – బోళం పాత్ర

పరిచయం :

పర్యావరణం అనేది కేవలం గాలి, నీరు, ధూలి, అగ్ని, ఆకాశం అనే అంశాలతో ఉంటుంది. ఈ విషయాన్ని ‘బాహుడు’ క్రీ.పూ. 2600 సంవత్సరాల క్రితం ‘‘ప్రతిత్యాగ సమ్రుద్యాము’’ అనే సూక్తితో వర్ణించాడు. అంటే సృష్టిలో ప్రతిది నిరంతరం మారుతుంది. మనం ఈనాడు చూస్తున్న భౌతిక ప్రపంచం కాదు. సుదూర ప్రాంతాలు విశ్వంలో ఉన్న గ్రహాలు, గ్రహ వ్యవస్థలు, సౌర వ్యవస్థలు, సౌర మండలాలు, గ్రహశిలకలు ఇవన్నీ ‘పర్యావరణమే’. అంతేకాదు భూమిపైన మనకు కన్పించని అతి సూక్ష్మజీవులు కూడా పర్యావరణమే. ఈ విషయాన్ని పాశ్చత్‍లాంటి శాస్త్రవేత్తలు నిరూపించారు.


మన భారత ఖండంలో అనేక మతాలు వెలిశాయి. హైందవం కావచ్చు, బౌద్ధం కావొచ్చు. అయితే బౌద్దాన్ని మాత్రం ఒక మతంగా వర్ణించారు. అది ఒక జీవన విధానం. క్రీ.పూ. 2600 సంవత్సరాల నాటి వ్యవసాయ సంక్షోభం కావచ్చు, శౌక్య, ఇతర రాజ్యాల వలన వచ్చిన నదీ జలాలు కావొచ్చు. కారణం ఒక్కటే ప్రకృతి – సమాజంల మధ్య అగాధం రావటమే అని బుద్దుడు వర్ణించాడు. కేవలం జంతువు అంటే ఒక ‘ఆవు’ మాత్రమే కాదు అని సర్వ ప్రాణిని కాపాడటమే మానవతావాదం అని చెప్పాడు.


ప్రకృతి- సమాజంల మధ్య మూడు రకాలు జీవ, అత్మ, పిరమిడ్‍ ఉన్నాయి.
1. సంఖ్యా పిరమిడ్‍ 2. జీవద్రవ్య పిరమిడ్‍ 3. శక్తి పిరమిడ్‍

సంఖ్యా పిరమిడ్‍ :

వివిధ ఆహార అంతస్థులని జీవుల సంఖ్యను మధ్య సంఖ్యనంమనుంది. ఇందులో ఉత్పత్తిదారల సంఖ్య ఎక్కువ  ఉంటుంది. అంటే మాంసాహారపు శాఖ జీవులు తక్కువగా ఉంటుంది. అంటే గడ్డి సంబంధించిన చిన్న చిన్న మొక్కలు ప్రాథమిక ఉత్పత్తిదారులుగా ఉంటాయి.

జీవద్రవ్య పిరమిడ్‍ :

నియమిత కాలంలో ఒక్కొక్క అంతస్థులోని జీవులు యొక్క సగటు భారుల జీవ ద్రవ్య ప్రమాణముగా తీసుకొని నిర్మించాడు. పిరమిడ్‍ను బయో పిరమిడ్‍ అంటారు (లేదా) జీవద్రవ్య పిరమిడ్‍ అంటారు.

శక్తి పిరమిడ్‍ :

ప్రతి అంతస్థులోని జీవులు అనేక కణజాల శక్తిని వుంచుకొనుట జరుగుతుంది. ఒక జీవి మరొక జీవిని భక్షించినప్పుడు కొంత వదలివేయబడుతుంది. ఒక అంతస్థును నుంచి ఇంకో అంతస్థుకు చేరినప్పుడు శక్తి నష్టము జరుగుతుంది.
పై విషయాలను బుద్దుడు సాధారణ భాషలో ఇలా చెప్పాడు.
1. జీవ హింస చేయరాదు 2. అవసరానికి మించి ఆహారం తినరాదు 3. అనవసరంగా ఒక చెత్తగాని, ఒక కట్టెను కూడా ఉపయోగించరాదు.
అందుకు ఒక చక్కటి ఉదాహరణ. బుద్ధుని ఆశ్రమం. బుద్ధుని యొక్క ప్రియ శిష్యుడు ఆనందుడు బుద్ధుని దగ్గరికి వెళ్లి ఆర్యా నాకు కొత్త గుడ్డ ఇవ్వండి అని అడిగినాడు.
అప్పుడు బుద్దుడు ఇలా అన్నాడు. పాత గుడ్డ ఏమైంది?
ఆనందుడు : దానిని నాపైన రక్షణగా వాడుకొన్నాను.
బుద్ధుడు : ఆ రక్షణ వాడుకొన్న గుడ్డకు ఏమైంది?
ఆనందుడు : అది చిరిగిపోవడంతో దానిని ఆశ్రమంలో  శుభ్రపర్చుకోవడానికి వాడటం జరిగింది.
బుద్ధుడు : ఆశ్రమంలో వాడిన ఆ గుడ్డకు ఏమైంది.
ఆనందుడు : మిగిలిన గుడ్డను దీపం వెలిగించడానికి వాడటం జరిగింది.
బుద్ధుడు : ఆనందా నీకు ఇంకొక కొత్త బట్ట ఇవ్వడం జరుగుతుందని చెప్పాడు బుద్దుడు.
పై విషయం ద్వారా ఆనాటి సంస్కృతులు, పర్యావరణానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని మనకు తెలుస్తుంది. బౌద్ధమత సిద్ధాంతం ప్రకారం నాలుగు విలువలు నాలుగు విషయాలపై ఆధారపడి  ఉంటాయి.


1. జీవుల నశింప చేయకుండుట 2. దొంగతనము చేయకుండుట 3. అబద్దమాడకుండుట 4. అహింస, ఇతరులకు హాని చేయకుండట.
అహింస అనేది ప్రకృతి పరమైన అపారమైన గౌరవమునకు సూచిక. బౌద్ధంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే విషతుల్యమైన ఆహార పదార్థము స్వీకరించరాదు. ఇది మానవజాతికి తీవ్రమైన హాని చేస్తుందని క్రీ.పూ. 484-560ల మధ్యనే బుద్ధుడు చెప్పాడు. విషతుల్యమైన ఆహార పదార్థాలు అంటే డ్రగ్స్ కావచ్చు. తిండి విషయాలు కావొచ్చు.

బౌద్ధం దృష్టిలో పర్యావరణం :

విశ్వంలో మొత్తం 84 కోట్ల జీవరాశులు ఉన్నాయి. అందులో మానవుడు కూడా మిగతా జీవరాశులవలె ఒకజీవి. కాని ‘మానవుడు’ ఇది మరిచి తన ఇష్టమైన రీతిలో ప్రకృతి – సమాజంల మధ్య ఆగాధం సృష్టించటం జరుగుతుంది.
పూలదండలో మనిషి ఒక పువ్వు. దానికి పరిపూర్ణమైన అనేక పూలు ఉంటేనే అందం ఉంటుంది. లేకపోతే ఉండదు. అందమైన ప్రకృతిలో ‘పగడపు దీవులు’, ‘మడ అడవులు’, అడవులు, సముద్రాలు, ఎడారులు, ఓజోన్‍ పొర లాంటి ఆవరణ వ్యవస్థలు ఉంటేనే ప్రకృతి స్థిరంగా ఉంటుంది. లేకపోతే ప్రకృతి – సమాజాల మధ్య ఆగాథం ఏర్పడి పర్యావరణ సంక్షోభాలు, సామాజిక వ్యవస్థల సంక్షోభాలు ఏర్పడుతాయి. ఇలాంటి పరిస్థితి మనకు రావలసిన అవసరం లేదని బుద్ధుడు క్రీ.పూ. 484-560ల మధ్య చెప్పటం జరిగింది. అంటే దాదాపు 2600 (ఇరువది ఆరువందల సం।।) క్రితం చెప్పాడు.


భారతదేశం నుంచి ప్రపంచంలోని అనేక దేశాలకు తన మానవతా సహకారమును అందించిన బౌద్ధం అనేక కారణాల వల్ల భారతదేశంలో తాత్కాలికంగా లేకపోయినా పశ్చిమ, తూర్పు కణుమ దేశాల్లో బౌద్ధ సిద్ధాంత పునాదులు బలంగా ఉన్నాయి. రెండవ బుద్ధుడైన ఆచార్య నాగార్జునుడు యొక్క ప్రభావం అన్ని దేశాల్లో ఉంది. 2010 జులై 28 నాడు ఐక్యరాజ్య సమితిలో ‘నీరు’ను ప్రాథమిక హక్కుగా గుర్తించడంలో బౌద్ధ సిద్ధాంతం పాత్ర ఎక్కువ ఉంది. 198 దేశాల్లో 42 దేశాలు నీరును ప్రాథమిక హక్కుగా గుర్తించడానికి వ్యతిరేకించాయి. అందులో అమెరికా ముందు ఉంది.
మన దేశం మాత్రం నీరు ప్రాథమిక హక్కుకి ఐక్యరాజ్య సమితిలో అనుకూలంగా ఓటు వేసింది. అందుకు కారణం మన అచేతనంలో బుద్ధుడి తత్వం బలంగా ఉండటమే.

ముగింపు :

మానవ సంక్షేమం కోసం ఏర్పడినది బౌద్ధం. ప్రకృతిలో – మనిషి ఒక ‘సగటు జీవి’ అని చెప్పి జీవుల యొక్క సంక్షేమమే మానవ సంక్షేమం అని చెప్పినాడు. బౌద్ధం స్థాపకుడు గౌతమ బుద్ధుడు ప్రతిది మారుతుందని. ప్రతిది ఆర్గానిక్‍గా ఇన్‍ ఆర్గానిక్‍గా మారుతుందని అని చెప్పాడు.
భూమి మీద దయ చూపాలి. మనిషి పాదర్శిక పదార్థం ప్రకృతి నుండి మనకు లభ్యం అయింది. దానిని విచక్షణ ఉపయోగించాలి. మనకు తెలివి ఉందని, ఆలోచన శక్తి ఉందని పర్యావరణం నాశనం చేసే హక్కు ఏ మనిషికి లేదని గౌతమ బుద్దుడు చెప్పడం జరిగింది.
బహుజన అంటే ఏ కులానికి చెందింది కాదు. ఎక్కువ మందికి చెందటం అని అర్థం. కావునా పర్యావరణం ఉంటేనే 84 కోట్ల జీవరాశులు ఉంటాయి. అప్పుడు ప్రకృతి – సమాజం బాగుంటుంది.

ఆధార గ్రంథాలు :

1. మూల గ్రంథాలు
అ) మూల మాధ్యక కారిక – ఆచార్య నాగార్జునుడు ( ఆంగ్ల అనువాదం)
ఆ) బుద్ధు మరియు ధర్మం డా।। బాబా సాహెబ్‍ అంబేద్కర్‍
ఇ) మానవ నాగరికత పర్యావరణ సమస్యలు – చెరుకూరి శ్రీనివాస్‍రావు

-ముత్తన్నగారి రాజేందర్‍రెడ్డి
ఎ : 9908240368

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *