మరవలేనిది మన మట్టివాసన
ప్రకృతితో మనం మమేకమయినప్పుడు అది మనల్ని తన గుండెలకు హత్తుకుంటుంది. మనిషికీ ప్రకృతికీ స్నేహం కావాలంటుంది పర్యావరణ పరిరక్షణ ఉద్యమం. ప్రకృతి మనతో ఎప్పుడు స్నేహం చేస్తుంది? ప్రకృతికి మూలమైన మట్టినీ, చెట్టునీ, నీటినీ, గాలిని సహజంగా ఉండనిచ్చినప్పుడు, వాటిని స్వేచ్ఛగా, నిర్మలంగా ఎదగనిచ్చినప్పుడు ప్రకృతి మనిషిని ప్రేమించి మనిషి భౌతిక, మానసిక అవసరాలను తీర్చడంలో ముందుంటుంది. ఏ రంగంలోనైనా సహజాలను అసహజాలుగా మార్చడమే సకల సంక్షోభాలకీ కారణం. ఈ ఆధునిక సంక్షోభాలన్నీ దాని ఫలితమే. వ్యవసాయరంగం …