Day: January 1, 2021

సమాచార కాలుష్యం నిర్మాణాత్మక వాస్తవ అవగాహనను ఛిన్నాభిన్నం చేస్తుంది

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.2020ని ఒక విపత్కర సంవత్సరంగా అందరూ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. కోవిడ్‍ మహమ్మారి ప్రపంచ దేశాలన్నిటినీ రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, ఆరోగ్య సంక్షోభానికి గురిచేసింది. ఈ సంవత్సరమంతా రోజువారీ జీవితంలోని ప్రతి ఆలోచననీ ఈ కరోనా ప్రభావితం చేసింది. కాని అదే సమయంలో ఇదే కోవిడ్‍ అనేక విలువల్ని నేర్పింది. జీవిత విధానాలను మార్చింది. ఆరోగ్య స్పృహను పెంచింది. ప్రకృతిలోనూ, మానవ ప్రవృత్తిలోనూ కాలుష్యాలను తగ్గించింది. మనుషుల మధ్య భౌతిక దూరం పెరిగినా …

సమాచార కాలుష్యం నిర్మాణాత్మక వాస్తవ అవగాహనను ఛిన్నాభిన్నం చేస్తుంది Read More »

బోయ జంగయ్య

 ‘కృషి వుంటే మనుష్యులు ఋషులౌతారు మహా పురుషులౌతారు’ అన్నది డా।। బోయ జంగయ్య విషయంలో అక్షరసత్యం. కవి, కథకుడు, నాటకకర్త, నవలాకారుడు, బాలసాహిత్య రచయిత ఎన్నెన్నో పక్రియలల్లో దిట్ట జంగయ్య అతి సామాన్య నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి ఇంతింతై వటుడింతై అన్నట్లు అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సాహితీ చరిత్రలో ఆణిముత్యంలా నిలిచారు. నిజాం నిరంకుశపాలన, రజాకార్ల దౌర్జన్యాలు, దొరలు, దేశ్‍ముఖ్‍ల ఆగడాలు ప్రజలను భయభ్రాంతులు చేస్తున్న రోజులు. 1 అక్టోబర్‍ 1942లో నల్లగొండ జిల్లాలోని పంతంగి అనే మారుమూల గ్రామంలో …

బోయ జంగయ్య Read More »

నిజమైన అంబేద్కరైట్‍ కె.ఆర్‍.వీరస్వామి

(డిసెంబర్‍ 23 కె.ఆర్‍.వీరస్వామి జయంతి సందర్భంగా) 1940వ దశకంలో హైదరాబాద్‍ దళిత రాజకీయాలకు దిశానిర్దేశం చేసిన జాతీయవాది కె.ఆర్‍.వీరస్వామి. తన ఇంగ్లీషు రచనలు, పత్రికా ప్రకటనలు, పదునైన భాషణతో ప్రత్యర్థులను పత్తాలేకుండా చేసేవాడు. వివిధ దళిత సంఘాలను స్థాపించి తన ముక్కుసూటి తనం, తలవంచని నైజంతో పనిచేసిండు. తప్పుజేసిన వారు ఎంతటి వారైనా సరే తూర్పారా పట్టేవాడు. అందులో తన బంధువులున్నా అదే తీరులో స్పందించేవాడు. మొదటి నుంచి రెబెల్‍గా వెలిగిండు. మిగతా నాయకులకు భిన్నంగా మాల, …

నిజమైన అంబేద్కరైట్‍ కె.ఆర్‍.వీరస్వామి Read More »

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-5 పొలమెయరట్టోడి కొండపర్తి (పూర్తి) తెలుగు శాసనం (క్రీ.శ.9వ శతాబ్ది)

హైదరాబాదుకు 32 కి.మీ. దూరంలో నున్న కీసరగుట్టలో బయల్పడిన ‘తులచువాన్ఱు’ అన్న క్రీ.శ. 5వ శతాబ్ది నాటి చిన్న శాసనమే, తెలంగాణ తొలిశాసనంగా కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన శ్రీరామోజు హరగోపాల్‍గారి ద్వారా ఇటీవల విస్తృత ప్రచారానికి నోచుకొంది. ఉమ్మడి రాష్ట్ర పురావస్తుశాఖ, 1970-80లలో కీసరగుట్టలో తవ్వకాలు చేస్తున్నపుడు, ఒక బండపై ఈ చిన్న శాసనాన్ని గుర్తించారు. విష్ణుకుండికాలపు ఈ శాసనంలో, తులచు – (తొలచు, తొలిచే) వాన్ఱు – (వారు, వాళ్లు) అంటే తొలచేవాళ్లని, రాతిని తొలిచే శిల్పులు (వడ్డర్లు కూడా …

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-5 పొలమెయరట్టోడి కొండపర్తి (పూర్తి) తెలుగు శాసనం (క్రీ.శ.9వ శతాబ్ది) Read More »

మరుపురాని మాదన్నపేట

ఇద్దరు మంచి మిత్రులు ఒక జంటగా క్షణం కూడా విడిపోకుండా కలిసిమెలిసి ఒకే ప్రాణంగా తిరుగుతుంటే వారిని చూసి ‘‘వీరిద్దరూ అక్కన్న మాదన్నలురా’’ అని అరవై ఏండ్ల క్రిందట హైదరాబాద్‍ పాత నగరంలోని ముసలివారు ముచ్చటపడేవారు. కుతుబ్‍షాహీల కాలంలో మంత్రులుగా పనిచేసిన అక్కన్న మాదన్నలు ఏకాత్మస్వరూపులుగా, కృష్ణార్జునులుగా కలసి బ్రతికి కలిసి చనిపోయారు. మహామంత్రి మాదన్న నివసించిన ప్రాంతమే ‘‘మాదన్నపేట’’గా తర్వాత కాలంలో వర్దిల్లింది. పాతనగరం శాలిబండలో వీరు కట్టించిన అమ్మవారి దేవాలయాన్ని ప్రజలు ఇప్పటికీ అక్కన్న మాదన్నల …

మరుపురాని మాదన్నపేట Read More »

అర్బన్‍ ల్యాండ్‍ విధానాలు – సిటీ ప్లానింగ్‍

భూమి లభ్యత పరిమితం. భూమి ఉపరితలంపై భూమి లభ్యత కేవలం 20 శాతమే.1.ఏ నగర అభివృద్ధికైనా భూమి అనేది ప్రాథమిక వనరు. ఇది రెండు ప్రధాన లక్షణాలను కలిగిఉంటుంది. (1) ఒక నిర్దిష్ట సమయం వద్ద భూమి లభ్యత పరిమితం గానే ఉంటుంది. (2) అది ఒక దానితో ఒకటి పోటీపడే అనేక ఉపయోగాలను కలిగి ఉంటుంది. నీరు లేదా శక్తి తరహాలో అది చలనశీలత ఉండేది కాదు. ఒక చోట ఉన్న స్థలాన్ని మరో చోటుకు …

అర్బన్‍ ల్యాండ్‍ విధానాలు – సిటీ ప్లానింగ్‍ Read More »

నేలపైన విమానం కన్నా అధిక వేగం… హైపర్‍లూప్‍ టెక్నాలజీతో సాకారం…!!

గతానికి కన్నా వర్తమానంలో మరింత మెరుగైన జీవితం గడపాలన్న ఆశకు సృజన, ఆసక్తి, పట్టుదల, సడలని దృఢసంకల్పం తోడైతే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. ఈరకమైన ఆలోచనలే మానవుడిని మహోన్నతుడిని చేశాయి. మొదట్లో ఒకచోట నుండి మరో చోటికి ప్రయాణించడానికి కాలినడకను ఆశ్రయించిన నాటి మానవుడు, తదనంతర కాలంలో ‘‘చక్రం’’ కనుక్కోవడం, మానవ నాగరికతలోనే ఒక విప్లవాత్మక పరిణామంగా అభివర్ణించవచ్చు. చక్రాల సహాయంతో ఎద్దుల బండ్లను తయారుచేసుకొని, గతంతో పోలిస్తే సులువుగా తన ప్రయాణ అవసరాలు తీర్చుకున్నారు అప్పటి తొలితరం …

నేలపైన విమానం కన్నా అధిక వేగం… హైపర్‍లూప్‍ టెక్నాలజీతో సాకారం…!! Read More »

శుకగ్రహంపై గ్రహాంతరవాసుల జీవం?

సూర్యమండలంలో కేంద్రమైన భానుడికి దగ్గరగా ఉన్న రెండవ గ్రహం శుక్రుడు. చంద్రుడి తరువాత శుకగ్రహం కూడా రాత్రివేళ ఆకాశంలో ప్రకాశవంతంగా వెలుగులు పంచగలుగుతుంది. సూర్యుడి చుట్టు ఒకసారి తిరగడానికి శుకగ్రహానికి 224.7 రోజులు పడుతుంది. ఆకారం, ద్రవ్యరాశి, సూర్యుడి నుండి దూరం మరియు సంఘటనలలో శుకగ్రహం మరియు భూగ్రహం ఒకేలా ఉన్నందున శుక్రుడిని భూమి ‘సోదర గ్రహం (సిస్టర్‍ ప్లానెట్‍)’ అంటారు. భూగ్రహం కోట్ల జీవులకు నెలవుగా ఉంది. శుకగ్రహంపై కూడా జీవుల ఉనికి ఉందనే ఆధారాలను 14 సెప్టెంబర్‍ 2020 రోజున అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల …

శుకగ్రహంపై గ్రహాంతరవాసుల జీవం? Read More »

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక హిందుస్తానీ సంగీతం

భారతదేశం ఏకశిలా సదృశ్యమైన ధార్మిక, సాంస్కృతిక విలువలు కలిగిన దేశం కాదు. భిన్నభాషా సంస్కృతులు, భిన్నమైన ఆలోచనా ధారలు వికసిల్లిన విశాల దేశం. భిన్నత్వమే ఈ దేశం ప్రత్యేకత. భిన్నత్వంలోనే ఏకత్వాన్ని సాధించిన సాంస్కృతిక ధార ఈ దేశానిది. అందులోనే సహజీవన సంస్కృతి వెల్లి విరిసింది. ఈ సహజీవన సంస్కృతి ఇప్పుడు తీవ్ర ప్రమాదంలో పడింది. భారత దేశం ఏకశిలా సదృశ్యమైన ధార్మిక సాంస్కృతిక సమాజంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నది. ఆ దిశగా చరిత్రను పునర్లిఖించే ప్రయత్నం …

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక హిందుస్తానీ సంగీతం Read More »

నకాశి కళకు వన్నె తెచ్చిన చేర్యాల్‍ స్క్రోల్‍ పెయింటింగ్‍

చేర్యాల్‍ స్క్రోల్‍ పెయింటింగ్‍ అనేది నకాశి ఆర్ట్కు స్థానిక ప్రత్యేక శైలిని జోడించిన హస్తకళ. తెలంగాణకు మాత్రమే పరిమితమైన అద్భుతకళారూపాలను ఇందులో చూడవచ్చు. ఈ శైలి తెలంగాణలో మాత్రమే కానవస్తుంది. వీటినే పటం బొమ్మలుగా వ్యవహరిస్తుంటారు. ఫిల్మ్ రోల్‍, కామిక్‍ స్ట్రిప్‍ తరహాలో ఈ పటాలు పురాణగాధలను, ఇతిహాసాలను వివరిస్తుంటాయి. సాధారణంగా జానపద పురాణాల, చిన్న చిన్న కథలకు దృశ్యరూపం వీటిలో ఉంటుంది. ఒకప్పుడు ఈ కళ దేశం లోని వివిధ ప్రాంతాల్లో కూడా ప్రాచుర్యంలో ఉండింది. ఎక్కడికక్కడ ఈ …

నకాశి కళకు వన్నె తెచ్చిన చేర్యాల్‍ స్క్రోల్‍ పెయింటింగ్‍ Read More »