ఇది నా కల. ఆకుపచ్చ కల. నడిచే దారంతా వృక్షాలు, పూల మొక్కలు ఉండాలని. చాలా చిన్న కల. మీకు కొంచెం ఇస్తున్నాను. మీకు నచ్చుతుంది నా కల. ఎందుకంటే నా కల, మీ కల ఒకటే కాబట్టి.
కాస్త మెరుగైన జీవితం కోసం రంగుల కలలు కందాం. ప్రయత్నించి సాకారం చేసుకుందాం. అది 2000 సంవత్సరం. న్యూ మిలీనియం. ప్రపంచీకరణకు దారులు తెరిచిన సమయం. Local is global, Global is local నినినాదం మారుమోగుతున్న కాలం, the Era of Globalization. Another world is possible అని కొత్త బంగారు లోకాన్ని స్వప్నించిన కాలం. అభివృద్ధి చెందుతున్న ఇండియా లాంటి దేశాల్లో ప్రపంచీకరణ ప్రణాళికలు Liberalization, Privatization, Globalization (LPG)వేగంగా అమలు జరుగుతున్న కాలం. అప్పుడు నేను New York/USAలో International Women’s Conference (UN) లో పాల్గొంటున్నాను. ప్రపంచ దేశాల స్త్రీలందరు ఒక చోట చేరిన సందర్భం అది. మేమంతా మా హక్కులగురించి మాత్రమే కాకుండా పర్యావరణం, సుస్థిరత, అభివ•ద్ది గురించి కూడా మాట్లాడుకున్నాం. 1992లో Rio de Jeneiro/ Brazilలో జరిగిన Earth Summitతర్వాత, 2000లో మిలీనియం సమ్మిట్ (Millennium Summit) జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రపంచ దేశాలన్నీ మిలీనియం డిక్లరేషన్ (వీMillennium Declaration)ని ఆమోదించాయి. దీనికి కొనసాగింపుగా ఎనిమిది లక్ష్యాలను తీసుకున్నారు.
దీన్ని Millennium Development Goals (MDGs) అంటారు. ఈ లక్ష్యాలను 2015 వరకు పూర్తి చేసి, ప్రపంచ పేదరికాన్ని దూరంచేసి, సుస్థిర అభివ•ద్ధిని సాధించాలి.
2015 సంవత్సరం ఒక మైలురాయి లాంటిది. ప్రపంచ రాజకీయాల మీద Multilateralism, International policies ప్రభావం చూపిస్తున్న కాలం అది. చాలా ప్రపంచ దేశాలు ఈ లక్ష్యాలను సాధించలేక పొయాయి 2015 వరకు కూడా కొన్నిపెద్ద దేశాలు, సంపన్న దేశాలు తప్ప. కాబట్టి, 2015లో NY/USAలో United Nations (UN), Sustainable Development Summitను నిర్వహించి, 17 లక్ష్యాలను 2030 వరకు సాధించమని మరింత విస్తృతంగా ప్రపంచ దేశాలకు ఇచ్చింది. ఈ లక్ష్యాలన్నీ పేదరికం, పర్యావరణం, స్త్రీలు ప్రాతిపదికగా కనిపిస్తాయి. ఒకదానితో ఒకటి అల్లుకొని కనిపిస్తాయి. అంటే – ఒక దానితో మరో లక్ష్యానికి ఇంటర్ కనెక్టివిటీ కనిపిస్తుంది. కొంచెం ప్రయత్నిస్తే మనం మన దేశాన్ని పేదరికం నుండి కాపాడుకోవచ్చు. ఆహార భద్రతను సాధించుకోవచ్చు. ఈ 17 లక్ష్యాలలో మనం ఎన్ని సాధించాం? ఇంకా సాధించాల్సింది ఏమిటి? దీని గురించి చర్చించి, ఒక అవగాహనతో, స్పష్టతతో ముందుకు సాగుదాం. సుస్థిర అభివృద్ధిలో భాగస్వాములం అవుదాం.
- మహెజబీన్
ఎ : 9866587919