పాఠశాలల పునఃప్రారంభం అభినందనీయం
దాదాపు సంవత్సరం తర్వాత పిల్లలు బడిబాట పట్టారు. కరోనాతో అతలాకుతలమైన అనేక రంగాలలో విద్యారంగం ప్రధానమైనది. లాక్‍డౌన్ ఎత్తివేసిన తరువాత ఉత్పత్తి, ఉపాధి, పాలనా రంగాలలో వీలును బట్టి వరుస వారీగా కార్యకలాపాలు మొదలైనప్పటికీ, విద్యారంగంలో త్వరితగతిన చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోయాయి. ఆన్‍లైన్ క్లాసులు అన్ని వర్గాల విద్యార్థులు ఉపయోగించుకోలేక పోయారు. ఆన్‍లైన్ క్లాసులు ప్రత్యక్ష బోధనకు సమానం కాకపోయినప్పటికీ తాత్కాలిక ప్రత్యామ్నాయ మార్గంగా అవసరమయ్యాయి. సంవత్సర కాలం పిల్లలు చదువు అనే అంశానికే దూరమయ్యారు …