Day: March 1, 2021

వేదనాభరిత జీవితాలని చూపించే కోర్టు కథలు

సినిమాల్లో కోర్టు వాతావరణం చూసి చాలా మంది కోర్టులు అలా వుంటాయని అనుకుంటారు. కోర్టు వాతావరణాన్ని దారుణంగా సినిమా వాళ్ళు చూపిస్తూ వుంటారు. అలాంటి సినిమాలు చూసి అదే విధంగా కథలు రాస్తున్న రచయితలూ వున్నారు.నేర న్యాయవ్యవస్థతో సంబంధం వున్న రచయితలు గానీ, న్యాయవాదులైన రచయితలు గానీ, న్యాయమూర్తులైన రచయితలుగానీ కోర్టుకు సంబంధించిన కథలు గానీ, నవలలు గానీ రాసినప్పుడు అలా వుండదు. కోర్టుల్లో వుండే పరిస్థితిని ఆ కథల్లో, నవలల్లో మనం చూడవచ్చు. అయితే తెలుగులో …

వేదనాభరిత జీవితాలని చూపించే కోర్టు కథలు Read More »

శతాబ్ది శిరసున సైన్స్ కిరీటం

ఉషోదయ వేళ విప్పారిన పుష్పం కనువిందు చేస్తుంది. కాని అంతకుముందు రోజే మొగ్గయి, రాత్రి విచ్చుకుంటేనే ఇది సాధ్యం. కాల ప్రవాహంలో రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు జలజల రాలిపడుతుండటం-మనిషి జీవితకాలంతో పోల్చలేం. మానవాళి నాగరికతను అమోఘంగా ప్రభావితం చేసిన విజ్ఞానశాస్త్రం, ప్రగతి వంటి అంశాలను బేరీజు వేసినపుడు వంద సంవత్సరాలు సుదీర్ఘమైన వ్యవధికాదు. సంకేతంగా రాళ్ళు వాడటం క్రీ.పూ. 24,00,000లో ప్రారంభం కాగా, వేటకు సోలతులు, బాణాలు, అంబులు వాడటం క్రీ.పూ. 25,000లో మొదలైంది. అలాగే …

శతాబ్ది శిరసున సైన్స్ కిరీటం Read More »

స్త్రీల కోసం, జెండర్‍ సమానత్వం కోసం సుస్థిరత, అభివృద్ధి UN/SDGs

మార్చ్ నెల స్త్రీల కోసం. మహిళా ఉద్యమాల ఉత్సవాలు జరుపు కోడానికి ప్రపంచ స్త్రీలు ఎదురు చూసే నెల. వాళ్ళతో పాటు నేను కూడా. మార్చ్ నెల ఎండా కాలం వచ్చిందని చెప్తుంది. హైదరాబాద్‍ వేడిగానే వుంది. అది నమ్మి, ఇండియా అంత ఒకే వాతావరణం ఉంటుందని భ్రమపడి, ఢిల్లీ వెళ్ళాను. స్త్రీల హక్కుల కోసం పని చేసినందుకు, భారత ప్రభుత్వం ఇచ్చే జాతీయ పురస్కారాన్ని అందుకోడానికి. చలి. హిమాలయాలు పక్కనే ఉన్నాయా అనిపించేటంత చలి. ‘ఢిల్లీకి …

స్త్రీల కోసం, జెండర్‍ సమానత్వం కోసం సుస్థిరత, అభివృద్ధి UN/SDGs Read More »

ప్రకృతే నియంత్రిస్తుంది! 8 ప్రకృతే శాసిస్తుంది!! భూగోళమే ఓ శాస్త్రీయ క్షేత్రం!

గత 6వ కథనంలో శాస్త్రీయ పద్ధతి గూర్చి, త్యాగనిరితితో గూడిన శాస్త్రజ్ఞుల పరిశోధన గూర్చి తెలుసుకున్నాం. ఇదంతా ఊహలతో కూడుకున్నది కాదని, శూన్యంలో జరిపేది అంతకన్నా కాదని గుర్తించడం జరిగింది. ఈ ఆలోచనలు, పరిశోధనలు భూమి ఆధారంగా, భూమి చుట్టూ ఆవరించిన వాతావరణం, పర్యావరణం, జీవావరణం, నేల, నీరు, గాలి తదితర అంశాలతోటే అనుసంధానమై వుంటాయి. వీటికి అతీతంగా ఏ పరిశోధన, పరిశీలన జరగదు. గ్రహాంతర పరిశోధనలు కూడా దాదాపు ఈ నేపథ్యంలోనే వుంటాయి. కాబట్టి, భూగోళమే …

ప్రకృతే నియంత్రిస్తుంది! 8 ప్రకృతే శాసిస్తుంది!! భూగోళమే ఓ శాస్త్రీయ క్షేత్రం! Read More »

లాభసాటి పాడి పరిశ్రమ నిర్వహణ

పాడిపశువుల రవాణాలో జాగ్రత్తలుపశువుల శరీరలక్షణాలు, వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి కొనుగోలు చేసిన పశువులను, శారీరక, మానసిక ఒత్తిడికి గురి కాకుండా క్షేమంగా ఇంటికి చేర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది.15-20 కి.మీ. లోపు దూరం ప్రయాణానికి ఎలాంటి వాహనం అవసరం లేదు. మధ్య మధ్యలో కాసేపు విశ్రాంతినిస్తూ, కాలి నడకన తీసుకొని రావాలి. నడిపించే సందర్భాలలో ఒకేసారి చాలా దూరం నడిపించకూడదు. అలా చేస్తే పశువుల కాళ్ళ నొప్పితో బాధపడతాయి. కాళ్లు మెత్తబడి, మేత తినలేక, నడవలేక …

లాభసాటి పాడి పరిశ్రమ నిర్వహణ Read More »

యయాతికల

నక్షత్రనౌక అశ్వని తన కక్ష్యలోంచి కిందికి జారింది. దానికి అమర్చిన రాకెట్లు సజావుగా పేలాయి. అశ్వని మెల్లిగా కిందికి దిగుతూ ఉపరితలానికి దగ్గరగా వస్తోంది.అశ్వనిని నడుపుతున్నది కెప్టెన్‍ యయాతి. అతనికి నక్షత్ర నౌకలు నడపడం కొత్తకాదు. ఎన్నో వందలసార్లు నడిపి ఉంటాడు. అసలు అతను కళ్ళు మూసుకుని దానిని కిందికి దింపగలడు. ఆ నౌకలో పదిహేను వందల మది ప్రయాణీకులు ఉన్నారు. వాళ్ళంతా రోహిణి నక్షత్రం మీద స్థిరపడటానికి వలస వస్తున్నారు. ఇప్పటికే రోహిణి మీద యాభైవేల …

యయాతికల Read More »