Day: April 1, 2021

మన భద్రత మన చేతుల్లోనే…

ప్రకృతిని ఎంతగా వినియోగించుకుంటే నాగరికత అంత అభివృద్ధి చెందుతుందని సామాజిక శాస్త్రవేత్తలు అంటుంటారు. ప్రకృతిని వినియోగించుకునే విధానం నాగరికత అభివృద్ధిని నిర్ణయిస్తుంది. ఆ జీవిత విధానాలనే సంస్కృతి అంటారు. ప్రకృతి అనేక సహజ నిర్మాణాలతో కూడుకొన్నదే అయినా నాగరికత అభివృద్ధి చెందేకొద్దీ దాని నిర్మాణ రూపాలు మారిపోతాయి. వినియోగం అనేదానిలోనే విధ్వంసం దాగి ఉంటుంది. సమతుల్యతను భంగపరుస్తుంది. ప్రకృతిలో సంభవించే ఈ అసమతుల్యతనే పర్యావరణ సంక్షోభం అంటాం. దీన్ని నివారించడమే పర్యావరణ పరిరక్షణ. ఈ పరిరక్షణ అనేది …

మన భద్రత మన చేతుల్లోనే… Read More »

అబిద్‍ హసన్‍ సఫ్రానీ

జై హింద్‍! అనే నినాదం జాతీయమైనది. అది భారతీయులకు ఎంతో పవిత్రమైనది. ఈ పవిత్ర నినాద సృష్టికర్త మేజర్‍ అబిద్‍ హసన్‍ సఫ్రానీ. ఆయన హైదరాబాద్‍కు చెందిన వ్యక్తి. అబిద్‍ హసన్‍ హైదరాబాద్‍ నగరంలోని ఒక ఉన్నతమైన కుటుంబంలో 1912వ సంవత్సరంలో జన్మించాడు. ఆయన తల్లి ఫక్రున్నిసా బేగం. ఆమెకు సరోజిని నాయుడు సాంగత్యంలో దేశభక్తి నరనరాన జీర్ణించుకుపోయింది. విదేశీ వస్త్రాలను తగులబెట్టిన మొదటి హైదరాబాద్‍ మహిళగా ఆమె అందరి మన్ననలను పొందగలిగింది. మహాత్మాగాంధీ, నెహ్రూ, ఆజాద్‍ …

అబిద్‍ హసన్‍ సఫ్రానీ Read More »

ఎర్త్ ఫస్ట్

గేలార్ట్ నెల్సన్‍ 1970ల్లో ధరిత్రి దినోత్సవం ఒకటి కావాలని ప్రతిపాదించాడు. దిస్కాన్సిన్‍ సెనేటర్‍గా నెల్సన్‍కి ఉన్న అసంతృప్తి లోంచి ‘ఎర్త్డే’ అనే భావన పుట్టింది. పర్యావరణం గురించి రాజకీయాలుగానీ మీటాయీ కానీ పెద్దగా పట్టించుకోని కాలాన ఎర్త్డే పట్టుకొచ్చింది. తదాదిగా ప్రతి ఏటా ఏప్రిల్‍ 22ను ఎర్త్డేగా పాటించటం జరుగుతోంది. ఇది ప్రతి ఏటా జరుగుతూ ఉన్నదే. ఎర్త్డేను ఎందుకు పాటించటం. ఎందుకు జరుపుకోవటం అనే ప్రశ్నలు ఎప్పటికీ విలువైనవే. ఈ ఘటన ఒక అంశాన్ని మనం …

ఎర్త్ ఫస్ట్ Read More »

అక్షరభిక్ష ప్రసాదించిన ‘గౌలిగూడ’

గలగలా పారే ముచికుందా నది తీరాన పుష్కలంగా లభించే పచ్చగడ్డి భూములలో గొల్లల ఆవాస నివాసాలు ఏర్పడేసరికి ఆ ప్రాంతం గొల్లగూడెం నుండి గౌలిగూడాగా మారింది. ‘‘ఒకే ఒక్క సిరా చుక్క లక్షల మెదళ్లకు కదలిక’’ అన్న కవిత్వం కార్యాచరణకు దిగింది ఈ గౌలిగూడాలోనే. అక్కడి రామమందిరం వీధిలో సుబ్బారావు హోటల్‍ ఉండేది. ఈ హోటల్‍ 1920లలో ప్రారంభమయ్యింది. ఇరవయ్యవ దశకంలోనే నగరంలో హోటళ్లు ప్రారంభం అయినవి. నగరానికి ఎవరైనా కొత్తగా వస్తే అన్నదాన సత్రాలలో ఉచిత …

అక్షరభిక్ష ప్రసాదించిన ‘గౌలిగూడ’ Read More »

వారసత్వ సంపదను కాపాడుకుందాం

ఏప్రిల్‍ 18న అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం టునీషియాలో 1982 ఏప్రిల్‍ 18న ఇంటర్నేషనల్‍ కౌన్సిల్‍, మూమెంట్స్ అండ్‍ సైట్స్ (ఐసిఒఎంఒఎస్‍) అనే సంస్థ నిర్వహించిన ఒక సదస్సు ఇంటర్నేషనల్‍ డే ఫర్‍ మూమెంట్స్ అండ్‍ సైట్స్ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించాలని సూచించింది. ఈ సదస్సు ప్రారంభమైన రోజు ఏప్రిల్‍ 18. కనుక ఆ తేదీనే ఎన్నుకున్నారు. యునెస్కో 1983 నవంబర్‍లో ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించింది. ఈ దినోత్సవాన్నే ‘వరల్డ్ హెరిటేజ్‍’ డే అనడం …

వారసత్వ సంపదను కాపాడుకుందాం Read More »

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-8

ముదుగొండచాళుక్య కుసుమాదిత్యునికుక్కునూరు రాగిరేకుతెలుగు (గద్య) శాసనం క్రీ.శ.12వశతాబ్ది ఖమ్మం జిల్లా పాల్వంచతాలూకా కుక్కునూరులో దొరికిన ముదుగొండచాళుక్య కుసుమాదిత్యుని రాగిరేకు శాసనం, ఆ రాజ వంశానికి చెందిన రెండోశాసనం. ఇది క్రీ.శ.12వ శతాబ్ది నాటిది. కాకతీయుల కంటే ముందు తూర్పు తెలంగాణా ప్రాంతాన్ని దాదాపు రెండు శతాబ్దాలు పాలించిన ముదుగొండచాళుక్యుల వంశవృక్షాన్ని, విజయాలను, నాటి తెలుగు భాష స్వరూపాన్ని తెలియజేసే ఈ శాసనం చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకొంది. 1973వ సం।।లో బి.హెచ్‍.లక్ష్మీనారాయణ అనే పరిశోధకులు, భద్రాచలంలో ఉన్న తన …

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-8 Read More »

అంగారకుడిపై తరగని మానవుని మమకారం..!!

జీవాన్వేషణ కోసం వరుస కడుతున్న అంతరిక్ష నౌకలు..!!భూమిపై నున్న పక్షులు, జంతువులతో పాటు ఇతర చలించగల ప్రాణికోటి మనుగడ కోసం పోరాటం చేస్తూ, తమకు అనుకూలమైన ఆహార, ఆవాసాల కోసం నిరంతరం అన్వేషిస్తూ ఉంటాయి. తాము నివసిస్తున్న ప్రాంతాల్లో శీతోష్ణస్థితిలో కలిగే మార్పులు తమకు ప్రతికూలంగా పరిణమిస్తే, తమకు అనుకూలమైన ప్రాంతాలను వెదుకుతూ అవి వలస వెళ్తాయి. మానవుడు కూడా ఇందుకు ఎంతమాత్రం అతీతుడు కాదు. పెరుగుతున్న జనాభా – తరుగుతున్న వనరులకు తోడు, భూమి మీద …

అంగారకుడిపై తరగని మానవుని మమకారం..!! Read More »

పర్యావరణాన్ని కాపాడుకుందాం

గతంలో భారతదేశం స్వయం పోషక స్వతంత్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కలిగి వుంది. ఫ్యూడల్‍ వ్యవస్థలో భాగంగా వుండేది. తర్వాత కాలాన ఫ్యూడల్‍ వ్యవస్థ స్థానంలో పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చింది. ఒకవైపు శాస్త్ర, సాంకేతిక రంగాలు అప్రతిహతంగా పురోగమిస్తున్నాయి. అదే సమయాన గుత్త పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాదం విజృంభించింది. వీటికి లాభమే పరమార్థం. ఈ పెట్టుబడిదారీ శక్తుల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని అమలు చేస్తున్న విధానాల వల్ల అనేక అనర్థాలు వస్తున్నాయి. అందులో ఘన (భూమి), ద్రవ, వాయు, …

పర్యావరణాన్ని కాపాడుకుందాం Read More »

నిలుపరా నీ రాష్ట్రం నిండు చరిత్రను…

మానవ వికాస చరిత్ర అనంతంగా దొరుకుతూనే వుంది. నిర్విరామంగా, ప్రపంచ పరివ్యాప్తంగా జరుగుతున్న పరిశోధకుల అన్వేషణలలో కొత్త సంగతులు బయటపడ్తూనే వున్నాయి. ఏనాటికానాటికి చరిత్ర కొత్తపుటలు తొడుక్కుంటూనే వున్నది. ఆ కొత్త పేజీలలో మనిషి ఎదిగిన తీరుతెన్నులు ఆశ్చర్యపరుస్తూనే వున్నాయి. ఇప్పటి మనుషులకు ఎప్పటి సంగతులో తెలుస్తున్నపుడల్లా విస్మయానందభరితులౌతున్నారు. పాతుకుపోయిన పాతనమ్మకాల నుంచి బయటపడాలంటే చరిత్ర తెలియడం గొప్ప చికిత్స. గతంలోని మానవ నాగరికతా, సంస్కృతులు పొందిన పరిణతుల గ్రాఫ్‍ గీసుకుంటే తెలుస్తుంది మనిషి తప్పొప్పుల పట్టిక. …

నిలుపరా నీ రాష్ట్రం నిండు చరిత్రను… Read More »

అన్నదాతకు అందలం

మట్టిని నమ్మిన రైతుకు.. ప్రజలను నమ్మిన రాజకీయ పార్టీకి ఓటమి లేదు : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‍రెడ్డి నాటి సమైక్య రాష్ట్రంలో వ్యవసాయం కుదేలు అయింది, వివక్షకి గురైంది. నీళ్లు ఉన్నా కూడా మనకు ఇవ్వలేదు. చెరువులు బావులపై ఆధార పడాల్సిన పరిస్థితి ఉండేది. సాగునీరు కోసం కృష్ణ గోదావరిలపై ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టలేదు, నాటి సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‍ …

అన్నదాతకు అందలం Read More »