Day: May 1, 2021

గులాం అహ్మద్‍

ఆయారాం, గయారాం అనే పదం భారత క్రికెట్‍లో గులాం అహ్మద్‍కే జరిగిందా అనిపిస్తుంది. తొలి టెస్ట్ మ్యాచ్‍ ఆడితే, మలి టెస్ట్లో ఆయనకు స్థానం ఉండదు. పోనీ ఆడిన టెస్ట్లో ప్రదర్శన బాగోలేదంటే అనుకోవచ్చు. బాగా ఆడినప్పటికీ ఆయనకు తదుపరి టెస్ట్లో చోటులేదు. ఇది గులాం అహ్మద్‍ టెస్ట్ల గురించిన విశేషం.అప్పట్లో అంటే 1950ల్లో క్రికెట్‍ ఆణిముత్యంగా, తెలుగుతల్లి తేజంగా గులాం అహ్మద్‍ ప్రతిభను భారత క్రికెట్‍ బోర్డు ఆపలేకపోయింది. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని జట్టులోకి వచ్చినప్పటికీ …

గులాం అహ్మద్‍ Read More »

సమిష్టి కృషే మానవాళి మనుగడకి రక్షణ

సమసిపోతుందనుకున్న కరోనా సమస్య మళ్లీ మొదటికొచ్చింది. మరింత ఉధృతంగా వచ్చింది. అంతకు ముందెన్నెడూ లేనంతగా రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ‘టైమ్స్’ సర్వే ప్రకారం ప్రభుత్వ లెక్కలకు ముప్పైరెట్లు కేసులున్నట్లు తెలుస్తోంది. సెకండ్‍ వేవ్‍ గురించి మొదటి నుంచీ పర్యావరణ శాస్త్రవేత్తలు, సామాజిక పరిశీలకులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మొదటి కోవిడ్‍ సమయంలో దక్కన్‍ల్యాండ్‍ మాసపత్రిక ఇంటర్వ్యూలలో కూడా పలురంగాల మేధావులు యిదే చెప్పారు. ఇప్పుడు ఆరోగ్య అత్యవసర పరిస్థితి (హెల్త్ ఎమర్జెన్సీ)లో మనమున్నాం. ఇంతకు …

సమిష్టి కృషే మానవాళి మనుగడకి రక్షణ Read More »

పక్కా హైదరాబాదీ వీరేంద్రనాథ్‍ ఛటోపాధ్యాయ

అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాదీలు చూపిన ప్రతిభ, తెగువ చరిత్రలో అంతగా రికార్డు కాలేదు. తెలంగాణ గడ్డమీద పుట్టిన వాళ్లు ప్రాణాలకు తెగించి కొట్లాడిన విషయమూ అందరికీ తెలియదు. ఇట్లా విస్మరణకు గురైన వాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే ఇవ్వాళ ఇక్కడ పక్కా హైదరాబాదీ వీరేంద్రనాథ్‍ ఛటోపాధ్యాయ గురించి తెలుసుకుందాం. మాతృదేశ విముక్తి కోసం బ్రిటిష్‍ ప్రభుత్వానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా యూరప్‍ కేంద్రంగా విప్లవోద్యమాలు చేసిండు. రహస్యంగా విప్లవకారుల మద్ధతు కూడగడుతూ అంతర్జాతీయ స్థాయిలో భారతీయుల వాణిని …

పక్కా హైదరాబాదీ వీరేంద్రనాథ్‍ ఛటోపాధ్యాయ Read More »

చారిత్రక వీధి ‘రెసిడెన్సీ బజార్‍’

ఎవరైనా గొప్పలు చెప్పుకుంటే ‘‘ఏంరా నిన్ను నువ్వు తురుంఖాన్‍ అనుకుంటున్నవా?’’ అనటం మనకు తెలిసిన సంగతే. మరి ఇంతకూ ఆ తురుం ఖాన్‍ ఎవరు? తుర్రేబాజ్‍ ఖాన్‍! వీరత్వానికి, త్యాగానికి మారుపేరు అతను. 1857 సిపాయిల తిరుగుబాటు హైద్రాబాద్‍ రాజ్యంలో కూడా జరిగింది. నగరంలో దానిని ‘‘జిహాద్‍’’ అన్నారు. దాని నాయకుడే తుర్రేబాజ్‍ ఖాన్‍.ముస్లింలలో ఇతను రొహిల్లా తెగకు చెందిన వాడు. షాద్‍ నగర్‍ దగ్గరి కుందుర్గ్ ఇతని స్వగ్రామం. ఇతని ముఖ్య అనుచరుడు సయ్యద్‍ మౌల్వీ …

చారిత్రక వీధి ‘రెసిడెన్సీ బజార్‍’ Read More »

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-9 విష్ణుకుండిన గోవిందవర్మ

హైదరాబాదు ప్రాకృత బౌద్ధశాసనం (క్రీ.శ.4వ శతాబ్ది) సిద్ధార్థుడు బుద్ధుడైన తరువాత శుద్ధోధనుని కోరికపై కపిలవస్తు మహానగరాన్ని సందర్శించటానికి అంగీకరించాడు. సిద్ధార్థ – గౌతముడు మళ్ళీ మనమధ్యకొస్తున్నాడని తెలుసుకొన్న శాక్యులంతా ఆనందపరవశులైనారు. ఆనోటా, ఈనోటా విన్న రాహులుడు, ఏడేళ్ల తరువాత తన తండ్రిని మొదటిసారిగా చూడబోతున్నందుకు ఆక్షణం ఎప్పుడొస్తుందా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాడు. ఈ సంగతి తెలిసి పరమానందభరితయైన యశోధర ఇల్లూ, వాకిలీ అందంగా అలంకరించటంలో నిమగ్నమై తన్ను తాను మరచిపోయింది. ‘అమ్మా నా తండ్రి, బుద్ధ …

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-9 విష్ణుకుండిన గోవిందవర్మ Read More »

సామ్యవాద శాస్త్రవేత్త – సైన్స్ రచయిత

జీవితంలో పొందలేకపోయిన వాటి గురించి చాలామంది విచారిస్తూ ఉంటారు. సాధించలేకపోయిన వాటిని పదే పదే తలచుకుని దిగులు చెందుతూ ఉంటారు. గతం గుర్తుచేసుకుని, బాధను దిగమింగుకుంటూ కూడా కొందరు ఉంటారు. అట్లాంటివారు ఎప్పుడైనా శాస్త్రవేత్తల గురించి, సైన్సు రచనలు చేసే వారి గురించి కొద్దిగా చదివితే ఊరట పొందవచ్చుననిపిస్తుంది. పాపులర్‍ సైన్సు రచనలో ఎంతో పేరు ప్రఖ్యాతి పొందిన, స్వయంగా పలు శాస్త్ర సంబంధిత అంశాల గురించి శోధించి చెప్పిన జేబీఎస్‍ హాల్టేన్‍ను చదివినప్పుడు చాలా విషయాలు …

సామ్యవాద శాస్త్రవేత్త – సైన్స్ రచయిత Read More »

అంగారకుడిపై తరగని మానవుని మమకారం..!! జీవాన్వేషణ కోసం వరుస కడుతున్న అంతరిక్ష నౌకలు..!!

(గత సంచిక తరువాయి)ఈ నేపథ్యంలో ఇటీవల యూఏఈ, చైనా, అమెరికాలు అంగారకుని మీదకు అంతరిక్ష నౌకలు పంపించాయి. వాటి గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం. యూఏఈ మొట్టమొదటి మార్స్ మిషన్‍ – హోప్‍10 లక్షల జనాభా (1 మిలియన్‍) కలిగిన అతిచిన్న మరియు ధనిక దేశం యూఏఈ అంగారకుడి మీదకు అంతరిక్ష నౌకను పంపి, ఆ ఘనత సాధించిన 5వ దేశంగా (అమెరికా, రష్యా, యూరోపియన్‍ యూనియన్‍, ఇండియాల తర్వాత) చరిత్ర సృష్టించింది. యూఈఏ అంగారకుడి మీదకు …

అంగారకుడిపై తరగని మానవుని మమకారం..!! జీవాన్వేషణ కోసం వరుస కడుతున్న అంతరిక్ష నౌకలు..!! Read More »

సదాశివపేట- తెలంగాణ రాష్ట్ర ప్రాచీన నగర నిర్మాణ నమూనా

నడిమధ్యన సదాశివుడు,నలువైపులా ద్వారబంధాలు,నలుచెరుగులా కందకం,నలుదిక్కుల చందరంగ శైలి విస్తరణ,కూర్మ వృష్ట వాస్తు నిర్మాణ కౌశలం,సదాశివరెడ్డి ఏలిన నేల అదే సదాశివపేట.భారతదేశం అనాది కాలం నుండి గొప్ప సంస్కృతి వారసత్వానికి పెట్టింది పేరు. ప్రాచీన భారతదేశం సందడిగా ఉన్న పట్టణాలు, గంభీరమైన రాజధానులు, సౌందర్య నిర్మాణాలకు నెలకొలువు. శతాబ్దాల నుండి గొప్ప కట్టడాలు, నిర్మాణ శైలి ఉన్న నగరాలు విలసిల్లుతున్నాయి. చండీఘర్‍, జైపూర్‍, మధురై లాంటి నగరాలు ఈ విధమైన నిర్మాణ శైలికి మచ్చుతునక. అలాంటి ఒక పట్టణమే …

సదాశివపేట- తెలంగాణ రాష్ట్ర ప్రాచీన నగర నిర్మాణ నమూనా Read More »

కొత్త పంచాయతీ రాజ్‍ చట్టంతో గ్రామాలలో పునరుజ్జీవనం

పంచాయతీ రాజ్‍ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍ రావు స్వాతంత్య్రం పొంది 74వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పటికీ, గ్రామాల స్థితి ఇంకా సరిగ్గా లేదు. ఎక్కువగా శిధిలమైన ఇళ్ళు, పశువుల గడ్డిబీడులు, కలుపు మొక్కలు, పేడ, దోమలు, మురికి నీటి గుంటలు, నిర్లక్ష్యం చేయబడిన బోర్‍వెల్లు, పిచ్చి కుక్కలు, పందులు, కోతులు, వంగిన విద్యుత్‍ స్తంభాలు ఇదీ మన గ్రామీణ దృశ్యం. ఇది మన రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు. మొత్తం దేశంలోనే ఈ స్థితి ఉంది. …

కొత్త పంచాయతీ రాజ్‍ చట్టంతో గ్రామాలలో పునరుజ్జీవనం Read More »

దళితుల జీవన లయ ‘డప్పు’ (తప్పెట)

డప్పు ఒక వాయిద్యపరికరం. అది సామాన్య ప్రజల భావోద్వేగాలను ప్రస్ఫుటంగా ప్రకటించి, వారిలో చేతనను ప్రేరేపించే అద్భుత సాధనం. దీనిని కొన్ని ప్రాంతాలలో పలక అని కూడా అంటారు. డక్కి లాంటి ఆకారమె కలిగి వుంటుంది. కాని పెద్దది. రెండడుగులు వ్యాసం కలిగి వుంటుంది. దీనిని ఎక్కువగా చావు…. వంటి కార్యాలకు వాడుతారు. దండోరా వేయడానికి పల్లెల్లో దీనిని గతంలో ఎక్కువగా వాడేవారు. జంతువుల తోలుతో తయారు చేసిన వాయిద్య పరికరమైన డప్పులను కొడుతుంటే వచ్చే శబ్దం …

దళితుల జీవన లయ ‘డప్పు’ (తప్పెట) Read More »