Day: July 1, 2021

మన తెలంగాణ ఐటి సవాళ్ళు దాటి.. అభివృద్ధిలో మేటి

తెలంగాణ రాష్ట్ర ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్‍ రంజన్‍ లక్ష్యాలు చేరుకునేందుకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. సమస్యలూ పలకరిస్తాయి. అయితే వాటిని ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ప్రయాణం సాగిస్తేనే గమ్యస్థానం చేరుకోగలం. అభివృద్ధిపరంగా అయినా ఇదే సూత్రం. ఇది తూ.చ. తప్పకుండా పాటించింది కాబట్టే ఇప్పుడు తెలంగాణలో ఐటి, పరిశ్రమలు వృద్ధిరేటు ఆశాజనకంగా నమోదవుతుంది. కోవిడ్‍తో వివిధ రాష్ట్రాల ఆదాయాలు తలకిందులు అవుతున్న ఈ కష్టకాలంలో కూడా తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతుంది. ఒకటి రెండు అని …

మన తెలంగాణ ఐటి సవాళ్ళు దాటి.. అభివృద్ధిలో మేటి Read More »

కనుమరుగవుతున్న చర్మకారులవృత్తి

చర్మసంబంధ వస్తువులు తయారు చేయువారిని చర్మకారులు అంటారు. ఈ వృత్తిని ఎక్కువగా మాదిగ కులానికి చెందినవారు చేస్తుంటారు. వ్యవసాయం, పాడిపంటలు, పశుసంపదతో విలసిల్లిన గ్రామీణ భారతం మనది. వీరిది గ్రామీణ జీవితంతో విడదీయలేని బంధం. రాంనారాయణ్‍రావత్‍ చర్మకారుల కులం చెప్పులవంటి జంతుసంబంధ వస్తువుల అవసరం పెరిగినప్పటి నుంచి ఆవిర్భవించినదనీ, అంతకుముందు వీరు కర్షకులే అని అంటారు. మాదిగవారు ప్రధానంగా తెలంగాణ, ఆంధప్రదేశ్‍, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‍గడ్‍, గుజరాత్‍, మధ్యప్రదేశ్‍ వంటి వివిధ రాష్ట్రాలలో జీవిస్తున్నారు. …

కనుమరుగవుతున్న చర్మకారులవృత్తి Read More »

అపరిమిత జనాభా వల్ల తగ్గుతున్న వనరులు

పెరుగుట విరుగుట కొరకే!జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం గత 30ఏళ్లుగా మనం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో జనాభా ఏడాదేడాదికి పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో జనాభా పెరుగుదల వలన జరిగే పరిణామాలపై చర్చించుకునేందుకు 1989లో ఐక్యరాజ్యసమితి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1987 జూన్‍ 11న ప్రపంచ జనాభా 500కోట్లు దాటగా.. దానిపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని …

అపరిమిత జనాభా వల్ల తగ్గుతున్న వనరులు Read More »

ఏది న్యాయం? ఏది అన్యాయం?

‘‘త్వరగా మాట్లాడకండిచక్రం ఇంకా తిరుగుతూనే వుందిఏదీ చెప్పలేంఏం పేరు పెట్టాలో తెలియదుఇప్పుడు ఓటమి చెందిన వ్యక్తులుఆ తరువాత విజేతలు కావొచ్చుఅలా కావడంమారుతున్న సమయాలకు కారణం’’ ‘ది టైమ్స్ దే ఆర్‍ ఎ-చేంజిన్‍’ అన్న కవితలోని చరణాలు. తొందరగా ఓ నిర్ణయానికి వచ్చి తుపాకులని గురిపెట్టకండి అంటూ నోబెల్‍ బహుమతి గ్రహీత బాబ్‍ డిలాన్‍ రాసిన కవితలోని చరణాలు అవి.బాబ్‍డిలాన్‍ ఓ ప్రముఖ గాయకుడు. అతను పాటలు కూడా రచిస్తాడు. ఆయనని 2016లో సాహిత్యానికి గానూ నోబెల్‍ బహుమతికి …

ఏది న్యాయం? ఏది అన్యాయం? Read More »

భూపరిమాణ శాస్త్రం – సర్వేల విధానం!(Geodesy – Method of Surveys)

ప్రకృతే నియంత్రిస్తుంది 11 ప్రకృతే శాసిస్తుంది!! ప్రకృతి దృగ్విషయాలు వింతగాను, ఆలోచించేవిగాను వుంటాయి. నేల, సముద్రం, ఆకాశం, కొండలు, పర్వతాలు ఎన్నో ప్రశ్నల్ని రేకెత్తిస్తాయి. తమలోతుల్ని చూడమంటాయి. ఓ ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి గల దూరం, ఒక దేశం నుంచి మరో దేశానికి గల భూ, సముద్ర, ఆకాశ మార్గాల దూరాలు వేర్వేరుగా వుంటాయి. వీటి ప్రయాణ దూరాన్ని గంటల్లో కొలుస్తాం. అధిరోహించలేని పర్వతాల ఎత్తుల్ని, దాటలేని నదుల వెడల్పును, ఈదలేని సముద్రాల లోతుల్ని, వైశాల్యాల్ని …

భూపరిమాణ శాస్త్రం – సర్వేల విధానం!(Geodesy – Method of Surveys) Read More »

కందూరి మల్లికార్జునచోడుని అవురవాణి (అవిరువాణ్డి) శాసనం

కందూరుచోడులు క్రీ.శ.1060 నుంచి 1160 వరకు అంటే వందేండ్లు మహబూబ్‍ నగర్‍ జిల్లా జడ్చర్ల, అచ్చంపేట ప్రాంతాలు, నల్లగొండ జిల్లాలోని నల్గొండ, మిర్యాలగూడ ప్రాంతాలతోకూడిన కందూరునాడును పరిపాలించేవారు. కోడూరు, పానగల్లులు వీరి రాజధానులుగా వుండేవి. కందూరిచోడుల వంశానికి మూలమైన వారిని గురించి ఒల్లాల శాసనం (ఎపిగ్రాఫియా ఆంధ్రికా, శా.సం.8, పే.55 -పీవీపిశాస్త్రి పరిష్కర్త) వల్ల తెలుస్తున్నది. ఎక్కడో ఒఱయూరుకు చెందిన ప్రధాన చోడరాజుల శాఖ ఏఱువప్రాంతాన్ని ఏలింది. ఏఱువప్రాంతం కృష్ణానదికి రెండువైపుల వ్యాపించివుండేదని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. …

కందూరి మల్లికార్జునచోడుని అవురవాణి (అవిరువాణ్డి) శాసనం Read More »

జీవాల్ని పోషించే పద్ధతులు

జీవాల పెంపకందార్లు మన రాష్ట్రంలో గొర్రెలు, మేకల్ని మూడు రకాల పద్ధతుల్లో పెంచుతున్నారు. ఆ పద్ధతులు, వాటిని ఆచరించడంవల్ల ఒనగూరే లాభాలు, నష్టాల గురించి వివరంగా తెల్సుకుందాం. ఎ) విస్తృత పద్ధతి: మన రాష్ట్రంలో 90% జీవాల్ని 6-8 గంటలపాటు బయట మేతకై తిప్పుతూ, రాత్రికళ్లా ఇంటిదగ్గర లేదా ఊరిచివర పొలాల్లో నిలిపిఉంచుతారు. పగలంత బయళ్లలో, అడవుల్లో, యజమాని స్వయంగా జీవాల్ని మేపుతుంటారు. దీనినే ‘‘విస్తృత పద్ధతి లేదా సాంప్రదాయ పద్ధతి’’ అని వ్యవహరిస్తారు. ఈ విధానంలో …

జీవాల్ని పోషించే పద్ధతులు Read More »

తీర్పు

‘‘ఈ తగువులు నేను తీర్చలేను’’ అంటూ విసుగ్గా బరువైన పదార్థమేదో విసిరేసి లోపలికి వెళ్లిపోయింది సుందరరామయ్య భార్య. అది తిన్నగా వచ్చి సుందరరామయ్య వొడిలో పడింది.అదేమిటా అని కుతూహలంగా చూశాడు సుందరరామయ్య. అందమైన అట్టలు అయిదు కనిపించాయి. అవి పిల్లల పరీక్షల్లో వాడుకునే రైటింగ్‍ పేడ్స్. అందులో నాలుగు అట్టలు ఒకే తీరుగాఉన్నాయి. ఒక అట్ట మాత్రం తక్కిన నాలుగింటి కంటె పెద్దది. దాని మీద వేసిన కాగితం అందమైనదీ ఖరీదైనదీ పైగా దానికి కాలికోతో చేసిన …

తీర్పు Read More »