Day: August 1, 2021

రిప్‍ వాన్‍ వింకిల్‍

సాహిత్యంతో సంబంధంలేని వ్యక్తులూ, సంస్థలూ తక్కువ. రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు సాహిత్యాన్ని తక్కువగా చదువుతూ వుండవచ్చు. కానీ పబ్లిక్‍ మీటింగ్‍ల్లో ఏదో ఓ కథని కవిత్వాన్నో ఉదహరించని నాయకులు అరుదు. అదే విధంగా న్యాయమూర్తులు కూడా అప్పుడప్పుడూ కవిత్వాన్నో, కథనో తమ తీర్పుల్లో ఉదహరిస్తూ వుంటారు. ఈ మధ్యన గంగా సహాయ్‍ వర్సెస్‍ డిప్యూటీ డైరెక్టర్‍ ఆఫ్‍ కన్సాలిడేషన్‍, తీర్పు తేదీ 18 మార్చి 2021 కేసులో అలహాబాద్‍ హైకోర్టు రిప్‍ వాన్‍ వింకిల్‍ని ఉదహరించింది. …

రిప్‍ వాన్‍ వింకిల్‍ Read More »

నిప్పుల కొలిమే.. జీవనాధారం

ఊరుమ్మడి కొలిమి మాయమయ్యింది. దున్నెటోడు లేడు. నాగలి చెక్కెటోడు లేడు. కర్రు కాల్చుడు పనే లేదు. కొలిమి కొట్టం పాడువడి, అండ్ల దొరవారి గాడ్దులను కట్టెయ్యడం మొదలైంది. ఊళ్ళ రాతెండి పాత్రలు కొనే శక్తి ఎవ్వరికి లేక కంచరోల్ల కొలిమి బూడిదైపోయింది. తిననీకి తిండె లేదంటె బంగారి ఎండి సొమ్ములు చేసుకునేదెవ్వరు? ఔసులోల్ల కొలిమి కూడ కూలిపోయింది. ఒక్కటి గుడ లేకుండ ఊళ్ల ఉన్న కొలుములన్ని ఆరిపోయినయి. ఊళ్ల నిప్పు బుట్టని పాడుకాలమొచ్చింది. ఊరుమ్మడి కొలుములైతే కనబడకుండ …

నిప్పుల కొలిమే.. జీవనాధారం Read More »

కొడవటిగంటి సైన్స్ రచనా ప్రణాళిక

కొడవటిగంటి కుటుంబరావు అనగానే మనకు కథ గుర్తుకు వస్తుంది. కానీ అదే రీతిలో ఆయన పేరు చెప్పగానే ఆయన చేసిన సినిమా సమీక్షలు గుర్తుకు రాకపోవచ్చు. ఆయన నెరపిన సంపాదకత్వం మన మదిలో మెదలకపోవచ్చు. సృజించిన బాలసాహిత్యం స్ఫురించక పోవచ్చు. సైన్స్ వ్యాసాలు రాసిన కుటుంబరావు తర్వాత ఆ స్థాయిలో సినిమా గురించి వేరెవరూ రాయలేదంటే ఆశ్చర్యం లేదు. సచిత్ర వారపత్రికలకు ఆయన డెబ్భైయ్యేళ్ళ క్రిందట ఏర్పరచిన చట్రం స్థూలంగా నేటికీ ఉందంటే అవాస్తవం కాబోదు. మూడు …

కొడవటిగంటి సైన్స్ రచనా ప్రణాళిక Read More »

గణపురం గుళ్ళ నిర్మాత పసాయిత గణపతిరెడ్డి

మధ్యయుగాలలో ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయరాజ్యం 10వ శతాబ్దంలో మొదలై 14వ శతాబ్దంలో ముగిసి పోయింది. మొత్తం తెలుగువారిని ఒక్కత్రాటికి తెచ్చి పాలించిన సాతవాహనుల తర్వాత కాకతీయులు రెండవవారు. కాకతీయులు తమను ‘పరమాంధ్ర వసుంధర’ పాలకులుగా శాసనాలలో పేర్కొన్నారు. (కూసుమంచి కొత్తశాసనం) వెన్నుడు (వెన్నరాజు)తో మొదలైన కాకతీయరాజవంశం 2వ ప్రతాపరుద్రునితో ముగిసిపోయింది. (బయ్యారం శాసనం) బస్తర్లో పాలకులుగా వున్నవారిని మలికాకతీయులని చెప్పడానికి ఒకే శాసనం ఆధారంగా వుంది. మలికాకతీయుల చరిత్ర పరిశోధించాల్సిన అవసరం వుంది. కాకతీయులకు ఆ పేరు …

గణపురం గుళ్ళ నిర్మాత పసాయిత గణపతిరెడ్డి Read More »

భూపరిమాణ శాస్త్రం – సర్వేల విధానం! (Geodesy – Method of Surveys)

ప్రకృతే నియంత్రిస్తుంది! 11 ప్రకృతే శాసిస్తుంది!! (గత సంచిక తరువాయి) జార్జి ఎవరెస్టు యుగం :విశ్రాంతి నుంచి 1822 అక్టోబర్‍లో తిరిగి వచ్చిన ఎవరెస్టు అకోలా కేంద్రంగా పడమరన గల పూణే నుంచి బొంబాయికి సర్వే చేపట్టాడు. ఈ బొంబాయి సర్వేను ఎవరెస్టు అవమానంగా భావించాడు. నిజానికి ఉత్తరాది మహాచాపం ఎవరెస్టు చేయాలని అనుకుంటే, దాన్ని డి.పెన్నింగ్‍కు అప్పజెప్పారు. ఇంతలోనే లాంబ్టన్‍ మరణించడంతో మహాచాపం బాధ్యతతో పాటు, మిగతా సర్వేలకు అధిపతి అయ్యాడు. ఇలా 1823 మార్చిలో …

భూపరిమాణ శాస్త్రం – సర్వేల విధానం! (Geodesy – Method of Surveys) Read More »

జీవాల్ని పోషించే పద్ధతులు

వాణిజ్య పరంగా జీవాల్ని పెంచే విధానాలుగొర్రెలు, మేకల ఫారాలు పెంపకం ప్రారంభించేముందు, వాటిని పెంచే విధానాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.సాధారణంగా జీవాల పెంపకంలో ఎ. బ్రీడింగ్‍ ఫారాలు, బి. పొట్టేలు పిల్లల పెంపక ఫారాలు, సి. పునరుత్పత్తిక్తి ఉపయోగపడే పొట్టేళ్ళ పెంపక ఫారాలు. ప్రారంభించడానికి వీలుగా ఉంటుంది. వాటి వివరాలు.. ఎ. బ్రీడింగ్‍ (పునరుత్పత్తి) ఫారాలు :పునరుత్పత్తి కోసం ఉపయోగపడే, సంవత్సరం వయస్సు పైబడిన గొర్రెలు లేదా మేకల్ని ఫారాల్లో ఫౌండేషన్‍ స్టాకులాగా కొని, …

జీవాల్ని పోషించే పద్ధతులు Read More »

మార్పిడి

తెల్లారితే రంగుల పండగ. ఆ ఊరి పిల్లలంతా ఊరి మధ్యలో వేప చెట్టు కింద కూర్చుని ఉన్నారు. కొందరి మొహాలకి రంగులు పూసి ఉన్నాయి.చెట్టా పట్టాలేసుకొని వస్తున్న రమణ, సాదిక్‍లు వారికి కనిపించారు. ఇద్దరూ కొత్త చొక్కాలు వేసుకొన్నారు. ఇద్దరి చొక్కాలు అచ్చు ఒకేలాగా ఉన్నాయి. వాటిని చూసిన వాళ్లెవరయినా సరే, ఒక చొక్కాలోంచి ఇంకో చొక్కా వచ్చిందని అనుకొంటారు. వాళ్ళ ఇళ్ళు కూడా ఎదురు బదురుగా ఉన్నాయి. రమణ తండ్రి, సాదిక్‍ తండ్రి ఇద్దరూ సన్నకారు …

మార్పిడి Read More »