Day: September 1, 2021

ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు నడుం కట్టిన రాష్ట్ర ప్రభుత్వం

ఏ దేశ సుస్థిర ఆర్థిక వ్యవస్థకైనా ఆయా దేశాల్లోని ప్రభుత్వరంగ సంస్థలు దోహదం చేస్తాయి. డిమాండ్‍కు తగ్గ ఉత్పత్తి, తక్కువ ధరలకు ప్రజలందరికీ అందుబాటులో ఉండటం, వచ్చే ఆదాయం ఆయా దేశాల ప్రజల ప్రయోజనాలకు వినియోగించడం, మిగులు ఆదాయాన్ని మళ్లీ అదే సంస్థలకు పెట్టుబడిగా మార్చడం వల్ల ఒకే సమయంలో ప్రజలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు భరోసా ఏర్పడుతుంది. విదేశీ సంస్థలకు, స్వదేశీ ప్రైవేట్‍ సంస్థలకు ప్రభుత్వాలు, ప్రజలు పరాధీనత చెందకుండా నివారిస్తాయి. అటువంటి ప్రభుత్వరంగ సంస్థల …

ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు నడుం కట్టిన రాష్ట్ర ప్రభుత్వం Read More »

బొమ్మ హేమాదేవి

తెలంగాణ మలితరం రచయిత్రులలో బొమ్మ హేమాదేవి ఒకరు. మొట్ట మొదటి బహుజన రచయిత్రి. 1960-1980 మధ్యకాలంలో మహిళల నుండి సాహిత్యం వెల్లువయింది. చదువుకునే వారి సంఖ్య పెరగడంతోపాటే రాసేవారి సంఖ్యా పెరిగింది. జీవితానుభవాలు, సంఘటనల నుండి కథలు, నవలలుగా మలిచారు మహిళలు. అందులో ఒకరు బొమ్మ హేమాదేవి. ఆమె అసలు పేరు రుక్ష్మిణీదేవితోపాటు యమున అనే పేరు కూడా ఉంది. రాయడం ఆరంభం చేసినప్పుడు ‘దేవీరమ’ అని ఇంకో పేరు పెట్టుకున్నారు. ఆ పేరుతో 20 నవలలు, …

బొమ్మ హేమాదేవి Read More »

ఆకాశంలో విరిసిన అందాల పుష్పం ‘ఫలక్‍ నుమా ప్యాలెస్‍’

రాజుల సొమ్ము రాళ్ల పాలు’’ అయితే కావొచ్చు గాక నష్టమేముంది? ఒక తాజ్‍మహల్‍, ఒక కోణార్క, ఒక హంపీ, ఒక రామప్ప మనకు దక్కింది కదా!ఆ వరుసలోనే హైద్రాబాదీలకు దక్కింది ఫలక్‍నుమా ప్యాలెస్‍. చార్మినార్‍ నుండి చాంద్రాయణగుట్టకు సీదాగా ప్రయాణిస్తుంటే ఒక మలుపులో కుడి వైపు గుట్టమీద వెలసిన పాలరాతి వెన్నెల భవనమే ఫలక్‍నుమా. ఉర్దూలో ఫలక్‍ అంటే ఆకాశం, నుమా అంటే ప్రతిబింబం. ఆ అందమైన భవనం గురించి అందంగా చెప్పాలంటే ‘‘ఆకాశ హర్శ్యం’’ అన్నమాట.అందమైన, …

ఆకాశంలో విరిసిన అందాల పుష్పం ‘ఫలక్‍ నుమా ప్యాలెస్‍’ Read More »

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-13 మహేశ్వరభటారల ప్రాగటూరు తెలుగు శాసనం (క్రీ.శ.859)

ఈసారి ప్రాగటూరులో నేను 1978 జులై 3వ తేదీన చూచిన శివాలయం ముందు నంది మండపం ఒక స్థంభంపైన గల శాసనంపైన రాయాలను కొన్నాను. ఎందుకంటే నేను, మొట్ట మొదటిసారిగా, ఒక శాసనాన్ని దగ్గర్నించి చూచింది ఆ శాసనమే. అక్షరాలు కనిపిస్తున్నాయి గానీ, ఇప్పటి తెలుగు కాదు గాబట్టి, కన్నడ శాసన మనుకొన్నాను. శాసనంలోని ఒక్కో పంక్తిని, పంక్తిలోని ప్రతి అక్షరాన్నీ చేతితో తడిమినపుడు ఏదో తెలియని వింత అనుభూతిని పొందాను. మళ్లీ నలభై మూడేళ్ళ తరువాత, …

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-13 మహేశ్వరభటారల ప్రాగటూరు తెలుగు శాసనం (క్రీ.శ.859) Read More »

150 మందిని కాపాడిన చింతచెట్టుకింద ఎఫ్‍బిహెచ్‍ స్మారక సమావేశం

ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ సెప్టెంబర్‍ మాసంలో డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ మరియు ఇతర స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో కార్యక్రమం మూసీనది ప్రక్షాళనతోనే హైదరాబాద్‍కు కొత్తకళ వస్తుందని, మూసీనది పరిరక్షణకు ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ చైర్మన్‍ మణికొండ వేదకుమార్‍ పేర్కొన్నారు. ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ ఆధ్వర్యంలో సెంటర్‍ ఫర్‍ దక్కన్‍ స్టడీస్‍, దక్కన్‍ హెరిటేజ్‍ ట్రస్ట్, దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ, ఇతర స్వచ్ఛంద …

150 మందిని కాపాడిన చింతచెట్టుకింద ఎఫ్‍బిహెచ్‍ స్మారక సమావేశం Read More »

ప్రపంచ పర్యావరణం – ప్రజల భాగస్వామ్యం

(ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఫోరమ్‍ ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ 2021 జూన్‍ 5న ఎకో సిస్టమ్‍ రిస్టొరేషన్‍ అనే అంశంపై జూమ్‍ మీటింగ్‍ ద్వారా ప్యానెల్‍ డిస్కషన్‍ నిర్వహించింది. ఈ సందర్భంగా, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్‍ పొందిన అదర్‍ సిన్హా చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం సమావేశమయ్యాం. హైదరాబాద్‍ మెరుగుదల కృషిలో 21 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు ముందుగా ఫోరమ్‍ ఫర్‍ బెటర్‍ హైదరాబాద్‍కు …

ప్రపంచ పర్యావరణం – ప్రజల భాగస్వామ్యం Read More »

‘భెల్‍’కు తెలంగాణ ప్రభుత్వం బాసట

బీహెచ్‍ఈఎల్‍ ప్రైవేట్‍పరం కాకుండా భారీ కాంట్రాక్టుతో అడ్డుకట్టపట్టుబట్టి నవరత్నానికి మెరుగులద్దిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కేంద్రం ఆధీనంలో ప్రస్తుతానికి 300 ప్రభుత్వరంగ కంపెనీలు ఉన్నాయి. ఆ సంఖ్యను 24కు కుదించుకోవాలని మోడీ సర్కార్‍ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. నీతి ఆయోగ్‍ సిఫారసులను ప్రాతిపదికగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ పక్రియను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వేగవంతం చేయనున్నట్లు విశ్లేషకుల అంచనా. రూ.1.75 లక్షల కోట్లు..వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2021-22లో ప్రభుత్వ రంగ కంపెనీల్లో …

‘భెల్‍’కు తెలంగాణ ప్రభుత్వం బాసట Read More »

నదులే మనకు ప్రాథమిక వనరులు

ప్రపంచ నదుల దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్‍ చివరి ఆదివారం జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబర్‍ 26న వస్తుంది. ప్రపంచ నదుల దినోత్సవం ప్రజల అవగాహన పెంచడానికి, ప్రపంచవ్యాప్తంగా అన్ని నదుల మెరుగైన నిర్వహణను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుంది. ప్రపంచ నదుల దినోత్సవం ప్రపంచంలోని జలమార్గాలను జరుపుకోవడం, నదుల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ముఖ్యమైన, అందమైన నదులను సంరక్షించడానికి ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రోత్సహించడం ఈ దినోత్సవం లక్ష్యం. ప్రపంచ నదుల దినోత్సవం చరిత్ర ఏమిటి?ఐక్యరాజ్యసమితి (UN) 2005లో వాటర్‍ …

నదులే మనకు ప్రాథమిక వనరులు Read More »

పిట్టకొంచెం-కూత ఘనం @ డ్రోన్‍ టెక్నాలజీ

గత జూన్‍లో జమ్మూకాశ్మీర్‍లోని భారత వైమానిక స్థావరంపై తొలిసారిగా డ్రోన్లతో దాడి జరిగింది. వైమానిక స్థావరంలోని, యుద్ధవిమానాలే లక్ష్యంగా రెండు డ్రోన్లు ప్రేలుడు పదార్థాల (ఐఈడీ)ను జారవిడిచాయి. అయితే స్వల్ప నష్టం మినహా, యుద్ధవిమానాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. గతంలో చాటుగా సైన్యంపై కాల్పులు, ఆత్మాహుతి దాడులు, మందుపాతర్లను పేల్చడం లాంటి సంఘటనలు జమ్మూకాశ్మీర్‍లో జరిగాయి కానీ, డ్రోన్లతో దాడి జరగడం ఇదే తొలిసారని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. అధిక ఖర్చు, ఎక్కువ ఎత్తులో ఎగిరే యుద్ధ …

పిట్టకొంచెం-కూత ఘనం @ డ్రోన్‍ టెక్నాలజీ Read More »

దళితజాతికి దారిదీపం

దళితజాతికి దారిదీపంఐరాస లక్ష్యం, కేసీఆర్‍ ఆచరణ శ్రీ దేశం ముంగిట దళిత ఎ‘జెండా’శ్రీ ఏడాది కిందే దళిత బంధు.. కరోనా వచ్చినందుకే లేటు: కేసీఆర్‍ఏడాది కిందే దళిత బంధుకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి కేసీఆర్‍ అన్నారు. హుజురాబాద్‍ నియోజకవర్గంలోని శాలపల్లి బహిరంగ సభలో దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. కరోనా నేపథ్యంలో దళిత బంధు ఆలస్యం అయిందని చెప్పారు. ప్రతిపక్షాలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నాయని.. అర్థం పర్థం లేని మాటలు మంచిది…