జంట నగరాల్లోని రక్షిత స్మారక చిహ్నాల పరిరక్షణకు తెలంగాణ రాష్ట్ర హరిటేజ్‍ అథారిటీ సమావేశం


బి.ఆర్‍.కె.ఆర్‍ భవన్‍లో తెలంగాణ రాష్ట్ర హెరిటేజ్‍ అథారిటీ (రాష్ట్ర స్థాయి) మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‍ కుమార్‍ అధ్యక్షత వహించారు. జంట నగరాల్లోని 26 రక్షిత స్మారక చిహ్నాలు (Protected Monuments), కుతుబ్‍ షాహీ సమాధులు మరియు గోల్కొండ కోటకు సంబంధించిన హెరిటేజ్‍ సమస్యలపై కమిటీ చర్చించింది. రక్షిత స్మారక చిహ్నాలపై సంక్షిప్త స్టేటస్‍ నోట్‍ ఫోటోలతో సహాతయారు చేయాలని, తదుపరి చర్యల నిమిత్తం తనిఖీ నివేదికను సమర్పిం చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. Greater Hyderabad Heritage and Precincts Committee ముందు కుతుబ్‍ షాహీ టూంబ్స్ కోసం బఫర్‍ జోన్‍పై రూపొందించిన డ్రాఫ్ట్ మార్గదర్శకాలను సమర్పించాలని కమిటీ కోరింది.


ములుగు జిల్లాలోని పాలంపేట గ్రామంలోని కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) దేవాలయ అభివృద్ధి కోసం integrated Conservation and Management Planసమర్పించాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్‍ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‍ కుమార్‍, విద్యాశాఖ కార్యదర్శి సందీప్‍ కుమార్‍ సుల్తానియా, జి.హెచ్‍.యం.సి కమీషనర్‍ లోకేశ్‍ కుమార్‍, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి కె.ఎస్‍.శ్రీనివాస రాజు, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్‍ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‍ అమయ్‍ కుమార్‍, ములుగు జిల్లా కలెక్టర్‍ కృష్ణ ఆదిత్య, కులీ కుతుబ్‍ షాహి అర్బన్‍ డెవలప్‍మెంట్‍ అథారిటీ ప్రత్యేక అధికారి సంతోష్‍, టీఎస్‍టీడీసి మేనేజింగ్‍ డైరెక్టర్‍ మనోహర్‍, జీహెచ్‍ఎంసీ చీఫ్‍ సిటీ ప్లానర్‍ దేవేందర్‍ రెడ్డి, పురావస్తు విభాగం అధికారి స్మిత మరియు ఇతర
ఉన్నతాధికారులు పాల్గొన్నారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *