150 మందిని కాపాడిన చింతచెట్టుకింద ఎఫ్‍బిహెచ్‍ స్మారక సమావేశం

  • ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍
  • సెప్టెంబర్‍ మాసంలో డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ మరియు ఇతర స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో కార్యక్రమం

మూసీనది ప్రక్షాళనతోనే హైదరాబాద్‍కు కొత్తకళ వస్తుందని, మూసీనది పరిరక్షణకు ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ చైర్మన్‍ మణికొండ వేదకుమార్‍ పేర్కొన్నారు. ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ ఆధ్వర్యంలో సెంటర్‍ ఫర్‍ దక్కన్‍ స్టడీస్‍, దక్కన్‍ హెరిటేజ్‍ ట్రస్ట్, దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ, ఇతర స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో సెప్టెంబర్‍ మాసంలో చింతచెట్టుకింద సమావేశం నిర్వహించనుంది.


1908లో మూసీనదిలో భారీగా వరదలు వచ్చి సుమారు 15 వేలమంది చనిపోవడం బాధాకరమైన విషయం. హైదరాబాద్‍కు వరదలు వచ్చి 113 సంవత్సరాలు అవుతుంది. వారి జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం మూసీనది ఫ్రంట్‍ వాక్‍ నిర్వహిస్తున్నారు. మళ్లీ హైదరాబాద్‍కు ఎలాంటి ప్రమాదం రాకుండా, జనాభా పెరిగినా ఇబ్బంది లేకుండా పట్టణ ప్రణాళికలు ఉండాలని కోరుతున్నారు. నిజాంలు వంద సంవత్సరాల పాటు హైదరాబాద్‍కు తాగునీరుకు ఇబ్బంది లేకుండా తీర్చిదిద్దిన విధంగా నేడు డ్రైనేజీకి ప్రణాళికలు చేపట్టాలని కోరుతున్నారు. గత 60 సంవత్సరాల నుండి అనేక ప్రభుత్వాలు మూసీనదిని శుద్ధి చేస్తామని అనేక ప్రకటనలు చేశాయని, కానీ ఆచరణలో విఫలమైనట్లు పేర్కొంటున్నారు. మూసీనది ప్రక్షాళన జరగకపోతే భావితరాలు నష్టపోతాయని, ఒకప్పుడు మూసీనది మంచినీరుకు ప్రసిద్ధి గాంచిందని, నేడు మురికినీరుకు కేంద్ర బిందువుగా ఉండటం చాలా బాధాకరం. ఆసఫ్‍జాహీలు మూసీని అన్ని విధాలుగా శుద్ధిచేసి హైదరాబాద్‍లో అండర్‍గ్రౌండ్‍ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చిందన్నారు. అనంతర కాలంలో హైదరాబాద్‍ జనాభా పెరగడం, మురికినీరు సైతం మూసీలోకి వచ్చి చేరుతుందన్నారు. హైదరాబాద్‍ డ్రైనేజీ (మురికి నీరు మరియు వర్షం నీరు) వ్యవస్థ అభివృద్ధికి ప్రణాళికా బద్ధంగా మాస్టర్‍ప్లాన్‍ తయారు చేసుకొని దాన్ని అమలు చేసినప్పుడే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మూసీ రివర్‍ ఫ్రంట్‍ డెవలప్‍మెంట్‍ కార్పొరేషన్‍ ఏర్పాటు చేయడం గర్వకారణం అన్నారు. పట్టణ ప్రజలు ఈ ప్రాజెక్టులో భారీ ఎత్తున భాగ స్వామ్యం కావాలన్నారు. భవిష్యత్‍లో పట్టణం నడిబొడ్డు నుండి పారుతున్న నది ప్రక్షాళన దేశంలోనే ఒక మోడల్‍గా నిలుస్తుందన్నారు.

  • శోభాసింగ్‍,
    ఎ : 93470 78585

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *