Day: October 1, 2021

‘ఆరోగ్యదాయ నగరం’ భావన పట్టణ ప్రణాళికారచనలో కీలకం..

ఎప్పటికప్పుడు మానవాళిని విపత్తులు చట్టుముడుతూనే వుంటాయి. వాటిని ఎదుర్కోవడానికి మార్గాలు అన్వేషించడమూ, నివారించుకోవడమూ అంతే సహజం. ఇప్పుడు కరోనా అనే మహమ్మారినే కాక తద్వారా ఏర్పడిన అనేక ఒత్తిళ్లను తట్టుకొని నిలబడాల్సి వస్తుంది. వీటిని అధిగమించడానికి దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం. ఈ విపత్తులకూ, అమలు చేస్తున్న, చేయబోతున్న ప్రణాళికలకు విడదీయరాని సంబంధం ఉంటుంది. ముఖ్యంగా నగరాలు, పట్టణాల సురక్షితకు అర్బన్‍ ప్లానింగ్‍ సిస్టమ్‍ అత్యంత కీలకం. నగరాలలో, పట్టణాలలో రోజురోజుకీ జనసాంద్రత పెరుగుతుంది. 2060నాటికి 66 శాతం …

‘ఆరోగ్యదాయ నగరం’ భావన పట్టణ ప్రణాళికారచనలో కీలకం.. Read More »

చిందుల ఎల్లమ్మ

శ్రమ నుంచి పుట్టిన ఏ కళారూపమైనా మట్టి పరిమళాలు వెదజల్లుతుంది. అణచివేతకు గురైన సామాజిక వర్గాల జీవితాల నుంచి జనించే కళారూపాలేవైనా శ్రమను మరిపించేలా చేస్తాయి. ఇలాంటి కళారూపాలు ఎన్ని ఒడిదుడుకుల సునామీలొచ్చినా తట్టుకుని నిలబడతాయి. పునాదిలో మార్పు రానంతకాలం, శ్రమజీవుల జీవితాల్లో వెలుగులు పరుచుకోనంత కాలం అలాంటి కళలు సజీవంగానే ఉంటాయి. అలా సజీవంగా ఉన్న కళారూపాల్లో ‘చిందు భాగవతం’ కూడా ఒకటి.ఇన్ని సంవత్సరాలుగా ఒక కళారూపం స్థిరపడటాన్ని చూస్తే అది సామాజిక, సాంస్కృతిక జీవితంలో …

చిందుల ఎల్లమ్మ Read More »

‘బెస్ట్ టూరిజం విలేజ్‍’ కాంటెస్ట్ పోటీలో భూదాన్‍ పోచంపల్లి

పోచంపల్లి.. మన దేశానికి స్వాతంత్య్రం అనంతరం భూములు దానాలు చేయడం వల్ల భూదాన్‍ పోచంపల్లిగా మారింది. స్వాతంత్య్రం రాకముందు అరబ్‍ దేశాలకు గాజులు పంపడంవల్ల ‘గాజుల పోచంపల్లి’గా పేరు వచ్చింది. పోచంపల్లి చీరలతో ప్రపంచం మొత్తం గుర్తింపు పొందింది. ఎక్కడెక్కడ నుంచో జనాలు ఇక్కడికి వచ్చి చీరలు కొంటారు. ఇప్పుడు యునైటెడ్‍ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్‍ (UWTA) కాంటెస్ట్కు నామినేట్‍ అయింది మన పోచంపల్లి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‍కు సుమూరు 42 కిలోమీటర్ల దూరంలో ఉంది …

‘బెస్ట్ టూరిజం విలేజ్‍’ కాంటెస్ట్ పోటీలో భూదాన్‍ పోచంపల్లి Read More »

తారే జమీన్‍ పర్‍ ‘ఇరామ్‍ మంజిల్‍’

చదివేస్తే ఉన్నమతి పోయి, కాకరకాయను కీకరకాయ అన్నట్లు మనం మన వీధులు, బస్తీల పేర్లన్నింటినీ అపసవ్యానికి, అపభ్రంశానికి గురి చేసాం. అందుకే నేక్‍నాం పల్లె నాంపల్లి అయ్యింది. నేక్‍ నాం ఖాన్‍ కుతుబ్‍షాహీల కాలంలో ఒక ఉన్నతాధికారి. అతను నివసించిన ప్రాంతమే నేక్‍నాంపురా లేదా నేక్‍నాంపల్లె. చివరికి మనం ఆధునిక కాలంలో నేక్‍ను ఎగరగొట్టి నాంపల్లెను నాంపల్లిని చేసాం. ఉన్న పేర్లను చెడగొట్టటంలో ఘనులం మనం. మూన్సే రేమండ్‍ బాగ్‍ను ముసారాంబాగ్‍ అన్నాం. తోపులబట్టీని లేదా తోప్‍కాసాంచాను …

తారే జమీన్‍ పర్‍ ‘ఇరామ్‍ మంజిల్‍’ Read More »

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-14

కళ్యాణచాళుక్య యువరాజు మూడోతైలపుని జడ్చర్ల జినశాసనం (క్రీ.శ.1127) జడ్చర్ల. అదొక కూడలి. హైదరాబాదు, రాయచూరు, కర్నూలు, శ్రీశైలం, కొల్లాపూర్‍ ఇలా ఎన్నో ఊళ్లకు వెళ్లే మార్గాల కూడలి. అంతేకాదు. అటు శైవ, వైష్ణవ, జైన మతాల కూడలి కూడ ప్రక్కనే ఉన్న గంగాపురంలో మతాల మధ్య సామరస్యాన్ని నింపిన పంచాయతన దేవాలయం, జైనతీర్థంకరునికి ఆచ్ఛాదన కల్పించిన ఇటుకరాతి జైన దేవాలయం, తొలిమధ్య, చాళుక్య, రాష్ట్ర కూటకాలపు శైవ-వైష్ణవ -శాక్త స్థావరం మీనాంబరం, కందూరిచోళుల తొలి, మలి రాజధానులైన …

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-14 Read More »

పిట్టకొంచెం-కూత ఘనం @ డ్రోన్‍ టెక్నాలజీ

(గత సంచిక తరువాయి) డ్రోన్లు ఎలా పనిచేస్తాయిసాధారణంగా ఒకటి లేదా రెండు రెక్కలు కలిగిన హెలికాప్టర్స్ మరియు విమానాలు సుదూరంగా గాలిలో ఎగరడం మనం చూసే ఉంటాం. కానీ నాలుగు రోటర్లు కలిగిన డ్రోన్లు మనకు అత్యంత సమీపంలో, కంటికి కనిపించేంత ఎత్తులో ఎగరడం చూస్తే మనకు చాలా ఆశ్చర్యంగానూ, గమ్మత్తుగానూ అనిపిస్తుంది. అలాంటి డ్రోన్లు ఎలా పనిచేస్తాయన్న విషయాన్ని పరిశీలిస్తే – ప్రస్తుతం మనం నిజజీవితంలో ఉపయోగించే ప్రతీ యంత్రం పనితీరు వెనుక ఏదో ఒక …

పిట్టకొంచెం-కూత ఘనం @ డ్రోన్‍ టెక్నాలజీ Read More »

భారత్‍లోనే అత్యంత సుందరమైన కట్టడం హుమాయూన్‍ సమాధి

1993లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించిన యునెస్కో హుమాయూన్‍ సమాధి ఢిల్లీ మొఘల్‍ నిర్మాణానికి పర్యాయ పదంగా మారిన గొప్ప రాజవంశ సమాధులలో మొదటిది. హుమాయూన్‍ సమాధి మొఘల్‍ నిర్మాణాల సమూహం. ఇది ఢిల్లీలోని తూర్పు నిజాముద్దీన్‍ ప్రాంతంలో ఉంది. తాజ్‍ మహల్‍ నిర్మాణానికి ముందు యిదే భారతదేశంలోని అత్యున్నత స్థాయి కట్టడం. హుమయూన్‍ సమాధి 27.04 హెక్టార్లలో ఉంది. ఇందులో ఇతర సమకాలీన, 16వ శతాబ్దపు మొఘల్‍ తోట సమాధులు నీలా గుంబాడ్‍, ఇసా ఖాన్‍, …

భారత్‍లోనే అత్యంత సుందరమైన కట్టడం హుమాయూన్‍ సమాధి Read More »

అంతర్జాతీయ పట్టణీకరణ

2060 నాటికి ప్రపంచ జనాభాలో 66% కంటే ఎక్కువ మందిపట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తుంటారు – ఐక్యరాజ్యసమితి అంచనా (ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఫోరమ్‍ ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ 2021 జూన్‍ 5న మణికొండ వేదకుమార్‍ అధ్యక్షతన ‘ఎకో సిస్టమ్‍ రిస్టొరేషన్‍’ (Eco System Restoration)అనే అంశంపై జూమ్‍ మీటింగ్‍ ద్వారా ప్యానెల్‍ డిస్కషన్‍ నిర్వహించింది. ఈ సందర్భంగా NK.Patel, ప్రెసిడెంట్‍, ఇనిస్టిట్యూట్‍ ఆఫ్‍ టౌన్‍ ప్లానర్స్ ఆఫ్‍ ఇండియా (ITPI), CMD – సన్‍ …

అంతర్జాతీయ పట్టణీకరణ Read More »

ప్రాచీన సంస్కృతికి ప్రతిబింబం చేనేత

ఎంతో కళాత్మక నైపుణ్యం… అపూర్వ మేధా శక్తి కలగలసిన చేనేత రంగం శతాబ్దాలుగా ఎందరికో ఉపాధినిస్తోంది. ప్రాచీన భారత దేశ సంస్క•తికి ప్రతిబింబమైన చేనేత రంగం… మారుతున్న కాలానికి అనుగుణంగా విభిన్న రకాల డిజైన్లతో రాణిస్తోంది. వ్యవసాయం తర్వాత గ్రామీణ రంగంలో ఎక్కువగా ఉపాధి కల్పిస్తున్నది చేనేత రంగమే. తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 3.5 లక్షల చేనేత మగ్గాలున్నాయి. వీటిపై 5 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. పరోక్షంగా మరో 20 లక్షల కుటుంబాలకు ఈ రంగమే …

ప్రాచీన సంస్కృతికి ప్రతిబింబం చేనేత Read More »

పిల్లలు పుట్టలేదని చెట్లను పెంచుకుంది

ఆమె నాటిన మొక్కల విలువ రూ।। కోటిన్నర పైనే 107 సంవత్సరాల వయసున్న సాలుమరద తిమ్మక్క. మనకెవరికీ అంతగా తెలియకపోయినా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ప్రేమికులకు మాత్రం సుపరిచితురాలు. గొప్ప పర్యావరణవేత్త. సాలుమరద అంటే చెట్ల వరస అని అర్థం. తిమ్మక్కను మదర్‍ ఆఫ్‍ ట్రీస్‍గా పిలుస్తారు. ఎవరీ తిమ్మక్క? కర్ణాటక రాష్ట్రం బెంగళూరు రూరల్‍ జిల్లా హులికల్‍ గ్రామానికి చెందిన సాధారణ మహిళ. పుట్టింది, పెరిగింది గుబ్బి పరిధిలోని తుముకూరులో. పేదరికం కారణంగా చదువుకోలేదు. తల్లిదండ్రులు దినసరి …

పిల్లలు పుట్టలేదని చెట్లను పెంచుకుంది Read More »