అర్బన్‍ ప్లానింగ్‍తో సమ్మిళితమయ్యే పరిసర వ్యవస్థ


(డాక్టర్‍ సంఘమిత్ర బసు, రిటైర్డ్ ప్రొఫెసర్‍, ఐఐటీ ఖరగ్‍ పూర్‍, మెంబర్‍, అడ్వయిజరీ కమిటీ, ఆర్కిటెక్చరల్‍ హెరిటేజ్‍ డివిజన్‍, ఇంటాక్‍, న్యూదిల్లీ. ఫోరమ్‍ ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ నిర్వహించిన వెబినార్‍ లో ఆమె ప్రసంగపాఠం సారాంశం)


21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫోరమ్‍ ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍కు ముందుగా నా అభినందనలు. నేను నేచర్‍ కల్చర్‍ జర్నీ దిశలో ఎకోసిస్టమ్‍, హెరిటేజ్‍, సెటిల్మెంట్‍ ప్లానింగ్‍ గురించి చర్చిస్తాను. రెండు కేస్‍ల స్టడీస్‍ గురించి మాట్లాడుతాను. వీటిలో ఒకటి కోల్‍ కతా- ఎకో సిస్టమ్‍ ఎట్‍ పెరిల్‍. మరొకటి ఒక చారిత్రక వారసత్వంగా శాంతినికేతన్‍ పరిసర వ్యవస్థ. ఇక్కడ ఎకో సిస్టమ్‍ అంటే యావత్‍ పరిసర వ్యవస్థ, అదే విధంగా అది ఏ విధంగా చారిత్రకంగా అర్బన్‍ ప్లానింగ్‍తో సమ్మిళతమైందనే అంశం కూడా ఉంటుంది. అంతే తప్ప దాన్నో అంతిమ ఉత్పాదనగానో లేదా భౌతిక రూపంగానో లేదా ఒక భౌతికపరమైన ఉనికిగానో చూడలేం. అది ప్రజలకు, వారి సంస్కృతి కి ఎలా సంబంధించిందో కూడా చూడాలి.


ముందుగా కోల్‍కతా, దాని ఎకో సిస్టమ్‍ ఎదుర్కొంటున్న ముప్పు గురించి మాట్లాడుకుందాం. కోల్‍కతా పరిసరాల్లో వెట్‍ ల్యాండ్‍ ప్రాంతాలున్నాయి. కోల్‍కతాకు తూర్పు వైపున ఇవి ఉన్నాయి. మీరు కోల్‍కతా చరిత్ర గనుక చూసినట్లయితే, ఇక్కడ గంగానది మూడు గ్రామాలకు ప్రధాన వనరుగా ఉంది. గంగానది పాయ అయిన హుగ్లీ తీరంలోనే కోల్‍ కతా నగరం అభివృద్ధి చెందింది. నేల వాలు నదికి దూరంగా ఉంది. ఒకటిన్నర మైళ్ల దూరం దాకా ఒండ్రుమట్టి నేలలు ఏర్పడ్డాయి. నిజానికి అక్కడే నగరం అభివృద్ధి చెందింది. మిగిలిన ప్రాంతం అంతా కూడా ఉప్పు నీటి చెరువు లేదా చిత్తడినేల. అది అలా సుందర్‍ బాన్స్ వరకూ ఉంటుంది. ఏళ్లుగా అది అలా ఉంటూ వచ్చింది. ఈ ప్రాంతం అంతా కూడా కోల్‍కతాకు అత్యంత సమీపంగా ఉంది. అంతే కాదు ఎంతో విస్తృత వైశాల్యంతో ఉంది. కాలువలు, జలాశయాలు, చెట్లు, చిత్తడి నేలలు వంటి వాటితో నిండిఉంది.


బ్రిటిష్‍ హయాంలో ఈ ప్రాంతం ఓడరేవుగా కూడా ఉండింది. అక్కడ ఒక వైపున కోట కూడా కట్టారు. అప్పట్లో అది వలసపాలకులకు సెటిల్మెంట్‍గా ఉండింది. అప్పట్లో అది ఈస్ట్ ఇండియా కంపెనీకి, ఆ తరువాత బ్రిటిష్‍ ఇండియాకు కొన్నేళ్ల పాటు రాజధానిగా ఉండింది. నాడూ, నేడూ చూస్తే, ఇప్పటికీ ఉప్పు నీటి చెరువులు
ఉన్నాయి. నగరం వాటి దరిదాపుల్లో అభివృద్ధి చెందుతోంది. నదికి రెండు వైపులా నగరం బాగా విస్తరించింది. వాటర్‍ అర్బనిజమ్‍: కోల్‍కతా అనే పుస్తకం చూస్తే ఆవరణ వ్యవస్థ అంతా కూడా జల వ్యవస్థతో ఎలా ముడిపడి ఉన్నదో అర్థమవుతుంది. అంతే కాదు, ప్రజల జీవనోపాధులు, ఆర్థిక వ్యవస్థ అంతా కూడా జల వ్యవస్థ పైనే ఆధారపడ్డాయి.


1893లోనే కోల్‍ కతా సమీప వెట్‍ ల్యాండ్స్ కుదించుకుపో తున్నట్లుగా గుర్తించారు. 1953…. 2000…. 2017…. ఇలా ఏళ్లు గడుస్తున్న కొద్దీ సమస్య మరింత ముదిరిపోయింది. నిజానికి ఆ దిశగా నగరం విస్తరణ ఉండకూడదు. కాకపోతే అలా విస్తరించడం చిత్తడి నేలలపై ఒత్తిడి పెంచింది. అలా జరుగకుండా ఉండాల్సింది. ఎందుకంటే చిత్తడి నేలలు ఎంతో ప్రత్యేకమైనవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా క్షీణించి పోయింది. ఒక హైవే నిర్మించారు. రెండు శాటిలైట్‍ టౌన్‍షిప్స్ వచ్చాయి. 1970, 1980లలో ఇవి మొదలయ్యాయి. నిజానికి ఇవి ఉప్పు నీటి చెరువులను, చిత్తడి నేలలను పూడ్చడం ద్వారా నిర్మించారు. అంతేగాకుండా ప్రధాన రవాణా మార్గంగా
ఉండిన జలమార్గాన్ని పక్కకు తప్పించడంతో రెండు వైపులా అది పట్టణీకరణ కోసం ఒత్తిడి పెంచింది. ఇది చిత్తడి భూముల విస్తీర్ణం తగ్గిపోయేందుకు దారి తీసింది.


చిత్తడి భూముల విస్తీర్ణం తగ్గిపోతే మనం ఎందుకు ఆందోళన చెందాలి? కోల్‍కతా వెట్‍ ల్యాండ్స్ అనేవి సహజ మైనవి మాత్రమే కాదు, మనిషిచే నిర్మితమైనవి కూడా. దానిపైనే చేపలు, కూరగాయల వ్యవస్థ కూడా ఆధారపడింది కాబట్టి. బ్రిటిష్‍ కాలంలో ఈ వ్యవస్థ అభివ•ద్ధి చేయబడింది. వాలు అటువైపుగా ఉన్నందున కోల్‍కతా వ్యర్థజలాలన్నీ కూడా ఈ చిత్తడి భూముల్లోకి వచ్చేవి. అలాంటి నీరు ఆవిరైపోయయేందుకు సహజ ఏర్పాట్లు ఉండినవి. ఫిల్టరేషన్‍ పక్రియ ఉండేది. ఇదంతా ఆక్వా కల్చర్‍కి ఉపయోగపడేది. అక్కడి నీరు అంతా కూడా సహజ విధానాల్లో రీసైకిల్‍ అయ్యేది. అక్కడి భూములను ఎలా సంర క్షించుకోవాలో తెలిసిన వారు కూడా ఉండే వారు. ఇదంతా కూడా ఎంతో నెమ్మదిగా ఏళ్ల కాలంలో జరిగింది. కాలు ష్యాన్ని అరి కట్టేందుకు అది తోడ్పడింది. దీన్ని అర్థం చేసుకోకుండా కొత్త అభివృద్ధి మొదలైంది. సాల్ట్ లేక్‍ సిటీ విస్తరించడం మొదలైంది.


ఈ విధమైన పట్టణ ప్రాంత విస్తరణ (రాజర్‍ హట్‍ లాంటివి) జరగడంతో, ఈ ఎకోసిస్టమ్‍ మెకానిజమ్‍ ఎలా ఉందన్న అంశాన్ని పలువురు అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. ఈ చిత్తడి నేలల వద్దకు వలస పక్షులు కూడా వస్తుండడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదంతా కూడా 2225 చ. కి.మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఉప్పు నీటి చెరువులు, సాగుభూముల నుంచి వచ్చే నీళ్లు, ఇతర చెరువులు అన్నీ ఇందులో ఉన్నాయి. ఈ మొత్తం ప్రాంతాన్ని 2002లో రామ్సర్‍ వెట్‍ ల్యాండ్‍గా ప్రకటించారు. అలా ప్రకటించడం ఇక్కడి కమ్యూనిటీని, ఎకో సిస్టమ్‍ను, దాని ఇంటరాక్షన్‍ను, ప్రాధాన్యాన్ని, కోల్‍కతా పట్టణ ప్రాంతానికి సంరక్షణపరంగా ఇదెంత ముఖ్యమైందో గుర్తించినట్లయింది. ఈ ప్రాంతంతో కోల్‍కతాకు గల అనుబంధం సీవేజ్‍ కు మాత్రమే సం బంధించింది కాదు, చేపలతో కూడా అది ముడిపడింది. ఇక్కడి చేపలను, కూరగాయలను కోల్‍కతా వాసులు ఆహారంగా స్వీకరిస్తుంటారు. ఆ ప్రకారంగా ఇక్కడ వ్యర్థాల రీసైక్లింగ్‍ జరుగుతోంది. ఈ విధంగా ఇక్కడి ఎకో సిస్టమ్‍ ఇక్కడ జీవనోపాధులను అందిస్తోంది.


ఇక్కడి పరిసర వ్యవస్థ అందించే సేవలను చూస్తే అది మూడు విధాలుగా ఉంటుంది. ప్రావిజనల్‍ సర్వీసెస్‍ (చేపలు, పంటలు, కూరగాయలు), నియంత్రణ సేవలు (వరదల నిర్వహణ, వాయు, జల కాలుష్యాల నియంత్రణ), సపోర్టింగ్‍, కల్చరల్‍ సర్వీసెస్‍ (జీవవైవిధ్య సంరక్షణ, ఆహ్లాదకర అనుభూతులు). ఇవన్నీ కూడా తక్కువ వ్యయాలకే, సుస్థిరదాయక రీతిలో లభ్యమవుతున్నాయి. ప్రభుత్వ స్థాయిలో విధానాల రూపకల్పన పరంగా సరైన అవగాహన లేకపోవడం వల్ల లేదా సాల్ట్ లేక్‍, రాజర్‍ హట్‍ ప్రాంతంలో చోటు చేసుకుంటున్న అవాంఛనీయ అభివృద్ధి కార్యకలాపాల వల్ల అక్కడి భూముల ధర అధికంగా ఉండడం వల్ల కావచ్చు… ఇప్పుడు ఏం జరుగుతోందంటే, అక్కడి చేపల పెంపకాన్ని దెబ్బతీసే విధంగా చర్యలు చేపట్టారు. చెరువుల మధ్యలో నుంచి రోడ్లు వేయడం వంటివి చేస్తున్నారు. ఫలితంగా అక్కడి భూములపై ఒత్తిడి బాగా పెరిగింది. అదే విధంగా అక్కడి జీవనోపాధులపై కూడా. సంప్రదాయకంగా ఏళ్లుగా అక్కడ ఉన్న అద్భుత పరిసర వ్యవస్థ ప్రమాదంలో పడింది. ఇప్పటికే మనం ఎంతో కోల్పోయాం. ఏళ్లుగా, దశాబ్దాలుగా వృద్ధి చెందుతూ వచ్చిన సుస్థిరదాయక అభివృద్ధి దెబ్బతింది. పట్టణ విస్తరణ కోసం, రియల్‍ ఎస్టేట్‍ అభివృద్ధి కోసం మనం సుస్థిరదాయక అభివృద్ధిని పణంగా పెడుతున్నాం. ఇదీ కోల్‍కత్తా కథ. రామ్సర్‍గా ప్రకటించినప్పటికీ నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి.


కువాయి భూములకు ముప్పు….
ఇక కువాయి, శాంతినికేతన్‍ విషయానికి వద్దాం. శాంతినికేతన్‍ మనందరికీ బాగా తెలిసిదే. సేవ, దాతృత్వం వంటి అంశాలు దానితో ముడిపడి ఉన్నాయి. విశ్వభారతి విశ్వవిద్యాలయం ఉన్నది అక్కడే. రవీంద్రనాథ్‍ ఠాగూర్‍ రచనలు కొన్ని అక్కడే రూపుదిద్దుకున్నాయి. ఇదంతా మనకు తెలిసిందే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, ఆయన అక్కడ ఉన్న పరిసర వ్యవస్థను చూసి ముగ్దుడై అక్కడ విశ్వభారతిని ప్రారంభించారు. అక్కడి పల్లెలు, గ్రామీణులు, పరిసరాలు…. ఇలాంటివన్నీ ఆయనను ఆకట్టుకున్నాయి. పరిసరాలు చక్కగా ఉండాలని కోరుకున్నారు. అందుకే చెట్లకిందనే తరగతులు నిర్వహించారు. అది ఒక ఆలోచనా పక్రియ. మనం ఇప్పుడు సుస్థిరదాయకత అనేది అంతా కూడా అప్పట్లో ఆయన చర్యల్లోనే కనిపించింది. విశ్వభారతి యావత్‍ భావన కూడా అదే. విశ్వభారతి అంటే పాటలు లేదా కవిత్వం లేదా సాహిత్యం మాత్రమే కాదు. అది జీవనోపాధుల గురించి కూడా ఆలోచిస్తుంది. పరిసర గ్రామాలతో చక్కగా సమ్మిళితమవుతుంది.


ఇక కువాయి విషయానికి వస్తే, ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా అడవిలా ఉండేది. పర్యాటకం ఒత్తిళ్ల కారణంగా, శాంతినికేతన్‍ అభివృద్ధి కారణంగా చాలా మంది అక్కడికి రావడంతో పరిస్థితి మారిపోయింది. పంటలు, పాటలు, పండుగలతో ఒకప్పుడు అది మనోహరంగా ఉండేది. ఇప్పుడు ప్రజలు అక్కడ ఇళ్లుని ర్మించు కుంటున్నారు. పర్యాటక ప్రాంతాలు, హోటళ్లు వెలుస్తున్నాయి. స్థానిక కళాకారులకూ ఈ ప్రాంతం ఒక వేదికగా మారిపోయింది. వారు ఇక్కడ తమ కళారూపాలు ప్రదర్శిస్తుంటారు. జాతర తరహాలో ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్లాస్టిక్‍ను మాత్రం ఇక్కడ అనుమతించరు. అది కూడా మంచిదే.


మొత్తం మీద ఇక్కడ పర్యాటకం ఒత్తిళ్లు అధికమైపోయాయి. ఇది ఓ కోర్టు కేసుకు కూడా దారి తీసింది. భూఆక్రమణలు మొదలయ్యాయి. అసలు ‘కువాయి’ (ఒక రకమైన నేల భౌగోళిక స్వరూపం) నిర్వచనం ఏంటి… దాన్ని భద్రపర్చుకోవడం ఎలా అనే ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి. దాంతో ఐఐటి ఖరగ్‍ పూర్‍లో మేం ఒక ప్రాజెక్టును కూడా చేపట్టాం. కువాయి అంటే ఏంటి? అది కంటికి కనిపించేదా? లాంటి అంశాలు చర్చకు వచ్చాయి. కువాయి అనేది ఒకరకమైన ప్రత్యేక భౌగోళిక స్వరూపం. ఠాగూర్‍ పెయింటింగ్స్లోనూ దాన్ని చూడవచ్చు. వాటిపై ఎన్నో పాటలు కూడా ఉన్నాయి. కువాయి అంటే ఏంటో శాస్త్రీయంగా చూడాలి. తద్వారా సరైన రీతిలో విధానాల రూప కల్పన చేయవచ్చు.


కోయి అంటే ఏమిటో చూద్దాం.

 • చూసేందుకు అది ఎగుడుదిగుడుగా ఉంటుంది
 • అక్కడ వ్యవసాయం చేయరు
 • ఎర్ర లేటరైట్‍ నేలతో కూడి ఉంటుంది
 • ఫెస్పర్‍, క్వార్ట్జ్‍, రెడ్‍ సాండ్‍ స్టోన్‍, కొద్ది మొత్తంలో మైకా ఉంటాయి.
 • లేటరైట్‍ సాయిల్‍ పొరలతో రూపుదిద్దుకొని ఉంటుంది. ఏళ్లుగా శిథిలమవుతూ ఉంటుంది. ఎగుడుదిగుడు ఆకారాలు కనిపించేది అందుకే.
 • అలాంటి పొరల్లో శిలాజాలు లభిస్తాయి
 • ఫెర్న్, ఆల్గే, ఫంగస్‍, పక్షుల అరుదైన రకాల ఆనవాళ్లు లభించే అవకాశం
 • అడవి పిల్లులు లాంటి కొన్ని జీవులు నివసిస్తాయి
 • ఈ భూముల సరిహద్దుల్లో ఒండ్రునేలలు కనిపిస్తాయి.
 • నేల స్వరూపం భారీ నిర్మాణాలకు అనుకూలంగా ఉన్నట్లుగా కనిపించదు


కువాయి భూములను శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు మేం ప్రయత్నించాం. వాటి సరిహద్దులను గుర్తించే ప్రయత్నం చేశాం. చుట్టుపక్కల భూములతో పాటు వీటికి సంబంధించిన పటాలను రూపొందించాం. వీటి సాయంతో కువాయి హద్దులను గుర్తించవచ్చు. వాటి రక్షణకు ఏం చేయాలో సూచించాం. శాంతినికేతన్‍తో సహా సుమారుగా 30 గ్రామాలు కువాయి చుట్టపక్కల ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో భవిష్యత్‍ అభివృద్ధి కార్యకలాపాలు ఎలా ఉండాలో సూచించాం. ఆ ప్రకారం పటాలు రూపొందించాం. ఎకో సెన్సిటివ్‍ జోన్‍, ఆర్గానిక్‍ అండ్‍ అన్‍ బ్యాలెన్స్డ్‍ జోన్‍, డెవలపడ్‍ సెమీ అర్బన్‍ జోన్‍, అన్‍ డెవలప్డ్ సెమీ అర్బన్‍ జోన్‍, పార్షియల్‍ అగ్రికల్చర్‍ జోన్‍, రిచ్‍ అగ్రి కల్చర్‍ జోన్‍ లాంటి వాటిని గుర్తించాం. తద్వారా భవిష్యత్‍ అభివృద్ధి పక్రియ అక్కడి ప్రత్యేక భౌగోళిక స్వరూపాన్ని దెబ్బ తీయకుండా జాగ్రత్త పడవచ్చని సూచించాం. ఆ విధంగా అభివవృద్ధి పరమైన ఒత్తిళ్లను కొంతమేరకు తగ్గించ వచ్చు.


ఈ ప్రత్యేక భౌగోళిక స్వరూపం ఇక్కడి చారిత్రక వారసత్వం. సాంస్కృతికపరంగా మాత్రమే గాకుండా సహజ పరిసర వ్యవస్థ పరంగా కూడా అదెంతో ముఖ్యమైంది. వలస పక్షులు కూడా ఇక్కడికి వస్తుంటాయి. మరో వైపున పర్యాటకం అనేది ఓ పెద్ద మార్కెట్‍ వస్తువుగా మారి పోయింది. పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఫేక్‍ గా గ్రామీణ వాతావరణాన్ని కూడా క్రియేట్‍ చేస్తున్నారు. ఒకనాటి శాంతినికేతన్‍తో రవీంద్రనాథుడు మనకు అర్బన్‍ డిజైన్‍ మార్గదర్శ కాలను అందించారు. ఆ బాటలో మనం నడవాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్లుగా సమగ్ర ప్రణాళికలను రూపొందించు కోవాలి.

 • అనువాదం : యన్‍.వి.యం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *