ఐఏఎంసీ హైద్రాబాద్‍కి మరో కలికితురాయి
ఆర్బిట్రేషన్ అంటే మధ్యవర్తిత్వం. ఈ ఆర్బిట్రేషన్ భారతదేశ గ్రామీణ వ్యవస్థలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. భార్యాభర్తల తగాదాలు, వారసత్వ ఆస్తుల వివాదాలు, భూసరిహద్దు వివాదాలు, కుల మత ఘర్షణల వంటివి పోలీసు కేసుల వరకూ, కోర్టుల వరకూ వెళ్లకుండా ఊరి పెద్దలే మధ్యవర్తిత్వం వహించి పరిష్కరించడం మనకు తెలుసు. ఆధునిక జీవితంలో వచ్చిన మార్పులు వివిధ సామాజిక వ్యవస్థలపై పరోక్షంగానో, ప్రత్యక్షంగానో తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అనేక కారణాల వల్ల కోర్టుల్లో కేసుల పరిష్కారం ఆలస్యమవుతుంది. …