పర్యావరణం – శాస్త్రం – నైతికత – తాత్విక దృక్పథాలు

పర్యావరణ నైతికత (Environmental Ethics)
“Environmental ethics is a systamatic account of the moral relations between human beings and their natural relations between human beings and their natural environment”

మనుషులు తమచుట్టూ ఉన్న సహజ పర్యావరణంతో కలిగి ఉండే నైతిక సంబంధాల క్రమ పరిగణననే పర్యావరణ నైతికత అనవచ్చు.
Environmental ethics ఏమి భావిస్తుందంటే నైతిక నియమాలు సహజ ప్రపంచాన్ని మానవ ప్రవర్తన గౌరవించేట్లు చేస్తుంది. అందువల్లనే Environmental ethics సిద్ధాంతం ఈ నైతిక నియమాలు ఏమిటనే వాటిని గురించి వివరిస్తుంది. ఇవి ఎవరికి అనేవి అనే వాటిని వివరిస్తుంది. మనుషులు ఎటువంటి బాధ్యతలను కలిగి ఉన్నారు. ఆ బాధ్యతలకు న్యాయం చేయడమెట్లా అనే వాటి విషయాలను కూడా వివరిస్తుంది.


ఎన్విరాన్‍మెంటల్‍ ఎథిక్స్కు సంబంధించిన భిన్న సిద్ధాంతాలు, విభిన్నమైన సమాధానాలను ఈ ప్రశ్నలకు అందిస్తాయి. కొంతమంది తాత్త్వికులు మానవ బాధ్యతలకు సంబంధించి చెప్పే అంశం ఏమంటే – బాధ్యత పరోక్షమైనవి. వనరులను పరిరక్షించడం అనేది ఇతర మానవుల పట్ల మన బాధ్యతలు ఎటువంటివి అనేది అర్థం చేసుకోవడంతో కూడి ఉంటుంది. వీటిని Anthropocentric ethics చెప్పాలి. దీనిలో మానవులు నైతిక విలువలను కలిగి ఉంటారని తెలుపుతుంది. (మనుషులు మాత్రమే) మనకు ప్రకృతి ప్రపంచం పట్ల బాధ్యతలు ఉన్నప్పటికీ అవి సహజ ప్రపంచానికి సంబంధించిన మన బాధ్యతలు పరోక్ష మైనటువంటివి.
తొలి దశాబ్దాలలో పర్యావరణ ఉద్యమానికి సంబంధించిన తలెత్తిన వివాదాలు అన్నీ గాలి, నీటి కాలుష్యం, వ్యర్థ విష పదార్థాలు, క్రిమి సంహారకాల దుర్వినియోగం మొదలైన వివాదాలన్నీ మానవ కేంద్రక ఎథిక్స్ (Anthropocentric ethics) దృక్పథం నుంచి ఉద్భవించినవే కావటం గమనార్హం. క్రిమి సంహారకాలలో కలుషితమైన నీరు, ఆహారం మానవుల ఆరోగ్యానికి ప్రత్యక్ష ముప్పును కలిగిస్తున్నాయి. ఆ విధంగా మానవ కేంద్రక ఎథిక్స్ అత్యంత సరళంగా ప్రమాణబద్ధ నైతిక సూత్రాలను కొత్త సమాజానికి సమస్యలకు అన్వయింపజేస్తూ ఉన్నాయి.


మానవకేంద్రక ఎథిక్స్ విస్తరణ భవిష్యత్‍ తరాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఉనికిలోకి వస్తుంది. మనుషులు వస్తువులుగా నైతిక బాధ్యతలను కలిగి ఉన్నారు. ఈ పద్ధతిలో కేవలం మనుషులు మాత్రమే నైతికంగా పరిగణనలోకి వస్తారు. అయితే దీని విస్తరణ అప్పటికి ఉనికిలో ఉండని మానవుల అస్తిత్వానికి మన బాధ్యత ఏమిటి? మన పూచీ ఏమిటి అనే ప్రశ్నలను లేవనెత్తుతుంది. తిరిగిమళ్లీ పర్యావరణ ఉద్యమ సిద్ధాంతాలను ఈ తరహా ప్రశ్నలన్నీ లేవనెత్తాయి. వాటిల్లో వనరుల conservation ఒకటి కాగా అణువ్యర్థ పదార్థాలను పారవేయటం ఈ రెండూ కూడా Anthropo ethical perspective లోంచే చూడబడినాయి.
ఇతర తాత్త్వికుల వాదన ఏమంటే సహజ ప్రపంచంతోటి మనం ప్రత్యక్ష బాధ్యతలను కలిగి ఉన్నాం. కేవలం మానవులు కాదు మానవేతర ప్రాణుల పట్లకూడా ఇది non anthropoentric ethics. మనకు ఈ దృక్పథం నైతిక ధైర్యాన్నిస్తుంది. జంతువు, మొక్కలు మొదలైన సహజ ప్రాణుల పట్ల మనకి ఉన్న బాధ్యత ప్రత్యక్షమే. ఈ విధానం మరికొంత విస్తరణను ప్రమాణబద్ధ ఎథికల్‍ సూత్రాలను పునరుద్ధరించాల్సి ఉంది. ప్రాణుల పట్ల అంతరించిపోతున్న మొక్కల జాతుల పట్ల చెలరేగిన వాదవివాదాలు దీనిలో భాగమే.


ఇక మూడవది Holistic ethics విడి ప్రాణుల నుంచి మొత్తం ప్రజాతులపైకి మారటం ఇందుకు ప్రధానం. ఇందులో Collections లేదా Wholes ముఖ్యం. Species, populations,ecosystems. holistics ethics. చెప్పే విషయము మనకు అన్నిటి పట్లా బాధ్యతలున్నాయి అని individuals కంటే మొత్తంగా చూడాలి అంటుంది. ఉదాహరణకు ఎంపిక చేసిన వేటను ఇది అనుమతి ఇస్తుంది. విడి ప్రాణాలను వేటాడవచ్చు. నియమం ఏమంటే అవి అంతరించి పోయే ప్రమాదం ఉండనట్లయితే వేటకు అనుమతి ఉంది. అంటే అవి endangered speciesగా ఉండకూడదు. Holism Science of ecology తో ప్రభావితమైంది. అంతేకాదు గంభీరమైన తాత్త్వికమైన సమస్యలను అది లేవనెత్తింది. Individual ethics కంటే తీవ్రమైంది ఇది.


ethics అనే పదం గ్రీకు పదమైన e’thosనుండి నిష్పన్నమైంది. దీనర్థం ‘custom’ అని. ఈ అర్థంలో ethicsదేనిని సూచిస్తుందంటే సాధారణ విశ్వాసాలు, వైఖరులు లేదా సంప్రదాయబద్ధ ప్రవర్తనను నడిపే ప్రమాణాలను సూచిస్తుంది. అట్లా సమాజం దానిదే అయిన ఎథిక్స్ను కలిగి ఉంటుంది. అంటే కొన్ని రకాల విశ్వాసాలు, ప్రమాణాలు ఏది customary అనే దానిని నిర్ధారిస్తాయి. గ్రీకు తత్వశాస్త్రం తొలినాళ్లనుంచి philosophical ethics సంప్రదాయబద్ధమైందే హక్కుగా భావించడాన్ని అంగీకరించడంతో సంతృప్తి చెందలేదు.


ఎథిక్స్ తత్త్వశాస్త్రపు శాఖకగా వివరణాత్మక పరిశీలన చేస్తుంది. సంప్రదాయం ఏం చెపుతుంది. ఎట్లా జీవించమని ఆదేశిస్తుందనే వాటిని పరిశీలిస్తుంది. సోక్రటీసుతో ఉద్భవించిన పాశ్చాత్య తత్త్వశాస్త్రం జీవితకాలం విమర్శనాత్మక పరిశీలనచేసింది గ్రీకు సమాజపు సంప్రదాయ నియమాలు ఏమిటనే విషయంగానే.
ఈ విమర్శనాత్మక పరిశీలనలు రెండుస్థాయిల్లో మనం ఒకడుగు వెనక్కివేయడం లేదా మన సాధారణ అనుభవాన్ని అమూర్త పరచుకోవడం ఇమిడి ఉంది. మనసాధారణ, సంప్రదాయ అనుభవానికి సంబంధించి మనకు కొన్ని విశ్వాసాలు, వైఖరులు, విలువలు ఉంటాయి. వాటిని మనం కలిగి ఉంటాం. అనుభవం నుంచి ఒకడుగు వెనక్కివేసి విమర్శనాత్మకంగా ప్రతిఫలనం చూపమని తత్త్వశాస్త్రం కోరుతుంది. మనం విశ్వసించే విషయాలను మనమెందుకు విశ్వసిస్తాం. మనం మన వైఖరులను మార్చుకోవాలా? మన విలువలు సమంజసమైనవేనా? ఈ తొలి స్థాయి అమూర్తత, సంప్రదాయ ప్రవర్తన పరిశీలనకు గురికావాలి. ఒక నియమానికి, ప్రయాణానికి appeal చేయాల్సింది ఒకటుంటుంది. ఏది జరగవలసి ఉంది. ఏది జరగాలి అనే దానికి సంబంధిం ఉంటుంది.


మన ఎథికల్‍ మరియు పర్యావరణ చైతన్యం విషయంగా ఉండే విషయములను తేటతెల్లం చేయటమే రాబోయే అధ్యాయాలలో మనం చూడాలి. ఈ ఎథిక్స్ సంబంధించిన చర్యలు కొంత మనకు అసహనాన్ని కలుగజేసే అవకాశం ఉంది. అందుకు ఈ చర్యలను మనం పరిశీలించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. అనేక పర్యావరణ వివాదాలు ప్రపంచానికి సంబంధించి మన సంబంధం తదితర అంశాలు భిన్నవైఖరులు, విలువల మీద ఆధారపడి ఉంటాయి. కొన్ని విషయాలు అసహనానికి గురిచేస్తూ ప్రాథమిక దృక్పథాలను సవాలు చేస్తాయి. కానీ, మనం కొంత ఓపెన్‍గా ఉండాల్సిన అవసరం ఉంది. మనం కొన్ని సార్లు ఎథికల్‍ ఇగ్నోరెన్స్లో ఉంటాం. ఫిలాసఫికల్‍ ఎథిక్స్ యొక్క ప్రాథమిక లక్ష్యం నిరంతరంగా మన అవగాహనను, దృక్పథాన్ని, చైతన్యాన్ని విస్తరింప జేసుకుంటూ పోవటం జరగాలి. ఈ విధంగా చేయడం వల్ల సంప్రదాయ ఆలోచనా విధానం నుండి వైదొలగలడానికి ఇది దోహదపడుతుంది.


నైతిక తీర్పులు చేయడానికి, సలహా ఇచ్చేందుకు ఏం చేయాలనే విషయంపై మూల్యాంకనం జరిపేందుకు Normative ethicsతో సంబంధం ఉండాలి. మొదటి స్థాయి అమూర్తమైనటువంటిది. ఇది నైతిక హేతువుతో ముడిపడి ఉంటుంది. ఎక్కువమంది ఈ స్థాయిలో ఉంటారు. ‘Normative Judgements’ ప్రవర్తన ఎలా
ఉండాలో తెలియచెపుతాయి. నిర్దేశిస్తాయి. ‘‘పెస్టిసైడ్ల వాడకం తగ్గించాలి’’, ‘‘కర్మాగారాలు నీటిని కలుషితం చేయకూడదు’’ Endangered ప్రజాతులు పరిరక్షించబడాలి’’

‘Normative Judgements’ బాహ్యంగాను, అంతర్గతంగా ఏదో ఒక నియమాన్ని నైతిక ప్రవర్తనకు ప్రమాణాన్ని నిర్దేశిస్తాయి.
ఎన్నో పర్యావరణ వివాదాలు ఈ Normative ethics తో ఏర్పడే తగవులను కలిగి ఉంటాయి. ఒక పక్షం అణువిద్యుత్‍ ప్లాట్లు విధ్వంసకరం అని విశ్వసిస్తాయి. మరో పక్షం మన జీవన విధానాలు కొనసాగాలంటే అణువిద్యుత్‍ అవసరమని విశ్వసిస్తాయి. వాదిస్తాయి. ఇరు పక్షాలు ఆధారాలను చూపుతాయి. తీర్పులకు మద్ధతు ఇవ్వమని కొన్ని నియమాలను కూడా రూపొందిస్తాయి. Normative disputes విసుగును, అసహనాన్ని కలగజేస్తాయి. వివాదాలకు తావివ్వడం వల్ల మనం మరోసారి ఆమూర్తాల్లోంచే బయటపడి ఏ ప్రత్యేకమైన అంగీకారం కుదరని విషయాలు ఉంటాయో వాటిని చూడాలి. పరిశీలించాలి. ఏ విలువలు సంఘర్షణకు గురయ్యాయో చూడాలి. అసలు సంఘర్షణకు మూలమైన కారణాలను కనుగొనాలి. అమూర్త ఆలోచనవైపు కదలటం అంటే నార్మేటివ్‍ నుండి ఫిలాసఫికల్‍ ఎథిక్స్ వైపు మారటమే.


ఎథికల్‍ రీజనింగ్‍ యొక్క తృతీయ స్థాయి పిలాసఫికల్‍ ఎథిక్స్, పిలాసపికల్‍ ఎథిక్స్ అనేది అధిక స్థాయిలో జరిగే సాధారణత, అమూర్తత అందులో సాధారణ తీర్పులను విశ్లేషించటం, తీర్పు ఇవ్వడం ఉంటుంది. అందుకు ఆలంబనగా నిలిచే కారణాలను పేర్కొనడం జరుగుతుంది. ఇందులో సాధారణ భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు ఉంటాయి. వీటికి డిఫెండింగ్‍గా ఉంటూ నార్మేటివ్‍ క్లెయిమ్స్ను వివరిస్తుంటాయి. ఈ స్థాయిలో తాత్త్వికులు సౌకర్యంతో ఉంటారు. అంతేకాదు చాలా విషయాలు ప్రస్తావించడానికి ముందుకొస్తారు. ఈ అర్థంలో Environmental ethics is a branch of philosoply involoving the systematic study and evaluation of the normative judgements that are so much a part of envirommentalism” “ethical theory refers to any attempt to provide systematic answers to the philosophical questions raised by descriptive and normative approaches to ethics”

ఈ ప్రశ్నలు వ్యక్తి నైతిక దృష్టికోణం నుండి మరియు సమాజ దృష్టికోణం లేదా పబ్లిక్‍ పాలసీ వరకు విస్తరిస్తాయి. నేనేం చేయాలి? నేను ఎటువంటి వ్యక్తిగా ఉండాలి? నేను దేనికి విలువ ఇస్తాను? నేనెలా జీవించాలి? ఇవి వ్యక్తికి సంబంధించినవి. సామాజిక తత్వ శాస్త్రం లేదా పబ్లిక్‍ పాలసీకి సంబంధించిన ప్రశ్నలు. ఏ తరహా సమాజం ఉత్తమమైనది? ఏ విధమైన విధానాలను ఒక సమూహంగా అనుసరించాలి? ఏ సామాజిక ఏర్పాట్లు, ఆచరణలు వ్యక్తి సంక్షేమాన్ని సంరక్షిస్తాయి? విడి వ్యక్తులు ఆమోదించకపోతే ఏం చేయాల్సి ఉంటుంది. మొదలైనవి తత్వశాస్త్రం తొలినాళ్ళ నుంచి ఉన్నవే. ఎథిక్స్ వ్యక్తి, సమాజ నైతికతలకు సంబంధించిన ప్రశ్నలను ఇందులో కూర్చాయి. విస్తృతార్థంలో ఎథికల్‍ థియరీ తాత్విక విశ్లేషణ నైతిక, రాజకీయ, ఆర్థిక, న్యాయ, సామాజిక ప్రశ్నలను ముందుకు తెస్తుంది.


సాధారణ పరిభాషలో ఎథిక్స్ అధ్యయనం పర్యావరణ వివాదాలను పరిపూర్ణంగా మూల్యాంకన పరచడానికి అవసరమేనని గుర్తించాలి. అయితే ఎథికల్‍ థియరీ అధ్యయనం కూడా ప్రాసంగికమే. సాధారణ పరిగణనలు సిద్ధాంతాన్ని ప్రాసంగికం చేస్తాయి. ఎథికల్‍ సిద్ధాంతాలు సాధారణ భాషను రూపొందిస్తాయి. ఎతికల్‍ ఇష్యూస్‍ వర్తించడానికి అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. పర్యావరణ ఎథిక్స్ అసంఖ్యాక వివాదాలను లక్షణీకరించుకుని ఉంటాయి. చాలా స్పష్టంగా అవసరమైన మొదటి అడుగు ఈ వివాదాలను పరిశీలించడానికి, పరిష్కరించడానికి వీటిని సంపూర్తిగా, కచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎథిక్స్కి సంబంధించిన వర్గీకరణలు, ప్రాథమిక భావనలు – హక్కులు, బాధ్యతలు, ఉపయోగం. అందరికీ మేలు, ఈ భావనలకు మధ్యనున్న సంబంధాలు ఉభయత్రా వీటిని లేదా సంభాషణను అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. ఎథికల్‍ సిద్ధాంతాలు ప్రత్యేకమైన వివాదాల్లో ఉన్న అంతర్గతంగా ఉన్న వాటిని సాధారణార్థంలో గ్రహించడానికి, పద్ధతి ప్రకారం అవగాహన చేసుకోవడానికి ఉపకరిస్తాయి. తాత్త్విక ఎథిక్స్ను భాషను నేర్చుకోవడం ద్వారా మనం చక్కగా వీటిని అర్థం చేసుకోవడానికి, మూల్యాంకన పరచడానికి, వాటిని తిరిగి ఇతరులకు తెలియజెప్పటానికి ఉపకరిస్తుంది.


అయితే ఇది – తత్ఫలితంగా పర్యావరణ చర్చల్లో సాధికారికంగా పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. హేతుబద్ధమైన సంభాషణ కొనసాగించడానికి పిలాసపికల్‍ ఎథిక్స్ ఒక సాధారణ భాషను కల్పిస్తుంది. పర్యావరణం ఎథిక్స్ను, తాత్విక ఎథిక్స్ను అధ్యయనం చేయటం ద్వారా వాగ్గేయకారులు ఏ నైతిక సూత్రం మీద నిలబడి ఆలోచించారో అర్థమవుతుంది.ఈ దృష్ట్యా పర్యావరణ తాత్త్వికులు ఇచ్చిన కొన్ని భావనలను ఇక్కడ పరిచయత్మాకంగా అర్థం చేసుకోవడం అవసరం. వీటిల్లో ప్రధానంగా ఉపయోగితావాదం, సోషల్‍ ఎకాలజి, గుప్తపర్యావరణ అధ్యయనం, పర్యావరణ స్త్రీవాదం, జీవకేంద్రక నైతికత అంతర్గత విలువలు, పర్యావరణ విమర్శ అనేవి ప్రధానమైనవి.


ఉపయోగితావాదం
పర్యావరణ నైతికతను అధ్యయనం చేయడానికి ఉపకరించే మరొక సంప్రదాయమే ఉపయోగితావాదం (Utilitarianism).. జెర్మీబెంతామ్‍. స్టూవర్ట్మిల్‍ల రచనల్లో ఈ సంప్రదాయానికి సంబంధించిన ప్రకటనలు కనిపిస్తాయి. నేటికీ ఈ వాదం పర్యావరణ పరమైన ఆలోచనలమీద ప్రభావం నెరపుతూ ఉన్నది. ఇది ప్రధాన స్రవంతికి చెందిన ఆర్థిక దృష్టికోణాలను పర్యావరణ నిర్ణయ విధానాలకు గాను ఒక సిద్ధాంత ప్రాతిపదికను సమకూరుస్తుంది.
ఉపయోగితావాద హేతువు అర్థశాస్త్రం, ప్రజావిధానం, ప్రభుత్వ నియంత్రణ లాంటి అంశాలపై ప్రభావం చూపుతుంది. స్థూలార్థంలో ఉపయోగితావాదం అందరికీ మేలును అధికం చేయుట లేదా ఎక్కువ మందికి అధికాధికంగా సంక్షేమం సమకూర్చటం గురించి తెలుపుతుంది. ఈ వాదం రెండు అంశాలమీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఏది మంచిచేస్తుందో పరిగణన చేయటం, ఇక అన్ని రకాల చర్యలను, నిర్ణయాలను నిర్ణయించడానికి కావలసిన నియమం లేదా సూత్రాలను ఇవ్వడం. మరి ఇవి ఏం చేస్తాయనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనిని ఈ విధంగా పేర్కొనవచ్చు. “The rule tells us to look to the consequences of any particular act and judge the ethical status of the act interms of those consequences”. చర్యల వలన నిర్ణయాల వలన కలిగే పర్యవసానాలను, ఆ పర్యవసానాల ఆధారంగా నైతికస్థితి ఇక్కడ ప్రధానం. ఒక ప్రత్యేక నిర్ణయం లేదా చర్య మంచి పర్యవసానాలను కలిగిస్తే నైతికం లేదా చర్య మంచి పర్యవసానాలను కలిగిస్తే నైతికంగా అది ఒప్పు. అట్లా కానప్పుడు అది తప్పు అని నియమం నిర్ణయిస్తుంది.
దీనిలో రెండు విషయాలున్నాయి. ఒకటి విలువను కొలవటం. దీని కొలమానం ఏమిటంటే సంతోషాన్ని పరిగణించటం లేదా నిర్ణయ ఫలితంగా పక్ష సంక్షేమం. ఏది ఉత్తమమైన ఐచ్ఛికం అవుతుందంటే, ఏ పర్యవసానాలు ప్రభావిత ప్రతినిధుల సంతోషాన్ని రెట్టింపు చేస్తుందో అది మంచిది. దీనికి మంచి చర్య ఏమంటే సంక్షేమంలో అధికంగా మెరుగుదల ఉండటం.


కాబట్టే ఈ ఉపయోగితావాదం మూడిటి గురించి మాట్లాడుతుంది. ఆ మూడూ ఇవి.
1. “It is welfarist : The only thing that is good in it self and not just a means to
another good is the happiness or well-being of individuals.
2.It is consequentialist : Whether an action is right or wrong is determined solely
by its consequences.
3.It is aggregative maximissing approach : We chose the action that produces the greatest total amount of well being”

పై మూడంశాలను అంచనావేస్తుంది ఉపయోగితావాదం. అయితే ఈ మూడిటిపై తత్వశాస్త్రం, అర్థశాస్త్రం, రాజకీయ సిద్ధాంతాలలో ఎన్నో వివాదాలకు కూడా ఇవి కారణమయ్యాయి.


-డా।। ఆర్‍. సీతారామారావు,
ఎ : 9866563519

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *