భావితరాల ప్రయోజనకారి-నేటి విద్యావిధానం
అనేక సామాజిక రుగ్మతలకు మూలం నిరక్షరాస్యత.ఈ నిరక్షరాస్యతకు మూలం సామాజిక అసమానతలు. విద్య, వైద్య విధానాల రూప కల్పన, ఆచరణ ఆయా సామాజికాభివృద్ధికి కారణమవుతాయి. నూతన రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ విద్య అందాలన్న సదాశయంతో దేశంలో మరెక్కడా లేని విధంగా కెజీ టూ పీజీ ఉచిత విద్యకు అంకిత భావంతో అంకురార్పణ చేసింది. గిరిజన, ఆదివాసీ, మైనారిటీ, దళిత బహుజన విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలను, స్థానిక, ప్రాంతీయ భాషల అభివృద్ధిలో భాగంగా …