సకల సౌకర్యాల వనం.. సికింద్రాబాద్‍ క్లబ్‍

హైదరాబాద్‍ నగరంలోని సికింద్రాబాద్‍ క్లబ్‍లో ఈ మధ్య భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. దాదాపు రూ.20కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. అగ్ని ప్రమాదానికి గురైన ఈ క్లబ్‍ సాదాసీదాది కాదు. భారత్‍లోని పురాతన క్లబ్‍లలో ఇదీ ఒకటి. దీనికంటూ ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ క్లబ్‍ను బ్రిటిష్‍ హయాంలో మిలటరీ అధికారుల కోసం 1878లో నిర్మించారు. మొదట్లో ఈ క్లబ్‍ను ‘సికింద్రాబాద్‍ పబ్లిక్‍ రూమ్స్’గా, ఆ తర్వాత ‘సికింద్రాబాద్‍ గ్యారిసన్‍ క్లబ్‍’, ‘సికింద్రాబాద్‍ జిమ్‍ఖానా క్లబ్‍’ పిలిచేవారు. 22 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్లబ్‍లో వందల ఏళ్ల నాటి భారీ వృక్షాలు దర్శనమిస్తాయి. అవి క్లబ్‍ చరిత్రకు సజీవసాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఎన్నో రకాల పక్షులకు ఈ భారీ చెట్లు ఆతిథ్యమిస్తుంటాయి. నిత్యం రద్దీ, ట్రాఫిక్‍తో కాంక్రీట్‍ అడవిగా మారిన ఈ నగరంలో ప్రక•తి సోయగాలు, ప్రకృతి అందాలతో ఈ క్లబ్‍ ఆకర్షణీయంగా కనిపిస్తుంటుంది. అందుకే, హైదరాబాద్‍ అర్బన్‍ డెవలప్‍మెంట్‍ అథారిటీ దీనికి వారసత్వ హోదాను కల్పించింది.


అప్పట్లో బ్రటిష్‍ అధికారులు, హైదరాబాద్‍ రాజులకే సభ్యత్వం..
స్వాతంత్య్రం వచ్చే వరకూ ఈ క్లబ్‍ అధ్యక్షుడిగా ఉండేందుకు కేవలం బ్రిటన్‍ పౌరులనే అనుమతించేవారు. ఈ క్లబ్‍లో సభ్యులుగా అందరూ బ్రిటిష్‍ అధికారులే ఉండేవారు. హైదరాబాద్‍ సంస్థానానికి చెందిన కొంతమంది రాజులకు మాత్రమే సభ్యత్వం ఉండేది. ఇప్పుడు ఆర్మీ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలు, పోలీసు అధికారులు, నిపుణులు, శాస్త్రవేత్తలు సహా అన్ని రంగాలకు చెందిన 8వేల మంది శాశ్వత సభ్యులు, 30వేల మంది క్రియశీలక సభ్యులున్నారు. క్లబ్‍ మేనేజింగ్‍ కమిటీని సభ్యులు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకుంటారు.


సమావేశాలకు హాళ్లు.. ఆటలకు మైదానాలు.. అంతర్జాతీయ స్థాయిలో వంటకాలు
బస విషయంలో 5-నక్షత్రాల హోటల్‍లో ఉండే వసతులన్నీ ఈ క్లబ్‍లో ఉంటాయి. ఇక్కడ క్రికెట్‍ మైదానం సహా ఇండోర్‍, అవుట్‍డోర్‍ క్రీడలకు సంబంధించి అన్ని సౌకర్యాలున్నాయి. ఎయిర్‍ కండిషన్డ్ బార్‍లు, డైనింగ్‍ హాల్స్, బాంకెట్‍ హాల్స్తో పాటు భారీ సమావేశాలు, పార్టీల కోసం అనేక పచ్చిక బయళ్లు ఉన్నాయి. విశాలమైన బాల్‍రూమ్‍, సినిమాల ప్రదర్శనకు ఓపెన్‍ ఎయిర్‍ థియేటర్‍ కూడా ఉంది. ఈ క్లబ్‍లో పెద్ద ఫుడ్‍ కోర్ట్ ఉంది. ఇక్కడ కాంటినెంటల్‍ నుంచి మొఘల్‍ వరకు.. చైనీస్‍ నుంచి ఇటాలియన్‍ వరకు, ఉత్తర నుంచి దక్షిణ భారతీయ వంటకాల వరకూ అనేక రకాల వంటకాలు నోరూరిస్తాయి.
ఏటా ఈ క్లబ్‍లో తంబోలా నిర్వహిస్తుంటారు. దాదాపు వెయ్యి మంది వరకు ఇందులో పాల్గొంటుంటారు. అలాగే, నూతన సంవత్సర వేడుకలు కూడా నిర్వహిస్తారు. మరోవైపు స్పాన్సర్‍ వేడుకలను కూడా నిర్వహించేందుకు క్లబ్‍ నిర్వాహకులు అనుమతిస్తున్నారు. సభ్యులు సామాజిక సమావేశాలు నిర్వహించుకోవాలంటే కావాల్సిన సౌకర్యాలను క్లబ్‍ కల్పిస్తుంది.


భారతదేశంలో సొంతంగా ప్రింటింగ్‍ ప్రెస్‍ కలిగి ఉన్న ఏకైక క్లబ్‍ ఇది. అలాగే, ప్రపంచంలో అనుబంధంగా సెయిలింగ్‍ను కలిగి ఉన్న ఒకే ఒక్క క్లబ్‍ కూడా ఇదేనని అంటుంటారు. క్లబ్‍ ప్రాంగణంలో ప్రత్యేకంగా పెట్రోల్‍ బంకు కూడా ఉండటం విశేషం. ఇది భారత్‍తోపాటు యూఎస్‍ఏ, యూరప్‍, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆగ్నేయాసియాలోని సుమారు వంద అగశ్రేణి క్లబ్‍లతో అనుబంధంగా కొనసాగుతోంది.

  • సోర్స్ : ఇంటర్నెట్‍ నుండి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *