కుండపోతలోనూ కరెంటు వెలుగులు

2011

ఉమ్మడి ఆంధప్రదేశ్‍, అది వానాకాలం. భారీ వర్షాలకు రామగుండం, మంచిర్యాల మధ్యన గోదావరి నది ఒడ్డున ‘132 కేవీ ఈహెచ్‍టీ’ టవర్‍ కూలిపోయింది. విద్యుత్‍ ఉత్పత్తి కేంద్రాల నుంచి గోదావరి ఆవల ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‍ జిల్లాకు కరెంటు సరఫరాలో అంతరాయం కలిగింది. 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని సుమారు 25 లక్షల మంది ప్రజానీకం 10 రోజులకు పైగా చీకట్లో మగ్గిపోయారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేవు. తిరిగి టవర్‍ నిర్మాణ పనులు పూర్తిచేసి విద్యుత్‍ సరఫరాను పునరుద్ధరించే సరికి ప్రజలు ఆదిమకాలం నాటి చీకటి రోజులు అనుభవించారు.

2022


వారం రోజులుగా కుండపోత వానలు. సుమారు 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. 33 జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లి చిరపుంజిని తలపించాయి. కానీ రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్‍ అంతరాయాల్లేవు.ప్రజలకు కరెంటు కష్టాలు లేనే లేవు. ‘కరెంట్‍ షాక్‍తో వ్యక్తి మ•తి’ లాంటి వార్తలు లేవు. ట్రిప్పింగులు, బ్రేక్‍డౌన్లు ప్రజలను ఇబ్బంది పెట్టలేదు. అదీ ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితి. సాధారణ పరిపాలకులకు, ఒక దార్శనికునికి ఉండే స్పష్టమైన తేడా ఇది.వ్యసాయ, విద్యుత్‍, పారిశ్రామిక తదితర సమస్త రంగాల్లో తెలంగాణ ప్రజలు స్వయం పాలనను, స్వీయ అస్తిత్వాన్ని చూసుకుంటున్నారు. రాష్ట్రంలో విద్యుత్‍రంగం సాధించిన అపురూపమైన విజయాలకు గత వారం రోజులుగా రాష్ట్ర ప్రజలు అందుకున్న నిరుపమాన విద్యుత్‍ సేవలు ఒక మంచి ఉదాహరణ. తెలంగాణ ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్‍ విద్యుత్‍రంగంపై ప్రత్యేకమైన దృష్టి సారించారు. వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించి ఉత్పత్తి, సరఫరా, పంపిణీ రంగాలను ఉన్నతంగా తీర్చిదిద్దారు. తత్ఫలితంగా ఎండాకాలంలో కరెంటు కోతలు, వర్షాకాలంలో అస్తవ్యస్తమయ్యే నెట్‍వర్క్ ఇక గతించిన కాలమనే చెప్పాలి. అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా రాష్ట్ర ప్రజలకు విద్యుత్‍ను అందించే దశకు రాష్ట్ర విద్యుత్‍ సంస్థలు చేరుకున్నాయి. ఉత్పత్తి, సరఫరా రంగాల్లో స్వయం సమృద్ధి స్థాయికి చేరుకున్న తక్షణమే సీఎం కేసీఆర్‍ డిస్కంలపై దృష్టి కేంద్రీకరించారు. గ్రామ, పట్టణ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చేపట్టిన ‘పల్లె ప్రగతి’, ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమాల్లో భాగంగా విద్యుత్‍ పంపిణీ వ్యవస్థల పటిష్ఠతకు చర్యలు తీసుకున్నారు. అందులోభాగంగా ‘పవర్‍ వీక్‍’ అనే వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు.

నేడు భారతదేశంలోని ఏ రాష్ట్రానికి వెళ్లినా మనకు కనిపించే సాధారణ దృశ్యం ఒరిగిన స్తంభాలు, వేలాడుతున్న తీగలు, ప్రమాదకరమైన ట్రాన్స్ఫార్మర్లు. కానీ రాష్ట్రంలో ఈ పరిస్థితులను సమూలంగా మార్చమని సీఎం కేసీఆర్‍ ఆదేశాలు జారీచేశారు. ‘పవర్‍ వీక్‍’ ద్వారా విద్యుత్‍ ప్రమాదాలు కూడా తగ్గిపోయాయి. గ్రామాల్లో ‘పవర్‍ వీక్‍’ పనులకుగాను ప్రభుత్వం రూ.388 కోట్ల 84 లక్షలు వెచ్చించింది. పట్టణ ప్రాంతాల కోసం రూ.162 కోట్ల 51 లక్షల నిధులు వెచ్చించింది. దీంతో లైన్లు, ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు జరిగాయి. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేపట్టని బృహత్తరమైన కార్యక్రమం ‘పవర్‍ వీక్‍’.


ప్రభుత్వం ‘పవర్‍ వీక్‍’లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షా రెండు వేల కొత్త ఇంటర్‍పోల్స్ను ఏర్పాటుచేసింది. 4,60,387 ఒరిగిన స్తంభాలను సరిచేసింది. వేలాడుతున్న తీగలకు గాను 51,891 సపోర్టు తీగలను బిగించింది. రేయింబవళ్లు వెలుగుతున్న వీధి దీపాలను అవసరం ఉన్నప్పుడే వాడుకునేలా 2,15,402 స్తంభాలకు వీధి దీపాల వైర్లను లాగింది. వాటి కోసం వాడుతున్న కరెంటును లెక్కగట్టేందుకు 63,601 మీటర్లను బిగించింది. ‘పట్టణ ప్రగతి’ విషయానికి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీ పరిధుల్లో 24,527 కొత్త ఇంటర్‍పోల్స్ను ఏర్పర్చడమే కాకుండా 24,611 తుప్పుబట్టిన స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటుచేసి, 11,585 ఒరిగిన స్తంభాలను సరిచేయడం ముదావహం. 4,569 సపోర్ట్ తీగలను బిగించి, 25,421 స్పాన్ల వేలాడుతున్న తీగలను సరిచేసింది. వీధి దీపాలకు గాను 67,727 స్తంభాలకు ఫేజ్‍వైర్‍ను లాగి 2,256 మీటర్‍ బాక్సులను బిగించింది. అంతేకాకుండా ట్రాఫిక్‍కు అంతరాయం కలిగిస్తున్న 5,573 స్తంభాలను తొలగించి సమస్యను పరిష్కరించింది. ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్‍ దిమ్మెల స్థానంలో కొత్తగా 2,596 దిమ్మెలను నిర్మించి ప్రమాదకర పరిస్థితులను నివారించింది.


2019 సెప్టెంబర్‍ 6 నుంచి 2020 జనవరి 31 వరకు జరిగిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం, 2020 ఫిబ్రవరి 24 నుంచి జరిగిన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమాల్లో పైన పేర్కొన్న పనులన్నీ ప్రభుత్వం చేపట్టింది. దీంతో వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వానల్లో సైతం రాష్ట్ర ప్రజలకు విద్యుత్‍ అంతరాయం కలగలేదు. ఇంతటి ఘన విజయం వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్‍, ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‍రావు, ఎస్‍పీడీసీఎల్‍ సీఎండీ జి.రఘుమారెడ్డి, ఎన్‍పీడీసీఎల్‍ సీఎండీ ఏ.గోపాల్‍రావు, విద్యుత్‍ సంస్థలలో అన్నిస్థాయిల్లో పనిచేస్తున్న ఇంజినీర్లు, సిబ్బంది, కార్మికుల కృషి ఎంతో ఉన్నది.

తుల్జారాంసింగ్‍ ఠాకూర్‍,
78930 05313,
(అధ్యక్షులు, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్‍, టీఎస్‍ఎస్‍పీడీసీఎల్‍
)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *