ఉమ్మడి ఖమ్మం జిల్లా శిలా మరియు ఖనిజ సంపద

ఈ జిల్లాలోని ప్రాంతం రాష్ట్ర విభజన జరగక ముందు 15,886 చదరపు కిలోమీటర్లుగా వుండేది. కాని విభజన సమయంలో ఈ జిల్లాలోని ఏడు (7) మండలాలు ఆంధప్రదేశ్‍లో కలపబడినవి. అవి బూర్గంపహాడ్‍, కుక్కునూరు, నెల్లిపాక, చింతూర్‍, వి.ఆర్‍పురం మరియు కూనవరం మండలాలు. దీని వల్ల దాదాపు 3000 చదరపు కిలోమీటర్లు ఈ జిల్లా మరియు తెలంగాణ రాష్ట్రం కోల్పోయింది. ఈ జిల్లాకు ఉత్తర దిశలో చత్తీస్‍గఢ్‍ ఒడిషా రాష్ట్రాలు, దక్షిణాన ఆంధప్రదేశ్‍, పశ్చిమంలో వరంగల్‍, నల్గొండ మరియు వాయువ్యంలో కరీంనగర్‍ జిల్లాలు కలవు. ఈ జిల్లాలోని ముఖ్య పట్టణాలు, ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, ఎల్లందు మరియు అశ్వరావుపేట.


ఈ జిల్లాలోని పశ్చిమ ప్రాంతం ప్లేన్‍ ల్యాండ్‍లో అక్కడక్కడా గుట్టలుతో కూడి వుంటుంది. మధ్య భాగం రగ్గెడ్‍గా గుట్టలతో చూడగలం. తూర్పు మరియు ఉత్తర భాగం ఎత్తైన గుట్టలు, కొండలు ఈస్టర్న్ ఘాట్‍ రేంజ్‍లోనివి. ఈ జిల్లాలోని ముఖ్యనదులు గోదావరి, శబరి, కిన్నెరసాని, వైరా మరియు మున్నేరు. ఈ జిల్లాలో మూడు రకాల సాయిల్స్ను చూడగలము. అవి బ్లాక్‍ కాటన్‍ సాయిల్‍, గోదావరి నదికి ఇరువైపులా వుంటుంది. రెడ్‍ సాండీ సాయిల్‍ చాలా వరకు పశ్చిమ మరియు ఉత్తర ప్రాంతంలో ఉన్నది. తూర్పు ప్రాంతం యొక్క టిప్‍లో చిన్న భాగంలో రెడ్‍ లోమీ సాయిల్‍ను చూడగలము.

సీస్‍మొటెక్‍టానిక్‍స్టడీ ప్రకారం తూర్పు ప్రాంతం జోన్‍-lమధ్య భాగం జోన్‍-ఱఱ మిగతా ప్రాంతం అంతా జోన్‍-ll గా నిర్ధారించబడినది.
ఈ జిల్లాలోని భూభాగం స్థిరమైన ధార్‍వార్‍ క్రేటాన్‍లోని ప్రాంతంగా గుర్తించబడినది. ఈ ప్రాంతంలోని శిలలు ఆర్‍క్యన్‍ పీరియడ్‍ నుండి లోవర్‍ క్రిటేశియస్‍ పీరియడ్‍కు చెందిన ఇగ్నియస్‍, సెడిమెంటరీ మరియు మెటమార్ఫిక్‍ కోవకు చెందినవి. ఆర్‍క్యన్‍ పీరియడ్‍కు చెందిన పలు రకాల గ్రానైట్‍లు, నైస్‍లతో కూడిన బేస్‍మెంట్‍ కాంప్లెక్స్ వీటిపైన ప్రోటిరోజాయిక్‍ పీరియడ్‍కు చెందిన పోకాల్‍ సూపర్‍గ్రూప్‍లోని కంగ్లామరేట్‍ సాండ్‍స్టోన్‍, శేల్‍, లైమ్‍స్టోన్‍ డోలిమైట్‍ శిలలు వీటిపైన సుల్లవాయి సాండ్‍స్టోన్‍ మరియు గోండ్‍వానా సూపర్‍ గ్రూప్‍కు చెందిన సెడిమెంటరీ శిలలు ప్రానహీతా గోదావరి వ్యాలీలో చూడగలము. దీనికి దక్షిణ భాగంలో హైగ్రేడ్‍ మెట మార్ఫిక్‍ శిలలను చూడగలము. వీటిని ఖమ్మం శిస్ట్ బెల్ట్గా గుర్తించబడినది. వీటితో పాటు ఈస్టర్న్ ఘాట్‍ సూపర్‍గ్రూప్‍కు చెందిన చార్‍నొకైట్‍, కొండలైట్‍ మిగ్మటైట్‍ స్యూట్స్ యొక్క శిలలను చూడగలము.


ఖనిజసంపద:
ఈ జిల్లాలో ఖనిజ వనరులు పుష్కలంగా వున్నవి. బొగ్గు నిక్షేపాలకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం అనే విషయం చాలా వరకు అందరికీ తెలిసినదే. కాని ఇది కాకుండా చెప్పుకోదగ్గ ఐరన్‍ ఓర్‍, మార్బల్‍, లైమ్‍స్టోన్‍, డోలమైట్‍, బెరైట్‍, కాపర్‍ఓర్‍ క్రోమైట్‍, కోరండమ్‍, గెలీనీ, గార్నెట్‍, గ్రాఫైట్‍, కయనైట్‍ మరియు మైకా నిక్షేపాలు కూడా కలవు.
బొగ్గు నిక్షేపాలు:
ఈ జిల్లాలోని బొగ్గు నిక్షేపాలని సింగరేణి కాలరీస్‍ కంపెనీ గత వంద సంవత్సరాల నుండి మైనింగ్‍ చేస్తున్నారు. ఎల్లందు, కొత్తగూడెం ప్రాంతంలో ఈ బొగ్గు ఖనిజం గోండ్‍ వానా సూపర్‍ గ్రూప్‍లోని బారాకర్‍ ఫారమేశన్‍లో దొరుకుతున్నది. బొగ్గు సీమ్స్ తిక్‍నెస్‍ 3 మీటర్ల నుండి 38 మీటర్ల వరకు కలదు. ఈ బొగ్గులో తేమ చాలా ఎక్కువగా ఉంటుంది. బిటుమినస్‍గా వుంటుంది. కొత్తగూడెం. పెన్‍గడపా బొగ్గు బెల్ట్లో జి.ఎస్‍.ఐ ఎర్రగుంట, దామరచెర్ల అభుగూడెం, రామాపురం, అయ్యనపలెం, కొత్తగూడెం – పెన్‍గడపా మరియు పెన్న బల్లి బ్లాక్‍లు జియోలాజికల్‍ ఇన్‍వెస్టిగేషన్‍ జరిపింది. ఎర్రగుంట బ్లాక్‍లో బోర్‍హోల్స్ డ్రిల్‍ చేయగా అందులో కంగ్లామరేట్‍, పెబ్లి సాండ్‍స్టోన్‍, పలు రకాల క్లే బెడ్స్ ఇంటర్‍సెక్ట్ కావడం జరిగినది. ఈ ప్రదేశంలో ఎన్నో ఫాల్ట్లు ఉన్నవి. అవి నార్త్ వెస్ట్- సౌత్‍ ఈస్ట్, నార్త్ ఈస్ట్-సౌత్‍ వెస్ట్ దిశలలో కలవు. పెన్నబల్లి బ్లాక్‍లో నాలుగు ముఖ్యమైన కోల్‍-కార్బనేశియస్‍ శేల్‍ జోన్స్ గుర్తింపబడినవి. బారాకర్‍ ఫారమేశన్‍లో కొత్తగూడెం, పెన్‍గడప బ్లాక్‍లో జి.ఎస్‍.ఐ. మ్యాపింగ్‍తో పాటు డ్రిల్లింగ్‍ 135 చదరపు కిలోమీటర్లలో జరిపింది. అందులో లోవర్‍ గోండ్‍వానా సిక్యప్స్ అనగా తాల్‍చీర్‍ – బారాకర్‍ – బ్యారెన్‍ మెసెర్స్, కాంతీ ఫార్మేశన్స్ యొక్క శిలలను గుర్తించడం జరిగినది. ఈ ప్రాంతంలో 25 గ్రావిటి ఫాల్ట్లు గుర్తించబడినవి. దామరచెర్ల – అబ్బుగూడెం బ్లాక్‍లో మూడు చెప్పుకోదగ్గ కోల్‍సీమ్స్ గుర్తించబడినవి. ఇందులో ఒకటి లోవర్‍కాంతీ ఫార్మేశన్‍లో, రెండు బారాకర్‍ ఫారమేశనలో ఉన్నవి. ఎల్లందు బ్లాక్‍లో రెండు కోల్‍సీమ్స్ లోవర్‍ కాంతీ బారాకర్‍ ఫార్మేశనలలో గుర్తించబడినవి.


ఐరన్‍ ఓర్‍
బయ్యారం ఐరన్‍ ఓర్‍ బెల్ట్ శ్రీపురం నుండి కొత్తగూడెం వరకు విస్తరించి యున్నది. ఇది నార్త్, నార్త్ వెస్ట్ – సౌత్‍, సౌత్‍ ఈస్ట్ దిశలో 50 కి.మీ. పొడవు ఉన్న బెల్ట్, పాకాల్‍ శిలల కాంటాక్ట్ను ఆనుకుని ఉంటుంది. ఈ ప్రాంతంలోని ముఖ్యమైన శిలలు ఆరక్యన్‍ పీరియడ్‍కు చెందిన ఖమ్మం గ్రూప్‍ మరియు పిజిసికి చెందినవి. ఐరన్‍ ఓర్‍ ముఖ్యంగా రెండు స్ట్రాటిగ్రఫిక్‍ హోరైజెన్స్లో కలదు. 1) ఖమ్మం గ్రూప్‍లోని బ్యాండెడ్‍ హెమటైట్‍ మాగ్నటైట్‍ క్వారజైట్‍లో మరియు 2) మల్లంపల్లి గ్రూప్‍లోని గుంజేడా పందికుంట ఫార్మేశన్‍ హెమటైట్‍ లెన్సస్‍లో హైగ్రేడ్‍ ఐరన్‍ ఓర్‍ దొరుకుతుంది. ఐరన్‍ ఓర్‍ చాలా వరకు హెమలైట్‍ ఖనిజంతో పాటు చిన్న మొత్తంలో లిమొనైట్‍, జీస్‍పార్‍, చర్ట్ మరియు సిడెరైట్‍తో కూడి ఉంటుంది. ఈ బెల్ట్లో బయ్యారం ప్రాంతంలో ఐరన్‍ ఓర్‍ హైగ్రేడ్‍ హెమటైట్‍ రూపంలో చాలా ఎక్కువ తిక్‍నెస్‍తో ఉంటుంది. దీనికి తోడు ప్లొట్‍ ఓర్‍ కూడా ఉండటం విశేషం. ఈ బెల్ట్లో మొత్తం ఇన్‍సిటూ ఓర్‍ 8.7 మిలియన్‍ టన్స్. మరియు ప్లొట్‍ఓర్‍ 2.3 మిలియన్‍టన్స్ ఉన్నట్టు నిర్ధారించబడినది.
క్రోమైట్‍ :
ఈ ఖనిజం లింగన్నపేట, కోనాయపాలెం, జన్నారం ప్రాంతంలో అనగా థార్‍వార్‍ క్రేటాన్‍ యొక్క ఈ శాన్య భాగంలో ఉన్నది. ఈ ఖనిజం మెటా అల్్ర‍మెఫిక్‍ శిలలో కలదు. పైన చెప్పిన ప్రాంతలతో పాటు శ్రీరామ్‍గిరి మరియు గార్లవడ్డు వద్ద కూడా ఉన్నది. ఇది ఒక క్రోమైట్‍ బెల్ట్గా గుర్తించబడినది. ఫెర్రో అల్లోయిస్‍ కార్పొరేషన్‍ ఇక్కడ మైనింగ్‍ చేస్తున్నారు. ఈ బెల్ట్లో క్రోమైట్‍ 9-40 మీటర్ల పొడువు, 2-13 మీటర్ల వెడల్పు లెన్సెస్‍ కలవు. క్రోమియం వ్యాలూస్‍ 7.61% నుండి 32% వరకు వున్నవి.
కాపర్‍ :
కాపర్‍ ఖనిజం క్వార్టజ్ క్లోరైట్‍ శిస్ట్ మరియు క్వార్ట్జైట్‍, డోలోమైటలో వున్న క్వార్ట్జ్‍ వీన్స్లో దొరుకుతుంది. ఈ ఖనిజం మైలారం, మెల్లంబైలు, బంజర్‍, సర్‍కల్‍ మరియు వెంకటాపురం ప్రాంతాలలో ఉన్నది. ఇది ఒక మినరల్‍ బెల్ట్గా గుర్తించబడినది. మైలారంలో నార్త్ వెస్ట్ – సౌత్‍ ఈస్ట్ దిశలో 1.10 కి.మీ. పొడుగాటి ప్రాంతంలో దొరుకును. ఇక్కడ చాల్కొ పైరైట ముఖ్యమైన ఖనిజం. ఈ బ్లాక్‍లో 0.99 మిలియన్‍ టన్నుల ఓర్‍ రిజర్వ్ ఉన్నట్టు నిర్ధారించారు. ఇక్కడ కాపర్‍ (cu) 1.82%గా 250 మీటర్లలోతు వరకు ఉన్నది. దీనిని రాష్ట్ర మినరల్‍ డెవలప్‍మెంట్‍ కార్పొరేషన్‍ కొంతకాలం మైనింగ్‍ చేశారు.
మైలారంకు 30 కి.మీ. తూర్పుదిశలో వెంకటాపురం బ్లాక్‍ కలదు. ఇక్కడ కూడా చాల్కొపైరైట్‍ ముఖ్య ఖనిజం ఈ ఖనిజం ఇక్కడ నార్త్ వెస్ట్ – సౌత్‍ ఈస్ట్ దిశలో ఉన్న శియర్‍ జన్‍లో ఉన్నది 300 మీటర్ల పొడుగు ఉన్న జోన్‍లో 1.5-5.4 మీటర్ల వెడల్పు గల జోన్‍లో ఎవరేజ్‍ గ్రేడ్‍ ఓర్‍లో 1.272% నుండి 1.82% కాపర్‍ (cu) వున్నట్టు నిర్ధారించారు.


డోలమైట్‍:
డోలమైట్‍ (mgco3) ఖనిజం చాలా ప్రాంతాలలో పాకాల్‍ సూపర్‍ గ్రూప్‍ శిలలతో కూడి వున్నది. మాధారం ప్రాంతంలో 3.50 మిలియన్‍ టన్నులు sms గ్రేడ్‍ మరియు 39 మిలియన్‍ టన్నుల ఫక్స్ గ్రేడ్‍ రిజర్వ్ ఉన్నట్టు నిర్ధారించారు. 43.50 మీటర్ల లోతు వరకు. ఇవి కాక రఘనాదపాలెం, వేముల సర్వేలో 88 మి. టన్నులు 6 మీటర్ల లోతు వరకు మాగ్నీశ్యం లైమ్‍ స్టోన్‍ ఉన్నట్టు తెలియచేశారు.
మార్బల్‍:
వైట్‍, గ్రే, స్ట్రీకడ్‍ మరియు మాటల్డ్ మార్‍బుల్‍ వెరైటీస్‍ మండిటోగ్‍, నిజామ్‍పేట, జెస్తపల్లి మరియు బేతంపూడి ప్రాంతాలలో దొరుకును. మొండిటోగ్‍లో 25 MT, పుబాలిలో 50 MT, తకాల గూడెంలో 12 MT, నిజాంపేటలో 111 MT, జెస్తపల్లిలో 0.2 MT రిజర్వ్ ఉన్నట్టు నిర్ధారించారు.
గార్నెట్‍:
ఈ ఖనిజం శిస్ట్బెల్ట్ శిలలో దొరుకును. వీటి యొక్క క్రిస్టల్స్ పింక్‍, బ్రౌన్‍ రెడ్‍ రంగులలో ఉంటుంది. ఇది గరీబ్‍పేట, ఎల్లందు ప్రాంతాలలో ఉన్నది. దాదాపు 31 మీ రిజర్వు ఉన్నట్టు నిర్దారించారు.
బెరైట్‍ (Ba So4) :
ఈ ఖనిజం బేరియంకు (Ba) మేన్‍ సోర్స్, దీనిలో 65% BaO (బేరియం ఆక్సైడ్‍) ఉంటుంది. దీన్ని రబ్బర్‍, టెక్స్టైల్‍, పేపర్‍, కార్డ్బోర్డ్, లెతర్‍, ఆయిల్‍, ప్లాస్టిక్‍, సిరామిక్‍ పరిశ్రమలలో ఉపయోగిస్తారు. ఈ జిల్లాలో ఈ ఖనిజం లెన్సెస్‍, స్ట్రంజర్స, వీన్స్ రూపంలో కలదు. వీటి వెడలి కొన్ని సెంటిమీటర్ల నుండి 6 మీటర్ల వరకు వున్నవి. మరి 300 మీటర్ల పొడవు వరకు దొరుకును. ఈ ఖనిజం దొరికే ప్రాంతాలు రుద్రం కోట, వెంకటయ్యపాలెం, గోపాల్‍పూర్‍ కొడయూర్‍, చెరువుపురం మరియు పోచారం. కోటా ఫార్మేశన్‍లో లైమ్‍స్టోన్‍ నిక్షేపాలు దొరుకును ఇవి కాకుండా క్లేస్‍ గోండ్‍ వానా శిలలో పలుచోట్ల, కొరండం, కయనైట్‍ సెమిప్రీశియస్‍ స్టోన్స్ అల్ట్రాబెసిక్‍ శిలల్లో, సైయనైట్‍లో కోనంపల్లి, శిబావి, హనుమరెడ్డిపల్లి ప్రాంతాలలో దొరుకును.


తాడ్లపల్లి, గుంపెన వద్ద గ్లాస్‍ పరిశ్రమకు పనికి వచ్చే క్వార్ట్జ్‍ వీన్‍ కలదు. శిస్ట్లలో మైకా శిస్టోస్‍ శిలల్లో గ్రాఫైట ఖనిజం పాల్వంచ, గుండ్లమడుగు కావరి గుంటాల్‍, సిగురు మామిడి, జీడి గుప్ప ప్రాంతాలలో ఉన్నది.

  • కమతం మహేందర్‍ రెడ్డి,
    ఎ : 90320 12955

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *