మృత్యువుతో ముఖాముఖ

(గత సంచిక తరువాయి)
కామ్రేడ్‍ చండ్ర రాజేశ్వరరావుగారి అంత్యక్రియలు పంజాగుట్ట స్మశానంలో జరిగా••. ఆ వీరుడి అంతిమ యాత్రలో అశేష విషాద జన సవ•ద్రాలు అలలు అలలుగా కదిలి స్మశానం దాకా విస్తరించా••. చితి మంటలు చెలరేగుతున్నపుడు పడమటి ఆకాశంలో సింధూరవర్ణంలో కుంగుతున్న సూర్యుడు కాస్తా వంగి ఆ వీరుడి నుదుటిని వ•ద్దాడుతున్నట్లు నాకు భ్రమ కలిగింది. మావోయిస్టు నాయకుడు ‘‘ఆజాద్‍’’ ఎలియాస్‍ చెరుకూరి రాజ్‍కుమార్‍ ఎన్‍కౌంటర్‍ అయ్యాక ఆయన అంత్యక్రియలు కూడా అదే స్మశానంలో జరుగుతుంటే ఆ రుద్రభూమిలో నేనూ, ఆర్టిస్టు మోహనూ నిలబడి మధ్య ఆసియా చరిత్రను, మోహిత్‍సేన్‍ స్వీయ చరిత్ర “A travelor and the Road” గురించి హా••గా గంటసేపు మాట్లాడుకున్నాం. ఆ వీరుడి మరణం మాకు విషాదాన్ని కలిగించలేదు. ఎందుకంటే రావిశాస్త్రి భాషలో వీరులు ఎక్కువ కాలం జీవించరు. పోరాటాలలో త్వరగానే మరణిస్తారు. ఏ వీరుడైనా ఎక్కువ కాలం జీవించాడంటే వాడు దొంగ వీరుడైనా్య ండాలి లేదా అవకాశావాద వీరుడైనా్య ండాలి. ఒకప్పటి వీరులు ప్రస్తుతం తెలంగాణ వచ్చినంక అవకాశావాదంతో ఎట్లా రంగులు మారుస్తున్నారో ఎట్లా పిల్లి వె•గ్గలు వేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం కదా!
చలం తన చావు గురించి చాలా చిత్రమైన అభిప్రాయం చెప్పాడు. ‘‘నేను చనిపోయాక నా శవం వ•ందు నిలబడి ఎవరూ ఏడవద్దు. ఎవరైనా ఏడ్చారో జాగ్రత్త పాడెమీద నుండి లేచి చితక తంతాను’’ అన్నాడు.


అమితాబచన్‍ తండ్రి హరివంశ్‍ రాయ్‍ బచన్‍ ‘‘మధుశాల’’ కావ్యకర్త తన స్వీయచరిత్రలో ఇలా అన్నాడు. ‘‘నేను ప్రతిరోజు రాత్రి పన్నెండు గంటలకు పడుకుని మళ్లీ ఉదయం వ•డు గంటలకే నిద్రలేచి త్రివేణీ సంగమంలో స్నానానికి వెళ్తాను. నేను మధ్యాహ్నం కూడా నిద్ర పోను ఎందుకంటె ఆరాం హారాం హై. నేను చనిపోగానే త్వరగా దహనం చేయకండి. నా శవాన్ని రెండు వ•డు రోజులు అట్లే పెట్టండి. నేను కంటి నిండా నిద్రపోవాలి’’.
‘‘చావు కూడా పెళ్లిలాంటిదే’’ అన్న సామెత తెలంగాణాలో ఇప్పటికీ సార్థకంగానే ఉన్నది. దళితులు, బహుజన సవ•దాయాల అంత్యక్రియలు దీనికి నిదర్శనం. మేళతాళాలతో మనిషిని సగౌరవంగా సాగనంపుతారు. అది కూడా పెళ్లిలాంటి హడావుడే. నిరక్షరాసులైన గ్రామీణ తల్లుల అక్కల చెల్లెళ్ల శోకం సుదీర్ఘంగా పో••న వారి గురించి వైన వైనాలుగా వర్ణిస్తూ, జ్ఞాపకం చేసుకుంటూ బహు కవితాత్మక శోకంగా ఉంటుంది. అది మావ•లు శోకంగా కాక రసాత్మక శ్లోకంగా మారుతుంది.


పంజాబీలకు మరణం చాలా తేలికైన విషయం. దేశభక్తులు, వీరులు చనిపోతే ఎవరూ కంటతడి పెట్టరు. అదొక అపచారంగా భావిస్తారు. వారి ఆత్మలను అగౌరవ పరిచినట్లు బాధపడతారు. ‘‘దేశ్‍ కెలియె ఇస్‍ రాహ్‍మె మర్నా సౌ జన్మోంకా సమాన్‍ హై’’ అని గర్వపడతారు.
మిలీనియంకు ఒకటిరెండు రోజుల వ•ందు ఎర్రం రెడ్డి సంతోష్‍రెడ్డి, నల్లా ఆదిరెడ్డి, నరేష్‍ల ఎన్‍కౌంటర్‍ జరిగింది. నేను కడివెండికి వెళ్లి సంతోష్‍రెడ్డి అంత్యక్రియలలో పాల్గొన్నాను. దొడ్డికొమరయ్య అమరుడైన నేల అది. త్యాగాల పరంపర, వారసత్వం అక్కడ ఆ నేలమీద నేటికీ కొనసాగుతూనే
ఉంది. దేశం నలువ•లల్నుండి వచ్చిన వేలాది మంది జనం ‘‘జైబోలో జైబోలో సంతోషన్నకు జైబోలో’’ అంటూ ఆ వీరుడిని పాటల పల్లకీలో ఊరేగిస్తూ ఆకాశం అవతలివైపుకు సాగనంపారు. ఆ దృశ్యాలని చూస్తుంటే నాకు ‘‘కె మర్‍ కె భీ కిసీ కో యాద్‍ ఆ••ంగే – జీనా ఇసీ కా నామ్‍ హై’’ పాట జ్ఞాపకం వచ్చింది.


‘‘మరణానంతర జీవితం’’ అని ఒక మాట ఉంది. అంటే లైఫ్‍ ఆఫ్టర్‍ డెత్‍ అన్న మాట. బాడీ డొనేషన్‍ ఈ కోవకే చెందుతుంది. కాళోజీ సోదరులు, కొండపల్లి కోటేశ్వరమ్మగారు ఇంకా అనేక మంది తమ శరీరాలను మెడికల్‍ కాలేజీలకు దానంగా ఇచ్చారు. ఎంత గొప్ప ఉదాత్త భావన. చనిపో••నా సమాజానికి ఉపయోగపడటం అంటే ఇదే కదా!


క్యాన్సర్‍ వ్యాధితో బాధపడుతూ అమెరికాలో చికిత్స పొందుతున్న సినీనటి సోనాలిబింద్రే ఒక మాట అన్నది. ‘‘నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. అందుకే క్యాన్సర్‍తో పోరాడుతున్నా. అ••నా జీవితం అంటే ఏమిటి? చివరి క్షణం వరకూ నేర్చుకోవటమే కదా?’’ ఈ మాటలు నాకు అబ్బురమనిపించి జయలలిత జ్ఞాపకం వచ్చింది. ఆమె చెన్నై అపోలో ఆసుపత్రిలో అంపశయ్యపై పడుకుని ఉన్నా జ్ఞానతృష్ణతో ‘ది ప్రైవేట్‍ లైఫ్‍ ఆఫ్‍ మావో’ పుస్తకాన్ని ఒక డాక్టర్‍తో ప్రతిరోజు చదివించుకుని వినేదట. ఆ వార్త చదివిన నేను ఆమె తప్పులన్నీ ఆ క్షణంలో క్షమించివేశాను. ఈ సందర్భంలో నాకు మళ్లీ సోక్రటీసు, భగత్‍సింగు జ్ఞాపకం వస్తున్నారు. తెల్లారితే సోక్రటీసుకు గరళపానంతో మరణశిక్ష. ఆయనకు వీధిలో ఏక్‍తారా సంగీతం వినబడి ఆ కళాకారుణ్ణి తనున్న గదికి రప్పించి ఎంతో ఇష్టంగా ఆ వా••ద్యాన్ని నేర్చుకున్నాడట. దానికి ఆయన శిష్యులు ఆశ్చర్యపడుతుంటే ‘‘జీవితమంటే చివరి క్షణం వరకు నేర్చుకోవటమే కదా’’ అన్నాడు.


భగత్‍సింగ్‍ కూడా అంతే తెల్లారితే ఉరికంబానికి ఉయ్యాలలూగవలసిన వాడు ఆ రాత్రంతా లెనిన్‍ పుస్తకాన్ని చదువుతూ కూచున్నాడట. నిజమైన చదువు, జ్ఞానతృష్ణ అంటే అది. ఇంటి వ•ందు గోడపైన ఎం.ఎ. పి.హెచ్‍డి బోర్డులు తగిలించుకుని వ•రిసిపోవటం కాదు. జాక్‍ లండన్‍ ఒక మాట అంటాడు. ‘‘జీవితం అంటే బత్రుకును ఈడుస్తూ బ్రతకటం కాదు. జీవితాన్ని సంపూర్ణంగా చివరి క్షణం వరకూ జీవించటం(Life is to Live not to exists).


ఇదంతా సరేగాని ‘‘బొందల గడ్డ’’ గురించి మరికొంత సేపు మజేదార్‍ వ•చ్చట్లు మాట్లాడుకుందాం. ఎక్కడికి వెళ్లినా ఏ దేశమేగినా సమాధులను సందర్శించటం నాకిష్టమైన వ్యాపకం. ఆ మాటకొస్తే కుష్వత్‍ సింగ్‍ కూడా అంతే. తీరిక దొరికినపుడల్లా ఢిల్లీ యవ•నా తీరంలోని ‘‘నిగం భోద్‍ ఘాట్‍’’కు వెళ్లి గంటల తరబడి కూచునేవాడు. ‘‘నేనొక సాయంకాలం ఒకానొక స్మశానానికి వెళ్లాను. ఆ వాతావరణం చాలా ప్రశాంతంగా, అందంగా అనిపించి, అక్కడే ఆగిపోవాలని, ఆ రాత్రి ఆ నీరవ నిశ్శబ్ద నిశిరాత్రి వేళ రా••-రా•• కరిగే గాంధారి వేళలో ఎవరైనా ఒక స్త్రీతో అక్కడ ఆ రుధ్రభూమిలో రమించాలని నాకు వింత కోరిక లిప్తకాలంపాటు జనించింది.’’ మర్యాదస్తులకు ఈ మాట రుచించదు గాన ఇంతటితో ఈ ప్రస్తావన వ•గిస్తాను.
న్యూజిలాండుకు వెళ్లినప్పుడు నేనూ, నా శ్రీమతి అక్కడి సమాధులను సందర్శించి ఆ పవిత్రతకు, ప్రశాంత వాతావరణానికి పులకించి కడుంగడు సంతసించాం. రెండు, వ•డు వందల ఏళ్ల క్రితం సమాధులు, శుభ్రంగా, అందంగా చెక్కుచెదరకుండా, కావ్యాత్మకమైన స్మ•తి గీతాలతో, వాక్యాలతో పురాతన వైభవాలతో చాలా అందంగా ఉన్నా••. మా ఆనందం పరవళ్లుపొంగి ‘‘అర్జెంటుగా చనిపో•• ఇక్కడే సమాధులు కట్టించుకుంటే ఎంత బాగుంటుందో’’ అని కాసేపు కలలు కన్నాం.


ఆస్ట్రేలియా సిడ్నీ పట్టణం పారామెట్టా ప్రాంతంలో ఒక సిమెట్రీని సందర్శించాను. వ•డువందల ఏళ్ల నాటి సమాధులను, ఎపిటాఫ్‍ల సమాచారంతో సహా వీరు భద్రంగా రక్షించు కుంటున్నారు. చైనాలోని కాష్గర్‍లో 12వ శతాబ్దం కాలం నాటి ఇద్దరు వ•స్లిం కవుల సమాధులు భద్రంగా, కళాత్మకంగా
ఉండటం చూసాను. మనదేశంలో సమాధులను కళాత్మకంగా నిర్మించుకునే సంస్క•తి ముస్లిం పరిపాలకులతో ప్రారంభ మయ్యింది. మరి మనం మన పోతన, శ్రీనాధుడు, వేమన సమాధుల్ని ఎందుకు కాపాడుకోలేక పోయాం? అది మన సాంస్క•తిక దారిద్య్రం కాదా? చైనాలోని బీజింగ్‍ తియాన్మిన్‍ స్క్వేర్‍లో చైర్మన్‍ మావో వ•సోలియం అందులో ఆయన పార్ధివదేహాన్ని సందర్శించాను. మరి మనం ఆ గౌరవాన్ని గాంధీ, నెహ్రూలకు ఎందుకు కల్పించలేకపోయాం? వెనీస్‍కు వెళ్లినప్పుడు మార్కోపోలో సమాధి కోసం వెదికాను కాని సమయం చాలక ఆ ప్రయత్నం ఫలించలేదు. డార్జిలింగుకు వెళ్లినపుడు అక్కడి వ•ర్దాహట్టీ స్మశాన వాటికలో పండిత్‍ రాహుల్‍ సాంకృత్యాయన్‍ సమాధిని సందర్శించి నా నివాళి అర్పించాను. ఆయన రచనల వలనే నేను లోక సంచారిగా మారాను.


లక్నోలో రెసిడెన్సీ బంగళా లోపల వున్న ఇంగ్లీషువారి సమాధులు నాకు చాలా నచ్చాయి. విశాలమైన ఆకుపచ్చని పచ్చిక మైదానాల మధ్య ఎర్రరాతి ఇటుకలతో 1857 తిరుగుబాటు కాలంలో మరణించిన ఆంగ్లేయుల సమాధులవి. రెండు మూడు సంవత్సరాల బాలబాలికల సమాధులు కూడా ఉన్నాయి. ప్రతి సమాధిపై ఒక ‘‘ఎపిటాప్‍’’ చాలా కళాత్మకంగా ఉంది. అక్కడి పరిశుభ్రత మళ్లీ నాకు ఎక్కడా కానరాలేదు. ఆ సమాధులన్నీ కాలం చెక్కిలి మీద ఘనీభవించిన కన్నీటి చుక్కలే!
మనం జీవితమంతా శుచి, శుభ్రతా, మడి, ఆచారం, అంటూ సొంటూ అని మహా పవిత్రంగా కడిగిన వ•త్యాల్లా బ్రతుకుతాం కాని చివరి మజిలీ చేరుకునే సరికి అక్కడ ఆ ‘‘పితృవనం’’లో (స్మశానానికి మరో పేరు) పందులు పశువులు దొర్లుతుంటా••. మనుషుల మలవ•త్ర వాసనలు. వ•రికి నీళ్ల కాలువలే మరణించిన మనుషులకు వీడ్కోలు పలికేది, ఆఖరి అల్విదాలు చెప్పేది ఆ అసహ్య వాతావరణంలోనే! ఇక్కడ మనుషులకు బ్రతికున్నప్పుడే ఏ విలువా, గౌరవం లేదు. ఇక మరణించిన తర్వాత కూడానా? పట్టుబట్టల పీతాంబరాలు ధరించే హిందూమత పండితులు, పీఠాధిపతులు హిందూ స్మశానాలు ఇంత ఘోరంగా, అధ్వాన్నంగా ఎందుకు ఉన్నాయో ఆలోచించరా? తల్లావజుల పతంజలి శాస్త్రి ఈ అంశంపై ‘‘వైతరిణికీవల’’ అను మంచి కథ రాశారు.


పన్నెండవ శతాబ్దపు ప్రవ•ఖ పర్షియన్‍ కవి ఖాజా హఫీజ్‍ షిరాజ్‍. ఆయన ఇరాన్‍లోని షిరాజ్‍ అన్న పట్టణంలో జన్మించాడు. అందుకే తన పేరు చివర షిరాజ్‍ అన్న పేరు పెట్టుకున్నాడు. అరబ్బీ, పారసీ, ఉర్దూ కవులందరూ తమ ‘‘తఖల్లూస్‍’’ (కలం పేరు)లో తమ జన్మభూమిని పేర్కొనే సత్సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఉదాహరణకు హస్రత్‍ జైపురీ, సాహిర్‍ లుథియాన్వీ, ఫిరాక్‍ గోరక్‍పూరీ, షకీల్‍ బదా•••నీ, జోష్‍ మలిహాబాదీ, కైఫీ ఆజ్మీ వగైరా. ఈ సంప్రదాయం మన హిందీ తెలుగు కవులకు లేదు. జననీ జన్మభూమి అని పొడుగు పొడుగు పాటలు మాత్రం దీర్ఘాలు తీస్తూ పాడుతారు. హఫీజ్‍ షిరాజ్‍ సమాధిపై శిలాఫలకంలో ఇలా రాసి ఉంది.


‘‘ధూళి నుండి జన్మించాను.
చివరికి ధూళిలో ధూళిగా మారాను’’.
మట్టి నుండి పుట్టిన మనం చివరాఖరికి మట్టిలోకి చేరుకుంటాం అన్నది మన తెలుగుమాట. నేలతల్లి ఒడిలో వాలి పెను విశ్రాంతిలోకి వెళ్లిపోవటమే ద్రవిడ సంప్రదాయం. ఇది హరప్పా, సింధూ నాగరికతల నుండి కొనసాగుతుంది. రాకాసి గుండ్లు (కైరన్లు) దీనికి మంచి ఉదాహరణ. ద్రవిడ సంప్రదాయమే కాదు శైవ మతం కూడా ‘‘ఖననం’’ పద్దతినే పాటిస్తుంది. దళిత బహుజనులందరూ ద్రవిడులే కావున నేల తల్లి ఒడిలోకి చేరుకోవటమే వారికి ఇష్టం. దీనికి భిన్నంగా ‘‘దహనం’’ పద్దతిని మధ్యాసియా నుండి వచ్చిన విదేశీ•••లు, దండయాత్రికులైన ఆర్యులు ప్రవేశపెట్టారు. ‘‘అగ్నిదేవుడు’’ వారికి ఆరాధ్యుడు కావున దహనం సంప్రదాయం చాలా ఆలస్యంగా ప్రవేశపెట్ట బడింది. హిందూమతం, బ్రాహ్మణిజంలోని కర్మకాండలకు ఇది దగ్గరగా ఉంటుంది.


బౌద్దంలో హీనయానం శాఖ ఒకటుంది. మరణానంతరం కూడా ఈ లోకానికి ఉపయోగపడాలనే సదుద్దేశ్యం వీరిది. టిబెట్‍, మంగోలియా, గోబీ ఎడారులలో నివసించే ఈ శాఖవారు మృతదేహాలను ఒక ఎత్తైన స్థలంలోకి తీసుకెళ్లి కత్తులు, గొడ్డళ్లతో శవాలను ఖండఖండాలుగా నరికి రాబందులకు వేస్తారు. పార్సీలు మాత్రం ఒక గుట్ట మీద ఒక బావి తవ్వి దానిపై ఒక ఇనుప జల్లెడలాంటిది అమర్చి శవాలను దానిపై పడుకోబెడతారు. కాకులు, రాబందులకు ఆ శవం ఆహారంగా మారుతుంది. మిగిలిన ఎవ•కలన్నీ ఆ ఇనుప జల్లెడపై నుండి బావిలోకి జారిపోతా••. ఇతర ప్రాణులపట్ల ప్రేమ వల్ల వారు ఈ పనిచేస్తారు. మన హైద్రాబాద్‍ నగరంలోని పార్సీగుట్ట దీనికి సంబంధించినదే.
కొన్ని వందల సంవత్సరాల క్రితం జపాన్‍లోని ఒక గ్రామ ప్రజలు 60 సంవత్సరాలు దాటిన తమ తల్లి తండ్రులను వీపున కట్టుకుని మోసుకుంటూ ఎన్నో రోజులు నడిచి చాలా కష్టంగా ‘‘నారాయమ’’ అనే ఒక పర్వతాన్ని ఎక్కి ఆ శిఖరాగ్రంపై వారిని ఒంటరిగా వదిలి వెనక్కి వచ్చేవారు.
ఆకలిదప్పులతో ఆ ముసలివారు ప్రాణాలు వదలగానే ఆశతో ఎదురు చూస్తున్న రాబందులకు ఆహారంగా మారేవారు. కరువు పరిస్థితులలో వారు అట్లా చేసారు. The ballad of Narayama అన్న జపాన్‍సీన్మా కథ అదే.


ప్రస్తుతం అన్నీ ఉన్నా ముసలి తల్లితండ్రుల్ని వృద్ధాశ్రమాలకు పంపటం ఆ ‘‘నారాయమా’’ కంటె అన్యాయం కాదా? ఆర్యులు ప్రవేశపెట్టిన ‘‘దహనం’’ పద్దతి పుణ్యమా అని పెద్దఎత్తున దేశంలో పర్యావరణ ప్రమాదం వ•ంచుకొస్తుంది. అరణ్యాలు అంతరించటమే గాక జీవనదుల జలాలన్నీ కలుషితమవుతున్నా••. దేశంలో ప్రతి ఏటా యాభై లక్షల మంది చనిపోతున్నారు. ఇందులో మెజారిటీ మృత దేహాలను దహనం చేస్తున్నారు. ఒక్కో మృత దేహ దహనానికి నాలుగు లేదా ఐదు క్వింటాళ్ల కట్టెలు అవసరం. ఈ లెక్కన ప్రతి సంవత్సరం ఐదారు కోట్ల చెట్లు నాశనమవుతున్నా••. అరణ్యాలు, వనసంపద నశించటమే గాక ఈ కట్టెల కాలుష్యం వలన నగరాలలో వాతావరణం కలుషితమవుతుంది. రెండు కోట్ల జనాభా కల్గిన ఢిల్లీలో అరవైకి పైగా స్మశాన వాటికలున్నా••. ఒక నిగం బోధ్‍ ఘాట్‍లోనే ప్రతిరోజు 50 లేదా 60 మృతదేహాలు దహనం చేయబడుతున్నా••. ఢిల్లీ నగరమే కాక పక్కనున్న యవ•నా నది కూడా కాలుష్యానికి గురి అవుతుంది. కాశీలో ఏకంగా శవాలనే గంగలోకి వదిలేస్తారు. బొందితోనే కైలాసం చేరుకోవటానికి. కరోనా కాలంలో గంగా, యమునా నదిలో శవాలు కుప్పలు కుప్పలుగా తేలి ప్రవహించాయి.


దీనికి భిన్నంగా ‘‘హరిత స్మశాన వాటికల’’ ప్రచారం నగరాలలో ప్రవేశపెట్ట బడుతుంది. అవి వ•డు నాలుగు పద్ధతులు. అందులో విద్యుత్‍ దహన వాటిక ఒక పద్దతి. ఒకప్పుడు బన్సీలాల్‍ పేట, అంబర్‍పేట స్మశాన వాటికల్లో వీటిని ప్రవేశపెట్టారు. కాని స్పందన లేక అవన్నీ తుప్పుపట్టి చెడిపోయా••.
మనం జీవిత కాలంలో రెండు చెట్లని పెంచుకున్నా, మరణించిన తర్వాత మరో నాలుగు చెట్లను నాశనం చేయవద్దని శాస్త్రజ్ఞులు ఘోషిస్తున్నారు.
‘‘మౌత్‍ కో సామ్నే రఖ్‍ లేకే జీనా’’ అని మా బాపు చెపుతూ ఉండేవాడు. దాని వలన ఈ క్రింది ‘‘ఎరుక’’ కలుగుతుంది.


‘‘సజన్‍ రే జూట్‍ మత్‍ బోలో
ఖుదా కే పాస్‍ జానా హై
న హాథీ హై న ఘోడా హై
వహాఁ పైదల్‍ హీ జానా హై’’
(తీస్రీ ఖసం సీన్మా పాట)


-పరవస్తు లోకేశ్వర్‍,
ఎ: 91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *