లక్క గాజులకు ‘జీఐ’(GI) నగిషీ

హైదరాబాద్‍ నగరానికి మరో గుర్తింపు దక్కింది. పాతబస్తీలోని లక్క గాజులకు జియోగ్రాఫికల్‍ ఇండికేషన్‍ (Geographical Indication) గుర్తింపు లభించింది. ఇదివరకే హైదరాబాద్‍ హలీమ్‍కు జీఐ ట్యాగ్‍ దక్కగా.. తాజాగా లక్క గాజులు ఆ జాబితాలో చేరాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చార్మినార్‍ లాడ్‍బజార్‍ లాక్‍ గాజులను తెలుగులో లక్క రాళ్ల గాజులుగా పిలుస్తుంటారు. తాజాగా ఈ లక్క గాజులకు చెన్నైలోని కేంద్ర ప్రభుత్వ GI Registration Tagను ప్రకటించింది. తెలంగాణలో జీఐ ట్యాగ్‍ అందుకున్న 17వ ఉత్పత్తి ఇది.


చేతితోనే తయారీ
హైదరాబాద్‍ పాతబస్తీ గాజులకు ప్రసిద్ధి. ఇక్కడ రకరకాల గాజులు తయారవుతుంటాయి. అందులో లక్క రాళ్ల గాజులు స్థానిక, అంతర్జాతీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందాయి. ఈ గాజుల తయారీ క్లిష్టమైన పక్రియ. రెసిన్‍ను కొలిమిపై కరిగిస్తే లక్క వస్తుంది. దీన్ని వ•త్తాకారంలో మలిచి.. దానిపై స్ఫటికాలు, రాళ్లు, పూసలు, అద్దాలను హస్తకళాకారులు అందంగా చేతులతోనే పొదుగుతారు. కాలక్రమంలో వీటి డిజైన్లలో ఎన్నో మార్పులొచ్చాయి. మొగలుల కాలంలో ఈ కళ ఉద్భవించిందని చెబుతారు. రాజకుటుంబాల్లోని మహిళలు ఈ గాజులు ధరించేవారు. ఇప్పుడు వేడుకల్లో వీటిని ధరించడానికి మహిళలు ఇష్టపడుతున్నారు.


లాడ్‍ బజార్‍లో మాత్రమే దొరికే లక్క గాజులకు GI Tag గుర్తింపు కోసం 2022లో క్రిసెంట్‍ హ్యాండీక్రాఫ్టస్ ఆర్టిజన్స్ వెల్‍ఫేర్‍ అసోసియేషన్‍ దరఖాస్తు చేసింది. తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయ సహకారాలు అందించింది. 18 నెలల పరిశీలన అనంతరం GI Tag మంజూరైంది. త్వరలోనే ధ్రువీకరణ పత్రం రానుంది. ‘‘లాక్‍ గాజుల తయారీలో 6 వేల కుటుంబాలు పాలు పంచుకుంటున్నాయి. GI Tag .. వీరందరికీ గుర్తింపు, గౌరవాన్ని తీసుకొస్తుంది. మంచి డిజైన్‍లను రూపొందించడానికి, కొత్తవి తయారు చేసేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మార్కెట్లో గాజులకు డిమాండ్‍తో పాటు అమ్మకాలు పెరిగి హస్తకళాకారుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది’’ అని ఆర్టిజన్స్ అసోసియేషన్‍ అధ్యక్షుడు మహ్మద్‍ హిసాముద్దీన్‍ ఆశాభావం వ్యక్తం చేశారు.

  • కె. సచిన్‍, ఎ : 8686664949

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *