‘‘ఎవని మనసు శిశు స్వచ్ఛమెవని బుద్ధి
జాతి చైతన్య సంపన్నమెవని యాత్మ
సర్వతో ముఖ కల్యాణ సవనకుండ
మట్టివాని గుండెల నుండి బుట్టు కవిత’’
అని కవికి కవితోత్రికి భాష్యం చెప్పిన అనుముల క•ష్ణమూర్తి గారు కొద్దిక•తులు మాత్రమే వెలువరించినా కవులలో మహాకవి, పండితులలో మహా పండితులు.
ఆంధ్రనగరికి (ఓరుగల్లుకు) అనుబంధంగా మణిగిరి (మడికొండ) అనే గ్రామమున్నది. అది తెలుగుదేశంలోనే ప్రఖ్యాతిగాంచిన గ్రామం. ఎందుకంటే ఆ గ్రామం నిండా పండితులు, కవులే. కాళోజీ సోదరులు, వానమామలై సోదరులు, పల్లా దుర్గయ్య గారు, బిరుదురాజు రామరాజు, అనుముల వంశం, మోత్కూరి వంశం ఇలా.. ఎన్ని కవి పండిత కుటుంబాలో, అలాంటి గ్రామంలో మే 16, 1923న ఒక అనుముల వంశంలో శ్యామలాదేవి, పండరినాథ శాస్త్రి దంపతులకు అనుముల క•ష్ణమూర్తి గారు జన్మించారు.
వీరి వంశంలో పూర్వీకులు క•ష్ణయ్య గారు ఎక్కడి నుండో వచ్చి వరంగల్‍కు కొంతదూరంలో ఉన్న ‘ఉప్పుల’ గ్రామంలో స్థిరపడ్డారు. వీరి పెద్దకుమారులు రామక•ష్ణయ్య గారు, అనుముల క•ష్ణమూర్తి తాతగారు (పితామహులు) భాగవత పారాయణం చేస్తుండేవారు. వేద పండితులు, మంత్రశాస్త్రాన్ని అధ్యయనం చేసినవారు. సాహిత్యంపై అపార గౌరవమున్న మడికొండ దొర తౌటంరెడ్డి గోపాలరెడ్డి గారు రామక•ష్ణయ్య గారిని మడికొండకు ఆహ్వానించి వారి జీవిక కోసం కొంత భూమినిచ్చారు. అట్లా రామక•ష్ణయ్య గారు మడికొండలో స్థిరపడ్డారు. అనేక ధార్మికపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామవాసుల గౌరవాభిమానాలను పొందారు.
గ్రామానికి తూర్పున ఉన్న పొడవాటి మెట్టుగుట్టపై రామలింగేశ్వరాలయం వారికి భక్తిదాయకమైనవది. అనుముల క•ష్ణమూర్తి గారు మెట్టు రామలింగేశ్వర శతకం రాశారందుకే. క్రమం తప్పకుండా మడికొండలో భాగవత సప్తాహాలు జరిపి అన్నదాన కార్యక్రమాలు జరుపుతుండేవారు.
రామక•ష్ణయ్య గారికి ఐదుగురు కుమారులు. పెద్దకొడుకు సీతారామయ్య వేదాధ్యయన పరులు. రెండోకొడుకు జగన్నాథం, మూడో కుమారుడు లక్ష్మణశాస్త్రి. సంస్క•తాంధ్ర భాషల్లో పండితులు, వేదం నేర్చుకున్నారు. నాలుగో కొడుకు విశ్వనాథశాస్త్రి (అనుముల క•ష్ణమూర్తి గారిని దత్తత తీసుకున్నవారు) ఐదో కొడుకు పండరినాథ శాస్త్రి (క•ష్ణమూర్తి గారి కన్నతండ్రి) ఉభయ వేదాంతా చార్యులు. వీరు హిందీ, సంస్క•తం, కన్నడ భాషల్లో పండితులు. చిత్రమేమిటంటే పండరినాథ శాస్త్రి గారికి పంతొమ్మిదేళ్ల వయస్సొచ్చేవరకు కూడా చదువు సంధ్యలులేవు. బలాదూరుగా తిరిగేవారు. కానీ ఇరుగుపొరుగు, బంధువులు, కుటుంబ సభ్యులు వీరిని చదువురాని వాడవని ఎగతాళి చేస్తుంటే తట్టుకోలేక తల్లి నగలు దొంగిలించి కాశీకి పారిపోయారు. అక్కడ సద్గురువుల ఆశీస్సులు పొంది సంస్క•తం నేర్చుకున్నారు. బహుశాస్త్ర కోవిదులయ్యారు.
ఇది తెలిసి పండరినాథ శాస్త్రి గారి అన్నలు కాశీకి వెళ్లి తమ్ముడిని కలుసుకొని నచ్చజెప్పి మడికొండకు తీసుకువచ్చారు. పెళ్ళి చేసి వారికి స్థిరనివాసం ఏర్పాటు చేశారు. పండరినాథ శాస్త్రి గారికి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. వీరిలో రెండవ కుమారులే అనుముల క•ష్ణమూర్తి గారు.
క•ష్ణమూర్తి గారు చదువులో చాలా చురుకు. అందుకే సంస్క•తం, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో పండితులు. ఫార్సీ, అరబీలలో మంచి ప్రవేశం ఉంది. సంస్క•తం వానమామలై వరదాచార్ల తండ్రి బక్కయ్య శాస్త్రి గారి వద్ద నేర్చుకున్నారు. ఫార్సీ, అరబీ మౌల్వీ సమయుజ్జీమా వద్ద నేర్చుకున్నారు. ఉర్దూ భాష పరిసరాల ప్రభావంతో సహజంగా అబ్బిందే. మెట్రిక్యులేషన్ (సంస్క•తం)లో హైదరాబాద్ స్టేట్‍కు డొమినియన్ ఫస్ట్ వచ్చారు.
మడికొండకు చెందిన ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యులు పల్లా దుర్గయ్య గారి ఇంట్లో ఉంటూ బీఏ, బీకాం, బీఈడీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా చేన్పూరులో పప్రథమంగా ఉపాధ్యాయులుగా ఉద్యోగంలో చేరి మధిర, ఖిలా వరంగల్, కోస్గి, మానుకోట, నిర్మల్, భువనగిరిలోనూ తిరిగి హన్మకొండ, వరంగల్లులో పనిచేసి ప్రమోషన్‍పై పెద్దపల్లి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‍గా వెళ్లారు. ఆ తర్వాత పర్కాలా, సుల్తానాబాద్‍లలో పనిచేసి సుల్తానాబాద్ నుండే 1978లో రిటైర్ అయ్యారు.
క•ష్ణమూర్తి గారి వివాహం 1942లో మేనమామ కూతురు నర్సమాంబ గారితో అయ్యింది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్దకుమార్తె డాక్టర్ సరస్వతి, ప్రభుత్వ డాక్టర్‍గా పనిచేసి రిటైరయ్యారు. రెండోకూతురు ఉమ చదువుకున్నా ఉద్యోగంలో చేరలేదు. మూడో కూతురు రమ మదనపల్లిలోని రిషీ వ్యాలీ స్కూలులో (జిడ్డు క•ష్ణమూర్తి స్థాపించిన) అధ్యాపకురాలిగా ఉద్యోగం చేస్తూ గ్లోబల్ లెవల్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కుమారుడు వెంకట రమణ అధ్యాపక వ•త్తిలో స్థిరపడ్డారు. ‘మోష’ను వివాహమాడినారు. మోష వరంగల్ సంగీత కళాశాలలో ఉపన్యాసకురాలు. ఈమెది చాలా అరుదైన గళం. హిందుస్థానీలో గానం చేస్తుంటే శ్రోతలంతా తన్మయ లోకంలోకి వెళ్లిపోతారు. మోష అనుముల క•ష్ణమూర్తి గారి సరస్వతీ సాక్షాత్కారం హిందుస్థానీలో పాడుతున్నప్పుడు విని తీరవలసిందే.
అనుముల క•ష్ణమూర్తి గారికి కాళోజీ సోదరులంటే భక్తి. వారు కూడా క•ష్ణమూర్తి గారిని స్వంత తమ్ముడిగా భావించేవారు. కాళోజీ సోదరులతో పాటు.. దాశరథి, బిరుదురాజు రామరాజు, వానమామలై వరదాచార్యులు మొదటినుండి సన్నిహితులు. గుంటూరు శేషేంద్రశర్మ గారు వీరిని ఎంతో అభిమానించేవారు. విశ్వనాథ సత్యనారాయణ గారు క•ష్ణమూర్తి గారికి గౌరవనీయులు. కవిత్వ శక్తిలో విశ్వనాథ వారిని ఒప్పుకునేవారు. జువ్వాది కాంతమరావు గారు మంచి మిత్రులు. క•ష్ణమూర్తి గారి సతీమణి నర్సమాంబ 1983లో జబ్బు చేసి మరణించడంతో ఆయన జీవితమంతా ఆగమైపోయింది. సాహిత్యం తప్ప ఏమీ ఎరుగని, దేన్నీ పట్టించుకోని వ్యక్తి ఆయన. ఇల్లును నడపడం ఆమె పని. అంతేకాదు క•ష్ణమూర్తి గారు తాము రచించిన పద్యాలకు మొదట శ్రోత ఆమె. కాళోజీ రామేశ్వరరావు గారు, నర్సమాంబ గారు ఇద్దరూ రసచక్షువులాయనకు.
తర్వాత కాలమంతా నిరాసక్తంగా, నైరాశ్యంగా బతికారు. బహుశా నర్సమాంబ గారు పోయిఉండకపోతే క•ష్ణమూర్తి జీవితం వేరేగా ఉండేదేమో! అనేక కావ్యాలు రాస్తూ జీవితంపై మక్కువతో బతికేవారు. వారి సతీమణి నర్సమాంబ గారు మరణించిన పదమూడు సంవత్సరాలకు 1996 మార్చి 31న అనుముల క•ష్ణమూర్తి తీవ్ర అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.
అనుముల క•ష్ణమూర్తి గారు కుదురులేని మనిషి. ఎంతో గొప్ప కవితాధార ఉండి, పాండిత్యముండి విస్త•తమైన అధ్యయనం చేసినవారై ఉండి రచనలు చేసింది తక్కువే. చిత్తు కాగితాలపై ఎక్కడపడితే అక్కడ రాసి పారవేసుకునే వారు. అసువుగా చెప్పేవారు. పోగా మిగిలిన కవితలు (పద్యాలు) ఇవాళ మనం చదువుకుంటున్న ‘సరస్వతీ సాక్షాత్కారము శబరి, ఇతర ఖండికలు’ అనే గ్రంథం. ఈ కావ్యాన్ని కాళోజీ ప్రమేయంతో 1967లో యువభారతి వారు తమ మొదటి ప్రచురణగా ప్రచురించారు. మళ్లీ రెండవ ముద్రణ కూడా వచ్చింది.
.
1967లో ప్రచురించబడిన ‘సరస్వతీ సాక్షాత్కారము’ కావ్యం శబరి ఇతర ఖండికలతో కలిసి 2007 వారి పిల్లల చొరవ, శ్రమతో మళ్లీ ప్రచురణకు నోచుకున్నది. ఈ ప్రచురణకు వారికి సహకరించిన వారు నాగిళ్ళ రామశాస్త్రి, ఆచార్య ఎస్.లక్ష్మణమూర్తి గారు. సరస్వతీ సాక్షాత్కారము ఒక గొప్ప రసకావ్యం. ఈ రచనతో అనుముల క•ష్ణమూర్తి గారిలో మహాకవి లక్షణాలు ఉన్నట్లు విద్వత్ ప్రతిభ ఉన్నవారందరూ అభిప్రాయపడ్డారు.
అనుముల క•ష్ణమూర్తి గారి రూపమే కాదు.. గాత్రం కూడా గొప్పగా ఉండేది. ఆయన ఏ పద్యం చదివినా శ్రోతలు తన్మయంలో ఊగిపోయేవారు. ‘నాయహంకార మర్మం’ శీర్షికన రచించిన పద్యాల్లో ఒకటి –
‘‘ఈ యావేశము నాది ఈ ప•థ్వీ నాదే. సర్వమున్
నాది న
న్నేయావేశము బూనెనేని లయమొదింతున్ పునస•ష్టికై
సాయంప్రాతరుపాసనా సయమ నిష్టా క్రూరుడే
క•ష్ణమూ
ర్తేయల్పిష్ఠుల గోష్ఠిలో బడ
మహార్తింబొందుముల్లోకముల్’’
అంటారు. మామాలుగానైతే అనుముల క•ష్ణమూర్తి గారు అంతర్ముఖులు. ప్రచారానికి దూరంగా ఉండేవారు. రచించిన పద్యాల విషయంలో ఏ మాత్రమూ శ్రద్ధ లేక వారి కవిత్వంలో చాలా భాగం వెలుగులోకి రాలేదు. కానీ వీరికి సరస్వతీ సాక్షాత్కారము జరిగినది. అట్లా జరిగినట్లు వారే ‘స్వయం సమీక్ష’లో ఇలా చెప్పుకున్నారు.
‘‘ఒక అర్ధరాత్రి అకస్మాత్తుగా మనశ్చక్షువునకు గోచరించిన చీరంచు, స్త్రీ యాక•తి రూపొంది కన్నుల నుండి కాళ్ల వరకు కరుణామయమైన వాగ్దేవతా క•తిగా భాసించినది. అది సర్వ రసాత్మకమై మహాంధ్ర జననిమైనది’’
‘‘భావ పరిధిలు, ఆలోచనా పరిధులు, కల్పనా పరిధులూ విశాలమైనట్లే మన తరంలో రసప్రపంచ పరిదులు విశాలమైనవి’’ అని అంటారు క•ష్ణమూర్తి గారు. రసలోకమును కనుగొన్న క•ష్ణమూర్తి గారు రసబ్రహ్మ అయినారు.
‘సరస్వతీ సాక్షాత్కారము’ శీశ్రీ ‘కవితా ఓ కవితా’ లాంటిది. అనుముల క•ష్ణమూర్తి గారు ఆ పద్యాల్ని ఓ మహాంధ్ర సరస్వతీ అంటూ ప్రారంభించి గానం చేస్తుంటే పుట్టపర్తి నారాయణా చార్యులు ‘శివతాండవం’ గానం చేసినట్టుండేదని మిత్రులన్నారు.
ఇక ‘శబరి’ కావ్యం విషయానికొస్తే క•ష్ణమూర్తి గారు ఒక కొత్త కాన్సెప్ట్ ఆరంభించారు. ఆ కావ్యాన్ని ‘ప్రజాస్వామి శబరి’ అన్నారు. ఇందులో వారే అన్నట్లు ‘రాముడు’ను ప్రజాస్వామ్య గత సర్వ సమాన సర్వజన సౌఖ్య భావన ప్రతీకగా, ‘శబరి’ ని పరంపరా పీడిత సామాన్య మానవతకు ప్రతీకగా తీసుకున్నారు.
కోవెల సంపత్ కుమార్ గారు అనుముల క•ష్ణమూర్తి ఒక అందమైన పద్యం అన్నారు. కాళోజీ అనుముల వారి గురించి ‘వాడు తింగడి మనిషేగాని అంగడి మనిషి కాలేదు’ అన్నారు. కావ్యగానంలో ఆయన తనువెల్లా కవితా రసావేశంతో నిండి ఉండేది. అందుకే మేమంతా వారిని ‘రసబ్రహ్మ’గా పిలిచేవాళ్లమని పేర్వారం జగన్నాథం గారన్నారు.
గుంటూరు శేషాంద్రశర్మ గారు ‘అన్నా నీ నాలుకపై ఎన్నో వేదంబులున్న వెన్నో కావ్యాంబులున్నవి నన్నల్పజ్ఞుని అన్నామని పిల్తువెట్టి అంభోనిదివో’ అని వినమ్రంగా అనుముల క•ష్ణమూర్తి గారికి నమస్కరించారు.
మిత్రమండలి మిత్రుల చేతనావర్తం కవుల్లో ఒకరు వేణుముద్దల నర్సింహారెడ్డి. ‘ఓయన సరస్వతియు ఓహోమని మారాడు నెవనికో వానికి నీకీ అక్షర సన్మానంబు’ అని కీర్తించారు. రామేశ్వరరావు షాద్ గారు అనుముల క•ష్ణమూర్తిని ‘కవిత్వ దేవత’ ఆవహించిందన్నారు.
(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్క•తిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)
- వి.ఆర్.విద్యార్థి
ఎ : 998913949