తమిళనాడు రాష్ట్రంలోని జియో హెరిటేజ్‍ స్థలాలు

తమిళనాడు రాష్ట్రంలో కేందప్రభుత్వం జియోలాజికల్‍ మాన్యుమెంట్స్గా గుర్తించిన స్థలాలు నాలుగు (4).
1) చార్నోకైట్‍ శిల, సేంట్‍ థామస్‍మౌంట్‍ వద్ద, చెన్నైలో.
2) సాత్తనూర్‍ ఫాసిల్‍వుడ్‍ పార్క్ – పెరంబలూర్‍ జిల్లా
3) తిరువక్కరై ఫాసిల్‍వుడ్‍ పార్క్ – విల్లుపురం జిల్లా
4) కరై బ్యాడ్‍ ల్యాంన్డస్, పెరంబలూర్‍ జిల్లా
ఈ జియో హెరిటేజ్‍ స్థలాలు పూర్తి వివరణ క్రింద ఇవ్వబడినది.


చార్నోకైట్‍శిల, సేంట్‍ తామస్‍ మౌంట్‍, చెన్నైలో

ఈ చార్నోకైట్‍ శిల చెన్నైలోని సేంట్‍ థామస్‍ మౌంట్‍ వద్ద వున్నది. ఈ శిలకు చార్నోకైట్‍ అన్న పేరు రావడానికి కారణం ఏమిటంటే ఈ శిలను మొట్టమొదట కొలకత్తా నగరం స్థాపకర్త జాబ్‍ చార్‍నోక్‍ అనే వ్యక్తి యొక్క సమాధి కట్టడంలో వాడినందున అతని పేరు పెట్టారు. ఈ శిల యొక్క సమ్ముహంలో కొన్ని ఇగ్‍నియస్‍ శిలలు వివిధ రకాలుగా మెటమార్ఫిసమ్‍ చెందినవిగా గుర్తించబడినవి. గ్రాన్యులైట్‍ ఫేసిస్‍ మెటుమార్ఫిసమ్‍ వల్ల గ్రానైట్‍ నైసెస్‍ మార్పు చెంది చార్నోకైట్‍గా మారడం జరిగింది. ఈ శిలలో ముఖ్యమైన ఖనిజాలు, క్వార్టజ్, ఫెల్స్ పార్‍ మరియు హైపర్త్సీన్‍ ఈ శిల రెండు పైరాక్సీన్‍ ఫెనీస్‍ మెటమార్ఫినంకు గురైనది. ఈ శిల సౌతర్న్ ‘గ్రాన్యులైట్‍ టెర్రేన్‍’కు చెందినది.


సాత్తనూరు ఫాసిల్‍వుడ్‍ పార్క్, పెరంబలూర్‍ జిల్లా
తమిళనాడు లోని పెరంబలూర్‍ జిల్లాకు చెందిన సొత్తనూరు అనే గ్రామంలో ఈ ఫాసిల్‍ వుడ్‍ పార్క్ కలదు. రాష్ట్ర ప్రభుత్వం దీనిని జియో పార్క్గా గుర్తించినది. ఈ పార్క్లోని అన్ని వృక్షాలు శిలలుగా మారిపోయినవి. వృక్షాలు పూర్తిగా వెట్రిఫికేషన్‍ ప్రాసెస్‍ ద్వారా శిలలుగా మారినవి. అందుకే వీటిని ఫాసిల్‍ వుడ్‍ అని అందురు. ఇవి క్రిటేశియస్‍ పిరియడ్‍కు చెందినవి (120 మిలియన్‍ సంవత్సరాలు). ఈ ఫాసిల్‍ వృక్షాల బుడం పొడవు 18 మీటర్ల వరకు కలదు. ఈ పాసిల్‍ వృక్షాలు తిరుచిరాపల్లి గ్రూపుకు చెందినవి. ఈ పార్క్ సొత్తనూరుకు ఉత్తరాన 100 మీటర్ల దూరంలో వున్నది. దీనిని చెన్నై-తిరుచిరాపల్లి రహదారి (ఎన్‍హెచ్‍-45) ద్వారా చేరవచ్చును. జియోలాజికల్‍ స్టడీస్‍ ద్వారా వెలువడిన విషయాలు ఏమిటి అంటే 120 మిలియన్‍ సంవత్సరాల క్రితం సొత్తనూరుకు 8 నుండి 10 కి.మీ. పశ్చిమ ప్రాంతం సముద్రం ఉప్పొంగి జలమయం కావడంతో అక్కడ వున్న వృక్షాలు చాలా కాలం నీటిలో వుండిపోయి క్రమేన జియోలాజికల్‍ టైమ్‍ పిరియడ్‍లో ఫాసిలైన్‍ కావడం జరిగినది.


తిరువక్కరై ఫాసిల్‍ వుడ్‍ పార్క, విల్లుపురం జిల్లా

ఈ ఫాసిల్‍ వుడ్‍ పార్క్ విల్లుపురం జిల్లాలోని తిరువక్కరై గ్రామానికి ఒక కిలోమీటర్‍ తూర్పు దిశల కలదు. దీనిని తిండివనం – పుదుచ్చెరి రహదారి గుండా చేరవచ్చును. ఇది తిండివనం నుండి 35 కి.మీ. దూరంలో వున్నది. ఈ పార్క్లోని వృక్షాలన్ని శిలలుగా మారిపోయినవి. దీనిని జిఎస్‍ఐ ప్రతిపాదన మేరకు కేంద్ర ప్రభుత్వం జియోహెరిటేజ్‍ స్థలంగా గుర్తించింది. ఈ పార్క్ను జిఎస్‍ఐ మెయింటేన్‍ చేస్తున్నది. ఈ ఫాసిల్‍వుడ్‍ పార్క్ 247 ఎకరాలలో విస్తరించి వున్నది. ఇది మైయొసీన్‍ పీరియడ్‍కు చెందిన కడ్డలూర్‍ సాండస్టోన్‍లోని భాగం. ఈ పార్క్లో 200 ఫాసిల్‍ వృక్షాలు రకరకాల ఆకారాలలో 5 నుండి 15 మీటర్ల పొడవు మరియు 5 మీటర్ల లావు కల బుడములు కలవు.


కరై బ్యాడ్‍ ల్యాండ్స్, పెరంబలూరు జిల్లా
కరై బ్యాడ్‍ ల్యాండ్స్ అలాతూర్‍ -అరియలూర్‍ రహదారిలో కరై మరియు కొలొక్కనీతన్‍ గ్రామాల వద్ద కలదు. ఈ బ్యాడ్‍ లాండ్స్ మెరైన సెడిమెంట్స్తో కూడినది. ఇది 4 కి.మీ. ల పొడవు మరియు 2 కి.మీ. వెడల్పు కలదు. ఈ బ్యాడ్‍ ల్యాండ్‍ టోపోగ్రఫి ఎత్తు పల్లాలుగా వుంటుంది. మరియు కోనికల్‍ గుట్టలు వీటి మధ్యలో లోయలుగా వుంటుంది. ఆ ప్రాంతంలోని సెడిమెంట్స్ కరై ఫార్మేషన్‍కు చెందినవి. ఈ సెడిమెంట్స్లో ముఖ్యంగా జిప్‍శియస్‍ క్లే, సాండ్‍ స్టోన్‍, ఫాస్‍ఫేట్‍ నాడ్యుల్స్ యొక్క పాకెట్స్ మరియు సెలిసైట్‍తో కూడి యున్నది. వీటిలో ప్రముఖంగా వున్న ఫాసిల్స్ అమ్మోనైట్స్, బెలిమనైట్స్, వోర్నట్యూబ్స్, గ్యాస్‍ట్రో పాడ్స్ మరియు అయిస్టర్స్. ఇలాంటి జియోమార్ఫిక్‍ ఫీచర్‍ అరుదగా వుంటుంది. కావున జి.ఎస్‍.ఐ ప్రతిపాదన మేరకు దీనిని కేంద్ర ప్రభుత్వం జియో హెరిటేజ్‍ స్థలంగా గుర్తించింది.

  • కమతం మహేందర్‍ రెడ్డి
    ఎ : 90320 12955

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *