టీవీ ఓ ప్రసార మాధ్యమంగా వచ్చి ఇప్పుడు ప్రతి ఇంట్లో ఓ భాగం అయిపోయింది. ఇప్పుడంటే ప్రతి ఇంట్లోనూ టీవీలు ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం ఒక ఉళ్లో ఒక్క టీవీ ఉండడం పెద్ద విశేషం. ఒకప్పుడు టీవీ అంటే డబ్బు ఉన్నవారి ఇళ్లలోనే ఉండేది. కానీ మారుతున్న పరిస్థితుల కారణంగా ప్రతి ఇంట్లో టీవీ భాగమైపోయింది. టెక్నాలజీ పెరిగి సెల్ ఫోన్ల వాడకం పెరిగినా టీవీలను చూసేవారు ఉన్నారు.
1996లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) ప్రతి సంవత్సరం నవంబర్ 21ని ప్రపంచ టెలివిజన్ దినోత్సవం (World Television Day) గా ప్రకటించింది. 1996లో మొదటి ప్రపంచ టెలివిజన్ ఫోరమ్ జరిగిన తేదీని గుర్తుచేసుకుంటూ ఈ దినోత్సవంను ప్రకటించారు.
టెక్నాలజీ పెరిగి.. సెల్ ఫోన్ల వాడకం పెరిగినా.. టీవీలను చూసేవారూ ఉన్నారు. కచ్చితమైన సమాచారం కోసం వాటి మీదే ఆధారపడుతుంటారు. ఐక్యరాజ్యసమితి ప్రకారం, ఇది వీడియో వినియోగం కోసం, కచ్చితమైన సమచారం కోసం ఉపయోగించే వస్తువుగా కొనసాగుతోంది. ప్రపంచ టెలివిజన్ దినోత్సవం దృశ్య మాధ్యమం శక్తిని, ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో, ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేయడంలో ఎలా సహాయపడుతుందో గుర్తుచేస్తుంది.
సమకాలీన ప్రపంచంలో 20వ శతాబ్దపు తొలి ఆవిష్కరణల ప్రభావం పెరుగుతున్నందున టీవీ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఐక్యరాజ్యసమితి విద్యా, వైజ్ఞానిక మరియు సాంస్కృతిక సంస్థ సహాయంతో భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. 1991లో భారత ప్రధాని పి.వి.నర్సింహారావు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఆర్థిక సంస్కరణల ప్రకారం ప్రైవేట్ మరియు విదేశీ ప్రసారకర్తలు పరిమిత కార్యకలాపాలలో పాల్గొనడానికి అనుమతించబడటానికి ముందు ప్రభుత్వ యాజమాన్యంలోని దూరదర్శన్ మాత్రమే జాతీయ ఛానెల్‌గా మిగిలిపోయింది.
1924లో టీవీని కనిపెట్టిన జాన్ లోగి బైర్డ్టీ
వీని 1924లో స్కాటిష్ ఇంజనీర్, జాన్ లోగీ బైర్డ్ కనిపెట్టారు. ఇది యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ సాయంతో ఇండియాలో సెప్టెంబర్ 15, 1959న ఢిల్లీలో ప్రవేశపెట్టారు.
ప్రపంచ టెలివిజన్ దినోత్సవం రోజున కమ్యూనికేషన్, ప్రపంచీకరణలో టెలివిజన్ పోషిస్తున్న పాత్ర గురించి, ప్రసార మాధ్యమాల పాత్రను గుర్తు చేశారు. సోషల్ మీడియాలో కంటెంట్‌లో వాస్తవికత సందేహాస్పందంగా ఉన్న సమయాల్లో సమాచారాన్ని అందించడానికి ప్రభుత్వాలు, వార్తా సంస్థలపై ఈరోజు చర్చిస్తారు. కావున సమాజంలోనూ, ప్రపంచ రాజకీయాల్లోనూ టీవీ పాత్ర చాలా గొప్పదని చెప్పొచ్చు.
- దక్కన్‌న్యూస్,
ఎ : 9030 6262 88