ప్రకృతి మనిషికి అందించిన వనరులు ఎన్నో.. ఎన్నెన్నో. గాలి, నీరు, నిప్పు, అడవులు, బొగ్గు, పెట్రోలియం, బంగారం, వజ్రాలు, ఖనిజాలు, వాతావరణం, వర్షపాతం, కొండలు, గుట్టలు, పర్వతాలు ఇలా ప్రకృతి మనిషికి ఎన్నో ఇచ్చింది. ప్రకృతి మనకు అందించిన ఈ సహజ వనరుల్ని వాడుకోవాలి. వాటిని సంరక్షించుకోవాలి. ఆ బాధ్యత ప్రతీ మనిషికి ఉంది. కానీ మనిషి మాత్రం అన్నింటిని కలుషితం చేస్తున్నాడు. రాబోయే తరాలకు అందకుండా చేస్తున్నాడు.
ప్రకృతి మనిషికి ఇచ్చిన వరాలు పర్వతాలు
ప్రకృతి మనకు ఇచ్చిన సహజవనరుల్లో పర్వతాలు కూడా ఉన్నాయి. మొదటి తరం మానవుల నాగరికత ఆనవాళ్లు నదులు, పర్వతాల్లోనే బైటపడ్డాయి. నీరు ఉన్నచోటే ప్రాణి మనుగడ సాగిస్తుంది. అలాగే పర్వతాలు భద్రతనిస్తాయి. అందుకే నదులు, పర్వతాల వద్దనే మొదటితరం మనిసి నాగరికత ఆనవాళ్లు బైటపడ్డాయి. నదులు, పర్వతాలు అనేక జీవజాతులకు నిలయంగా ఉంటాయి.
ప్రపంచ జనాభాలో 15శాతం మందికి పర్వతాలపైనే నివాసం
భూమిపైన జీవవైవిధ్యాన్ని (Biodiversity) కాపాడుకుంటూ వస్తున్నాయి. ప్రపంచ జనాభాలో 15శాతం మంది ప్రజలు పర్వత ప్రాంతాల్లోనే నివసిస్తున్నారంటే పర్వతాల ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీన్ని గుర్తుచేసుకుంటూ డిసెంబర్ 11న పర్వతాల పరిరక్షణ, అక్కడి జీవవైవిధ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. పర్వతాలను పరిరక్షించుకోవాలనే ఉద్ధేశ్యంతోనే ఇంటర్నేషనల్ మౌంటెన్ డే ఏర్పడింది. ప్రపంచ జనాభాలో సగంమందికి పర్వతాలు మంచినీటిని అందిస్తున్నాయి. పర్వతాలు అందించే నీటితోనే అంత స్థాయి జనాభా మనుగడ సాగిస్తోంది. కానీ అక్కడి వాతావరణ మార్పుల వల్ల పర్వతాలపై నివసించే ప్రజల మనుగడ కష్టమవుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కరిగిపోతున్న మంచుపర్వతాలు..మనకు తెలియకుండానే మనిషిని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. ఇది మనిషి గుర్తించటంలేదు.
మంచు పర్వతాలు కరిగిపోతుండటంతో కోట్లాదిమంది ప్రజల మంచినీటి సరఫరాపై ప్రభావం పడుతోంది. ఇది ఏ ఒక్క దేశానికో కాదు. ప్రపంచంలోని ప్రతి ఒక్క దేశంపై ఏదో ఒక విధంగా ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇది ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా గుర్తించాలి. వాతావరణ కాలుష్యానికి కారణమయ్యే చర్యల్ని అడ్డుకోవాలి. సహజవనరులను పరిరక్షించుకోవాలి. ఇది ప్రతీ ఒక్కరి బాధ్యతగా ఉండాలి. దీంతో పాటు పర్వతాల పరిధిలో ఉండే జీవవైవిధ్యాన్ని, అందమైన ప్రకృతిని కాపాడటానికి ప్రజలకు International Mountain Day ఈ అవగాహన కల్పించటానికి ఏర్పడింది. ఇంటర్నేషనల్ మౌంటైన్ డే 2024 అనేది జ్ఞానాన్ని మార్పిడి చేసుకోవడానికి, ఉత్తమ అభ్యాసాలను ప్రదర్శించడానికి మరియు సామూహిక చర్యను సమీకరించడానికి ఒక వేదిక. ఆవిష్కరణ, అనుసరణ, యువత సాధికారత మరియు సహకార విధానాలను స్వీకరించడం ద్వారా, పర్వత సమాజాలు మరియు పర్యావరణ వ్యవస్థలకు మరింత స్థిరమైన మరియు స్థితిస్థాపకమైన భవిష్యత్తు కోసం మేము మార్గం సుగమం చేయవచ్చు.
2024 థీమ్ : ‘‘స్థిరమైన భవిష్యత్తు కోసం పర్వత పరిష్కారాలు – ఆవిష్కరణ, అనుసరణ మరియు యువత’’. దేశాలు, సంఘాలు మరియు సంస్థలు ఈ థీమ్ ద్వారా ఉత్సవాలు జరుపుకోవడానికి స్వాగతం పలుకుతున్నాయి.
- దక్కన్‍న్యూస్, ఎ : 9030 6262 88