ప్రజాపాలన – ప్రజా విజావిజయోత్సవాల ముగింపు వేడుకలను డిసెంబర్ 07వ తేది నుండి 09వ తేది వరకు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలలో ప్రజలు కూడా పాలు పంచుకుని సంబరాలు జరుపుకునే విధంగా కార్యక్రమాల రూపకల్పన చేశారు. ట్యాంక్‍బండ్, నెక్లస్ రోడ్, హెచ్‍ఎండీఏ గ్రౌండ్స్ వేదికగా పలు సంగీత, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ప్రముఖ సంగీత కళాకారులు వందే మాతరం శ్రీనివాస్, రాహుల్ సిప్లీగంజ్, తమన్‍ల సంగీత కచేరీలు ప్రత్యక ఆకర్షణగా నిలువనున్నాయి. సందర్శకుల కోసం సాంస్కృతిక, ఫుడ్, హస్తకళల స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గ్ వద్ద బాణా సంచా ప్రదర్శన, ట్యాంక్ బండ్ వద్ద డ్రోన్ షో, భారత వాయు దళం చే ఎయిర్ షో ఆహుతులను ఆకట్టుకోనున్నాయి. పూర్తి కార్యక్రమాల వివరాలు తేదీల వారీగా ఈ క్రింది విధంగా ఉన్నాయి.
