సరస్వతి నది గురించి మరిన్ని ఆధారాలురాఖీగఢీ వద్ద భారీ జలాశయం గుర్తింపు

హరియాణాలోని రాఖీగఢీలో గత నెలలో బయటపడిన జలాశయం హరప్పా ఇంజనీరింగ్‍కు సంబంధించిన ఒక అద్భుతం మాత్రమే కాదు, సరస్వతి నదిపై చురుగ్గా సాగుతున్న పరిశోధనలను మరింత ముందుకు కూడా తీసుకువెళుతుంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
రాఖీగఢీలో పురావస్తు శాస్త్రవేత్తల బ•ందం అక్కడి గ్రామానికి చెందిన కూలీలతో కలిసి కొన్ని వారాల క్రితం 10×10 కందకం నుండి కొన్ని పిడికిళ్ల బురదను బయటకు తీసింది. ఆ బురదను చూస్తుంటే వారి కళ్ళు విప్పారాయి. పురావస్తు శాస్త్రవేత్తలంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. వణుకుతున్న బురద మరకల చేతులతో, వారు శతాబ్దాల నాటి బురదను బయటకు తీశారు. బురదను మాత్రమే కాదు… వేల ఏళ్ల నాటి చరిత్రను కూడా.
హరియాణా లోని రాఖీగఢీ లోని తవ్వకం స్థలంలో హరప్పా కాలం నాటి నీటి నిల్వ వ్యవస్థ ఉందని పురావస్తు శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా అనుమానిస్తున్నారు. కానీ బురుద బయటపడిన రోజు వారి ఆవిష్కరణ అన్ని అంచనాలను మించిపోయింది. గుజరాత్‍లోని ధోలావీరా వద్ద ఉన్న దాని తర్వాత రెండవ అతిపెద్ద జలాశయం అది. ప్రస్తుతానికి వాళ్లకు ఈ విశేషానికి మించింది మరొకటి ఉండదు.
ఈ జలాశయం ఓ ఇంజనీరింగ్‍ అద్భుతం. సామాన్య శక పూర్వం 2600 మరియు 1900 మధ్య వర్ధిల్లిన హరప్పా నాగరికత అతిపెద్ద పట్టణ కేంద్రాలలో ఒకటైన రాఖీగఢీ 500 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇది మొహెంజోదారో కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ. అయినప్పటికీ ఈ స్థాయిలో ఏదీ ఇక్కడ ఇప్పటి వరకూ బయటపడలేదు. 2024 డిసెంబర్‍ తవ్వకాలు ఒక సంక్లిష్టమైన, అధునాతనమైన నీటి నిర్వహణ వ్యవస్థను బయటపెట్టింది. ఇప్పటివరకు, మొహెంజొదారో, హరప్పాలో బావులను మాత్రమే కనుగొన్నారు.
ఈ సందర్భంగా భారత పురావస్తు సర్వే (ఏఎస్‍ఐ) జాయింట్‍ డైరెక్టర్‍ జనరల్‍, రాఖీగఢిలో తవ్వకాలకు సారథ్యం వహిస్తున్న సంజయ్‍ మంజుల్‍ మాట్లాడుతూ, ‘‘రాఖీగఢీలో చాలాసార్లు తవ్వకాలు జరిగాయి. కానీ ఇప్పటివరకు జలాశయం గురించి ఎటువంటి సమాచారం బయటకు రాలేదు’’ అని అన్నారు. ‘‘మొదటిసారిగా, మౌండ్‍ 3 వద్ద దాదాపు 3.5 నుండి 4 అడుగుల లోతు గల నీటి నిల్వ ప్రాంతం వెల్లడైంది. పరిణతి చెందిన, హరప్పా నాగరికత చివరి కాలంలో నదులు ఎండిపోవడం ప్రారంభమైనప్పుడు, ప్రజలు నీటిని నిల్వ చేయడం ప్రారంభించినప్పుడు నీటి నిర్వహణను అర్థం చేసుకోవడంలో ఈ పరిశోధనలు సహాయపడతాయి’’ అని ఆయన అన్నారు.
ఈ జలాశయం భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలలో సరస్వతి నదిపై మరింత ఆసక్తిని పెంచింది. చురుగ్గా సాగుతున్న పరిశోధనలను మరింత ముందుకు కూడా తీసుకువెళుతుంది. హరప్పా నాగరికత చివరి కాలంలో, సరస్వతి నదికి ప్రధాన వనరు అయిన ద•షద్వతి నది (చౌతాంగ్‍ నది అని కూడా పిలు స్తారు) సామాన్య శక పూర్వం సుమారు 3000 ప్రాంతంలో ఎండిపోవడం ప్రారంభమైంది. నది సన్నబడటానికి స్పందనగా ఈ జలాశయం ఏర్పడి ఉండవచ్చు. రాఖీగఢీ తవ్వకం జరిగిన ప్రాంతం నుండి కేవలం 400 మీటర్ల దూరంలో ఎండిన ద•షద్వతి నుండి పాలియోచానెల్స్ ఉనికిని రిమోట్‍ సెన్సింగ్‍ డేటా నిర్ధారిస్తోంది.
గత రెండు దశాబ్దాలుగా, పురావస్తు పరిశోధనలు ఋగ్వేదంలో పేర్కొన్న గొప్ప నది అయిన సరస్వతి నది ఆలోచనను స్థిరంగా ధ్రువీకరిస్తున్నాయి. హిమాలయాల నుండి అరేబియా సముద్రం వరకు ప్రవహించే సరస్వతి నది చివరికి అద•శ్యమై, కేవలం జాడలను మాత్రమే మిగిల్చింది. ఋగ్వేదంలో కూడా సరస్వతి నదికి ముఖ్యమైన ఉపనదిగా ద•షద్వతిని పేర్కొన్నారు.


‘‘ద•షద్వతి వేద కాలానికి చెందిన నది. రాఖీగఢీ సమీపంలో ఉన్న ఏకైక నీటి వనరు’’ అని కురుక్షేత్ర విశ్వవిద్యాలయంలోని సరస్వతి నది పరిశోధనా కేంద్రం ప్రొఫెసర్‍ ఎఆర్‍ చౌదరి అన్నారు. ‘‘ఇది మహాభారత కాలం నాటిది’’ అని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
2022లో రాఖీగఢీ తవ్వకాలను ప్రారంభించిన మంజుల్‍ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ద•షద్వతి ఒకప్పుడు ఈ ప్రాంతానికి జీవనాడి. ఈ పరిశోధనలు, హరప్పా ప్రజలు నీటి నిల్వ కోసం ఉపయోగించిన అధునాతన పద్ధతులను సూచిస్తున్నాయని’’ ఆయన అన్నారు. గతంలో, ఈ స్థలంలో పురావస్తు శాస్త్రవేత్తలు సూరజ్‍ భాన్‍, అమరేంద్ర నాథ్‍, వసంత్‍ షిండే అనేకసార్లు తవ్వకాలు నిర్వహించారు. 1924లో పురావస్తు శాస్త్రవేత్త సర్‍ జాన్‍ మార్షల్‍ సింధు లోయ నాగరికతను గుర్తించిన దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఈ గొప్ప ఆవిష్కరణ చోటు చేసుకోవడం విశేషం.
‘‘సుమారు 5,000 సంవత్సరాల క్రితం, నది ఎండిపోవడం ప్రారంభించినప్పుడు, ప్రజలు వ్యవసాయంతో సహా వారి వ్యక్తిగత అవసరాలకు నీటిని నిల్వ చేసుకోవలసి వచ్చింది’’ అని మంజుల్‍ అన్నారు. ‘‘ఈ పరిశోధనలు నీటి నిర్వహణ నమూనా, ఒకప్పుడు సమాజం ఎలా ఆలోచించేది అనే దాని గురించి మనకు ఒక ఆలోచనను ఇస్తాయి’’ అని ఆయన అన్నారు.


అవగాహనతో కూడిన ఊహ హరప్పా కథను కనుగొనటానికి దారితీసింది.
2022 నుండి, సంజయ్‍ మంజుల్‍ బ•ందం రాఖీగఢీ మౌండ్‍ 3 వద్ద పురాతన మట్టి-ఇటుక నిర్మాణాలను తవ్వడంలో బిజీగా ఉంది. ఇది మౌండ్‍ 1, 2 ప్రాంతాల మధ్య ఉంది. ఆ తరువాత 2023లో, అదే దిబ్బ అంచున ఉన్న బహిరంగ ప్రాంతాన్ని తవ్వాలనే ఆలోచన అతని మనసులోకి వచ్చింది. ఒకవేళ ఒక పురాతన జలాశయం ఉంటే, అది గుట్టలకు దూరంగా, మానవ నివాసాల నుండి వేరుగా ఉన్న బహిరంగ ప్రదేశంలో ఉండేదని ఆయన అనుకున్నాడు.
మంజుల్‍ ఊహ నిజమైంది. అతని బ•ందం 2023లో ఒక సిల్టేషన్‍ పొరను కనుగొంది. కానీ తన ఊహాను నిజమని చెప్పేందుకు అతనికి మరింత నిర్ధారణ అవసరమైంది.
డిసెంబర్‍ 2024లో, ఆయన బ•ందం రిజర్వాయర్‍ వ్యవస్థ పరిమాణం, పరిధిని అన్వేషించడానికి మరో రెండు కందకాలను తెరిచింది. వాళ్లు ఈ కందకాలలో కూడా బురదను కనుగొన్నారు. ఇది ఆ ప్రదేశంలో ఇతర చోట్ల కనిపించే ఒండ్రు నేల కంటే చాలా భిన్నంగా ఉండడం విశేషం.
కొత్తగా కనుగొన్న అంశాల నేపథ్యంలో హరప్పా జలాశయం గురించి మునుపటి అంచనాలు అకస్మాత్తుగా చిన్నవిగా కనిపించాయి. ఇది మెసొపొటేమియా, ఈజిప్షియన్‍ నాగరికత ప్రదేశాలలో కనుగొనబడిన మరే ఇతర జలాశయాల కన్నా కూడా పెద్దది. 1969లో పురావస్తు శాస్త్రవేత్త సూరజ్‍ భాన్‍ ఆధ్వర్యంలో రాఖీగఢీ లో తవ్వకాలు ప్రారంభమైనప్పటి నుండి సాధించిన అతిపెద్ద పురోగతి ఇది.
‘‘మూడు పొరల సిల్టేషన్‍ గుర్తించబడింది. అక్కడ నీరు నిలిచి ఉందని చెప్పడానికి బురద పేరుకుపోవడమే నిదర్శనం. కానీ ఇది చౌతాంగ్‍ నది బురద కాదు, అంటే ఇది నిల్వ ప్రాంతం’’ అని ఆ తవ్వకాన్ని పర్యవేక్షించిన ఏఎస్‍ఐ చండీగఢ్‍ సర్కిల్‍ అసిస్టెంట్‍ పురావస్తు శాస్త్రవేత్త పంకజ్‍ భరద్వాజ్‍ అన్నారు.
రాఖీగఢీ డ్రైనేజీ వ్యవస్థను ముందే కనుగొన్నప్పటికీ, తరువాతి దశల్లో హరప్పా వాసులు నీటిని ఎలా నిల్వ చేశారో ఇప్పటి వరకూ ఎవరూ కనుగొనలేదు.
చివరి హరప్పా కాలంలో ఈ జలాశయం వచ్చినప్పటికీ, సరస్వతి-ద•షద్వతిపై పారుదల వ్యవస్థ నాగరికత మూడు దశలలో స్పష్టంగా ఉందని ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త కె.ఎన్‍. దీక్షిత్‍ 2013లో ‘ఆరిజిన్‍ ఆఫ్‍ ఎర్లీ హరప్పా కల్చర్స్ ఇన్‍ ది సరస్వతి వ్యాలీ: రీసెంట్‍ అర్కియాలాజికల్‍ విడెన్స్ అండ్‍ రేడియోమెట్రిక్‍ డేట్స్’ అనే అధ్యయన పత్రంలో రాశారు.
మెసొపొటేమియా, ఈజిప్షియన్‍ ప్రదేశాలలో కాలువ వ్యవస్థలు ఎక్కువగా పాలకుల కోసం రూపొందించబడ్డా యి. అక్కడి మాదిరిగా కాకుండా రాఖీగఢీ, ధోలావీరాలోని పెద్దపెద్ద హరప్పా జలాశయాలు సామాన్య ప్రజల కోసం ఉద్దేశిం• •బడ్డాయి. నీటి లభ్యతపై వివాదాలను తగ్గించడానికే ఇలా చేసి ఉంటారని నిపుణులు అంటున్నారు.
‘‘పరిశుభ్రత, బావులు, మురుగు కాలువలు అనే భావన పరిశుభ్రత గురించి కాదు, సంఘర్షణ నివారణ గురించి. కాబట్టి ఇది ప్రజలు ఒకరితో ఒకరు పోట్లాడుకోకుండా ఉండటానికి ఒక వ్యూహం’’ అని ప్రొఫెసర్‍ జోనాథన్‍ మార్క్ కెనోయర్‍ 2016లో భారతదేశ పర్యటన సందర్భంగా అన్నారు.
రాఖీగఢీ కందకాలలో లభించిన రాగి ఫిష్‍హుక్స్, సముద్రపు గవ్వలు హరప్పా ప్రజల దైనందిన జీవితాలు, వాణిజ్యాన్ని మరింతగా తెలియజేశాయని భరద్వాజ్‍ అన్నారు.

గత రెండు దశాబ్దాలుగా, రాఖీగఢీ భారతదేశ పురావస్తు తవ్వకాల్లో ఒక మకుటంగా మారింది. భిర్రానా, ఫర్మానా వంటి సమీప ప్రదేశాల నుండి కనుగొన్న విషయాలు సింధు లోయ నాగరిక• మూలాలను కనీసం 2,000 సంవత్సరాలు వెనక్కి నెట్టాయి – గతంలో అంచనా వేసిన సామాన్య శక పూర్వం 4000 నుండి సా.శ.పూ. 6000 వరకు.
ఈ సైట్‍ సంవత్సరాలుగా ఎంతో చర్చను కూడా రేకెత్తించింది. 4,600 సంవత్సరాల పురాతనమైన ఒక మహిళ అస్థిపంజరంపై నిర్వహించిన జన్యు పరీక్ష 2019లో ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం గురించి చర్చలను తిరిగి ప్రారంభించింది. ఆమె అవశేషాలలో ‘‘స్టెప్పీ పాస్టోరలిస్టుల నుండి లేదా అనటోలియన్‍, ఇరానియన్‍ రైతుల నుండి గుర్తించదగిన పూర్వీకులు’’ లేరని ఫలితాలు చూపించాయి.
‘‘హరప్పా నాగరికతలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే హరియాణా ప్రాంతం ఇప్పటివరకు తొలి రేడియోమెట్రిక్‍ తేదీలను అందించింది’’ అని కె.ఎన్‍. దీక్షిత్‍ అదే 2013 అధ్యయనపత్రంలో రాశారు.
రాఖీగఢీ రహస్యాలను ఛేదించడాన్ని ఏఎస్‍ఐ కొనసాగిస్తుండటంతో, ఈ ప్రదేశం వివిధ కార్యకలాపాల కేంద్రంగా మారింది. గతాన్ని ఒకచోట చేర్చేందుకు నెమ్మదిగా, శ్రమతో జరుగుతున్న పక్రియను చూడటానికి ఆసక్తిగల సందర్శకులు వస్తున్నారు.
కానీ ఇంతటి జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రదేశమైన రాఖీగఢీ నిర్లక్ష్యానికి గురవుతోంది. 2020-21 కేంద్ర బడ్జెట్‍ దీనిని ‘‘ఐకానిక్‍ సైట్‍’’గా అభివ•ద్ధి చేయాలని ప్రతిపాదించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆవు పేడ కుప్పలు ఆ ప్రాంతమంతా పేరుకుపోయాయి. కందకాల చుట్టూ వీధికుక్కలు, పందులు, ఆవులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి.
అదే సమయంలో ఈ తవ్వకం స్థానిక విద్యాసంస్థలు, చరిత్ర ఔత్సాహికుల ఆసక్తిని సొంతం చేసుకుంది.
జనవరిలో చలిగా ఉండే ఒక మధ్యాహ్నం, శిక్షణ పొందిన గ్రామస్తులు కందకాలు తవ్వుతుండగా సమీప గ్రామాల విద్యార్థులు ఆసక్తిగా చూశారు. ఇలాంటి ద•శ్యాలు అనేకం చోటు చేసుకున్నాయి.
‘‘ఇస్సే క్యా పతా చలేగా, ఇత్నా గెహ్రా ఖోడా హై (ఇంత లోతుగా తవ్వితే మనకు ఏమి తెలుస్తుంది)’’ అని 10వ తరగతి విద్యార్థిని స•ష్టి సిరోహి అడిగాడు.
సమాధానం క్లుప్తంగా ఉంది. ‘‘మేం తవ్వుతున్నాం,’’ అని గ్రామస్తులలో ఒకరు అన్నారు.


వేల సంవత్సరాల క్రితం, ద•షద్వతి నది రాఖీగఢీ మధ్యలో ప్రవహించి, ప్రాచీన హరప్పా నాగరికతకు జీవనాధారంగా పనిచేసింది. దాని జలాలు ఇక్కడి నేల స్వరూప స్వభావాలను మార్చివేశాయి. దాని ఒడ్డున వ•ద్ధి చెందిన అధునాతన పట్టణ కేంద్రాలను పోషించాయి.
‘‘ఇది ఈ ప్రాంత నీటి నిర్వహణ వ్యవస్థలలో కీలకమైన భాగం. ఇది ఇక్కడి వ్యవసాయం, దైనందిన జీవితానికి మద్దతు ఇచ్చింది’’ అని 2011 నుండి 2016 వరకు రాఖీగఢీలో తవ్వకాలకు నాయకత్వం వహించిన ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త ప్రొఫెసర్‍ వసంత్‍ షిండే అన్నారు.
శతాబ్దాలుగా, ద•షద్వతి శూన్యంగా మారిపోయింది. శీతోష్ణస్థితి మార్పులు, భౌగోళిక మార్పుల కారణంగా అది ఎండిపోయి భూమి అడుగున అద•శ్యమైంది, ఒకప్పటి తన గొప్ప ఉనికి ఆనవాళ్లను మాత్రమే మిగిల్చింది.
ఈ నది ఒకప్పుడు కర్నాల్‍, జింద్‍, హిసార్‍ వంటి నేటి జిల్లాల గుండా ప్రవహించి, రాజస్థాన్‍లోని సూరత్‍గఢ్‍ సమీపంలో సరస్వతి నదిలో కలిసేది. రాఖీగఢీతో పాటు, దాని మైదానాల వెంబడి ఉన్న కీలకమైన హరప్పా ప్రదేశాలలో సోథి, సిస్వాల్‍, మితాతల్‍, బాలు, దౌలత్‍పుర్‍ ఉన్నాయి.
హరప్పా స్థావరాలలో మూడింట రెండు వంతులు సరస్వతి పరీవాహక ప్రాంతంలో ఉన్నాయని షిండే అన్నారు. ఇది సింధు లోయ నాగరికతను సింధు-సరస్వతి నాగరికతగా పేరు మార్చడానికి దారితీసింది. దీనిని పాఠ్యపుస్తకాల్లో కూడా చేర్చారు.


హరప్పా ప్రజలు నీటిని సద్వినియోగం చేసుకోవడంలో ఎంత ముందుకు సాగారో చూపించే ఒక ప్రదేశం ధోలావీరా. ఇది రాన్‍ ఆఫ్‍ కచ్‍లోని పాక్షిక శుష్క ద్వీపంలో ఉంది.
1989-2005 మధ్య పురావస్తు శాస్త్రవేత్త ఆర్‍.ఎస్‍. బిష్ట్ తవ్వకాలు జరిపిన ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో, జలాశయాల నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు నీటిని మళ్ళించే రాతి కాలువల నెట్‍వర్క్ కూడా ఇక్కడ కనుగొన్న అంశాలలో ఒకటి. పూర్తిగా రాతితో నిర్మించిన ఏకైక హరప్పా ప్రదేశంగా ధోలావీరా కూడా ప్రత్యేకమైనది. ప్రజలు తమ నీటి వ్యవస్థను నిలబెట్టుకోవడానికి మన్సార్‍, మన్హర్‍ అనే రెండు కాలానుగుణ నదులపై ఆధారపడ్డారు.
హరప్పా జల నిర్వహణకు ధోలావీరా అత్యుత్తమ నిదర్శనం అని నిపుణులు పేర్కొంటున్నారు. జలాశయాలు వివిధ ఆకారాలు, పరిమాణాలలో వచ్చాయి – కొన్ని దీర్ఘచతురస్రాకార లేదా వ•త్తాకార డిజైన్లలో నిర్మించబడ్డాయి. బహిరంగ జలాశయాలు కూడా ఉన్నాయి.
ఆకస్మిక వరదలను మళ్లించడం ద్వారా, నివాస స్థలం లోపల ట్యాంకులు నిర్మించడం ద్వారా నీటిని నిల్వ చేశారని వసంత్‍ షిండే అన్నారు. అప్పట్లో నగరం వెలుపలికి మురికి నీటిని ఒక కాలువ ద్వారా విడుదల చేసేవారు.
‘‘ఇటువంటి వ్యవస్థను మెసొపొటేమియా లేదా ఈజిప్టులో కనుగొనలేదు’’ అని షిండే అన్నారు. ‘‘ఇది అసమానమైనది’’ అంటూ ఆయన అభివర్ణించారు.
ఇలా తవ్వకాలు జరుగుతున్న సమయంలోనే వర్షంతో నిండిపోయిన రాఖీగఢీలో, డిసెంబర్‍లో ఒక చిన్న విచారకర సంఘటన చోటు చేసుకుంది. కందకం నీటితో నిండిపోయింది. ఒక భాగం కుంగిపోయింది.
‘‘మేం ఇక్కడ చాలా నెలలుగా కష్టతరమైన తవ్వకం పనిని చేస్తూ చాలా కష్టపడి పనిచేస్తున్నాం’’ అని భరద్వాజ్‍ గుర్తు చేసుకున్నారు. ‘‘జరిగిన సంఘటనతో మేం కన్నీళ్లు పెట్టుకున్నాం’’ అని ఆయన అన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *