అమ్మ మాటే మాత•భాష.. తెలుగు మాట్లాడితే 7200 నరాలు యాక్టివేట్ అవుతాయి అంటారు. మనిషి తన భావాలను వ్యక్తిపరిచేందుకు సాధనం భాష. మాత•భాషతోనే మనిషి జీవితం మొదలవుతుంది. అమ్మ నేర్పించే మాత•భాష అమ•తంలాగా ఉంటుంది. తేనె కంటే తియ్యగా ఉంటుంది. చిన్ననాటి నుంచి.. చివరి శ్వాస వరకూ.. మనిషి జీవితాంతం తోడు ఉండేది మాత•భాష. కమ్మనైన అమ్మపాట లాంటిది మన తెలుగు భాష. కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగిన గొప్ప వారసత్వ సంపద. అందుకే అంతటి గొప్ప వ్యక్తి.. శ్రీక•ష్ణదేవరాయాలు ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని వ్యాఖ్యానించాడు. తల్లే మొదటి గురువు, తల్లి ఒడి బిడ్డకు మొదటి బడి. జీవితంలో మొదటగా నేర్చుకునేది ఏదైనా ఉందంటే.. అది మాత• భాషే. అమ్మ పలికే.. ప్రతీ పలుకు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది బిడ్డ. అందుకే ప్రతీ ఒక్కరూ అమ్మను కాపాడుకున్నట్టే మాత•భాషను కాపాడుకోవాలి. పరభాషను ప్రేమించాలి. మాత•భాషను గుండెల్లో పెట్టుకోవాలి. అందుకోసమే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాత•భాషా దినోత్సవం నిర్వహిస్తారు.
అమ్మ భాషను రక్షించుకోవడానికి 1999లో 30వ యునెస్కో మహాసభ.. ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాత•భాష దినోత్సవంగా ప్రకటించింది. ఆత్మగౌరవాన్ని ప్రసాదించే.. అమ్మ భాషను గౌరవించడం ప్రతీ ఒక్కరి బాధ్యత. ఏ జాతి అయితే మాత•భాషను కీర్తిస్తుందో ఆ జాతి మరింత అభివ•ద్ధి చెందుతుంది. ఇక తెలుగు భాష విషయానికి వస్తే.. వేల ఏళ్ల నుండి మనుగడలో ఉంది. భాషలో కాస్త మార్పులు రావొచ్చు.. కాలం మారుతుంది. భాషలోనూ మార్పులు వస్తున్నాయి. అయితే అందులోని మాధుర్యం మాత్రం అలానే ఉంది. అది తెలుగు భాష గొప్పదనం.
తెలుగులోని ప్రతి పదం అచ్చు శబ్దంతో ముగుస్తుంది. మన తెలుగులోనే అత్యధిక సంఖ్యలో సామెతలు ఉన్నాయి. భారతదేశంలో తెలుగు మాట్లాడేవారు ఎక్కువే ఉన్నారు. ఇటాలియన్ వర్తకులు.. తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా పిలిచారు. క్రీస్తుపూర్వం 400 నుంచి తెలుగు భాష ఉనికిలో ఉంది. తెలుగులో భాష మాధుర్యం గొప్పది. అయితే తెలుగును మాట్లాడితే 7200 నరాలు యాక్టివేట్ అవుతాయి. ఇది సైంటిఫిక్‍గా నిరూపితమైంది.
తెలుగు రాష్ట్రాలతోపాటుగా భారత దేశంలోని ఇతర ప్రాంతా ల్లోనూ తెలుగు మాట్లాడేవారు
ఉన్నారు. శ్రీలంకకు చెందిన జిప్సీ జాతి ప్రజలు కూడా తెలుగు మాట్లాడుతారు. భారతదేశంలో స్థానిక భాషలు మాట్లాడే స్థానంలో తెలుగుది మూడో స్థానం. తెలుగులో తియ్యదనం ఉంది. ప్రతి పదం పలుకుతుంటే.. అమ్మతో మాట్లాడినట్టుగా ఉంటుంది. అందుకే మాత•భాషగా తెలుగును మాట్లాడే వ్యక్తులుగా ఆనందిద్దాం… మాత•భాష గొప్పతనాన్ని నలుదిశలా చాటుదాం. అందరికీ అంతర్జాతీయ మాత• భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
- దక్కన్‍న్యూస్
ఎ : 9030 6262 88