ఇంటిలో గూడు దానికి మేము తోడువేసవి దాహాన్ని తీర్చుదాం

ఈ భూమ్మీద బ్రతకడానికి మనిషికి ఎంత హక్కు ఉందో ప్రతి ప్రాణికి అంతే హక్కు ఉంది. కానీ మనిషి స్వార్థానికి ప్రక•తి వనరులు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. మూగజీవాలు నిలవ నీడ లేక అల్లాడిపోతున్నాయి. కాంక్రీట్‍ జంగిల్‍ గా మారిన పట్టణాల్లో పక్షులు గూడు నిర్మించుకోవడానికి నానా తంటాలు పడుతుంటాయి. చెరువుల్లో బంగళాలు మొలిచి పశు పక్షులకు తాగేందుకు నీరు కరువవుతుంది. అందమైన ఇండ్లు నిర్మించుకుంటున్నప్పటికీ పరిసరాల్లో కనీసం మొక్కలు పెంచి పక్షులకు ఆశ్రయం ఇవ్వాలన్న కనీస స్ప•హ కొరబడుతుంది. ఉన్న చెట్లను పార్కింగ్‍ అవసరాల కోసమో మరొక రకమైన ఉపయోగం కోసం నేలమట్టం చేస్తున్నారు. ఒకప్పుడు పిచ్చుకలు ఇళ్లల్లో స్వేచ్ఛగా గూళ్ళను నిర్మించుకొని మనిషితో సహజీవనం చేసేవి. మనుషులే అర్థం చేసుకొని వాటికోసం ఇళ్లల్లో జొన్న కంకులను సజ్జ కంకులను వేలాడదీసేవారు. నేడు పట్టణాలతో పాటు పల్లెల్లో కూడా పిచ్చుకల కిలకిల రావాలు వినిపించడం తగ్గిపోయాయి. దీనికంతటికి కారణం పర్యావరణ స్ప•హ లోపించడం. మనుషులు జీవకారుణ్యంతో పశువులకు పక్షులకు మేలు చేసేందుకు పూనుకోవాలి.

వేసవిలో దాహార్తితో అల్లాడిపోయి మూగజీవాల కోసం పశుపక్షుల కోసం మనమే అర్థం చేసుకుని అందుబాటులో తాగేందుకు చిన్న చిన్న పాత్రల్లో నీటిని ఉంచాల్సిన అవసరం ఉంది. ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటి సంరక్షిస్తే పక్షులకు ఆశ్రయం కల్పించినట్లవుతుంది. మా ఇంటి వద్ద పిచ్చుకల కోసం అట్ట డబ్బాతో గూళ్ళు తయారు చేసి గోడకు బిగించాను. మొదట అందులో గూడు పెట్టేందుకు భయపడ్డా తర్వాత అవి తమ ఆవాసాలుగా మార్చుకున్నాయి. పిచ్చుకల కోలాహాలంతో మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. మేం కల్పిస్తున్న భరోసాతో ఇంటి లోపల కూడా గుళ్ళు పెట్టుకున్నాయి. అర్థం చేసుకోవాల్సింది ఆలోచించాల్సిందే ఆచరించాల్సింది మనిషి మాత్రమే. మనిషి మారితేనే పర్యావరణం బాగుంటుంది. ప్రక•తి వనరులు అంతరించిపోకుండా కాపాడుకునేందుకు వీలు కలుగుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *