దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను త్రుణ ప్రాయంగా అర్పించిన మహనీయులందరి త్యాగాలను నిరంతరం స్మరించుకోవాలని, వారు కలలు గన్న అభివ•ద్ధి చెందిన భారత దేశం లక్ష్యాల సాధనకు పునరంకితం కావాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు. అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సింగరేణి భవన్‍లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఎందరో స్వాతంత్య్ర సమర యోధులు విభిన్న పంథాలో పోరాటాలను కొనసాగించి దేశానికి స్వేచ్ఛను ప్రసాదించేందుకు క•షి చేశారన్నారు.
జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని, మనం ఈ రోజు స్వేచ్ఛగా జీవించడం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన యోధులందరినీ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో డైరెక్టర్ (పర్సనల్, పి అండ్ పి) జి.వెంకటేశ్వర రెడ్డి, జీఎం(కో ఆర్డినేషన్) ఎస్డి.ఎం.సుభానీ, తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్ శ్రీ జనక్ ప్రసాద్, జీఎం లలిత్ కుమార్, సింగరేణి అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
136 ఏళ్ల చరిత్రలో తొలిసారి….
- సింగరేణి సీఎండీ గనుల బాట
- కార్మిక చైతన్య యాత్ర పేరిట కార్మికులతో మమేకం..
- ఉత్పత్తి పెంచాలని సందేశం శ్రీ రక్షణ మరవొద్దని హితబోధ
- నాణ్యతకు పెద్దపీట వేయాలని స్పష్టీకరణ..
- యంత్రాల పనిగంటలు పెంచాలని ఆదేశాలు..
- మహిళా శక్తిని సద్వినియోగం చేసుకుంటామంటూ ప్రకటన..
- మస్టర్ పడి బయట తిరిగితే ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు
- గైర్హాజరీ చేస్తే ఉపేక్షించబోమని స్పష్టీకరణ.
సీఎండీ పర్యటన సాగింది ఇలా…
శ్రీరాంపూర్ ఏరియా, మందమర్రి, బెల్లంపల్లి ఏరియా, శ్రీరాంపూర్ ఏరియా, రామగుండం -2 ఏరియా, రామగుండం -1 ఏరియా, రామగుండం-3 ఏరియా, ఆర్జీ-1 జీఎం కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులు, ఖైరిగూడ
ఉపరితల గని వద్ద మొక్కలు నాటిన సీఎండీ.
-చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్
ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ప్రభుత్వ సంస్థ)
ప్రజా సంబంధాల విభాగం, హైదరాబాద్