పూటకూళ్ళవ్వ

ఇటర్మీడియట్‍ పూర్తి చేసిన అభిరామ్‍ తన ఫ్రెండ్స్తో కలిసి కారులో నర్సంపేట నుండి బయలుదేరాడు. ముందు రోజు రాత్రే హైదరాబాదు నుండి అభిరామ్‍ ఫ్రెండ్స్ చరణ్‍, కార్తీక్‍లు అభిరామ్‍ ఇంటికి చేరుకునారు. అదే ఊర్లో ఉండే మరో ఫ్రెండ్‍ రాజీవ్‍ కూడా మిత్రులు వచ్చారని తెలిసి అభిరాం వాళ్ళింటికి వచ్చాడు. నలుగురు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ‘‘ఇప్పుడు మనందరికీ బీటెక్‍లో సీటు వచ్చింది. కోర్సులో జాయిన్‍ అయ్యాక మళ్లీ మనకు టైం దొరకదు కదా… అందుకే ఇప్పుడే నాలుగు రోజులు ఎటైనా వెళ్లి ఎంజాయ్‍ చేసి వద్దాం’’ అనుకున్నార.
ఇదే విషయం వాళ్ళ నాన్నను కూడా అడిగాడు అభిరామ్‍. కొడుకు చెప్పిన కారణం నిజమే అనిపించి ‘‘సరేనంటూ’’ అనుమతి చ్చారు. ‘‘నాన్న ఎంత మంచివారో.. వెళ్లటానికి కాకుండా, ఈసారి కారులో వెళ్లడానికి కూడా అనుమతిచ్చారు’’.. ‘‘కాకపోతే ఖచ్చితంగా డ్రైవర్‍ని తీసుకొని వెళ్లాలన్నారు. అది కూడా నాన్నకు నా మీద
ఉన్న ప్రేమలే’’ అందుకునే ఇప్పుడే స్వంతంగా నడపటం వద్దంటారు’’ మనసులోనే అనుకున్నాడు అభిరామ్‍.
ఇంతలో ‘‘ఒరేయ్‍ అభీ… ఇన్ని రోజులు మనం సిటీలోనే చదువుకున్నాం కదా! ఇప్పుడు మళ్లీ సిటీకి డైరెక్ట్గా కాకుండా సిటీకి కొంచెం దూరంలో ఉన్న ఏదైనా మంచి ప్రదేశానికి వెళ్దామా’’ అడిగాడు చరణ్‍.
‘‘ఓకే.. కానీ ఎక్కడికి వెళ్దాం? అన్నాడు అభిరాం.
‘‘మిత్రులారా.. నేను ఒక మంచి విషయం చెప్పెదను వినెదరా.. మీరు!’’ తమాషా కోసం నాటకీయంగా అడిగాడు రాజీవ్‍.
రాజీవ్‍ మాటలకు ముగ్గురూ నవ్వుతూ ‘‘ముందు అదేంటో చెప్పరా’’ అన్నారు.
‘‘సరే సరే’’ అంటూ ఇలా చెప్పాడు. ‘‘మనం నర్సంపేట నుండి వరంగల్‍ వెళ్లే దారిలో ‘ఊకల్‍ హవేలీ’ అనే ఊరు వస్తుంది కదా! కొంచెం లోపలికి వెళ్ళగానే అక్కడ ‘‘పూటకూళ్ళవ్వ విడిది’’ ఉందంట… అక్కడ ఒక అవ్వ కూడా ఉందట.. ఉండటానికి వసతి, తినడానికి రుచికరమైన వంటలు ఉంటా యట. ఈ విషయం మా ఇంటి దగ్గరి ఫ్రెండ్స్, బంధువులు మా అమ్మ వాళ్ళతో చెబుతుంటే విన్నాను’’ అన్నాడు రాజీవ్‍.
‘‘అయితే మనం కూడా అక్కడికి వెళ్ళి చూద్దాం..’’ అంటూ ‘‘పూటకూళ్ళవ్వ విడిది’ వైపు కారును మళ్ళించారు.
కారు కాస్త లోపలికి వెళ్ళగానే ‘‘పూటకూళ్ళవ్వ విడిదికి దారి’’ అని బాణం గుర్తుతో ఒక బోర్డు కనబడింది. ‘‘హమ్మయ్య మనం వెతుక్కోవలసిన పనిలేదు’’ అను కున్నారు నలుగురు. మరో ఐదు నిమిషాల్లో ‘‘విడిది’’కి చేరుకున్నారు.
కారు దిగగానే ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టారు.
‘‘ఏంట్రా… పేరు విని ఏదో గుడిసె లాగా ఉంటుందనుకున్న! ఇంత బ్రహ్మాం డంగా ఉందేమిట్రా..’’ అన్నాడు కార్తీక్‍.
అవున్రా.. బిల్డింగ్‍ డిజైన్‍ గుడిసె లాగ ఉంది. కానీ, చూడటానికి అంతా లేటెస్ట్గా.. కొత్తగా ఉంది. ముందు మనం లోపలికి వెళ్దాం పదరా’’ అన్నాడు అభిరామ్‍.
అందరూ బ్యాగులు తీసుకొని లోపలికి వెళ్ళగానే. వీళ్ళ వైపే వస్తూ కనిపించింది ‘‘పూటకూళ్ళశ్‍శ’’.
(మిగతా కథ వచ్చే సంచికలో)

  • మాదారపు వాణిశ్రీ
    ఫోన్‍ : 924728666

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *