ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాశిలా మరియు ఖనిజ సంపద

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా 10,070 చదరపు కిలోమీటర్లలో ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలోని ఈశాన్య ప్రాంతంలో విస్తరించి యున్నది. ఈ రాష్ట్రం నైరుతిలోని బారీ చీపురుపల్లి నుండి ఉత్తరాన కేదారపురం వరకు మరియు ఈశాన్యంలోని ఇచ్చాపురం వరకు విస్తరించియున్నది. ఈ జిల్లాకి ఉత్తరాన ఒడిస్సా రాష్ట్రం, ఆగ్నేయంలో విశాఖపట్నం జిల్లా మరియు తూర్పులో బంగాళాఖాతం కలదు.
హౌరా – చెన్నై, రాయిపూర్‍ – వైజాక్‍ బ్రాడ్‍ గేజ్‍, గుంపూర్‍ – నౌపాడ్‍ న్యేరో గేజ్‍ రేల్‍వే లైన్స్ మరియు కొలకత్తా – చెన్నై, జగదల్‍పూర్‍ – వైజాగ్‍ జాతీయ రహదారులు ఈ ప్రాంతం గుండా వెళ్తవి.


ఈ జిల్లాలో చాలా వరకు కొండ ప్రాంతంగా వుంటుంది. ఈస్ట్రన్‍ ఘాట్‍ సూపర్‍ గ్రూప్‍కు చెందిన కొండలైట్‍, చార్నొకైట్‍ సూట్స్కు చెందిన శిలలతో కూడి వున్నవి. కోస్తా ప్రాంతంలో చాలా వరకు కొండలైట్‍ గ్రూప్‍కు చెందిన శిలలు కలవు. మెట్ట ప్రాంతంలో ఎత్తైన కొండలు చార్నొకైట్‍ గ్రూప్‍కు చెందిన శిలలు దాదాపు 1130 మీటర్ల ఎత్తు వరకు కలవు. వీటిపైన క్యాపింగ్స్రూపంలో లాటరైట్‍ని చూడగలము. ఈ రాష్ట్రానికి సన్నటి కోస్తా ప్రాంతం కలదు. నదులు నాగావలి, వంశధారా వీటి ప్లడ్‍ ప్లేన్స్లో క్వాటర్‍ నెరి నిక్షేపాలు కలవు. ఈ ప్రాంతాలలో గ్రౌండ్‍ వాటర్‍ రిసోర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ జిల్లాలోని ప్రాంతం సీస్‍మిక్‍ స్టడీస్‍ ప్రకారం రెండు జోన్స్ జోన్‍-1 మరియు జోన్‍-2గా నిర్థారించారు.
ఈ జిల్లాలోని నాగావలి, వంశధారా నదుల లితోసెక్‍శెన్స్లో ఎన్నో ఆరిక్యలాజికల్‍ సైట్స్ని గుర్తించబడినది. పెలియొలితిక్‍ ఇంప్లిమెంట్స్, పురాతన ఇటుకలు దొరికినవి వాటిని ఎ.ఎస్‍.ఐ వారు శాతవాహన్‍ పిరియడ్‍కు చెందినవిగా నిర్ధారించారు. ఈ పురాతన వస్తువులను వంశధారా నది ఒడ్డున వున్న సాలిహుండం వద్ద వున్న కొండపైన భద్రపరిచారు.
ఈ జిల్లాలోని ప్రాంతంలో ఈస్ట్రన్‍ ఘాట్‍ సూపర్‍ గ్రూప్‍కు చెందిన కొండలైట్‍, చార్నొకైట్స్ యొక్క శిలలతో కూడి యున్నది. వీటి యొక్క మిగ్నటైట్స్ మరియు గ్రానైట్‍ నైస్‍లను కూడ చూడగలము. ఈ శిలలు గ్రానులైట్‍ ఫేసిస్‍ మేటమార్పి సంకు లోనైనది. వీటి వయస్సు ఆర్‍క్యన్‍ నుండి పేలియొ ప్రొటిరొజొయిక్‍ పీరియడ్‍కు చెందినవిగా పరిశోధన ద్వారా నిర్ధారించారు. కోస్తాప్రాంతంలో కొండలైట్‍ గ్రానైట్‍ నైస్‍ ఉండగా మెట్టు ప్రాంతంలో కొండ లైట్‍, గ్రానైట్‍ నైస్‍ ఉండగా మెట్ట ప్రాంతంలో చార్నొకైట్‍తో కూడిన కొండలను చూడగలము. న్యారో బీచ్‍ గ్రేసాండ్‍తో కూడి వున్నది. అక్కడక్కడా టైడల్‍ప్లాట్స్, బ్రౌన్‍ సిల్టీక్లేతో కూడి వుంటుంది. నాగావలి, వంశధారా నదుల ఇరు ప్రక్కల ఫ్లడ్‍ ప్లేన్‍లో బ్రౌన్‍ సిల్టీక్లే నది చానెల్స్లో కోర్స్ సాండ్‍ వన్నవి.


ఖనిజ సంపద :
ఈ రాష్ట్రంలో మాంగనీస్‍, గ్రాఫైట్‍, డైమెన్శ్న్‍ స్టోన్స్, బ్లాక్‍సాండ్‍, జిప్‍సం, వీన్‍ క్వార్ట్జ్‍ కలవు.
మాంగనీస్‍ :
మాంగనీస్‍ నిక్షేపాలు బొండపల్లి, అవగూడెం, బంగారు వలస, గర్రాజు-చీపురుపల్లి మరియు బరువ ప్రాంతాలలో దొరుకుతుంది. లోగ్రేడ్‍ మాంగనీస్‍ ఓర్‍ అనగా 22-40 శాతం మాంగనీస్‍ కలిగిన ఓర్‍ని పిగ్‍ ఐరన్‍ మ్యాను ఫ్యాక్టరింగ్‍ ఫర్నేస్‍లో వాడతారు.
గ్రాఫైట్‍ :
ఈ జిల్లాలో గ్రాఫైట్‍ డొలెంబా వద్ద మరియు కొన్ని ప్రాంతాలలో దొరుకుతుంది. దీనిని క్రూసిబాల్‍ తయారిలో, డ్రైసెల్‍ మ్యానుఫాక్చరింగ్‍లో, మెషినరీలలో లూబ్రికెంట్‍గా ఉపయోగిస్తారు.
డైమెన్షన్‍ స్టోన్స్ :
ఈ ప్రాంతంలో చార్నొకైట్‍, కొండలైట్‍ మరియు ఇతర గ్రానులైట్స్ని కమర్శియల్‍గా కన్స్ట్రక్షన్‍ పరిశ్రమలో ఉపయోగిస్తారు. చార్నొకైట్స్ని శ్రీకాకుళం భ్లూ పేరుతో, లేప్టీ, నైట్స్ని ‘కశ్‍మీర్‍వైట్‍’ పేరుతో ఎక్స్పోర్ట్ చేయబడుతున్నది.
బ్లాక్‍ సాండ్‍ :
బ్లాక్‍ సాండ్‍ కాన్‍సన్‍ట్రేట్స్ బీచ్‍ ప్రాంతాలలో కలింగపట్నం, నౌపాడ, సోమ్‍పేట వద్ద వున్నది. ఈ సాండ్స్లో 60 నుండి 70 శాతం ఇల్న్నైట్‍ ఉంటుంది. మిగతావి చాలా వరకు గార్నెట్‍, రూటైల్‍, జిర్కాన్‍, పైరాక్సిన్‍తో కూడి వుంటుంది.
జిప్సం :
ఇది కుప్పిలి వద్ద టైడల్‍ ఫాట్‍ క్లేస్‍లో చాలా మొత్తంలో వున్నట్టు నిర్ధారించారు.
క్వార్ట్జ్‍ :
ఈ జిల్లాలో చాలా ప్రాంతాలలో చార్నొకైట్‍ కొండలైట్‍ శిలలో క్వార్ట్జ్‍ వీన్స్ని చూడగలము. దీనిని గ్లాస్‍ పరిశ్రమలో
ఉపయోగిస్తారు.

  • కమతం మహేందర్‍ రెడ్డి,
    90320 12955

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *