ఉష్ణమండల రొట్టె

వేల సంవత్సరాల స్వదేశీ పద్ధతులు కాసావా మనుగడను నిర్ధారించాయని అధ్యయనం కనుగొంది.
‘కుకుర్రో ఇళ్ళు’ వంటి స్వదేశీ పద్ధతులు పంట జన్యు వైవిధ్యాన్ని నిర్ధారించాయి. వేల సంవత్సరాల దేశీయ వ్యవసాయ పురాణాలు మరియు సాంస్కృతిక సంప్రదాయాలు కర్రపెండలం పంట (టపియోకా మూలం) మనుగడకు కీలకంగా ఉన్నాయని ఒక కొత్త అధ్యయనం కనుగొంది.
కాసావా (‘యుకా’ లేదా ‘మానియోక్‍’ అని కూడా పిలుస్తారు) అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్‍ మందికి ఆహారం ఇచ్చే ఒక వేరు కూరగాయ. ఈ కారణంగా, దీనిని తరచుగా ఉష్ణమండల రొట్టె’ అని పిలుస్తారు.


ఈ పంటను ప్రపంచవ్యాప్తంగా కాండం కోత ద్వారా పండిస్తారు, ఈ పద్ధతి ద్వారా అసలు మొక్క యొక్క జన్యు క్లోన్‍ అయిన కొత్త కాసావా మొక్కలను ఉత్పత్తి చేస్తారు. కానీ క్లోనల్‍ నాటడం అంటే మొక్క తక్కువ జన్యు వైవిధ్యాన్ని కలిగి ఉండవచ్చు, ఇది వ్యాధులకు గురయ్యేలా చేస్తుంది.
అయితే, వార్విక్‍ విశ్వవిద్యాలయం, స్మిత్సోనియన్‍ ఇన్‍స్టిట్యూషన్‍ మరియు ఎంబ్రాపా (బ్రెజిలియన్‍ వ్యవసాయ పరిశోధన) పరిశోధకులు 500 కంటే ఎక్కువ ఆధునిక, హెర్బేరియం మరియు పురావస్తు కాసావా మొక్కల జన్యువులను విశ్లేషించినప్పుడు, వారు క్లోనల్‍ పంటకు ఈ జాతులు అసాధారణంగా వైవిధ్యంగా ఉన్నాయని కనుగొన్నారు.


పంట వైవిధ్యం వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవడానికి వారు బ్రెజిలియన్‍ స్వదేశీ రైతులను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలు స్థానిక సాంస్కృతిక పద్ధతులు మరియు సంప్రదాయాలు వైవిధ్యమైన కాసావా జన్యు సమూహాన్ని సృష్టించడానికి మరియు నిర్వహించడానికి కారణమని వారు నిర్ధారించారు.
ఉదాహరణకు, స్థానిక రైతులు తమ వ్యవసాయ పనిముట్లను అలంకరించడానికి ఉపయోగించే గొంగళి పురుగు దేవుడు కుకుర్రోపై తమకున్న నమ్మకం గురించి వారికి చెప్పారు.


‘‘కుకుర్రో గౌరవార్థం, రైతులు అప్పుడప్పుడు ప్రత్యేక ‘కుకుర్రో గృహాల’లో దగ్గరగా అధిక దిగుబడినిచ్చే మరియు స్థితిస్థాపకంగా
ఉండే కాసావా మొక్కల కాండాలను నాటుతారు. ఇది విత్తన ఆధారిత లైంగిక పునరుత్పత్తిని అనుమతిస్తుంది, ఫలితంగా ‘ఆకాశం నుండి కాసావా’ వస్తుంది, ఇది వ్యవస్థకు జన్యు వైవిధ్యాన్ని కాపాడుతుంది,’’ అని వార్విక్‍ విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
అమెజాన్‍, కరేబియన్‍లోని వివిధ ప్రాంతాలలో కాసావాలో ఒకే విధమైన వైవిధ్య నమూనాలను పరిశోధకులు కనుగొన్నారు. విస్తృతమైన పంటలలో ప్రాంతీయ జన్యు వైవిధ్యం సాధారణం కాబట్టి ఇది అసాధారణమని వారు భావించారు.
మళ్ళీ, మరింత పరిశోధన వివిధ రకాల కాసావా కోతలలో మార్పిడి మరియు వ్యాపారం జరిగిందని, ఫలితంగా స్థితిస్థాపకంగా మరియు విభిన్నమైన పంటలు ప్రాంతీయంగా పంపిణీ అయ్యాయని వారు తేల్చారు. ఉదాహరణకు, బ్రెజిలియన్‍ వౌరా ప్రజల వివాహ ఆచారంలో భాగంగా, కొత్త వధువులు తమ భర్త గ్రామానికి కాసావా కోతలను తీసుకువస్తారు.
‘‘ఈ అధ్యయనం మన ప్రపంచ ఆహార భద్రతకు చిన్న తరహా దేశీయ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను నిజంగా చూపిస్తుంది’’ అని పేపర్‍ యొక్క సీనియర్‍ రచయిత, వార్విక్‍ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‍ రాబిన్‍ అల్లాబీ అన్నారు.


-రజత్‍ ఘాయ్‍
అనువాదం: శ్రీహరి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *