ఉమ్మడి నెల్లూరు జిల్లాశిలా మరియు ఖనిజ సంపద

ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో దక్షిణ ప్రాంతంలో 20,620 చదరపు కిలోమీటర్లలో విస్తరించి యున్నది. ఈ జిల్లా యొక్క ఉత్తరాన ప్రకాశం, దక్షిణాన చిత్తూరు జిల్లాలు, పశ్చిమలో బంగాళాఖాతం కలవు.
ఈ జిల్లాలో ఆర్‍క్యన్‍ పీరియడ్‍కు చెందిన ఓల్డ్ర్‍ మెటమార్పిక్స్, ఆర్‍క్యన్‍-పేలియో ప్రొటిరోజోయిక్‍కు చెందిన థార్‍వార్‍ సూపర్‍గ్రూప్‍ శిలలు, ఇంట్రూసివ్‍స్‍, కడప సూపర్‍ గ్రూప్‍కు చెందిన సెడిమెంటరీ శిలలు, మాయో ప్లేయో సీన్‍కు చెందిన కడ్డలూరు సాండ్‍స్టోన్‍, సీనోజోయిక్‍కు చెందిన లాటరైట్‍ మరియు క్వాటర్‍నెరి పీరియడ్‍కు చెందిన సెడిమెంట్స్ను చూడగలము. ఈ జిల్లాలో ఎక్కువ ప్రాంతంలో ఆర్‍క్యన్‍ శిలలు కలవు. అవి గార్నెట్‍ కార్ట్జ్‍-మైకాశిస్ట్, ఆంఫిబోలైట్‍, క్వార్ట్జ్‍మైకా శిస్ట్, కయనైట్‍ స్టారోలైట్‍శిస్ట్, పిజిసి యొక్క గ్రానైట్‍ వేరియంట్స్ మరియు క్వార్ట్జైట్‍ అవుట్‍లైయర్స్ రూపంలో మిగ్నటైనడ్‍ శిస్ట్ పైన అక్కడక్కడ చూడగలం. ధార్‍వార్‍ సూపర్‍గ్రూప్‍కు చెందిన NW SE ట్రెండ్‍తో ఉన్న బెల్ట్ ఉదయగిరికి ఉత్తరం నుండి గూడూరుకు దక్షిణ ప్రాంతం వరకు విస్తరించి యున్నది. పోస్ట్థార్‍వార్‍ ఇంట్రూసివ్‍స్‍ రూపంలో ఉన్న శిలలు గ్వాబ్రో, అనార్తొసైట్‍, కార్బోనటైట్‍, గ్రానైట్‍ మరియు పెగ్మటైట్‍. పెగ్మటైట్‍ వీన్స్ డేగపూడికి సైదాపురంకు మధ్య ప్రాంతంలో చూడగలము. కడప సూపర్‍గ్రూప్‍కు చెందిన శిలలు అవుట్‍ లైయర్‍ రూపంలో ఉదయగిరికి పశ్చిమమ్‍లో కలవు. ఇవి నల్లమలై గ్రూప్‍కు చెందినవి. కర్డులూరు ఫార్మేశన్‍కు చెందిన సాండ్‍స్టోన్‍, గ్రిట్‍, గ్రావెల్స్, కంగ్లామరేట్‍ అక్కడక్కడ నెల్లూరుకు ఉత్తరం, దక్షిణంలో కోస్తా ప్రాంతంలో చూడగలము. లాటరైట్‍ క్యాపింగ్స్ని ఈ జిల్లాలోని తూర్పు దిశలో చూడగలము. క్వాటర్‍నెరీ సెడిమెంట్స్ పెన్నేరు నది యొక్క ఫ్లడ్‍ ప్లేన్‍లో కూడా మరియు డెల్టా ప్రాంతంలో సముద్ర తీరంలో చూడగలము. పులికాటీ లేక్‍ లోని సెడిమెంట్స్ జిప్స్ం, లైమ్‍తో కూడి యున్నది. స్వర్ణముఖి నది యొక్క ఫ్లడ్‍ ప్లెన్‍లో కూడా సెడిమెంట్స్ని చూడగలము.
ఈ జిల్లాలో గ్రాస్‍లాండ్స్, స్క్రబ్స్ నెల్లూరు, ఉదయగిరి, గూడూరు ప్రాంతాలలో ఉన్నవి. ఫారెస్ట్ భూమి వెంకటగిరి, సోమశిల మరియు ఉదయగిరికి నైరుతిలో ఉన్నది. ఒక పెద్ద లగూన్‍ పులికాట్‍ లేక్‍ రూపంలో ఈ జిల్లాలో చూడగలము. ఈ జిల్లాలో సముద్ర తీరంలో మరియు పెన్నేర్‍, స్వర్ణముఖి నదుల ఫ్లడ్‍ ప్లేన్‍లలో అల్లువియల్‍ సాయిల్‍, మిక్స్డ్‍ రెడ్‍ బ్లాక్‍ సాయిల్‍ సోమశిల ప్రాంతంలో, లాటరైటిక్‍ సాయిల్‍ గూడురుకు దక్షిణంలో చూడగలము.


ఖనిజ సంపద:
ఈ జిల్లాలో మైకా, బెరైటీస్‍, కాపర్‍ జింక్‍, జిప్స్మ్‍, డిమేన్స్న్‍ స్టోన్‍, కైయనైట్‍ నిక్షేపాలు పుష్కలంగా కలవు.
మైకా:
ఈ జిల్లా దేశంలోనే ఎక్కువ మొత్తం మైకా ఉత్పత్తి చేస్తుంది. పుష్కలంగా మంచి క్వాలిటీ మైకా గూడురు, నెల్లూరు, రావూరు ప్రాంతాలలో దొరుకుతుంది. ఆత్మకూరు, గూడూరు, కావలి, రావూర్‍ ప్రాంతాలలో పెగ్మటైట్స్ని మైకా కోసం కొన్ని దశాబ్దాల నుండి మైనింగ్‍ జరుగుతుంది. మస్కోవైట్‍ మైకా పెగ్మటైట్స్లో బుక్స్ రూపంలో దొరుకుతుంది. ఇవి 25 KMS పొడవు గల బెల్ట్లో దొరుకుతుంది. సైదాపురం, దేవగుడికి మధ్య ప్రాంతంలో 15 KM సెక్షన్‍లో చాలా మంచి క్వాలిటీ మైకా మినరలైజేషన్‍ని చూడగలము. ఇందులో ఆకుపచ్చ, రుబీవైరైటీ మైకా దొరుకుతుంది. రాచపల్లి, గూడరు ప్రాంతంలో పర్మికులైట్‍ లెన్సెస్‍, వీన్స్ 10 CM-20 CM వెడల్పుగలవి నైస్‍ శిలలో చూడగలం. ఇది కాకుండా మైకా డంప్స్లో కూడా క్వార్ట్జ్‍, ఫెల్స్పార్ల్తో పాటు దొరుకుతుంది.
బెరైటీస్‍:
ఈ ఖనిజం వింజమూర్‍కు నైరుతిలో దొరుకుతుంది. ఇందులో BaO శాతం 32% నుండి 50% వరకు వుంటుంది.
కాపర్‍ ఓర్‍ :
పురాతన మైనింగ్‍ సైట్స్ కాపర్‍ ఓర్‍ కొరకు చేసినవి గరిమనిపేట, గొట్టిగుండ్ల, దుత్తలూరు, ఉదయగిరి ప్రాంతాలలో చూడగలము.ఈ ఖనిజం శిస్ట్లో ఇంట్రూసిన్స్గా ఉన్న క్వార్ట్జ్‍, ఫెల్స్పార్‍తో కూడి ఉంటుంది.
జిప్స్ం:
ఈ ఖనిజం యొక్క నిక్షేపాలు పులికేట్‍ లేక్‍లోని లగూనల్‍ ఐలెండ్స్లో దొరుకుతుంది. ఇది కలర్‍లెస్‍, ఇరెగులర్‍ లంప్స్ రూపంలో మెరైన్‍ క్లేస్‍లో పై నుండి ఓక మీటర్‍ లోతులో దొరుకుతుంది.
కయనైట్‍:
ఈ ఖనిజం జనగానపల్లి, సైదాపురం ప్రాంతంలో మెటమార్ఫిక్‍ శిలల్లో దొరుకుతుంది. ఇది పూర్‍ క్వాలిటీగా ఉంటుంది చాలా వరకు. ఇందులో 37% నుండి 55% Al2O3 తో కూడి ఉంటుంది.
డైమెన్షెన్‍ స్టోన్స్:
కొన్ని గ్రానైట్‍ వెరైటీస్‍, ఎపిడొట్‍తో కూడిన శిలలు, క్వార్ట్జైట్స్, డొలరైట్స్, లాటరైట్స్ని కన్స్ట్రక్షన్‍ పరిశ్రమలో ఉపయోగించడానికి మైనింగ్‍ చేస్తున్నారు ఈ జిల్లాలో. కల్లూరు, కలువాగు, బొమ్యారం, ప్రాంతాలలో గ్రానైట్స్, నైసెస్‍లను క్వారి చేస్తున్నారు. కదివేడు, చిట్టెండు ప్రాంతాలలలో ఫెరు జినస్‍ సాండ్‍స్టోన్‍ పైన ఉన్న లాటరైట్‍ క్యాపింగ్స్ని క్వారి చేస్తున్నారు.

  • కమతం మహేందర్‍ రెడ్డి,
    ఎ : 091 90320 12955

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *